హత్యాకాండ జరిగిన రాత్రి అమెరికా సైనికులు జరిపిన అకృత్యాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా సైనికులు హత్యాకాండకి ముందు ఇద్దరు ఆఫ్ఘన్ స్త్రీలను రేప్ చేసి అనంతరం హత్యాకాండ జరిపారని పార్లమెంటరీ విచారణ కమిటీ సభ్యులు, శనివారం ఆఫ్ఘన్ పార్లమెంటులో ప్రకటించారు. హత్యాకాండలో చనిపోయిన నలుగురు స్త్రీలలో రేప్ కి గురికాబడిన ఇద్దరు స్త్రీలు ఉన్నారని కమిటీ సభ్యులు పార్లమెంటుకి తెలియజేశారు. జంగాబాద్ ప్రాంతంలో అమెరికా ట్యాంకర్ ఒకదానిని మందుపాతరతో పేల్చివేసినందుకు ప్రతీకారంతోనే అమెరికా సైనికులు ఈ హత్యాకాండకు చెప్పి మరీ పాల్పడ్డారని కూడా వారు పార్లమెంటుకి తెలిపారు.
విచారణ కమిటీ సభ్యులు హామీద్జాయ్ లాలి, షకీలా హషేమి ఈ ఘోరాన్ని పార్లమెంటుకు తెలియజేశారు. హాత్యాకాండకి ముందు ఇద్దరు ఆఫ్ఘన్ స్త్రీలను రేప్ చేసి, కాల్చి చంపి తమ హత్యాకాండ ప్రారంభించారని వారు ఆఫ్ఘన్ పార్లమెంటు సాధారణ సమావేశంలో తెలిపారు. 15 నుండి 20 మంది అమెరికా సైనికులు రెండు గ్రూపులుగా ఈ హత్యాకాండలో పాల్గొన్నారని వారు తెలిపారు.
38 యేళ్ళ స్టాఫ్ సార్జంట్ రాబర్ట్ బేల్స్ ఒక్కడే, పదే పదే యుద్ధ విధులకు పంపడంతో ‘పోస్ట్ ట్రౌమేటిక్ సిండ్రోమ్ డిజార్డర్” గురై, మతి చలించిన స్ధితిలో హత్యాకాండకి పాల్పడ్డాడని పశ్చిమ దేశాల పత్రికలు (బిబిసి, రాయిటర్స్, న్యూయార్క్స్ టైమ్స్, డెయిలీ మెయిల్, బ్లూమ్ బర్గ్ సి.ఎన్.ఎన్… దాదాపు అన్నీ) ప్రచారం చేస్తుండగానే ఆఫ్ఘన్ పార్లమెంటరీ కమిటీ ఈ వాస్తవాలు వెల్లడించింది. ఆఫ్ఘన్ పార్లమెంటరీ కమిటీ యే విచారణ జరిపామని చెబుతున్నప్పటికీ ఈ వివరాలను ఆ పత్రికలేవీ ప్రచురించడం లేదు. ఆఫ్ఘన్ పార్లమెంటరీ సభ్యులు వెల్లడించిన వాస్తవాలను ప్రచురించకపోగా ‘ఏకైక మతి చలించిన అమెరికా సైనికుడు” కధను అవి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. అతను పిచ్చోడని చెప్పడానికి కొత్త కొత్త సంగతులు వెల్లడించడానికి అవి పోటీ పడుతున్నాయి.
