‘వలస బుద్ది’ వీడన్ బ్రిటన్ -కార్టూన్


రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచ దేశాలను కబళించే అగ్రరాజ్యంగా అవతరించడంతో ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం’ అస్తమించింది. అనేకవలసల నుండి విరమించుకున్న బ్రిటన్ అమెరికాకి ఉపగ్రహ రాజ్యంగా మారిపోయింది. స్వతంత్ర దేశాలపై అమెరికా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాల్లో జూనియర్ పార్టనర్ గా చేరింది. అయితే అదింకా అర్జెంటీనా కి చెందిన ‘మాల్వినాస్’ (బ్రిటన్ దీనిని ఫాక్ లాండ్స్ గా పిలుస్తుంది) ద్వీపకల్పాన్ని ఇంకా తన వలసగానే పరిగణిస్తోంది. మాల్వినాస్ ని సముద్రాలకు ఆవల ఉన్న సొంత భూభాగంగా పరిగణిస్తోంది.

మాల్వినాస్ ను వలస ప్రాంతంగా పరిగణించడం మాని ద్వీప కల్పాన్ని వీడిపోవడానికి వీలుగా చర్చలు ప్రారంభించాలని ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించినప్పటికీ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ అంగీకరించలేదు. ‘ద పైరేట్ ఆఫ్ ద మాల్వినాస్’ గా ప్రసిద్ధికెక్కడానికి కామెరూన్ ఉవ్విళ్లూరుతున్నాడు. అమెరికా, ఫ్రాన్సు లతో కలిసి నిర్వహించిన ‘కిరాయి తిరుగుబాటు’ విజయం ఇచ్చిన స్ఫూర్తితో అంతర్జాతీయ చట్టాలను నగ్నంగా ఉల్లంఘించడానికి కామెరూన్ నేతృత్వంలోని బ్రిటన్ సిద్ధపడింది. మాల్వినాస్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అర్జెంటీనా సిద్ధపడినప్పటికీ చర్చలకు కామెరూన్ తిరస్కరించాడు. ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్న అర్జెంటీనా భూభాగం తమదేనని హుంకరిస్తున్నాడు. దక్షిణ అమెరికా దేశాలన్నీ కామెరూన్ వలస బుద్ధిని ఈసడిస్తున్నాయి.

Pirate of the Malvinas

కార్టూన్: కార్లోస్ లాతుఫ్, బ్రెజిల్

వ్యాఖ్యానించండి