టాట్రా ట్రక్కుల కొనుగోలుకోసం రు.14 కోట్లు లంచం ఇవ్వజూపారని ఆరోపించిన ఆర్మీ ఛీఫ్ వి.కె.సింగ్ ఆరోపణ చేసినపుడు పేరు చెప్పలేదు. ఇప్పుడు సి.బి.ఐ కి ఫిర్యాదు చేస్తూ తనకు లంచం ఇవ్వబోయిన వ్యక్తి ‘లెఫ్టినెంట్ జనరల్ తేజీందర్ సింగ్’ అని స్పష్టం చేసాడు. (తేజీందర్ సింగ్ ఇప్పటికే వి.కె.సింగ్ పై పరువు నష్టం దావా వేశాడు) తన తదనంతరం ఆర్మీ ఛీఫ్ కానున్నవారిలో రెండవ స్ధానంలో ఉన్న బల్వీందర్ సింగ్ పైన సి.బి.ఐ విచారణకు ఆదేశించిన సంగతి విదితమే. ఇద్దరు ముఖ్యమైన జనరల్స్ పై అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా ఆర్మీ ఛీఫ్ పరోక్షంగా ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టినట్లయింది. ఆర్మీ వద్ద ఉన్న ఆయుధాల్లో మెజారిటీ కాలం చెల్లిపోయాయని ఆయన ప్రధానికి లేఖ రాయడం ద్వారా దేశ రక్షణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కూడా పరోక్షంగా తప్పు పట్టినట్లే.
–
–
