కన్న కూతురిపై అత్యాచారం, ఫ్రెంచి రాయబారి పై కేసు నమోదు


Diplomat raped daughter 1పతన విలువలకి పరాకాష్ట ఇది. బెంగుళూరు లో నియమితుడైన ఫ్రాన్సు రాయబారి మూడున్నరేళ్ల కూతురుపై అత్యాచారం జరిపినట్లు బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రాయబారిని ఇంకా అరెస్టు చేయలేదని ఎన్.డి.టి.వి తెలిపింది. రాయబారి దేశం విడిచి వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భారతీయురాలైన అతని భార్య హోమ్ మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖలకు లేఖలు రాసింది. ఫ్రెంచి జాతీయులైన తమ ముగ్గురు పిల్లలను భర్త కస్టడీకి ఇవ్వరాదని ఆమె డిమాండ్ చేస్తోంది.

ఫ్రెంచి రాయబారిపై కేసు నమోదు చేసినట్లు బెంగుళూరు పోలీసులు తెలిపారు. బెంగుళూరు లోని ఒక ఎన్.జి.ఓ సంస్ధ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె చెప్పినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. కూతురిపైన రాయబారి అత్యాచారం చేస్తున్నట్లు వారి పని మనిషి (మెయిడ్) చెప్పడంతో రాయబారి భార్య పాపను హెబ్బాల్ లోని ప్రవేటు ఆసుపత్రికి తీసుకెళ్లిందనీ, అత్యాచారం జరిగినట్లు వారు ధృవీకరించారని ‘కర్ణాటక కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్’ చైర్ పర్సన్ నీనా నాయక్ తెలియజేసింది.

Diplomat raped daughter 2పోలీసులు ఇంతవరకూ రాయబారిని అరెస్టు చేయలేదు. కనీసం అదుపులోకి కూడా తీసుకోలేదు. పోలీసులు సాక్షాలు పరిశీలిస్తున్నారనీ, మెడికల్ రికార్డులు పరిశీలించడం, ప్రత్యక్ష సాక్ష్యులను విచారించడం చేస్తున్నారని వివిధ పత్రికలు, చానెళ్లు చెబుతున్నాయి. “పిల్లలపై అత్యాచారం చేసిన కేసును రిజిస్టర్ చేశాం. కేసును పరిశోధిస్తున్నాం… కొద్ది మందిని విచారించాం. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు” అని డి.సి.పి చెప్పాడని ఎన్.డి.టి.వి తెలిపింది. అయితే రాయబారిని రాత్రే నిర్భంధంలోకి తీసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.

“తల్లి ఇంటికి తిరిగి వచ్చినపుడు, ఆమె భర్త మూడు గంటల నుండి కూతురితో కలిసి బెడ్ రూమ్ లో ఉన్నాడని డోమెస్టిక్ హెల్ప్ చెప్పింది. కూతురు తీవ్రమైన బాధతో ఏడుస్తూ ఉండడాన్ని ఆమె చూసింది” అని నీనా నాయక్ పత్రికలకు తెలిపింది. వెంటనే ఆమె పాపను ఆసుపత్రికి తీసుకెళ్లింది. రాయబారి పేరు పాస్కల్ మజూరీయర్ అని నీనా తెలిపింది. ఫ్రాన్స్ కాన్సలేట్ లో ‘డిప్యూటీ హెడ్ ఆఫ్ చాన్సరీ’ గా ఆయన పని చేస్తున్నట్లుగా నీనాని ఉటంకికిస్తూ టి.ఓ.ఐ తెలిపింది. పాపను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పరీక్షించి నివేదిక ఇవ్వాలని తాను ఎన్.జి.ఓ సంస్ధకు చెప్పానని కూడా నీనా తెలిపింది.

ఫిర్యాదు ఎవరు చేసిందీ పోలీసులు చెప్పలేదు. రక్త సంబంధీకులు ఫిర్యాదు చేశారని మాత్రమే పోలీసులు చెప్పినట్లు టి.ఓ.ఐ తెలిపింది. రాయబారిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు పి.టి.ఐ ద్వారా తెలుస్తోంది.

భారతీయ జాలర్లను హత్య చేసిన ఇటలీ నావికులను నిర్బంధంలోకి తీసుకుని చుక్కలు చూపిస్తున్న ఇండియా, భారతీయ మహిళను వివాహం చేసుకున్న ఫ్రాన్సు రాయబారి నీచకృత్యానీకీ అదే స్ధాయిలో ప్రతిస్పందిస్తుందని ఆశిద్దాం.

Diplomat raped daughter 3

One thought on “కన్న కూతురిపై అత్యాచారం, ఫ్రెంచి రాయబారి పై కేసు నమోదు

  1. Don’t misunderstand me….is this woman really married that french diplomat…is that child born for this french guy…or for someone else…..what sentiment for us is a game plan sometimes…from another view point

వ్యాఖ్యానించండి