ఆఫ్ఘన్ పార్లమెంటరీ కమిటీ విచారణకు అమెరికా సహకరించలేదని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ గత శుక్రవారం ఆరోపించినప్పటికీ అమెరికా ఇంతవరకూ సమాధానం ఇవ్వలేదు. ఆఫ్ఘన్ అధ్యక్షుడి ప్రకటన కూడా పశ్చిమ దేశాల పత్రికల్లో పెద్దగా స్ధానం సంపాదించలేకపోయింది. అమెరికా కీలు బొమ్మ కర్జాయ్ మాటలకు ఆ పత్రికలు విలువ ఇవ్వకపోవడంలో వింతేమీ లేదు. హత్యాకాండ బాధితులు, గిరిజన పెద్దలు, ఆఫ్ఘన్ పార్లమెంటు సభ్యులు అందరూ హత్యాకాండ జరిపిన సైనికులను ఆఫ్ఘనిస్ధాన్ లోనే విచారించి, శిక్షించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ హమీద్ కర్జాయ్ మాత్రం ఆఫ్ఘనిస్ధాన్ లోనే విచారించాలని లేదనీ కాకపోతే విచారణను రహస్యంగా కాకుండా, పారదర్శకంగా, బహిరంగంగా చేస్తే చాలునని ప్రకటించాడు. కర్జాయ్ ఆ విధంగా ప్రకటించాడని పశ్చిమ దేశాల పత్రికలే ప్రముఖంగా రాసుకున్నాయి. కానీ ‘అమెరికా సహకరించడం లేదంటూ’ కర్జాయ్ చేసిన ప్రకటనను మాత్రం అవి విస్మరించాయి.
పార్లమెంటరీ కమిటీకి నేతృత్వం వహించిన సయ్యద్ ఇషాక్ జిలానీ పార్లమెంటులో తమ విచారణ వివరాలు తెలియజేస్తూ అమెరికా ట్యాంకు మందు పాతర పేలుడులో నాశనం కావడంతో ఆఫ్హన్ పౌరులపై ప్రతీకారానికి దిగారని చెప్పాడు. జంగాబాద్ ప్రాంతంలో జరిగిన పేలుడులో అమెరికా ట్యాంకు ధ్వంసం అయిందనీ దానికి ప్రతీకారంగానే అమెరికన్లు హత్యాకాండకి దిగారనీ అంటకుందే గ్రామస్తులు పత్రికలకు తెలియజేశారు. పేలుడు జరిగాక అమెరికా సైనికులు స్ధానిక ఆఫ్ఘన్లను, గిరిజన పెద్దలను బైటికి పిలిపించి మాట్లాడారనీ, ట్యాంకర్ ని ధ్వంసం చేసినందుకుగాను ఆఫ్ఘన్ స్త్రీలు, పిల్లలపైనే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారనీ కాందహార్ గిరిజన పెద్దలు పత్రికలకు వెల్లడించారు.
తాము అన్నట్లుగానే అమెరికా సైనికులు ప్రతీకారం తీర్చుకున్నారు. చెప్పినట్లుగానే ప్రత్యేకంగా పిల్లలను, స్త్రీలను టార్గెట్ చేసుకుని మరీ ప్రతీకారం తీర్చుకున్నారు. స్త్రీలను రేప్ చేసి, పిల్లలను తొమ్మిది మందిని చంపి వారు తమ ప్రతీకారం తీర్చుకున్నారు. టార్గెట్ చేసి మరీ రేప్ లకు, హత్యాకాండకి పాల్పడిన అమెరికన్లు యుద్ధ ఒత్తిడికి మతి చలించినవారుగా, అదీ అన్నీ ఒక్కడే చేసినట్లుగా ప్రచారం చేస్తున్న పశ్చిమ దేశాల అంతర్జాతీయ పత్రికలు తమ దుర్మార్గ పూరితమైన పాక్షికతను నిస్సిగ్గుగా బైట పెట్టుకుంటున్నాయి.
హత్యాకాండలో చనిపోయిన 16 మంది శవాలను ఈ పత్రికలు ఎలాగూ కప్పి పెట్టలేవు. అందువల్ల హత్యాకాండ జరిగిందని చెప్పక తప్పదు. కాందహార్ కి చాలాకాలంగా తాలిబాన్ రావడం లేదని గ్రామస్ధులు ముక్త కంఠంతో చెప్పారు. కనుక హత్యాకాండని తాలిబాన్ పైకి నెట్టివేయలేవు. ఇక చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా హత్యాకాండ నేరాన్ని అమెరికా దురాక్రమణపైకి రాకుండా చూడాల్సిన బాధ్యత వారిపైన పడింది. ఆఫ్ఘన్ ప్రజల ప్రయోజనాల కోసమే ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ అవి చెబుతున్నాయి గనక ఆ ప్రయోజన వాదానికి దెబ్బతగలకుండా చూడాల్సిన బాధ్యత వారిదే మరి. నేరంతో అమెరికా, నాటోలకు సంబంధం లేదనీ, మతి చలించిన ఒక సైనికుడు చేసిన దుష్కృత్యమేననీ ప్రచారం లంకించుకున్నాయి. ఆ అబద్ధాన్ని వదలకుండా ప్రచారం చేస్తున్నాయి. ఆఫ్ఘన్ పార్లమెంటు కమిటీ స్వయంగా చేసిన నిజ నిర్ధారణ కూడా వారికి ఇప్పుడు కనిపించడం లేదు. నవ్వి పోదురు గాక!
