సుప్రీం కోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) మోడి కి ఏ పాపమూ తెలియదని తేల్చేసింది. హిందూ మూకల చేత పన్నెండొందలకు పైగా ముస్లింలు ఊచకోత కోయబడ్డ గుజరాత్ మారణ కాండకు సంబంధించి మోడిని ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలేవీ కనిపించలేదట. నెలల తరబడి సాగిన మానవ హననంలో పసి పిల్లలు, ముసలివాళ్ళు, స్త్రీలు, గర్భిణీ స్త్రీలు అత్యంత పాశవికంగా హత్యలకు గురయినప్పటికీ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ కూచుంది. అయినా రాష్ట్ర ముఖ్య మంత్రికి వ్యతిరేకంగా వీసమెత్తు సాక్ష్యం దొరకలేదట. హిందూ మత ముష్కరులు ఓ వైపు పాశవిక హత్యాకాండకు పాల్పడుతుండగా ‘న్యూటన్ ధర్డ్ లా’ ప్రకారం చర్యకు ప్రతి చర్య తీసుకుంటున్నారంటూ బహిరంగంగా సమర్ధించిన అత్యంత కర్కశ రక్త పిపాసి ముఖ్యమంత్రి నరేంద్ర మోడి పవిత్రుడేనట.
ఇక మిగిలిన ఆశలన్నీ సుప్రీం కోర్టు పైనే. నరేంద్ర మోడి ని ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలున్నాయని చాటి చెప్పిన సుప్రీం కోర్టు అమికస్ క్యూరీ రిపోర్టుని సుప్రీం కోర్టు ఎలా పరిగణించనున్నదో చూడవలసి ఉంది. అమికస్ క్యూరీ రాధాకృష్ణన్ పరిశీలన ఎందుకూ కొరగాకుండా పోయినట్లయితే ఇక ఈ దేశంలో సామాన్య మానవుడికి రక్షణ లేనట్లే. శతాబ్దాల తరబడి పోరాడి సాధించిన ‘సో కాల్డ్’ స్వాతంత్రం ఇక నిక్కచ్చిగా మేడి పండే. గోధ్రా దహనం, చర్యకు ప్రతిచర్యకై మోడీ ఆదేశాలు, హిందూ మూకలతో పోలీసుల కుమ్మక్కు, సంవత్సరాల తరబడి సాగిన సాక్ష్యుల కొనుగోలు… వీటికి కొనసాగింపే సిట్ నియామకం అన్న అనుమానాలు రూఢి అయినట్లే. సిట్ నియామకం మోడి దోషిత్వాన్ని రుజువు చేయడానికి కాదు. ఆ రాక్షస మూకల దుర్మార్గాలను చట్ట బద్ధంగా సమాధి చేయడానికే. తన పనిని సిట్ నిర్విఘ్నంగా, విజవంతంగా పూర్తి చేసింది.
–

this smacks of bias of the highest level and stooping to the lowest level. So where do you draw the line? and whom do you believe? You decided and pre-judged Modi through your colored lenses and if the same report was against Modi, by this time you would be drooling over it and now you are saying ( rather hope) that Supreme court will have to take a decision? what decision satisfies you? you expect the decision to go against Modi! If not, again you will start accusing the Judiciary also. Isn’t it?
sreerama, Chennai
అయితే ఎవరు చేసినట్లు? సంవత్సరాల తరబడి పోలీసులు ఏ చర్యా ఎందుకు తీసుకోనట్లు? సాక్ష్యులను కొనేసిన వార్తలను విస్మరించడం ఎలా సాధ్యం? బెస్ట్ బేకరీ కేసు సాక్షిని లక్షలు పెట్టి కొనుక్కోవడం అబద్ధమా? 1200 పైగా అమాయకులు హత్యాకాండలో బలి కావడం అబద్ధమా? చర్యకు ప్రతి చర్య అని మోడీ సమర్ధించడం అబద్ధమా? ఏది అబద్ధం అయితే మోడీ అమాయకుడు? రాష్ట్ర ప్రభుత్వం మద్దతు లేకుండానే నెలల తరబడి హత్యాకాండ సాగించడం సాధ్యమా? పోలీసులే జనాన్ని మూకలవైపుకి తరమడం అబద్ధమా? ఇవన్నీ ఎలా రుజువు కావాలి? ఇంకా ఏయే చట్టాలు చేస్తే మోడీ లాంటి దుర్మార్గులు బోను ఎక్కుతారు? ఏనుగులు దూరగల కంతలున్న చట్టాలే మోడి నిర్దోషిత్వానికి రాజమార్గాలు.
oho so Rajiv did’nt commit anything on Sikh Brothers!
what a bias ? any thing is right for Khangress ;)
ఏ రాయయితేనేం? పళ్ళూడగొట్టుకోవడానికి!
