బాప్ రే, అచ్చం ఫోటోల్లా ఉన్నా ఇవి పెయింటింగ్ లే నట! -ఫోటోలు


ఇవి ఫోటోలని చెబితే ఎవరైనా ఇట్టే నమ్మేస్తారు. కానీ ఇవి పెయింటింగ్ లేనట. అమెరికాలోని బ్రూక్లీన్ కి చెందిన 35 యేళ్ళ అలిస్సా మాంక్స్ గీసిన పెయింటింగ్ లు ఇవి. సమకాలీన ప్రపంచంలో అత్యంత ప్రతిభ కలిగిన ఫోటో రియలిస్టిక్ పెయింటర్ గా అలిస్సాకి పేరు ప్రఖ్యాతులున్నాయని తెలుస్తోంది. ఆయిల్ పెయింట్లతో వాస్తవిక చిత్రణ చెయ్యడంలో ఈమెకు గొప్ప ప్రతిభ ఉన్న సంగతి ఈ పెయింటింగ్ లు చూస్తేనే అర్ధం అవుతోంది. వేడి ఆవిరితో స్నానం (స్టీమ్ బాత్) చేస్తున్న పెయింటింగ్ లు వేయడంలో ఈమె చేయి తిరిగిన పెయింటర్ అని తెలుస్తూనే ఉంది. ఫోటోలతో పోటీ పడుతూ పోర్ట్రయిట్ లు గీయడంలో కూడా ఈమె దిట్టేనట. ఈమె పెయింటింగ్ లు అమెరికాతో పాటు జర్మనీ, గ్రీసు, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అనేక సోలో ప్రదర్శనలకు నోచుకున్నాయి. చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఇంత వాస్తవికంగా అలిస్సా ఎలా పెయింట్ చేయగలిగింది? ఆమె మాటల్లోనే చూస్తే…

“Using filters such as glass, vinyl, water, and steam, I distort the body in shallow painted spaces. These filters allow for large areas of abstract design – islands of color with activated surfaces – while bits of the human form peak through. In a contemporary take on the traditional bathing women, my subjects are pushing against the glass “window”, distorting their own body, aware of and commanding the proverbial male gaze.

Thick paint strokes in delicate color relationships are pushed and pulled to imitate glass, steam, water and flesh from a distance. However, up close, the delicious physical properties of oil paint are apparent. Thus sustaining the moment when abstract paint strokes become something else.”

చివరి రెండు ఫొటోల్లో అలిస్సాను చూడవచ్చు.

 

(ఫొటోలను యాహూ న్యూస్ అందించింది)

10 thoughts on “బాప్ రే, అచ్చం ఫోటోల్లా ఉన్నా ఇవి పెయింటింగ్ లే నట! -ఫోటోలు

  1. మీరు ప్రచురించిన బొమ్మలు వంక పెట్టడానికి వీల్లేనంత అద్భుత చిత్రాలనడంలో సందేహం లేదు. అదే సమయంలో మనం సినిమా పోస్టర్లతోనే జీవితం పండించుకున్న తెలుగు చిత్రపరిశ్రమ పోస్టర్ చిత్రకారులు ఈశ్వర్ గారి పెయింటింగ్‌లను మర్చిపోరాదు. ఇవి మనిషి తన చేతులతో గీసిన చిత్రాలు అంటే భవిష్యత్తులో ఎవరూ నమ్మరేమో.

    అలాగే తమిళనాడులో జయరాం అనుకుంటాను తను వేసిన ఆయిల్ పెయింటింగులు చూస్తే అవి మనిషి హస్తం గీసిన చిత్రాలు అంటే ఇప్పుడు కూడా నమ్మడం కష్టం. తమిళ సాంప్రదాయిక వంటింట్లో ఒక మామూలు వనిత పొయ్యి వెలుగిస్తూన్న చిత్రాన్ని నేను చందమామ ఆఫీసులో ఒక చిత్రకారుడి సిస్టమ్‌లో చూశాను.

    అన్నిటినీ మించి చందమామ కవర్ పేజీ చిత్రాలమాటో. చందమామ దిగ్గజ చిత్రకారులు చిత్రా, ఎంటివి ఆచార్య, శంకర్, వపా గార్లు 1940ల మలిభాగం నుండి 1990ల వరకు వేసిన వేలాది రమణీయ చిత్రాల మాటో. మనవాళ్లు, మన మాన్యులు సాధించిన కృషి బయటి ప్రపంచానికి తెలియదు కదా..

