శుక్రవారం లోక్ సభలో జరిగిన గొడవతో ఎన్.సి.ఇ.ఆర్.టి సెలక్షన్ కౌన్సిల్ సభ్యులూ, ఛీఫ్ సలదారులూ అయిన ఇద్దరు రాజీనామా చేయవలసి వచ్చింది. దళిత ఎం.పిలు గొడవ చేయడంతో ప్రముఖ కార్టూనిస్టు శంకర్ కార్టూన్ ఉన్న పదకొండవ తరగతి రాజకీయ శాస్త్రం లో ఒక పాఠ్యాంశంగా ఉన్న పుస్తకాన్ని తొలగిస్తున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి ‘కపిల్ సీబాల్’ ప్రకటించాడు. ఆయనతో పాటు ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా కార్టూన్ అలా గీయవలసింది కాదని వ్యాఖ్యానించారు. కార్టూన్ గీయడం వెనక క్రిమినల్ ఉద్దేశ్యాలున్నాయేమో పరిశీలిస్తామని కూడా కపిల్ సిబాల్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ వ్యాపిత మన్ననలు అందుకున్న ప్రఖ్యాత కార్టూనిస్టు శంకర్ 1989 లోనే మరణించిన సంగతి ఈ అంబేద్కర్ ప్రేమికులకు తెలియదా ఏమి? లేక దళితుల అభ్యున్నతి కి పాటు పడిన అంబేద్కర్ విమర్శలకు అతీతుడని చెప్పదలిచారా?
–

రాజ్యాంగం వ్రాసినది అంబేద్కర్ ఒక్కడే కాదు. రాజ్యాంగం వ్రాసిన కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడు.
ఏమిటేమిటి ప్రజాస్వామ్యం నత్త నడకన సాగుతోంది అదే కదా! ఇందులో చూపించారు !
ఓహో ! అదన్న మాట సంగతి! అక్కడ !! పొరపాటున తప్పు photo పెట్టారు
ruling party తరఫున చదేవే వాళ్ళ పుస్తకాల్లో ప్రతిపక్ష leader బొమ్మ,
opposition party తరఫున చదివేవాళ్ళ పుస్తకాల్లో ruling party leader బొమ్మ ఉండేలా లాంటిది
Morphing ఏమన్నా చేస్తే సరి గీసినాయన ఎటూ లేడుగా !!
?!
ఇన్నాళ్ళూ మన భారతీయ కార్టూనిస్టులు ఏ కొంత వివాదస్పద కార్టూన్ వేసినా శంకర్ కార్టూన్లని ఆసరా తెచ్చుకుని సమర్థించుకునేవాళ్ళు… ఆనాడే శంకర్ ఇంతకంటే తీవ్రంగా వేశాడంటూ!
తనను వదిలివెయ్యకుండా ఎప్పటిలాగే కార్టూన్ల చురకలు వేస్తుండాలని నెహ్రూ శంకర్ ని అడిగిన ఉదంతం ఉంది. రాజకీయ నాయకులకు ఉండాల్సిన క్రీడా స్ఫూర్తి గురించి చెప్పేటపుడు ఈ సంఘటనను ఉటంకిస్తుంటారు.
కానీ ఇన్నేళ్ళ తర్వాత అదే శంకర్ గీసిన వ్యంగ్యచిత్రంలో మన నేతలకు తప్పు కనపడటం హాస్యాస్పదంగా, విచిత్రంగా ఉంది. ఇలా తప్పు పట్టటం అంబేద్కర్ ని గౌరవించటం అవుతుందని భ్రమిస్తున్నట్టున్నారు. ఒకప్పటి కార్టూన్ల వెనక ‘క్రిమినల్ ఉద్దేశాలను పరిశీలించే ’ పని కూడా మంత్రులపై కొత్తగా పడిందన్నమాట! రానురానూ వ్యంగ్యాన్నీ, విమర్శనూ ఏమాత్రం అర్థం చేసుకోలేని, భరించలేని స్థితికి వచ్చేస్తున్నారు మన నాయకులు!
Indian Government banned this cartoon. You have no right to publish the same in website or anywhere. It is a crime and liable for prosecution. please remove it from website.
కృష్ణ గారు, ఈ కార్టూన్ ని ‘ది హిందూ’ పత్రిక ఫ్రంట్ పేజితో పాటు లోపలి పేజిలో కూడా ప్రచురించింది. ఈ కార్టూన్ తో కలిపి హిందూ కార్టూనిస్టు సురేంద్ర మరో కార్టూన్ గీసాడు. అది కూడా ఈ బ్లాగ్ లో ఉంది.
గొడవ కి కారణమైన కార్టూన్ ఏమిటో తెలియాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్టూన్ ప్రచురించడం జరిగింది. గొడవ ఎందుకు జరిగిందో తెలియడానికి, జరిగిన గొడవ సమంజసమేనా అన్నది నిర్ధారించుకోవడానికి కార్టూన్ అవసరం కదా.
కార్మికులకి సమ్మె హక్కు లేదని కూడా కోర్టులు తీర్పులిస్తున్నాయి. ప్రభుత్వాలూ, కంపెనీలూ కూడా అదే చెబుతున్నాయి. అవన్నీ ప్రజల హక్కుల్ని హరించేవే. ఈ రోజు కార్టూన్ ని నిషేధించినవారు రేపు మరొకటి చేయరన్న గ్యారంటీ లేదు. సాధారణ దృష్టితో చూసినపుడు పత్రికల్లో వచ్చే కార్టూన్లు ఒక రాజకీయ ప్రకటన చేస్తాయి. రాజకీయ ప్రకటనలపైనా, అభిప్రాయాలపైనా నిషేధం విధిస్తే పాలకవర్గాలకే అంతిమ ప్రయోజనం. ప్రజలు తమ ప్రజాస్వామిక హక్కులను కాపాడుకునే బదులు ఇలాంటి వాటిని అనుమతిస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం. కాదంటారా?
వేణు గారు, మీ వ్యాఖ్య ఎందుకో స్పాం లో ఉంది. అందుకే ప్రచురణ ఆలస్యం అయింది.
chuse kalla batti untundi!…nehru nattani kodutunnadu, ambedkar ki sahayam chestunnadu anukovachhugaa
సుభాష్ గారూ, అనుకోవడం కాదు. కార్టూన్ చెబుతోంది అదే. నెహ్రూ, అంబేద్కర్ ఇద్దరూ కలిసి ‘రాజ్యాంగం’ అనే నత్తను వేగంగా పరుగెత్తించడానికి ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగ రచనే నెమ్మదిగా జరుగుతున్నపుడు నత్త ఎలా పరుగుపెడుతుందన్నది శంకర్ గారి విమర్శ.
హిందువులుకు పవిత్రం అయిన భగవద్గీత అయిన, ముస్లిమ్స్ కి కురాన్ అయిన, క్రీస్తియన్స్ కి బైబిల్ అయిన మంచినే చెప్పాయి…అలానే భారతీయులకు రాజ్యాంగం అంత విలువ అయినది…దాని విలువను చిన్నప్పటి పాట్య పుస్తకాల్లోనే వివరిస్తే, నత్త దానికి అదే వేగం గా వెళుతుంది…రావాల్సింది మన దీశ ప్రజల్లో మార్పు…
Is there any wrong In that picture?
Read this link: http://4proletarianrevolution.mlmedia.net.in/134550870