‘వడ్డించే వాడు మనోడే అయితే’ బంతిలో ఎక్కడ కూచున్నా అన్నీ అందుతాయన్నది సామెత. ‘ప్రశ్నించే నోరు మనదే అయితే, నచ్చిన సమాధానం చెప్పుకోవచ్చు’ అన్నది ఇప్పటి సామెత గా చేర్చుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ, ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన తామే నిరసన ప్రదర్శనలు చెయ్యడం ఎమిటి? బందులు హర్తాళ్ లు చేస్తూ ఆవేశకావేశాలు వెళ్లగక్కడం ఏమిటి? ఇక జనానికి సమాధానం చెప్పేదెవ్వరు?
యు.పి.ఎ ప్రభుత్వం ఒకేసారి లీటర్ పెట్రో ధర రు. 7.54 పై లు పెంచింది. పెంపు ఉపసంహరించుకోవాలని ఎన్.డి.ఎ, లెఫ్ట్ ప్రభుత్వాలు బంద్ కి పిలుపిచ్చాయి. అంతవరకూ బాగానే ఉంది. యు.పి.ఎ భాగస్వాములైన త్రిణమూల్ కాంగ్రెస్, డి.ఎం.కె లు కూడా బంద్ ప్రకటించి ఊరేగింపులు చెయ్యడమే అర్ధం కాని విషయం. ఇదెక్కడి చోద్యం? పెట్రోల్ రేట్లు పెంచినోడే తగ్గించాలని రోడ్డెక్కితే జనం ఎవర్ని అడగాలి? ప్రజావ్యతిరేక నిర్ణయం తీసుకున్నవాడే ప్రశ్నిస్తుంటే, జనాలు కడుపుమండి వేసే ప్రశ్నలు కూడా ప్రభుత్వంలో ఉన్న మనుషులే వేస్తుంటే ఇక ప్రజల నిరసనలకి నిజాయితీగా ప్రాతినిధ్యం వహించేదెవ్వరు? ఈరోజు నిరసన పేరుతో జనం మధ్యకి వచ్చినవాడే రేపు పార్లమెంటులోనో, కేబినెట్ లోనో కూర్చుని నిర్ణయాలు చేస్తున్నారు. ఈ విధంగా అధికార పక్షంమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడిది? ఇది ప్రజాస్వామ్యమేనా?
“విజయవంతమైన కూటమి లో ఉన్న రహస్యం: మిత్రులు నిరసించడానికి తగినంత చోటివ్వడమే.”
–

ప్రభుత్వాన్ని కూల్చే రీతి లో మేము అసమ్మతి చేయము కాని, జనాకర్షణ కోసం మేము ఇంగితజ్ఞానానికి వ్యతిరేకం గా ఏదైనా చేస్తామని ఆ పార్టీలు మరోసారి నిరూపించాయి.
If they demolish the government, ministers belonging to their parties will lose their jobs.