  2. విశేఖర్ గారూ,
    పోస్టర్ చిత్రకారులు ఈశ్వర్ గారి పుస్తకాన్ని ఇటీవలే చందమామ పూర్వ సంపాదకులు విశ్వనాధరెడ్డి గారు డాల్టన్ పబ్లికేషన్స్ తరపున ప్రచురించారు దాంట్లో ఎ4 సైజులో ఆయన తెలుగు సినీ హీరోలు, తదితరులపై గీసిన 40 అత్యద్భుత వర్ణచిత్రాలతో పాటు ఆయన 40 ఏళ్ల సినీ జీవితంలో పెన్సిల్ స్కెచ్‌తో వేసిన అజరామర పోస్టర్ చిత్రాలు డజన్లకొద్దీ చూడవచ్చు. ఈ పుస్తకాన్ని ఇక్కడ చెన్నయ్‌లో రూ.300లకే ఇస్తున్నారు. నేను కూడా రెండు సెట్లు తెప్పించుకున్నాను. మీ ప్రాంతంలో బుక్‌స్టాల్స్‌లో కాని విశాలాంద్ర షాపులో కాని దొరకవచ్చు. మీకు అందుబాటులో లేదనుకుంటే చెప్పండి. నా వద్ద ఉన్న కాపీ మీకు పంపిస్తాను.

    తెలుగు -దక్షిణ భారత సినీ పరిశ్రమ- సినిమా పోస్టర్ చరిత్రపై ఇది ప్రామాణిక పుస్తకం అనుకోండి. మీరు తప్పక ఈ పుస్తకం చూడండి.

    అలాగే చందమామ దిగ్గజ చిత్రకారుల ఒరిజనల్ చిత్రాలను మూడేళ్ల క్రితం చందమామ యాజమాన్యం ఆర్ట్‌బుక్ పేరిట ప్రింట్ చేశారు. ఎంటీవీ ఆచార్య, చిత్రా, శంకర్, వపా గార్లు అప్పట్లో చిత్రించిన 180 ఒరిజనల్ ముఖచిత్రాలను ప్రీమియం క్వాలిటీతో ఈ పుస్తకంలో ప్రచురించారు. కాని దాదాపు 3 కేజీల బరువున్న ఈ రెండు భాగాల పుస్తకానికి కాస్త ఎక్కువ ధరే పెట్టారు రూ.1500.00 నేరుగా చందమామ ఆపీసులో కొంటే రూ.1350లకు ఇస్తున్నారు.

    ఇక తమిళ చిత్రకారుడి చిత్రాలు ఆన్‌లైన్‌లో దొరికే అవకాశముందేమో అడిగి చూస్తాను.

    చందమామ పత్రికలో చివరి లోపలి పేజీలో ఆర్ట్‌బుక్ లోని ఒక చిత్రాన్ని ప్రతి నెలా పాఠకుల కోసం ప్రచురిస్తున్నారు. వీలయితే ఒక కాపీ తెప్పించుకుని చూడండి.

    మీ ఈమెయిల్ ఐడీకి అందుబాటులో ఉన్న కొన్ని చిత్రాలు పంపుతాను.

  3. విశేఖర్ గారూ,
    ఇప్పుడే ఇళయరాజా -సంగీత దర్శకుడు కాదు- గీసిన తమిళ బాలికల ఆయిల్ పెయింటింగ్స్ లింక్ పంపుతున్నాను చూడండి. బొమ్మల కింది కామెంట్లు చూడండి. ముఖ్యంగా పొయ్యి వెలిగిస్తున్న అమ్మాయి ఫోటో చూడండి. చేత్తో గీసిందంటే నమ్మలేం గాక నమ్మలేము.. నా తొలి వాఖ్యలో తన పేరు జయరాం అని తప్పుగా ప్రస్తావించాను. అసలు పేరు ఇళయరాజా అట.

    కింది లింక్ చూడండి.

    https://picasaweb.google.com/artistilayaraja/IndianGirlsWomens

    పొయ్యి వెలిగిస్తున్న అమ్మాయి పెయింటింగ్ కింది లింకులో చూడండి. అన్ బిలీవబుల్ అంటూ చాలా కామెంట్లు వచ్చాయి. దక్షిణ భారత స్త్రీల ముగ్ధత్వం, అమాయకత్వంతో కూడిన పల్లెటూరి పాపల నిసర్గ సౌందర్యం ఎంత బాగా ఆయిల్ పెయింట్‌తో చిత్రించారో..
    1.
    https://picasaweb.google.com/artistilayaraja/IndianGirlsWomens#5572793154252462114

    2.
    https://picasaweb.google.com/artistilayaraja/IndianGirlsWomens#5424437328039312034

