‘మందుపాతర’కు ప్రతీకారమే ‘ఆఫ్ఘన్ హత్యాకాండ’


AFGHANISTAN-UNREST-US-SHOOTING-DEMOఆఫ్ఘనిస్ధాన్ ప్రజల అత్యాధ్మిక రాజధాని కాందహార్ సమీపాన అమెరికా సైనికులు రెండు గ్రామాల్లో (బలాంది, అల్కోజాయ్), మూడు ఇళ్ళల్లో జొరబడి 16 మంది పౌరులను చంపింది మతి భ్రమించి కాదని, హత్యాకాండకు కొద్ది రోజుల ముందు అమెరికా సైనిక కాన్వాయ్ పైన తాలిబాన్ ప్రయోగించిన మందుపాతర’ కు ప్రతీకారమేనని రాయిటర్స్ వార్తా సంస్ధ కధనం వెల్లడించింది. ఆ కధనం ఇలా ఉంది.

DEMAND FOR TRIAL in AFGHANISTAN

The U.S. military hopes to withdraw about 23,000 soldiers from Afghanistan by the end of the coming summer fighting season, leaving about 68,000.

In the two Panjwai district villages where the weekend massacre took place, U.S. troops remained confined to the compound where the soldier was based, and people in the area demanded a trial in Afghanistan under Afghan law.

“They have to be prosecuted here. They have done two crimes against my family. One they killed them, and secondly they burned them,” said Wazir Mohammad, 40, who lost 11 members of his family in the incident.

A cleric, Neda Mohammad Akhond, said he believed the shootings may have been retaliation for an insurgent landmine attack on a U.S. convoy in the days before the massacre.

“They asked people to come out of their homes and warned them they would avenge this,” Akhond said.

There was no independent verification of an earlier attack.

ఒక ముస్లిం పూజారి “నేడా మహమ్మద్ ఆఖండ్’ ని రాయిటర్స్ ఉటంకించింది. అమెరికా సైన్యంపై తాలిబాన్ నిత్యం అనేక దాడులు చేస్తుంటాయి. అనేక మంది అమెరికా సైనికులు ఆ దాడుల్లో గాయపడి, కన్నో, కాలో పోగొట్టుకుని అమెరికాకి తిరుగు ప్రయాణం కట్టడం నిత్యం జరుగుతుంది. వీటన్నింటినీ నాటో గానీ అమెరికా గానీ బైటికి చెప్పుకోవు. చెప్పుకుంటే తమ పరువే పోతుంది గనుక చెప్పుకోవు. ఆ విధంగా బైటికి చెప్పుకోని దాడిలో ‘మందు పాతర’ దాడి కూడా ఒకటని భావించవలసిందే.

హత్యాకాండ జరిపిన ‘ఏకైక సైనికుడు’ గా చెపుతున్న వాడు నిజానికి ఆఫ్ఘన్ గ్రామ ప్రజలతో సత్సంబంధాలనూ, స్నేహ సంబంధాలనూ పెంపొందించుకోవడానికి నియమితుడైన వ్యక్తి అని బి.బి.సి, రాయిటర్స్, డెయిలీ మెయిల్ పత్రికలన్నీ రాశాయి. ఈ అంశాన్ని డెయిలీ మెయిల్ ఇలా రాసింది.

Little is known about the soldier who committed the atrocities, including his name, but a U.S. official said he is married with three children, and served three separate tours in Iraq.

He was assigned to support a special operations unit of either Green Berets or Navy SEALs engaged in a village stability operation.

Such operations are among NATO’s best hopes for transitioning out of Afghanistan, pairing special operations troops with villagers chosen by village elders to become essentially a sanctioned, armed neighbourhood watch. He has reportedly been stationed in Afghanistan since December.

