బ్రిటిష్ రాణి ఎలిజబెత్ II సింహాసనాన్ని చేపట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరి 6 తో అరవై యేళ్లు పూర్తి కావస్తున్నాయట. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం ప్రపంచ వ్యాపితంగా పండగ జరుపాలని తలపెట్టింది. గత కొద్ది నెలలుగా ఎక్కడా కొత్తగా బ్యాంక్సీ వీధి చిత్రం జాడలేదు. నార్త్ లండన్ లో ప్రత్యక్షమైన ఈ వీధి చిత్రంతో బ్రిటిష్ రాణి అరవై యేళ్ల పండగని ఈ విధంగా బ్యాంక్సీ జరపుకున్నాడని ఔత్సాహికులు వ్యాఖ్యానిస్తున్నారు. రాణి గారి అరవై యేళ్ల పాలనా పండగ కోసం బ్యాంక్సీ మార్కు ‘బాల కార్మికుడు’ బ్రిటిష్ పతాకాలను ఇలా తయారు చేస్తున్నట్లుంది.
(ప్రఖ్యాత బ్రిటిష్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ వివరాల కోసం ఈ పోస్టు చూడగలరు.)

అరవై ఏళ్ళ పరిపాలనా సంబరాలకు ఐదారేళ్ళ వయసన్న పిల్లాడు శ్రమపడటం.. ఎంత సందర్భోచితంగా, వ్యంగ్య విలసితంగా ఉందో కదా ఈ బాలకార్మికుడి వీధి చిత్రం!
మరే!