  4. విశేఖర్ గారూ, రాజు గారూ,

    సినిమా పోస్టర్ పుస్తకంలో ప్రచురించిన ఈశ్వర్ గారి అద్భుతమైన ‘కొన్ని’ పెయింట్లను అర్జెంటుగా చూసెయ్యటానికి ఈ లింకు….
    http://www.idlebrain.com/news/2000march20/interview-eswar.html

  5. రాజు, వేణు గార్లకు, మీరిచ్చిన లింక్స్ చూశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇళయరాజా గారి పెయింటింగ్ లు సహజత్వానికి ఏమాత్రం తీసిపోవు. ఈశ్వర్ గారి పెయింటింగ్ లని చిన్నప్పటినుండీ ఎరుగుదును. ఫలనా ఆయన గీసారని మాత్రమే తెలియదు గాని. అలాంటి పెయింటింగ్ లు గీయడం వారికి మామూలే అన్నట్లుగానే వాటిని చూసేవాళ్లం. ఫొటోషాప్ లూ అవీ వచ్చాక ఈశ్వర్ లాంటి వారి అవసరం తగ్గిపోయిందనుకుంటా.
    మీ లింక్ లను క్లిక్ చేసి చూసినవారు తక్కువ. అందువలన మరోసారి కొన్ని పెయింటింగ్ లను నా బ్లాగ్ లో పబ్లిష్ చేస్తాను. ఫర్వాలేదు కదా?

  6. వేణు గారూ, ఒక అద్భుతాన్ని అలా కళ్లముందు చూపించేశారు. ఈశ్వర్ గారి ఈ ఇంటర్వ్యూ ఆయన పుస్తకంలో కూడా వచ్చింది కదూ. అలాగే మీరు ఇక్కడ లింకులో చూపించిన ఆయన బొమ్మలు ముఖ్యంగా రామారావు బొమ్మలు నిజంగా వర్ణ రంజితాలే. ఫ్యూడల్ యుగపు పౌరాణిక ఆహార్యం తనకు సరిపోయినట్లు ఈ ప్రపంచంలోనే ఎవరికీ సరిపోదు. తన ఆహార్యం వల్ల ఆయనకు పేరొచ్చిందా లేదా ఆయనవల్ల ఆ ఆహార్యానికి పేరొచ్చిందా అంటే చెప్పలేను.

    మొన్న మన మాయా బజారులాగా 3 నెలల క్రితం తమిళంలో 40 సంవత్సరాల నాటి కర్ణ సినిమాను డిజిటలైజ్ చేసి పంచ రంగుల్లో చూపించారు. సినిమా అంతా కర్ణపాత్ర ధారి శివాజా గణేష్ తన అభినయ అతి అరుపులతో దడదడలాడిస్తాడు. చివరి అర్ధ గంటలో కృష్ణ పాత్రధారి రామారావు మెల్లగా వచ్చి తమిళ ప్రేక్షకులను నేడు కూడా మంత్రముగ్ధులను చేసేశాడు. చివరి అర్ధ గంటలో రామారావు కృష్ణుడి వేషంలో కనిపించినప్పుడల్లా డైలాగ్ కొట్టినప్పుడల్లా ప్రేక్షకుల నుంచి హర్షం ధ్వానాలే హర్షధ్వానాలు.

    దాదాపు 12 సంవత్సరాల తర్వాత థియేటర్‌కు వెళ్లి మరీ -ఆఫీసుకు ఎగనామం పెట్టి- ఒక సినిమాను చూడటం ఇదే తొలిసారి. మా మేనేజర్‌ను, ఆఫీస్ ఇన్‌ఛార్జ్‌ను, మార్కెటింగ్ అధికారిని అందరినీ పిల్చుకుపోయాను కాబట్టి బతికిపోయాను లెండి. 12 సంవత్సరాల తర్వాత ధియేటర్లో చూడటంతో సినిమా థియేటర్ ఒక భయంకర శబ్దలోకం లాగా అనిపించింది. అందులోనూ శివాజీ ఓవరాక్షన్ దానివెనుక దడదడ సంగీతం… నిజంగా తలనొప్పి వచ్చింది. తెలుగు పౌరాణిక సినిమా సౌకుమార్యం, మార్దవత్వం తమిళంలోనే కాదు… ఏ సినిమాలోనూ ఉండవేమో.

    కాని కర్ణ తమిళ సినిమా డిజిటల్ రూపం అద్భుతంగా ఉంది.

    కాని ఇదే రామారావు రాజకీయాల్లోకి వచ్చి వందలాది యువతీయువకులను నక్సలైట్ల పేరిట కాల్చి చంపించినప్పడు ఆ ఫ్యూడల్ ఆహార్యపు సోయగం వెనుకాతలి వర్గ స్వభావం స్పష్టాతి స్పష్టంగా నాకు బోధపడింది. అందుకే గద్దర్ 1990ల మొదట్లో వందలసార్లు గొంతెత్తి పాడినట్లు….

