కంప్యూటర్ల నుండి మొబైల్ ఫోన్ల వరకూ సమాచార సాంకేతిక విప్లవం మానవ జీవనాన్ని ఉర్రూతలూగిస్తున్న కాలం మనది. దేశ దేశాల సాంస్కృతిక జీవనంలోకి కూడా చొరబడి మధ్య తరగతి యువతీ, యువకుల చేత కిడ్నీలను అమ్మిస్తున్న ఐ-ఫోన్ల కాలం కూడా మనదే. బిట్లు, బైట్లుగా కాపర్ తీగల్లో ప్రవహిస్తున్న సాంకేతిక విప్లవ ఫలితం భారత దేశ పల్లెలకు అందని ద్రాక్షగా భావించవచ్చు గానీ, మహబూబ్ నగర్ జిల్లా లోని మహమ్మద్ హుసేన్ పల్లి విద్యార్ధులు అందుకు మినహాయింపు కావచ్చు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబీకులు పి.రాజేశ్వరి ప్రోద్బలంతో ఈ పెల్లెలోకి ప్రవేశించిన ‘ఐ-స్లేట్’, మొదటితరం విద్యార్ధినీ విధ్యార్ధులలో జ్ఞాన పిపాస రగిలిస్తోంది.
స్కూల్ వదిలితే టి.వి ల ముందు సెటిలైపోయే పిల్లలు ఇప్పుడు ఐ-స్లేట్ ను వదలడం లేదట. విద్యుత్ కొరత లేకుండా చూసుకోవడానికి పాఠశాల భవనం పైన సోలార్ విద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కేలిక్యులేటర్ల తరహాలో స్వంత సోలార్ పేనెల్ కలిగిన ఐ-స్లేట్ ను స్విట్జర్లాండ్ తయారీ చిప్ లతో సింగపూర్ కి చెందిన నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ మరియు రైస్ యూనివర్సిటీ వారు తయారు చేయగా ప్రయోగాత్మకంగా మహమ్మద్ హుస్సేన్ పల్లి లో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. రైస్ యూనివర్సిటీ పరిశోధకుడు పాలెం. కృష్ణ బ్రెయిన్ చైల్డ్ గా చెబుతున్న ఐస్లేట్ ను హైద్రాబాద్ లోని విదల్ (ViDAL) సంస్ధ మహమ్మద్ హుస్సేన్ పల్లె లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. ధనికులకూ పేదలకూ మధ్య ఉన్న డిజిటల్ వివక్షనూ, విభజననూ ఐ స్లేట్ చెరిపివేయగలదని ఆశిద్దాం.
ఈ ఫోటోలను ది హిందూ ఫోటో గ్రాఫర్ పి.వి.శివకుమార్ అందించారు.













పల్లెటూరి స్కూలు పిల్లల చేతుల్లో ఒదిగిపోయినందుకు ఐ- స్టేట్లకే అందం వచ్చింది!
Thanks for the report.
It is a beauty to watch these barefooted , innocent and poor boys and girls learning to use the I- slates with such admiration and dedication. Best wishes to them. And we all must thank all those who are involved in this program ( to uplift the poor ).
వేణు గారు, అవును. వినియోగ సరుకు గా కాకుండా నేర్చుకునే జిజ్ఞాసను ఐ-స్లేట్ ఎలా పెంపొందించిందో పిల్లల ముఖాల్లో చూడవచ్చు. కొత్త పద్ధతిలో హత్తుకునే విధంగా చదువు నేర్చుకోవడంలో ఉండే తాదాత్మ్యత ని పిల్లలు వ్యక్తీకరించడం వల్ల వచ్చిన అందం అది. బెత్తం, హోం వర్క్, అదిలింపులు లాంటివి విధిస్తున్న భారం ఒక్కసారిగా వదిలించుకోవడంలో వచ్చే ఆనందం కూడా పిల్లల్లో ప్రతిఫలిస్తోంది.
