చనిపోయినవారిపై ఒంటేలు పోస్తున్న అమెరికా సైనికులు -వీడియో


గత జనవరి నెలలో ఈ వీడియో బైటికి వచ్చింది. శవాలపై ఒంటికి వెళ్తున్న ఈ నీచ, నికృష్ట మానవులు అమెరికా సైనికులు. నార్త్ కరోలినా లోని లెజీన్ క్యాంప్ నుండి వచ్చిన 2 వ మెరైన్స్, 3 వ బెటాలియన్ కి వీరు చెందినవారని వీడియోను యూ ట్యూబ్ లో పోస్ట్ చేసిన వ్యక్తి సమాచారం ఇచ్చాడు. చనిపోయినవారిని చూస్తే ఆఫ్ఘన్ పౌరులని ఇట్టే అర్ధం అవుతోంది.

“అమెరికా మిలట్రీ కి చెందినవారు శత్రువుల శవాలపై అసంబద్ధమైన కార్యక్రమానికి పాల్పడుతున్నట్లు ఇటీవల ఒక పబ్లిక్ వెబ్ సైట్ లో పోస్ట్ చేయబడిన వీడియో ద్వారా తెలుస్తోంది. అగౌరవనీయమైన ఈ పని చెప్పడానికి వీలు లేనంత దారుణమైనది. మిత్ర కూటమి బలగాల నుండి మేము ఆశించే అత్యున్నత నైతిక వర్తనతో ఇది సరిపోలడం లేదు” అని ఈ దుర్మార్గం పైన వ్యాఖ్యానిస్తూ నాటో ప్రకటన జారీ చేసింది.

ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు, “ముగ్గురు ఆఫ్ఘన్ల శవాలను అవమానిస్తూ అమెరికా సైనికులు చేస్తున్న ఈ పని ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దీనిపై అమెరికా అర్జెంటుగా విచారణ జరపాలి. నేరస్ధులకు తీవ్రమైన శిక్షలు విధించాలి” అని ఆయన అమెరికా సైనికులను నేరస్ధులుగా అభివర్ణించాడు.

“అమెరికా సైన్యం ఇంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించడం ఇదేమీ కొత్త కాదు. మా దేశం దురాక్రమణ దారుల చేతుల్లో ఉందని మాకు బాగానే తెలుసు” అని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నట్లుగా టైమ్స్ తెలిపింది. తమ దేశాన్ని దురాక్రమించిన సైన్యం నుండి అంతకంటె సవ్య ప్రవర్తమైన ప్రవర్తనను ఆశించలేమని తేల్చేశాడు.

తాలిబాన్ ప్రతినిధి చెప్పింది వాస్తవం. కంపెనీల లాభాల కోసం, ప్రపంచ దేశాలపై దండయాత్ర చేస్తూ, మానవ నాగరికత సాధించిన మానవ, పౌర, నైతిక విలువన్నింటినీ కాలరాస్తూ పేద దేశాల ప్రజల ధన, మాన, ప్రాణాలను హరించి వేస్తున్న నీచ, నికృష్ట, దుర్మార్గులనుండి ఇంతకంటే గొప్ప ప్రవర్తనను ఆశించలేము. ఒక మనిషి చనిపోయాక అతని శరీరంలో ఇక స్పందనలు ఉండవు. శవం తనను తాను రక్షించుకోలేదు. శవం పట్ల సజీవంగా ఉన్న వారే శవంగా మారినీ వ్యక్తుల గౌరవాన్ని కాపాడాల్సి ఉంటుంది. మనిషిగా అటువంటి కనీస పాత్ర పోషించలేని ఈ దుర్మాదాంధ పశు సమానులు ఆఫ్ఘనిస్ధాన్ వద్దనే ఆగిపోతారా? ఖచ్చితంగా ఆగరు.

ఈ దుర్మార్గులా ఆఫ్ఘనిస్ధాన్ లో ప్రజాస్వామ్యాని స్ధాపించవచ్చిన సంస్ధాపకులు? ఈ నీచులా తాలిబాన్ నుండి ఆఫ్ఘన్ స్త్రీల హక్కులను కాపాడేది? ఈ నికృష్టులా ప్రపంచంలో పౌరహక్కులను కాపడడానికి నడుం కట్టిన వీరులు? మనిషి విగతదేహానికి గౌరవం ఇవ్వలేని వీరు తోటి సైనికుడి మరణం తర్వాతనైనా ఇదే విధంగా ప్రవర్తించరని గ్యారంటీ ఏమిటి? శవ సంస్కారానికి సిద్ధపడనివారు తనవారికి కూడా పనికిరాని కుసంస్కారులుగా, పశువులుగానే మిగిలిపోతారు.

One thought on “చనిపోయినవారిపై ఒంటేలు పోస్తున్న అమెరికా సైనికులు -వీడియో

వ్యాఖ్యానించండి