    పోతివిరో రామన్నా… నువు పోతివిరో రామన్నా..
    పేదోళ్ల ఉసురు తగిలి… పసిగుడ్డుల ఉసురు తలిగీ..
    పోతివిరో రామన్నా..

    నటుడుగా చిరస్మరణీయుడు. రాజకీయపరంగా జీవన్మృతుడు. నా దృష్టిలో రామారావు అనే ఒక జీవికి అర్థం ఇంతే.

  7. “మీ లింక్ లను క్లిక్ చేసి చూసినవారు తక్కువ. అందువలన మరోసారి కొన్ని పెయింటింగ్ లను నా బ్లాగ్ లో పబ్లిష్ చేస్తాను. ఫర్వాలేదు కదా?”

    విశేఖర్ గారూ,
    ఎక్కువ మంది చూడటం అనే ప్రయోజన దృష్టితో చెబుతున్నారు కనుక ఇళయరాజా గారి ఆయిల్ పెయింటింగ్‌లను మీ బ్లాగులో పోస్ట్ చేయడంలో తప్పు లేదనుకంటాను. కావాలంటే పికాసా సౌజన్యంతో అని రాయండి. వారికేదయినా అభ్యంతరం అయితే విషయం చెప్పి తీసివేయవచ్చు. ప్రమాదమేమీ ఉండదనుకుంటున్నాను. అంతగా కావాలంటే ఆయనతో నేరుగా సంప్రదిస్తాను. ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.

    మానవజాతి స్వంత ఆస్తి క్రమంలోకి పయనించిన బహుళ రూపాల్లో కాపీరైట్ కూడా ఒకటి కాబోలు. జాతి సామూహిక సంపదగా ఉపయోగపడవలసిన కళలు, సమస్త కృషులు కాపీరైట్ వలయంలో చిక్కుకుపోయాయి. చందమామ కూడా దీనికి మినహాయింపు కాదు.

    సోవియట్ యూనియన్ తన స్వంత నిర్వాకంతో కుప్పకూలితే కూలింది కాని కొన్ని కోట్ల పుస్తకాలను ప్రపంచానికి దాదాపు ఉచితంగా అందించిన గొప్ప చరిత్ర ఇప్పటి తరం ఊహల్లో కూడా లేకుండా పోయింది. ఎంత గొప్ప బాలసాహిత్యాన్ని సోవియట్ యూనియన్ పంచరంగుల్లో ప్రపంచంలోని అన్ని భాషలవారికి అందించిందో.. విశ్వసాహిత్యంలోని ఆణిముత్యాలను ఎంత విస్తృతంగా ఆ రోజుల్లో అది సమాజానికి అందించిందో.

    ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు…?

  8. వేణు గారూ, విశేఖర్ గారూ
    సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం మీకు చెబుతున్నాను.

    మీ ద్వారా పాతికేళ్ల తర్వాత మళ్లీ రంగనాయకమ్మగారితో, బావూజీ గారితో పరిచయం ఏర్పడింది. మూడువారాలుగా వారితో భావ ప్రసార సంబంధంలో ఉన్నాను. ఈ క్రమంలో మీ బ్లాగులో -విశేఖర్-, బొందలపాటి ప్రసాద్ గారి బ్లాగులో మార్క్సిజంపై, తదితర అంశాలపై ఇటీవల జరిగిన చర్చా వ్యాసాలను లింకులతో సహా వారికి పంపించాను. బాపూజీ గారు ఈ బ్లాగ్ లింకులను చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు. కాస్త జాగ్రత్తగా నిర్వహిస్తే ఇలాంటి బ్లాగులు స్టడీ సర్కిల్స్ లాగా ప్రయోజనకరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఆయన పంపిన మెయిల్‌లో కొంత ఇక్కడ ఇస్తున్నాను.

    Today, that is on 13-7-12, I could go through the attached file where you included all the postings. It is certainly useful because individuals cannot meet over conference calls, tv channels, general newspapers etc. These blogs, if handled carefully, are like study circles. Almost all participants seem to be serious and genuinely concerned with the issues raised. Your links on caste and marxists are of great use for me and I will visit them when I find some more time.

    B.R.Bapuji, Professor,
    Centre for Applied Linguistics & Translation Studies [CALTS],
    University of Hyderabad, Central University post office,
    HYDERABAD-500 046. (Phone: 040-23133655,23133650 or 23010161).

వ్యాఖ్యానించండి