ఓ వైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు జరుగుతుండగానే భారత దేశ రాష్ట్ర పతికి ఎవరు సరైన అభ్యర్ధులో తేల్చుకోవడానికి రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు పడుతున్నాయి. రెండు చోట్ల, రెండు రంగాల్లో చోటు చేసుకున్న ద్వైదీ భావ ‘టు బి ఆర్ నాట్ టు బి’ పరిస్ధితి ‘ది హిందూ’ పత్రిక కార్టూనిస్టు సురేంద్రను ఈ కార్టూన్ గీయడానికి పురి గొల్పింది.
రాష్ట్రపతి పదవికి ఇద్దరు అభ్యర్ధులను కాంగ్రెస్ ప్రతిపాదించింది. వారు ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ. ఇద్దరిలో ప్రణబ్ ముఖర్జీ ఆమోదయోగ్యమైన అభ్యర్ధిగా తేలనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఉప రాష్ట్ర పతిని రాష్ట్రపతి పదవికి నియమించే సంప్రదాయాన్ని కాంగ్రెస్ ఎందుకు వదిలి పెట్టిందీ అర్ధం కాలేదు. బహుశా పూర్తి మెజారిటీ లేని పరిస్ధితులే పాలక పార్టీ అవకాశాల్ని గండి కొట్టినట్లు కనిపిస్తోంది. అన్సారీ కి స్టేచర్ లేదని వ్యాఖ్యానించిన సుష్మా జె.డి(యు) అభ్యంతరం చెప్పడంతో మళ్లీ నాలుక్కరుచుకుంది. మధ్యలో మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం రెండు మూడు రోజులపాటు వార్తల్లో నానినా, మళ్ళీ తేలలేదు. మొత్తం మీద రాజకీయ పార్టీల చర్చల్లో పడి రాష్ట్ర పతిక ఎన్నిక ఐ.పి.ఎల్ తలపిస్తోంది.
—
“స్కోరెంత? ఐ.పి.ఎల్ పాయింట్ల పట్టికలో ఎవరు ముందున్నారు? నా ఉద్దేశ్యం ‘ఇండియన్ ప్రెసిడెన్షియల్ లీగ్’ అని?”
–
