ప్రముఖ పోర్చుగీసు కళాకారుడు ‘అలెగ్జాండ్రె ఫార్టో’ అలియాస్ ‘విల్స్’ చెక్కిన బొమ్మలివి. తీసి పారేసిన చెక్కల ఉపరితలాలను క్రమ పద్ధతిలో చెక్కడం ద్వారా పోర్ట్రయిట్ లను సృజించడాన్ని ఈ ఫొటోల్లో చూడవచ్చు. కొంచెం పరిశీలిస్తే ఇళ్లు లేదా ఆఫీసుల గోడలకి ఉపయోగించిన చెక్కలపైన ఈ చిత్రాలు చెక్కినట్లు కనిపిస్తొంది. పశ్చిమ దేశాల్లో చెక్క ఇళ్లు ఎక్కువ గనక ఇలా భావించవలసి వస్తోంది.
అలెగ్జాండ్రె వయసు 24 సం. మాత్రమే. 2008లో లండన్ లో జరిగిన కేన్స్ ఫెస్టివల్ లో ప్రముఖ లండన్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ గీసిన బొమ్మల పక్కన ఈయన గీసిన బొమ్మ ప్రదర్శించబడింది. అప్పటి నుండీ అలెగ్జాండ్రె కూడా ప్రముఖ వీధి చిత్రకారుడుగా గుర్తింపు పొందాడు. సిమెంటు గోడల ఉపరితలాల్ని చెక్కి పోర్ట్రయిట్లను సృజించడంలో ఈయన నిష్ణాతుడు. అదే పద్ధతిలో చెక్కల ఉపరితలాల్ని కూడా చెక్కి ఈ కళని సృష్టించాడు.
–
ఈ బొమ్మలకి అలెగ్జాండ్రె పెట్టిన శీర్షిక ‘Destroy to create’.
–





దారు శిల్పాలు అనకుండా ‘దారు చిత్రాలు’ అనాలేమో వీటిని. చాలా బాగున్నాయి. ‘Destroy to create’ అనే పదబంధంలో వైచిత్రి బాగుంది- శాంతి కోసం యుద్ధం అన్నట్టుగా!
వేణు గారూ, చెక్కని దారు అని అనాలని నాకు గుర్తు లేదు. ఎప్పుడో చిన్నపుడు ఆ పదం చదివాను. మీ ద్వారా అది గుర్తుకొచ్చింది. ధ్యాంక్స్.