ఇరవై మంది సైనికులు ఒక్కుమ్మడిగా సైనిక స్ధావరం నుండి బైటికి వెళ్తుంటే నాటో అధికారులు చూస్తూ ఉంటారా? ఉండరు. వాస్తవం ఏమిటంటే ఈ రేపిస్టు హంతకులు నాటో/అమెరికా సైనికాధికారుల అనుమతితోనే హత్యాకాండకి బయలుదేరి వెళ్లారు. గ్రామాల్లో జొరబడి ప్రతీకారం ప్రారంభించారు. స్త్రీలపై ప్రతీకారం తీర్చుకోవడం అంటే మగ పుంగవులకి పుట్టే ఆలోచన అదొక్కటే. అమెరికా సైనికులు కూడా అదే చేశారు. స్త్రీలపై ప్రతీకారం తీర్చుకుంటామన్న వాగ్దానం అమలు చేశాక పిల్లలపై కాల్పులకి దిగారు. తొమ్మిది మండి పసి పిల్లలను పొట్టన బెట్టుకున్నారు. ఆఫ్ఘనిస్ధాన్ లో ప్రజాస్వామ్యం స్ధాపిస్తామని వచ్చిన అమెరికా సైనికులు రేప్ లతో, పసిపిల్లల హత్యలతో ఇన్నాళ్లూ ప్రజాస్వామ్యం స్ధాపిస్తున్నారన్నమాట! వికీలీక్స్ ద్వారా వెల్లడయిన అమెరికా ‘యుద్ధ డాక్యుమెంట్లు’ వందల వేల మంది ఆఫ్ఘన్ పౌరులను చంపేశాయని వెల్లడించాయి. అవి అక్షర సత్యాలని మరోసారి అమెరికా రుజువు చేసుకుంది.
తాలిబాన్ మత ఛాందస పాలన నుండి ఆఫ్ఘన్ స్త్రీలను విముక్తి చేయడానికే అమెరికా దురాక్రమణ అని నమ్ముతున్న బుద్ధి జీవులు ఇకనైనా కళ్ళు తెరుస్తారని ఆశించవచ్చా? లేక ఆఫ్ఘన్ ప్రజల ప్రయోజనాల కోసమే ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ అని చెప్పగానే నమ్మేసినట్లుగా ఆఫ్ఘన్ స్త్రీలను ఉద్ధరించడం కోసమే వారిని రేప్ చేయవలసి వచ్చిందని వాదనకు దిగుతారా?
Ur correct….everyday all the news chanels in US are telecasting his post war disorder or something else…..But they are not accepting the truth.
Hi Dev, Actually, it’s not the question of accepting the truth. It’s about the fear of spreading the truth. If truth spreads in the US, it could be a big blow to the main stream US media which spread full of lies for last decade among Americans about the heroic adventures of the U.S. army in aggessive wars in Afghanistan, Iraq and elsewhere. If citizens of the U.S. come to know the reality of the wars, the US government will be pressurised to pack up the wars. Given the dependence of the military and industrial establishment of the US on wars, they can’t afford concluding wars. Even the (war) economy may face a virtual collapse, if they do so. They can’t either move forwad winning the war or backward concluding the war midway. They keep on prolonging the war for the sake of the profits of their companies. But, both ways are quite against to the interests of the people of the US as well as the world. The only possible solution that help people is the demise of the US imperialism.
It seems u r in the U.S. Can you offer feed back from the people of the U.S. on this particular incident for blog readers? We will be thankful to u. Advance thanks.