వాల్ స్ట్రీట్: టూ బిగ్ టు జెయిల్ -కార్టూన్


2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దెబ్బకు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఇంకా కోలుకోలేదు. పొదుపు ఆర్ధిక విధానాలను రుద్దుతూ తాత్కాలికంగా సంక్షోభాన్ని కార్మిక వర్గంపైకి నెట్టేసిన వాల్ స్ట్రీట్ కంపెనీలు మళ్లీ లాభాలు పుంజుకున్నప్పటికీ ప్రభుత్వాలు ఇంకా బక్క చిక్కే ఉన్నాయి. ట్రిలియన్ల కొద్దీ డాలర్లను అప్పులు తెచ్చి అమెరికా, యూరప్ ప్రభుత్వాలు వాల్ స్ట్రీట్ ను బయటపడేశాయి. కాని అత్యాశతో అనేక అక్రమ వ్యాపార పద్ధతులను అవలంబించి, చట్టాలను తుంగలో తొక్కిన బడా కంపెనీలను విచారించి జైలులో పెడతామన్న తమ వాగ్దానాన్ని పూర్తిగా విస్మరించాయి. ‘టూ బిగ్ టు ఫెయిల్’ అంటూ సమర్ధించుకొచ్చిన కంపెనీలను ముక్కలు చేసి ప్రభుత్వాల అదుపులో ఉంచుతామన్న వాగ్దానాన్నీ తుంగలో తొక్కాయి. జి 20 సమావేశాల్లో బడా ద్రవ్య, మాన్యుఫాక్చరింగ్ కంపెనీల అక్రమ వ్యాపారాలను అరి కట్టడానికి చేసిన ఏ ఒక్క నిర్ణయాన్నీ అమలు చేయలేకపోయాయి. ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేలా, క్విక్ ప్రాఫిట్స్ కోసం తయారు చేసిన దగుల్బాజీ ద్రవ్య ఉపకరణాలను (ఫైనాన్షియల్ ఇన్ స్ట్రుమెంట్స్) ఇప్పటికీ కొనసాగిస్తూ మరో సంక్షోభానికి పునాదిని నిర్మిస్తున్నాయి.

Too-Big-To-Jail

వ్యాఖ్యానించండి