“పక్కా యుద్ధాన్నే మేం ప్రారంభించాం! ఇప్పుడంతా యుద్ధంలో మునిగిపోయారు. కాని తమ శత్రువు ఎవరో ఇప్పుడు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు”
–
‘టెర్రరిజం పై యుద్ధం’ పేరుతో అమెరికా ప్రారంభించిన యుద్ధానికి ఇప్పుడు దిక్కూ, దరీ లేదు. ‘టెర్రరిస్టులపై యుద్ధమే’ లక్ష్యం అయితే ఆ లక్ష్య శుద్ధి ప్రారంభంలోనే లేదు. ఆల్-ఖైదాతో యుద్ధం అని చెప్పి, అదే ఆల్జ్-ఖైదాతో కుమ్మక్కై ప్రభుత్వాలు ఏర్పరుస్తున్నారు. ఆఫ్ఘనిస్ధాన్ లో ఆల్-ఖైదాతో యుద్ధం, లిబియాలో ఆల్-ఖైదాతో కుమ్మక్కై గడ్డాఫీతో యుద్ధం, సిరియాలో ఆల్-ఖైదాతో కలిసి జనంపై హత్యాకాండ, పాకిస్ధాన్ లో ఆల్-ఖైదా పైనే డ్రోన్ దాడులు. ఇదే టెర్రరిజం పై యుద్ధం. ఈ యుద్ధం అసలు లక్ష్యం అమెరికా, యూరప్ కంపెనీలకు మార్కెట్ విస్తరణ, ప్రపంచ వనరుల దాసోహం. ఆ లక్ష్యంలో భాగమే శత్రువెవరో తెలియకుండా యుద్ధాల్లో మునిగి తేలేలా చేయడంలో సామ్రాజ్యవాదులు సఫలం అయ్యారు.
[కార్టూనిస్టు: జువాన్ రామోన్ మోరా (బార్సిలోనా, స్పెయిన్)]

cartoons having one line and looks very simple but they have so much depth in them