పార్లమెంటుతో సచిన్ సరికొత్త ఇన్నింగ్స్ -కార్టూన్


రాష్ట్ర పతి కోటాలో సచిన్ టెండూల్కర్ రాజ్య సభ సభ్యుడయ్యాడు. సెంచరీల శతకం సాధించినందుకు అభినందనలు అందుకోమని పిలిచి కాంగ్రెస్ సుప్రీం సోనియా ఆయనకి రాజ్య సభ్య సభ్యత్వం కట్టబెట్టింది. సచిన్ కి ‘భారత రత్న’ ఇవ్వాలని ఓ పక్క చర్చలు సాగుతుండగా రాజ్య సభ సభ్యత్వం కట్టబెట్టడం అనుమానాలు రేకెత్తించింది. భారత రత్న ఇవ్వలేక రాజ్య సభ్య సభ్యత్వం ఇచ్చినట్టా లేక భారత రత్న కు రాజ్య సభ సభ్యత్వం బోనస్సా అన్నది ముందు ముందు గాని తెలియదు. పలు వ్యాపార ఉత్పత్తులకు ఎండార్స్ మెంట్ ఇచ్చిన సచిన్ ‘భారత రత్న’ కు అనర్హుడని వ్యాఖ్యానాలు వినవచ్చిన నేపధ్యంలో అందుకు బదులుగా రాజ్య సభ సభ్యత్వం ఇచ్చి ఉండవచ్చని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నా ప్రస్తుతానికి అవన్నీ ఊహాగానాలుగానే ఉన్నాయి. ఓ వైపు క్రికెట్ ఆటలో కొనసాగుతూ రాజ్య సభ సమావేశాలకు సచిన్ హాజరవగలడా అన్న అనుమానాలు కూడా పలువురు రాజకీయ నాయకులు పరోక్షంగా ప్రశ్నలు సైతం లేవనెత్తారు.

Sachin, MP

“ఆయనకి క్రీజుని అలా తాకి వెళ్లడానికి మాత్రమే సమయం ఉంది మరి!”

(‘ది హిందూ’ పత్రిక ఈ కార్టూన్ ప్రచురించింది.)

One thought on “పార్లమెంటుతో సచిన్ సరికొత్త ఇన్నింగ్స్ -కార్టూన్

  1. రాజ్య సభలో స్దానం పొందినందుకు సచిన్ కు నా అభినందనలు. అయితే రాజ్యసభ సభ్యత్వం బిరుదులు కింద ఇవ్వటం సబబు కాదు. నిజం గా ప్రజా సేవ కోసం రాజ్య సభలో సభ్యులు కావడం ఒక ఎత్తు, స్వలాభం కోసం, హోదా కోసం సభ్యులు కావడం ప్రజాస్వామ్యానికి అంత శ్రేయస్కరం కాదు.

వ్యాఖ్యానించండి