త్వరలో ఇండియాలోనూ ‘పొదుపు విధానాలు’ -కార్టూన్


గురువారం ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్ సభలో ఓ జోక్ పేల్చాడు. త్వరలో భారత దేశంలోనూ ఆయన ‘పొదుపు విధానాల్ని’ తెస్తాడట. దేశాన్ని ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతున్నాయనీ వాటిని ఎదుర్కోవడానికి ‘పొదుపు విధానాలు’ తప్పవనీ ‘బడ్జెట్ ఆమోదం’ ముగిసాక ఆయన లోక్ సభ సభ్యుల్ని ఉద్దేశిస్తూ హెచ్చరిక చేశాడు. ఆయన ఆ ప్రకటన చేసినా, ప్రతిపక్ష సభ్యుల్లో ఎవరూ అదేమని ప్రశ్నించినవారు లేరు. ఆయన ప్రకటనని ఎవరూ గుర్తించినట్లు కూడా కనిపించలేదు. అదేదో తప్పనిసరన్నట్లుగా, మామూలే అన్నట్లుగా ఎవరూ పట్టించుకోలేదు.

కాని ప్రణబ్ ముఖర్జీ చెప్పిన ‘పొదుపు విధానాలు’ అమలు చేస్తున్నందునే ఇప్పటికి నికరంగా ఐదు యూరప్ దేశాల్లో జాతీయ ప్రభుత్వాలు కూలిపోయాయి. స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, ఫ్రాన్సు, గ్రీసు దేశాల్లో సో కాల్డ్ ‘లెఫ్టిస్టు’ ప్రభుత్వాలు ఉంటె రైటిస్టులు గద్దెనెక్కాయి, రైటిస్టులుంటె వారు ఓడి లెఫ్టిస్టులు ఎక్కారు. జర్మనీ లాంటి చోట్ల రాష్ట్రాల ఎన్నికల్లో పాలక పక్షాలు తీవ్ర ఓటమిని ఎదుర్కొంటున్నాయి. అంటే పొదుపు విధానాలన్నింటినీ ఆ దేశాల ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. వాటి వల్ల యూరప్ రుణ సంక్షోభం పరిష్కారం కాకపోగా మరింత ముదిరింది. అలాంటి పరమ నాసిరకమైన, ప్రజావ్యతిరేకమైన పొదుపు విధానాల్ని తెచ్చి ఇండియాలో అమలు చేస్తాననీ, దాంతో సంక్షోభం పరిష్కారం చేస్తానని చెబుతున్న చెబుతున్న మన ఆర్ధిక మంత్రిని చూస్తె ఒక్క హిందూ కార్టూనిస్టు కేశవ్ గారే కాక ఎవరికైనా నవ్వు రాకుండా పోదు.

Pranab Austerity

వ్యాఖ్యానించండి