హిందు మత ముష్కరులు అన్న పదం బాగాలేదు.ముష్కరులకు మతం ఎందుకు అంటగడుతున్నారు.గోధ్రా దుర్ఘటనల్లో కేవలం ముస్లింలు మాత్రమే చనిపోయారు అని పదేపదే చెప్పడం కరెక్ట్ కాదు.అక్కడ మరుగున పడిపోయిన నిజాలు ఎన్నో ఉన్నాయి.గుజరాత్ ఇష్యూ వచ్చిన ప్రతీసారీ గోధ్రా ఘటన తరువాత జరిగిన అల్లర్లు అని మొదలుపెడ్తారు ఎందుకు? గోద్రాలో సబర్మతి రైల్లో జరిగిన హేయమైన సంఘటన గురించి ఎందుకు ప్రస్తావించరు…రైలు భోగీలో పెట్రోల్ మంటల్లో కాలిపోయిన రామభక్తులవి ప్రాణాలు కావా…వారిని చంపింది ముస్లిం ముష్కరులు అని ఎందుకు చెప్పడం లేదు.ముందు రైల్లో ఏమి జరిగిందో చెప్పి తరువాత సంఘటనలు వివరిస్తే అభిప్రాయాలు సమతూకంగా ఉంటాయి.మరో విషయంలో అల్లర్లలో మంది ముస్లింలు,రెండు వందల మందికి పైగా హిందుమతస్ధులు చనిపోయారని,వంద మందికి పైగా హిందువుల ఆచూకి తెలియడం లేదని ,దుర్ఘటన పై విచారించిన కమిటీలు స్ఫష్టం చేశారు.ఊచకోతలకు పాల్పడింది హిందువులైతే వాళ్లు,హిందువులను కూడా ఎందుకు చంపినట్లు.?
తప్పు రెండు వైపులనుంచీ ఉంది.మోడీది తప్పు ఉందా లేదా అన్నది ఖచ్చితంగా న్యాయస్ధానంలో తేలుతుంది.కానీ ఒకే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దుర్మార్గపు దుష్ప్రచారాలను ఆపడం మంచిది కాదు.గోద్రా ఘటన జరిగి ఉండకూడదు.ఆ తరువాత జరిగిన రక్తపాతం ఎట్టిపరిస్దితుల్లోనూ క్షమార్హం కాదు.
“గోద్రా ఘటన జరిగి ఉండకూడదు.ఆ తరువాత జరిగిన రక్తపాతం ఎట్టిపరిస్దితుల్లోనూ క్షమార్హం కాదు.”
అరుణ్ గారూ, భేషైన మాటన్నారు. గుజరాత్ లో ముస్లింలపై మారణ కాండను నిరసిస్తే అది గోధ్రా రైలు దహనానికి సమర్ధన కాదని మీరు గమనించాలి.
ఊచకోతకు పాల్పడింది హిందువులేనని నేను కొత్తగా చెబుతున్న విషయం కాదు. స్వయంగా మోడీయే ఆ మాట అన్నాడు. హిందువులు చర్యకు ప్రతి చర్య తీసుకుంటున్నారని బహిరంగంగా సమర్ధించిన వ్యక్తి మోడి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి, గోధ్రా రైలు దహనానికి కారకులైనవారిని పట్టుకుని శిక్షించగల అత్యున్నత అధికారం ఉన్న పదవిలో ఉండి ఆ మాట ఎలా అనగలరు? పోలీసు అధికారులను సమావేశ పరిచి అల్లర్లను చూసి చూడనట్లు పోవాలని మోడీ ఆదేశించిన సంగతి కోర్టులో రుజువు కాకపోవచ్చు. మోడి అలా ఆదేశాలిచ్చిన సమావేశంలో తానున్నానని చెప్పిన సంజయ్ భట్ సాక్ష్యాన్ని సిట్ పరిగణించకపోవడం కేవలం సాంకేతిక కారణం వల్లనే.
