మల్టీ ఎక్స్‌పోజర్ టెక్నిక్ తో తీసిన ఫొటోలివి. వెనువెంటనే వివిధ సమయాల్లో తీసిన ఫొటోలను ఒకే ఫ్రేమ్ పై ఎక్స్‌పోజ్ చేసే టెక్నిక్ ఇది. ఒక ఘటనలో ఒకే వ్యక్తి కొద్ది సెకన్ల తేడాతో చేసే కదలికలను పట్టి ఒకే ఫ్రేమ్ పై ఎక్స్‌పోజ్ చేయడం ద్వారా స్పెషల్ ఎఫెక్ట్స్ తెచ్చే ఈ ప్రక్రియలో ఫొటోలు చూడడానికి ప్రత్యేకంగా ఉంటాయి. అంటే వివిధ సమయాలలో చేసిన కదలికలను ఒకే ఫొటోలో చూడడం అన్నమాట. ఇవి చూడడానికి కళాత్మకంగా ఉండడంతో పాటు ఆసక్తిగా ఉంటాయి. ‘మోషన్ అండ్ పొజిషన్’ కు సంబంధించిన అధ్యయనానికి కూడా ఈ ఫొటోలు ఉపయోగపడతాయని తెలుస్తోంది. ఇంటర్నెట్ లో కనిపించే గిఫ్ తరహా ఫొటో లాగే ఉన్నాయివి. కాకపోతే గిఫ్ (గ్రాఫిక్ ఇంటర్‌ఛేంజ్ ఫార్మాట్) ఫొటోలో వివిధ కదలికలు ఒకదాని తర్వాత మరొకటి కంటి ముందుకు వస్తే, ఇక్కడ మాత్రం ఒకేసారి కంటి ముందు నిలుస్తాయి.
–













ఫొటోలన్నీ చూడముచ్చటగా ఉన్నాయి. ముఖ్యంగా మోటార్ సైకిల్ స్టంట్ విన్యాసాలు…!