మియాన్మార్ జన జీవనం -ఫొటోలు


మియాన్మార్ (బర్మా) గురించిన వివరాలు ఇన్నాళ్ళూ పెద్దగా ప్రపంచానికి తెలియదు. విదేశీ పత్రికలపై ఉన్న ఆంక్షలు అందుకు కారణం కావచ్చు. గత డిసెంబర్ నుండి అక్కడి ప్రభుత్వం కొన్ని రాజకీయ సంస్కరణలు చేపట్టింది. వాటిలో భాగంగా గృహ నిర్భంధం నుండి ప్రజాస్వామ్య ఉద్యమ నేత ‘ఆంగ్ సాన్ సూక్యీ’ ని విడుదల చేసింది. వివిధ కారణాలతో పార్లమెంటులో ఏర్పడిన ఖాళీలను నింపడానికి జరిపిన ఉప ఎన్నికల్లో సూక్యీ పార్టీ ‘ఎన్.ఎల్.డి’ ని పోటీ చేయడానికి అనుమతించింది. ఎన్నికల కోసం ప్రచారం కూడా చేయనిచ్చింది. పరిమిత సంఖ్యలో అంతర్జాతీయ ఎన్నికల పరిశీలకుల్ని, విలేఖరుల్ని అనుమతించింది. ఈ చర్యల పర్యవసానంగా కొంతమేరకు మియాన్మార్ లోకి తొంగి చూడడానికి విదేశీ పత్రికలకి అవకాశం దొరికింది. మియాన్మార్ ప్రజల జీవనాన్ని పట్టిస్తున్న ఈ ఫొటోలని ‘ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్’ (ఐబిటి) పత్రిక ప్రచురించింది. భారత పల్లె ప్రజల జీవనంతో దగ్గరి పోలికలు ఈ ఫొటోల్లో చూడవచ్చు. ఆధునిక ఉత్పత్తులు మియాన్మార్ లోకి ఇంకా ప్రవేశించలేదని కూడా ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి.

 

వ్యాఖ్యానించండి