అమెరికాలో ఇజ్రాయెల్ ఉత్పత్తుల బహిష్కరణ


Park Slope Food Co-Op, Brooklyn, New York Cityపాలస్తీనా ప్రజలపై జాత్యహంకార  ఇజ్రాయెల్ ఉత్పత్తులను బహిష్కరించాలని బ్రూక్లీన్ ప్రజలు నిర్ణయించుకున్నారు. పాలస్తీనీయుల హక్కులను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్ ఉత్పత్తులను వాడ కుండా ఆ దేశంపై ఒత్తిడి తేవాలని వారు కోరుతున్నారు. ‘పార్క్ స్లోప్ ఫుడ్ కోఆపరేటివ్’ అనే సహకార సంస్ధలో సభ్యులైన వేలాది సభ్యులు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. బ్రూక్లీన్ టెక్నికల్ హైస్కూల్ దగ్గర సమావేశం అయిన వీరు ఏక గ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రెస్ టి.వి తెలిపింది.

“మేము ఈ బాయ్ కాట్ ని సమర్ధిస్తున్నాం. పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ దశాబ్ధాలుగా అమలు జరుపుతున్న దురహంకార విధానాలు మా నిర్ణయానికి కారణం. అక్రమ సెటిల్ మెంట్లపై ఇజ్రాయెల్ విధానాలను చురుకుగా వ్యతిరేకించాలని మేము నమ్ముతున్నాం. పాలస్తీనా ఆక్రమణ అంతం కావాలి. పాలస్తీనీయులకు సమాన హక్కులు అమలు చేయాలి” అని కో ఆపరేటివ్ సభ్యుడు కారోల్ వాల్డ్ సమావేశాన్ని ఉద్దేశించి అన్నాడు. 

పాలస్తీనా ప్రజలను మానవ హక్కులను ఇజ్రాయెల్ దారుణంగా హరిస్తున్నదని ప్రపంచ దేశాలతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఆరోపిస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ తన తీరు మార్చుకోవడం లేదు. తాను ఆర్కామించిన పాలస్తీనా ప్రజల ఇళ్లనూ, భూములనూ లాక్కుని అందులో యూదుల కోసం అక్రమంగా సెటిల్ మెంట్లు నిర్వహిస్తోంది. 1967 లో పాలస్తీనా భూభాగాలను ఆక్రమించినప్పటినుండీ వందకు సెటెల్ మెంట్లకు పైగా నిర్మించింది. సెటిల్ మెంట్లలో 5 లక్షలకు మందికి పైగా యూదులను తెచ్చి పెట్టింది. వీరంతా వివిధ దేశాల నుండి తరలి వచ్చిన యూదులే కావడం గమనార్హం. స్ధానికంగా సహస్రాబ్దాల తరబడి నివశిస్తున్న పాలస్తీనీయులను తరిమేసి ఇజ్రాయెల్ దేశాన్ని అరబ్ నేలపై సృష్టించడంలో బ్రిటన్, అమెరికా ల దే ప్రధాన పాత్ర. 

పాలస్తీనా ప్రజల భూములను అక్రమంగా ఆక్రమించుకుని, అక్రమ సెటెల్ మెంట్లు నిర్మించడం పైన అంతర్జాతీయ విచారణ జరపాలని మార్చి 22 న ‘అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధ’ (యు.ఎన్.హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) ఆదేశాలు జారీ చేసింది. దానితో యు.ఎన్.హెచ్.ఆర్.సి తో సంబంధాలు తెంపుకుంటున్నట్లు మరుసటి రోజే ఇజ్రాయెల్ ప్రకటించింది. తద్వారా ఇజ్రాయెల్ అక్రమాలపై అంతర్జాతీయ స్ధాయి విచారణ జరిగే అవకాశం లేకుండాపోయింది.

అమెరికా ప్రభుత్వంలో శక్తివంతమైన లాబీగా ఇజ్రాయెల్ లాబీ పేరుపొందింది. ప్రభుత్వంలోని అనేక ఉన్నత స్ధానాలలో ఇజ్రాయెల్ అనుకూల వ్యక్తులు నియమించే బడేలా ఇజ్రాయెల్ అనేక చర్యలు తీసుకుంటుంది. లంచాలు మేపి సెనేట్, కాంగ్రెస్ సభూలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఇజ్రాయెల్ గూఢ చార వర్గాలు, లాబీయిస్టులు ముదిరిపోయారు. అమెరికా ప్రభుత్వంలో ఇజ్రాయెల్ కు గల పలుకుబడిని చూసినవారికి చాలా మందికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఇజ్రాయెల్ తల పెట్టిన ప్రతి పనీ, అది ఎంత పనికిమాలినదైనా జరిగిపోవడం వారి ఆశ్చర్యానికి కారణం. అమెరికాకి తోకగా ఇజ్రాయెల్ ను భావించినప్పటికీ ఒక్కోసారి తోకే శరీరాన్ని ఆడిస్తున్నట్లుగా విశ్లేషకులకు తోస్తుంది. 

వ్యాఖ్యానించండి