ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి ఓటమి పై యూరోపియన్ కార్టూనిస్టులు ఇలా స్పందించారు. యూరోపియన్ బహుళజాతి కంపెనీలతో పాటు అమెరికా బహుళజాతి కంపెనీలకు లబ్ది చేకూరుస్తూ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజీల నేతృత్వంలో యూరోపియన్ ప్రభుత్వాలు అమలు చేసిన పొదుపు ఆర్ధిక విధానాలతో యూరోపియన్ ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. కంపెనీలకు బెయిలౌట్లు పంచిపెట్టడం వల్ల పేరుకున్న అప్పులను కోతలు, రద్దులతో ఇ.యు ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. కార్మికులు, ఉద్యోగుల వేతనాలలో గణనీయ భాగాన్ని కంపెనీల లాభాలకు తరలిస్తూ కంపెనీల లాభాల సంక్షోభాన్ని ప్రజల నెత్తిన రుద్దుతున్నాయి. ఫలితంగా ఎన్నికలు జరిగిన చోటల్లా అధికార పార్టీలు ఓటమి పాలవుతున్నాయి. స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ (స్ధానిక ఎన్నికలు), ఫ్రాన్సు లకు తోడు ఆదివారం గ్రీసు లో కూడా అధికార కూటమి పదవీచ్యుతురాలయింది.
- కార్టూనిస్టు: డెరిల్ కేగిల్, అమెరికా
- కార్టూనిస్టు: పాట్రిక్ చప్పాట్టీ, స్విట్జర్లాండ్
- కార్టూనిస్టు: మార్టిన్ సుటోవెక్, స్లొవేకియా
- కార్టూనిస్టు: పెటార్ పిస్మెస్త్రోవిక్, ఆస్ట్రియా
- కార్టూనిస్టు: జోప్ బెర్ట్రామ్స్, నెదర్లాండ్స్
–
ఎం.ఎస్.ఎన్ వార్తా సంస్ధ ఈ కార్టూన్లను అందించింది.
–