గుజరాత్ హత్యాకాండ గురించి ‘కాంబాట్ కమ్యూనలిజం’ అన్న పత్రిక చాలా వివరాలు ప్రకటించింది. ఒక ఇష్యూ మొత్తం ఆ హత్యాకాండకి కేటాయించింది. ఆ ఇష్యూ తెలుగులోకి కూడా అనువాదం అయింది. ఆ పుస్తకం నేను చదివాను. మోడీ ఆదేశాల ఫలితం గుజరాత్ హత్యాకాండలో ప్రత్యక్షంగా ఎలా అమలయిందో ఆ పత్రిక కళ్లకు కట్టినట్లు వివరించింది. పోలీసులు, హిందూ మతం పేరు చెప్పిన మూకలతో ఎలా కుమ్మక్కయిందీ వివరించింది. పారిపోతున్న ముస్లింలను మూకలవైపుకి పోలీసులు ఎలా తరిమిందీ తెలిపింది. కాపాడతామని తీసుకెళ్ళి హిందూ గూండాలకి ఎలా అప్పజెప్పిందీ వివరించింది. ఇళ్లు తగలబెట్టి ఆ మంటల్లో స్త్రీలనూ పిల్లలనూ ఎలా విసిరేసిందీ వివరించింది. గర్భిణీ స్త్రీ పొట్ట చీల్చి బిడ్డను లాగి కత్తితో నరికిన దృశ్యాన్నీ వివరించింది. కాంగ్రెస్ ఎం.పి జాఫ్రీ పదే పదే పోలీసు కంట్రోల్ రూం కీ, సెక్రటేరియట్ కీ, మంత్రులకీ ఫోన్లు చేసినా కాపాడడానికి ఎవరూ రాని సంగతిని వివరించింది.
ఇన్ని దుర్మార్గాలు జరిగితే ఒక్కటంటే ఒక్క కేసులోనైనా శిక్షలు పడేలా చేయడానికి మోడికి మనసొప్పలేదు. ఎమ్మెల్యేల అనుచరులు స్వయంగా సాగించిన హత్యాకాండ వివరాలు విజయోత్సాహంతో చెప్పుకుంటే రికార్డు చేసిన వార్తలు పత్రికల్లో వచ్చాయి. ఒక్కో కేసూ నీరు గార్చడానికి మోడి ప్రభుత్వం వైపు నుండి జరిగిన ప్రయత్నాలు పత్రికల్లో వచ్చాయి. చివరికి గుజరాత్ కోర్టులపైన కూడా నమ్మకం లేక సుప్రీం కోర్టు కొన్ని కేసుల్ని బైటి రాష్ట్రాలకి తరలించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రభావం నుండి తప్పించి, గుజరాత్ పోలీసులు, కోర్టుల విచారన ప్రభావం నుండి తప్పించి సుప్రీం కోర్టు స్వయంగా పర్యవేక్షించడం వల్ల మాత్రమే కొన్ని కేసుల్లోనైనా శిక్షలు పడుతున్నాయి. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోని పోలీసుల విచారణలో ఒక్కటంటె ఒక్క దోషికీ శిక్షలు పడలేదు. అందరూ నిర్దోషులుగా బైటికొచ్చారు. ఇప్పుడు శిక్షలు పడుతున్నవారు కూడా గుజరాత్ లో నిర్దోషులుగా బైటపడ్డవారే. ఎందుకంత తేడా? గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ మద్దతు లేకుండా, మోడీ ఆదేశాలు లేకుండా పదుల కేసుల్లో, వందల మంది నిర్దోషులుగా బైటికి రావడం ఎలా సాధ్యం?
హిందూ మతం పేరు చెప్పి ముస్లింలపై హత్యాకాండకి పాల్పడ్డారు. అందుకే హిందూ ముష్కరులు అనడం. దానర్ధం హిందువులంతా ముష్కరులని చెప్పడం కాదు. నాకా అభిప్రాయం లేదు. మత దురభిమానం ఏ రూపంలో ఉన్నా నేను వ్యతిరేకిస్తాను.
నేను మొత్తం ఘటనను విశ్లేషించినట్లయితే గోధ్రా రైలు దహనం గురించి రాయకపోవడం తప్పవుతుంది. కాదు గనక రైలు దహనం గురించి ప్రస్తావించలేదు.
కోర్టులకి సాక్ష్యాలు కావాలి. నేరస్ధులు సాక్ష్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే దోషులు కాకుండా పోతారా? జరిగిన హత్యాకాండ మాసిపోతుందా?
దుర్మార్గపు దుష్ప్రచారం కాదిది. జరిగిన దుర్మార్గం తీవ్రత తెలియజేయడానికి సాధారణ పరిభాషలో నాకసలు మాటలే దొరకవు.