2జి స్పెక్ట్రం కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం యు-టర్న్ తీసుకుంది. ప్రవేటు టెలికం కంపెనీలు అక్రమంగా పొందిన లైసెన్సులను రద్దు చేసిన సుప్రీం కోర్టు తీర్పు పై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను ఉపసంహరించు కోవాలని నిర్ణయించింది. ప్రవేటు కంపెనీలు పొందిన 122 అక్రమ లైసెన్సులను సుప్రీం కోర్టు ఫిబ్రవరి 2, 2012 తేదీన ఇచ్చిన తీర్పులో రద్దు చేసింది. దేశ సహజ వనరుల విషయంలో మొదట వచ్చినవారికి మొదట లైసెన్సు లు కేటాయించే పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పు చెప్పింది. వేలం వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకి లబ్ది చేకూర్చాలని చెప్పింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు అనుమతించలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారించడానికి అంగీకరించింది. ఇపుడు అకస్మాత్తుగా రివ్యూ పిటిషన్ పై ముందుకు వెళ్లకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా కొన్ని వివరాలతో ‘ది హిందూ’ పత్రిక ఈ క్రింది గ్రాఫిక్ ను అందించింది. (క్లిక్ చేసి పెద్ద సైజులో చూడవచ్చు.)

మరో రెండేళ్ళ తరువాత ఎన్నికలు వస్తాయి కదా, ఓడిపోకుండా జాగ్రత్తపడదామని.