బి.బి.సి, రాయిటర్స్ కూడా కాస్త అటూ ఇటుగా పై విధంగా చెప్పాయి. 2014 తర్వాత కూడా, అమెరికా బలగాలు ‘మిలట్రీ సలహా దారుల’ పేరుతో, ‘ప్రత్యేక బలగాల’ పేరుతో ఆఫ్ఘనిస్ధాన్ లో కొనసాగడానికి కీలు బొమ్మ అధ్యక్షుడు కర్జాయ్ తో అమెరికా చర్చలు జరుపుతోంది. అయితే, ఆఫ్ఘన్ ప్రజల్లో అమెరికా ప్రజల పట్ల రోజు రోజుకీ ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. వారు చేసే దురాగతాలను ఎవరు మాత్రం సహిస్తారు? ఇదే పేరిస్ధితి కొనసాగితే ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనిక స్దావరం ఏర్పాటు చేయడం కష్టం అవుతుంది. అందువలన ఈ లోపు ఆఫ్ఘన్ ప్రజల్ని మంచి చేసుకోవలసిన అవసరం అమెరికాకి తలెత్తింది. అందులో భాగమే ‘విలేజ్ స్టాబిలిటీ ప్రోగ్రామ్’.

ఆఫ్ఘన్ గ్రామస్ధులు, గిరిజన పెద్దలతో స్నేహ సంబంధాలు పెంపొందించుకునే ఈ కార్యక్రమం పైన అమెరికా/నాటో సైన్యం పెద్ద ఎత్తున నమ్మకాలు పెట్టుకున్నట్లు పై రిపోర్టు తెలుపుతోంది. సత్సంబంధాలు పెంచుకోవడానికి నియమితుడైన సైనికులు తమపైన తాలిబాన్ ‘మందుపాతర’ పేల్చడం సహించలేకపోయారు. ఆ రోజే గ్రామస్ధులను ఇళ్లనుండి బైటికి పిలిచి ‘మందుపాతర’కు బదులు తీర్చుకుంటామని బెదిరించారని మహమ్మద్ ఆఖండ్ సాక్ష్యం చెపుతోంది. వారు బెదిరించినట్లుగానే పధకం ప్రకారం రెండు గ్రూపులుగా వచ్చి గ్రామాలపై దాడి చేసి హత్యాకాండ జరిపారు.

దురాక్రమణకి దిగిన విదేశీ బలగాలు తాము ఆక్రమించుకున్న దేశాల ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదు. అది దురాక్రమణదారుడి స్వభావానికే విరుద్ధం. అది సత్సంబంధాలు పెట్టుకుని ఎల్ల కాలం ఆఫ్ఘనిస్ధాన్ లో సైనిక స్ధావరం కొనసాగించి ఏమి చేద్దామని? ఆఫ్ఘనిస్ధాన్ లో తిష్ట వేసి భవిష్యత్తులో సైనికంగా పోటీగా ఎదగనున్న చైనా పై చెక్ పెట్టడానికీ, పశ్చిమాసియాలో తమ ప్రయోజనాలు కాపాడుతున్న ఇజ్రాయెల్ కి ఇరాన్ భయం లేకుండా చేయడానికీ, పనిలో పనిగా దక్షిణాసియాలో తమ కంపెనీల ప్రయోజనాలు మరింతగా పెంచుకోవడానికీ ఆఫ్ఘనిస్ధాన్ లో ఆమెరికా సైన్యం ఉండాలి. అందుకోసమే అమెరికా ఆఫ్ఘనిస్ధాన్ ని దురాక్రమించింది.

టెర్రరిజం పై యుద్ధం కోసమే ఆఫ్ఘనిస్ధాన్ పై అమెరికా దాడి చేసిందని భావించినవారు ఇప్పటికైనా నిజాలు గ్రహించాలి. ఆఫ్ఘనిస్ధాన్ లో తిష్ట వేసుకుని పాకిస్ధాన్, చైనాలను మాత్రమే అదుపులో ఉంచుతుందనీ, ఇండియాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందనీ భారత్ జోలికి రాదనీ ఎవరైనా నమ్మితే ఆ భ్రమల్ని వదిలిపెట్టాలి. పక్క దేశ ప్రజలపై దారుణాలు సాగిస్తూ ఇండియాలో చేతులు ముడుచుకు కూర్చోదు. భారత దేశంలో దేశ వనరులను విదేశీ కంపెనీలకు అప్పజెప్పడానికి వ్యతిరేకంగా ప్రజలు సాగిస్తున్న పోరాటాలను అణచివేయడానికి అమెరికా పూర్తిగా చురుకుగా వ్యవహరిస్తుంది. భారత పాలకులని పూర్తి కీలు బొమ్మలుగా చేసుకునే రోజు ఎంతో దూరం లేదు. అందుకే ఆఫ్ఘన్ దురాక్రమణని భారతీయులు వ్యతిరేకించాలి.

వ్యాఖ్యానించండి