Hi Sudhakar, your are welcome.
Your wishes to “these barefooted, innocent and poor boys and girls” are great, timely and inspiring. And I join you.
“ధనికులకూ పేదలకూ మధ్య ఉన్న డిజిటల్ వివక్షనూ, విభజననూ ఐ స్లేట్ చెరిపివేయగలదని ఆశిద్దాం”
విశేఖర్ గారూ,
ఆలస్యంగా స్పందిస్తున్నాను. పేద పిల్లలకు టెక్నాలజీ సులువుగా అందే అందించే ప్రక్రియపై మీ స్పందన అక్షరాక్షరం ఉద్వేగభరితంగా ఉంది. కాని పైన మీరు వ్యక్తీకరించిన పై ఆకాంక్ష ఆచరణలో నిరూపించబడితే అందమైన కల వాస్తవంగా మారినట్లే. కాని డిజిటల్ వివక్ష ఐ స్లేట్‌తో మాత్రమే చెరిపివేయబడగలదా… మీ ఆకాంక్ష ఆదర్శపూరితమైనదిగానే మిగిలిపోతుందేమో..
నిజమైన పేదల్లో చాలామంది ఇప్పటికీ మన దేశంలో కంప్యూటర్లకు, డిజిటల్ ఆవిష్కరణలకు చాలా దూరంగా ఉన్నారు.
అవకాశం వస్తే పేద పిల్లలు కూడా టెక్నాలజీ మధుర ఫలాలను ఎంత మక్కువతో అక్కున చేర్చుకుంటారో మీ కథనంలోని ఫోటోలు అద్భుతంగా చూపిస్తున్నాయి. తల్లితండ్రులకు ఆ పసిపాప ఐస్లేట్ జ్ఞానాన్ని చూపిస్తున్న దృశ్యం ఇంకా అద్భుతంగా ఉంది.
నిజంగా ఇది నూతన తరహా రిపోర్టింగ్.
కాని మహమ్మద్ హుసేన్ పల్లె భారత దేశానికి నమూనా కాగలదా… రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేస్తున్న పాలకులు ఈ కొత్త బాటను అమలు చేయగలరా?
ఏమో….
కొంతకాలం నేను ఇంటర్నెట్‌కు, బ్లాగింగుకు దూరం కావలసి వచ్చేటట్టుంది. త్వరలో వివరంగా చెబుతాను
రాజు గారూ,
“కాని డిజిటల్ వివక్ష ఐ స్లేట్‌తో మాత్రమే చెరిపివేయబడగలదా… మీ ఆకాంక్ష ఆదర్శపూరితమైనదిగానే మిగిలిపోతుందేమో..”
ఐ-స్లేట్ తో చెరిగిపోయేదయితే అది వివక్ష గా మారకపోదును. ఆదాయ అంతరాలు కొనసాగినంత కాలం వివక్షలు కొనసాగడం అనివార్యం. కాకపోతే వివక్ష ను ఎత్తి చూపడానికి ఇదొక మార్గం.
ధనికుల మార్కెట్లను హై ఎండ్ ఉత్పత్తులు ఆక్రమించి ఉన్న పరిస్ధితుల్లో అల్పాయాదాయ వర్గాల మార్కెట్ ను కొత్తగా అభివృద్ధి చేసుకునే ఆలోచన తలెత్తడం ఇప్పటి వ్యవస్ధ పరిమితుల్లో సహజంగా జరిగే పరిణామం. తక్కువ ఖరీదుతో అవే రకం ఉత్పత్తులను తయారు చేసి కొత్త మార్కెట్ ను సృష్టించుకునే ప్రక్రియలో భాగంగా ఐ-స్లేట్ ను చూడవచ్చు. ఆడమ్ స్మిత్ పోటీ సిద్ధాంతం ఒక కోణంలో పని చేయడం అన్నమాట.
తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, ప్రేమ, పెళ్ళి ఇలా సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించి ఉత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నట్లే వివక్షలను కూడా (రాజకీయ లబ్ది కి వాడుకున్నట్లే) వ్యాపార లబ్దికి వాడుకునే ధోరణికి ఐ-స్లేట్ ఒక బీజ రూపమేమో!
నా ఉద్దేశ్యంలో ఐ-స్లేట్ ని ప్రవేశ పెట్టడంలో టెక్నాలజీ ని పేద వర్గాల దరికి చేర్చే లక్ష్యం ఉందంటే నమ్మడం కష్టం. అలా అంటే ఇందులో ఉన్న వ్యక్తులను అవ(ను)మానించడం అవుతుందేమో కానీ, కొంతకాలం గడిస్తే అసలు విషయం బోధపడుతుంది.
ఐ-స్లేట్ ని వాడుకలోకి తెచ్చేందుకు మహమ్మద్ హుస్సేన్ పల్లి ఒక ప్రయోగశాల. ఉత్పత్తిని లక్ష్యిత వినియోగదారుల్లోకి తీసుకెళ్ళి, ఫీడ్ బేక్ తీసుకుని మరిన్ని మెరుగులు దిద్దే ఉద్దేశ్యం ఉన్నట్లు కనిపిస్తోంది. వాడకందారుల వినియోగానికి అనుగుణంగా ఉత్పత్తిని తీర్చి దిద్దితేనే కదా ఉత్పత్తి సక్సెస్ అయ్యేది.
సొంత ఆస్తి కొనసాగుతున్నంత కాలం వ్యవస్ధలోని అన్ని రకాల ప్రక్రియలకు (ఆర్ధిక, సామాజిక, రాజకీయ ప్రక్రియలన్నీ) ఆర్ధిక చొరవలే చోదక శక్తిగా పని చేస్తాయి. రాజ్యం మారి కొత్త రకం సామాజిక, సాంస్కృతిక సంబంధాలు అభివృద్ధి చేసేవరకూ ఈ పీకులాట తప్పదు.
మీరన్నది నిజమే. హై ఎండ్ మార్కెట్‌ను ఎలాగో ఇప్పటికే కొల్లగొడుతున్నాయి కంపెనీలు. ఇప్పుడు లో ఎండ్ మార్కెట్‌లో కూడా కొన్ని రాళ్లు వేసి ప్రయోగ పలితాలకోసం ఎదురు చూస్తున్నారేమో మరి.
ప్రస్తుతం మహానగరాల్లో ఎక్కడ చూసినా రెండు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్లు, ఇతర ఉత్పత్తుల ప్యాకెట్లు విచ్చలవిడిగా కనబడుతున్నాయు. భారతీయుల కొనుగోలు శక్తి పరిమితులను సమర్థంగా గుర్తించిన కంపెనీలు చౌకధరలతో మార్కెట్‌ను కైవశం చేసుకున్నాయి. ఇంతకు ముందు నగరాల్లో తోపుడు బళ్లమీద రూపాయి, రెండు రూపాయల బిస్కెట్ పాకెట్లను అమ్మేవారు. ఇప్పుడివి కలికానిక్కూడ కనిపించడం లేదు. ఏ షాపుచూసినా చౌకధరలతో ఎమ్ఎన్‌సిల పాకెట్లో కనబడుతుంటాయి. ఈరోజు చౌకధరల ప్యాకెట్లు మొత్తం మార్కెట్లో 85 శాతం ఆక్రమించాయని వార్త.
స్థానిక వ్యాపారం, తోపుడు బండి వ్యాపారం నాశనమైపోయింది. మన మన్మోహన్ సింగ్ బతికుండగానే ఆ వాల్ మార్ట్ లను కూడా ఇండియాకు తెచ్చేస్తే చిల్లర దుకాణాలను కూడా మనం చూసే అవకాశం ఉండదు తర్వాత. ఇంటి ముందుకు బండి వస్తే ఏరుకుని కూరగాయలు తీసుకునే కాలం కూడా కనుమరుగైపోతోంది.
ఏంటో..