ప్రపంచ స్ధాయి రేపిస్టులు వీళ్ళు -ఫొటోలు


లైంగిక అత్యాచారాలకు పాల్పడి ప్రపంచ స్ధాయిలో పేరు పొందిన రాజకీయవేత్తలు వీళ్లు. ఈ ఫొటోలను ఫస్ట్ పోస్ట్ అందించింది. ఆయా దేశాలలో ఉన్నత పదవులను అధిష్టించినవారు తమ తమ దేశాల్లోని ఉన్నత సాంస్కృతిక విలువలకు అద్దం పట్టేలా జీవించాలి. ఆయా దేశాల జీవన విధానాలకు అద్దం పట్టడమే కాక మొత్తం ప్రపంచ స్ధాయి విలువలను కూడా వీరి ప్రతిబింబించాల్సి ఉంటుంది. మానవ నాగరికతలో కుటుంబ జీవనానికి అత్యున్నత రూపం అయిన మోనోగమీ (ఒక భర్తకు ఒకే భార్య) కి కట్టుబడి ఉంటారని ఎవరయినా ఆశిస్తారు. అందుకు బదులుగా తాము వాస్తవంగా చీకటి సమాజాలకు ప్రతినిధులమని బైటపెట్టుకున్నారు. చీకటి సామ్రాజ్యాలను నిర్వహిస్తే తప్ప పెట్టుబడిదారీ వ్యవస్ధలలో ఉన్నత స్ధాయిలకు చేరుకోలేరని రుజువు చేశారు. వీరు కేవలం దొరికినవారు మాత్రమే. సమాజంలో అనేక నేరస్ధ కార్యకలాపాలను నిర్వహిస్తూ వివిధ దేశాల్లో అత్యున్నత స్ధానాలకు చేరుకుని చట్టాలకు దొరకని వారు ఇంకా బోలెడంత మంది ఉన్నారు. దొరకనంత కాలం వారు దొరలే.

2 thoughts on “ప్రపంచ స్ధాయి రేపిస్టులు వీళ్ళు -ఫొటోలు

వ్యాఖ్యానించండి