1962 నుండి అమెరికా దురాక్రమణ యుద్ధ భీభత్సాన్ని అతి చిన్న దేశం ‘వియత్నాం’ నెత్తిన రుద్దింది. కమ్యూనిస్టు చైనా ప్రాబల్యం వియత్నాం దేశంలోకి విస్తరిస్తుందన్న భయంతో వియత్నాం ప్రజలపై అమెరికా బలవంతంగా రుద్దిన యుద్ధం ఇది. జాతీయ విముక్తి యుద్ధాల ఫలితంగా ప్రపంచంపై యూరోపియన్ దేశాల వలసాధిపత్యం అంతరించాక అమెరికా తన సామ్రాజ్యాధిపత్యాన్ని విస్తరించడానికి అనేక దుర్మార్గ యుద్ధాలను ప్రపంచ దేశాలపై రుద్ధడం ప్రారంభించింది. అమెరికా కంపెనీల ప్రయోజనాలను ప్రపంచ వ్యాపితంగా విస్తరించడంతో పాటు, కమ్యూనిస్టు వ్యవస్ధల ప్రమాదాన్ని ఎదుర్కోవడం ఈ యుద్ధాల ప్రధాన లక్ష్యం. వియత్నాం ప్రజలు అత్యంత ధైర్య సాహసాలతో అమెరికా సైనికులను చావు దెబ్బ కొట్టడంతో ‘ఓటమి’ ని అంగీకరించి అమెరికా సర్దుకోక తప్పలేదు. అయినా అమెరికా బుద్ధి తెచ్చుకోకుండా ఆఫ్ఘనిస్ధాన్-పాకిస్ధాన్ దేశాలపై ‘టెర్రరిజం’ పేరుతో దురాక్రమణ యుద్ధం నిర్వహిస్తోంది. ఇరాక్ లోనూ పాఠం నేర్చుకోక సిరియాలో వేలు పెడుతోంది.
వియత్నాం యుద్ధాన్ని ‘అసొసియేటెడ్ ప్రెస్’ వార్తా సంస్ధ తరపున ‘హార్ట్స్ ఫాస్’ కవర్ చేసి ఆ కృషికి గాను ‘పులిట్జర్ బహుమతి’ గెలుచుకున్నాడు. జర్మనీకి చెందిన ఫాస్ మే 10 న చనిపోయిన సందర్భంగా వియత్నాం యుద్ధ భీభత్సాన్ని తలచుకోవడం సముచితం.




















హార్ట్స్ ఫాస్ తీసిన వియత్నాం యుద్ధ రంగ ఫొటోల కోసం నెట్ లో వెతుకుదామనుకుంటున్నాను… ఈలోపే మీరు ఇక్కడ ఆ ఫోటోలను పోస్ట్ చేశారు.
యుద్ధ బీభత్సానికి బహుముఖంగా అద్దం పట్టిన ఈ ఛాయాచిత్రాలు వియత్నాం వేదనకు ప్రబలసాక్ష్యాలు. కొడుకు మృతదేహం పట్టుకుని నిలబడిన తండ్రి నిస్సహాయత, భర్త శవం దగ్గర భార్య ఆక్రందన…ఇలా ప్రతి ఫొటో కూడా జనం దు:ఖాన్నీ, ఇతర భావోద్వేగాలనూ రికార్డు చేసి, చూసిన ప్రతి ఒక్కరి మనసుల్నీ కదిలించేలా ఉంది!
అవును. ఈయన వియత్నాం యుద్ధమే కాక బంగ్లాదేశ్ సివిల్ వార్ ని కూడా కవర్ చేశాట్ట. బంగ్లాదేశ్ కవరేజ్ కి (1972) ఇంకో పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్నాడు. కాంగో, అల్జీరియా అంతర్యుద్ధాలని కూడా కవర్ చేశాడని పత్రికల ద్వారా తెలుస్తోంది. మరో ఫొటో గ్రాఫర్ ఎడ్డీ ఆడమ్స్ కి పులిట్జర్ ప్రైజ్ రావడానికి ఇతను కారకుడు. అమెరికా సైన్యాన్ని ఆహ్వానించిన దక్షిణ వియత్నాం ప్రభుత్వ పోలీసు ఒకాయన వియత్నాం కమ్యూనిస్టు ఖైదీని బహిరంగంగా కాల్చి చంపినపుడు ఆడమ్స్ ఫొటో తీస్తే దాన్ని దాచి పెట్టారట. ఆ ఫొటో బైటికి రావడానికి ఫాస్ కారణమని కొన్ని పత్రికలు రాసాయి.
AMERICA VIETNAM YUDDAM ENDUKU JARIGINDO VIVARANGA OKA POST VEYYAGALARA…….