సచిన్ టెండూల్కర్ కి రాష్ట్ర పతి కోటాలో రాజ్య సభ సభ్యత్వం కట్టబెట్టడం వెనుక కాంగ్రెస్ కి మోసపూరిత ఉద్దేశ్యాలున్నాయని బాల్ ధాకరే ఆరోపించాడు. బాల్ ధాకరే ఆరోపణలకు ‘ది హిందూ’ కార్టూనిస్టు సురేంద్ర ఇచ్చిన కార్టూన్ రూపం ఇది. కాంగ్రెస్ కి ఏ ఉద్దేశ్యాలున్నాయో ఏమో గాని రాజకీయ చదరంగంలో సచిన్ ఒక పావుగా మారే సూచనలు అప్పుడే కనిపిస్తున్నాయి. మరో పక్క రాజ్య సభ సభ్యత్వం స్వీకరించినంత మాత్రాన తాను రాజకీయాల్లోకి రాబోనని సచిన్ స్పష్టం చేస్తున్నాడు. తాను ఇంకా క్రికెటర్ నే ననీ, క్రీడల కోటాలో తనకు రాజ్య సభ సభ్యత్వం ఇచ్చారనీ సచిన్ అన్నాడు. అయితే, రాజకీయాల్లో చేర కుండానే రాజ్య సభ సభ్యత్వం పొందవచ్చన్నమాట. పెద్దల సభ అంటే అర్ధం అదే కాబోలు.
–
