యు.పి లో కాంగ్రెస్ ఓటమిని సమీక్షించడానికి ఎ.కె.ఆంటోని, షీలా దీక్షిత్, సుశీల్ కుమార్ షిండే లతో కాంగ్రెస్ నియమించిన కమిటీ, నివేదికను పూర్తి చేసినట్లు పత్రికలు తెలిపాయి. యు.పి ఎన్నికలకు చాలా ముందు నుండె ప్రచారంలోకి దూకిన రాహుల్ గాంధీ ప్రసక్తి లేకుండానే కమిటీ తన నివేదికను పూర్తి చేసినట్లు అవి తెలిపాయి. సరైన అభ్యర్ధులకి టిక్కెట్లు ఇవ్వకపోవడం, అవినీతిపై ప్రజల దృక్పధం, అధిక ధరలు, వివాదాస్పద ప్రచారం కాంగ్రెస్ ఓటమికి కారణాలని కమిటీ నివేదించిందని తెలుస్తోంది. ప్రచారానికి నాయకత్వం వహించిన రాహుల్ గాంధీ ప్రస్తావనే నివేదిక లో లేకపోవడాన్ని పత్రికలు విమర్శిస్తున్నాయి.
“అదంతా చెట్టు తప్పే. రోడ్డుకి మరీ దగ్గరగా వచ్చేసింది చూడండి మేడం”
–

విరిగిన స్టీరింగ్ తో రాహుల్ గాంధీ సోనియా వెనక ఉండటంలో భలే చమత్కృతి కనిపిస్తోంది!
మొన్న సచిన్ టెండూల్కర్ ని చిత్రిస్తున్న బాల్ థాకరే కార్టూన్, ఇవాళ ఈ కార్టూన్… వీటిని వేసిన కార్టూనిస్టు ‘సురేన్ద్ర’ది విజయవాడే. ఇంతకుముందు ఆంధ్రభూమి/ వార్తలో పొలిటికల్ కార్టూనిస్టుగా పనిచేశాడు. తర్వాత హిందూలో చేరి, కేశవ్ తర్వాత ఆ స్థాయిలో కార్టూన్లు వేసేంతగా ఎదుగుతున్నాడు!
అవునా? సురేంద్ర మన తెలుగోడే అన్న మాట!