అంబేడ్కర్ కార్టూన్ పై ఇంత రగడ అవసరమా? -కార్టూన్


శుక్రవారం పార్లమెంటులో అంబేడ్కర్ కార్టూన్ విషయంలో జరిగిన రగడ కు స్పందనగా ‘ది హిందూ’ పత్రిక కార్టూనిస్టు ‘సురేంద్ర’ గీసిన కార్టూన్ ఇది. మమత బెనర్జీ పై గీసిన కార్టూన్ ని ఈమెయిల్ ద్వారా ఇతరులకు పంపాడన్న కారణంతో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ పైన కేసులు పెట్టి వేధించడాన్ని దేశం మొత్తం ఖండించింది. దేశ రాజకీయ నాయకులతో పాటు, అనేక మంది స్కాలర్లు, విద్యావేత్తలు, రాజకీయ వేత్తలు మెచ్చిన కార్టూనిస్టు ‘శంకర్’ గీసిన కార్టూన్ అరవై అయిదేళ్ల తర్వాత వివాదానికి కారణం కావడం విచారకరం. బహుశా అంబేడ్కర్ బతికే ఉన్నా తనపై గీసిన కార్టూన్ కి ఇంత రగడ జరగడానికి అనుమతించేవాడు కాదేమో. ప్రజాస్వామ్య వ్యవస్ధలో విమర్శలకు ఏదీ అతీతం కాదన్న తెలివిడి పెరిగిందా తరిగిందా అన్న అనుమానం వస్తే దానికి బాధ్యులు ఎవరు?

వ్యాఖ్యానించండి