అధ్యక్షుడుగా ఒబామా సాధించేమిటి? -కార్టూన్


ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలు ముగించి అమెరికా సైనికుల్ని తిరిగి స్వదేశం రప్పిస్తానని గత అధ్యక్ష ఎన్నికల్లో వాగ్దానం చేసిన బారక్ ఒబామా మళ్ళీ ఎన్నికలు వస్తున్నా తన హామీ నిలుపుకోలేదు. పైగా పదవిని అధిష్టించినవెంటనే ఆఫ్ఘనిస్ధాన్ కి ‘ట్రూప్ సర్జ్’ పేరుతో మరో 30,000 సైనికుల్ని పంపించాడు. అధ్యక్ష ఎన్నికలు జరిగే 2012 చివరి నాటికి ఈ ముప్ఫై వేలమంది సైనికుల్ని ఉపసంహరిస్తున్నానని గత సంవత్సరం ప్రకటించాడు. అంటే, ఎన్నికల సంవత్సరంలో ‘సైనికుల ఉపసంహరణ’ పేరుతో తాను పెంచిన సైనికుల్నే ఒబామా ఉపసంహరించుకుంటున్నాడు తప్ప తాను చేసిన వాగ్దానాన్ని వాస్తవంగా అమలు చేయడానికి పూనుకోలేదు.

Obama-Decorations

ఇరాక్ లో ఇరాన్ అనుకూల ప్రభుత్వం హెచ్చరిక మేరకు చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా కువైట్ కి సైనికుల్ని వెనక్కి తీసుకున్న అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ లో చావు దెబ్బలు తింటోంది. లిబియాలో కిరాయి తిరుగుబాటుతో అధ్యక్షుడు గడ్డాఫీని హత్య చేసి, ఆల్-ఖైదా తో కుమ్మక్కయ్యి అస్ధిర ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. లిబియా ఎత్తుగడనే సిరియాలో అమలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి, విఫలమై కోఫీ అన్నన్ తో రాజకీయ సర్దుబాటు ఒప్పందానికి రాయబారం పంపే స్ధితికి దిగజారాడు ఒబామా. మిలట్రీ రంగంలో చావుదెబ్బలు తింటూ ఆర్ధిక రంగంలో సైతం అదే పరిస్ధితిని ఎదుర్కొంటున్నాడు. ఆర్ధిక సంక్షోభం లో మునిగి తేలుతున్న అమెరికా, సంక్షోభం నుండి బైటికి రావడానికి దురాక్రమణ యుద్ధాలకు తెగబడి మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది.

వ్యాఖ్యానించండి