మోసపోయిన స్త్రీల అంతరంగం వారి మాటల్లోనే చదవండి -లింక్


‘జైజై నాయకా’ బ్లాగర్ కె.ఎన్.మూర్తి గారు ఒక ఇంటర్వ్యూ ప్రచురించారు. వ్యభిచార వృత్తిలో ఉన్న ఒక స్త్రీ తో జరిపిన ఇంటర్వ్యూ ఇది. మూడు కోట్ల మంది స్త్రీల ప్రతినిధిగా ఈమె చెప్పిన సంగతులు హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ వృత్తిలో ఉన్న మహిళలకు తమ వృత్తి పట్ల ఉన్న వ్యతిరేకత, ఆర్ధిక బాధలని ఎదుర్కోవడానికి అదే వృత్తిలో కొనసాగక తప్పనిసరి పరిస్ధితులు వారి బతుకుల్ని ఎంతగా బుగ్గిపాలు చేస్తున్నాయో ఆమె వివరించింది. చాలా కొద్ది మాటల్లో చెప్పిన ఈ వివరాలు ‘మనుషులు’ తెలుసుకోవలసినవి.

వ్యభిచారం అనేది ఒక్క స్త్రీల సమస్య మాత్రమే కాదనీ, సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకోవలసిన సమస్య అనీ ఈ ఇంటర్వ్యూ తెలుపుతోంది. అంతే కాక ఈ సమస్య ‘వర్గ సమస్య’ అనీ, పేదవర్గాలు మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య అనీ చెబుతోంది. వ్యభిచారం లీగలైజ్ చేస్తే వచ్చే ప్రమాదం ఏమిటో కూడా ఆమె చెబుతోంది. వ్యభిచార వృత్తిలో ఉన్నవారిలో మూడొంతులు మైనర్ బాలికలేనన్న కఠోర వాస్తవం ప్రభుత్వాలకి తెలిసినా ఏ చర్యా తీసుకోకపోవడాన్ని ఎలా చూడాలి?

ఇంటర్వ్యూని ఈ లింక్ లో చూడవచ్చు.

5 thoughts on “మోసపోయిన స్త్రీల అంతరంగం వారి మాటల్లోనే చదవండి -లింక్

  1. మూర్తిగారూ, వాస్తవానికే నేనే మరియూ మీ పోస్టు చదువుతున్నవాళ్లం మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీరు ప్రచురించిన ఇంటర్వ్యూ చాలా సమగ్రంగా ఉంది. బహుశా ఆమె ఒక సంస్ధలో పని చేస్తుండడం వల్లనేమో (అలా అని ఇంటర్వ్యూ ద్వారా అర్ధం అయింది) ఆమె మాటల్లో సమగ్రత వచ్చింది. చాలా విషయాలు ఆమె మాటల్లో తెలిసాయి. అందులో ఆడవాళ్లు ఆ పరిస్ధుతుల్లోకి ఎందుకు వస్తున్నారో వివరం ఉంది. ఆర్ధిక పరిస్ధితులు వారినా పరిస్ధితికి నెట్టాయన్న నిజాన్ని చక్కగా వివరించింది. కుటుంబ సభ్యులు, చివరికి భర్తలు సైతం వారినా వృత్తిలో కొనసాగిస్తున్న దైన్యాన్ని ఆమె వివరించింది.

    మీరు ఇలాంటివి మరిన్ని పోస్టులు, ఎలాగూ జర్నలిజం వృత్తిలో ఉన్నారు గనక, రాయాలని కోరుతున్నాను.

  2. ఏమో సర్, ఎన్ని సౌకర్యాలు, ఎన్నెన్నో విలాసాలు ఉన్నా మనజీవితాల్లో ఏదో లేనట్లు గా కోల్పోతున్నట్లుగా భావాలు కలుగుతుంటాయి అప్పుడప్పుడు,
    కాని ఇలాంటి ఘటన తో compare చేస్తే ఏపాటి కష్టం మనవి? ఛ అని పిస్తున్నది, కాని వారి దైన్యతను మనము ఏ రీతినా నివారించాలేమనే అసహాయతా భావం తో comment కాక మరేమీ చేయలేకున్నాను ?!

వ్యాఖ్యానించండి