బి.జె.పి ఆట ఎవరితో? -కార్టూన్


కర్ణాటకలో సంక్షోభం ముదిరి పాకాన పడుతోందని పత్రికలు, ఛానెళ్ళు ఘోషిస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయవలసి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప రెట్టించిన బలంతో పార్టీ అధిష్టానాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇతర పార్టీలకంటే ‘విభిన్నమైనది’ గా చెప్పుకున్న ఆ పార్టీ క్రమంగా ‘విభేధాలకు నిలయం’ గా మారిపోయింది. అవినీతి ఆరోపణలకు గురయిన నాయకుడు నలుగురికీ ముఖం చూపించడానికి సిగ్గుపడడానికి బదులు ప్రజల ముందు ధీమాగా తిరుగుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఫలితంగా బి.జె.పి ప్రత్యర్ధి పార్టీలతో తలపడడానికి బదులు తనతో తానే తలపడుతోంది. బంతిని ప్రత్యర్ధి కోర్టులోకి విసరడానికి సొంత కోర్టులోనే తిప్పుకుంటోంది.

వ్యాఖ్యానించండి