ఇరాన్ పై అమెరికా దాడికి ఒప్పుకోం -పాకిస్ధాన్


Hina Rabbani Khar‘అణ్వాయుధాలు ఉన్నాయన్న’ పేరుతో ఇరాన్ పై అమెరికా మిలట్రీ దాడికి పూనుకుంటే తాము అంగీకరించేది లేదని పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హీరా రబ్బానీ ఖర్ తేల్చి చెప్పింది. మరోక మిలట్రీ దాడికి ఈ ప్రాంతం భరించే స్ధితిలో లేదని ఆమె అభిప్రాయపడింది. అమెరికా ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఇరాన్ తో గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని కొనసాగిస్తామని కూడా ఖర్ తేల్చి చెప్పింది.

“అవసరమైతే ఇరాన్ పైన బల ప్రయోగం చేయడానికైనా సిద్ధమేనంటూ ఒబామా చేసిన ప్రకటన  నేపధ్యంలో పాక్ మంత్రి హీనా రబ్బానీ తాజా ప్రకటన చేసింది. ఆఫ్ఘనిస్ధన్ లో అస్ధిరతకు పాక్ కారణమన్న ఆరోపణలను ఆమె మరొకసారి ఖండించింది. “మా దేశాన్నే అస్ధిరపరచుకునే పని తాము చేయమన్న సంగతి నాటో కూటమి గుర్తించాలి. ఆఫ్ఘనిస్ధాన్ లో టెర్రరిజం పై పోరాడుతున్న విదేశీ బలగలాలకు సమస్యలు సృష్టించడం తమకు ప్రయోజనాకారి కాదని కూడా వారు గ్రహించాలి” అని హీనా రబ్బానీ తెలిపింది.

ఇరాన్ పై మిలట్రీ దాడికి ఇజ్రాయెల్ ఉరకలు వేస్తుండగా సంయనం పాటించాలని ఒబామా కోరుతున్నాడు. అయితే ఇరాన్ పై మిలట్రీ దాడి చేయబోమని మాత్రం అమెరికా చెప్పడం లేదు. మిలట్రీ ప్రత్యామ్నాయం కొట్టివేయడం లేదని కూడా పదే పదే ప్రకటిస్తోంది. ఇరాన్ అణ్వాయుధాన్ని సమకూర్చుకుంటోదన్నదే పశ్చిమ దేశాలు, ఇజ్రాయెల్ లు ఇరాన్ పై దాడికి చూపుతున్న సాకు. అయితే ఇజ్రాయెల్ వద్ద ఇప్పటికే 300 కు పైగా అణ్వాయుధాలు ఉన్నాయని బి.బి.సి లాంటి పత్రికలు తెలిపాయి. తన వద్ద అణ్వాయుధాలు లేవని ఇజ్రాయెల్ ఎన్నడూ చెప్పనప్పటికీ లేవని మాత్రం ఎన్నడూ ఖండించలేదు. పైగా తన వద్ద అణ్వాయుధాలు ఉన్న సమాచారాన్ని అది చక్కగా లీక్ చేస్తుంది. వందల కొద్దీ అణ్వాయుధాలు ఉన్న ఇజ్రాయెల్ తోనో, పశ్చిమ దేశాలతోనో లేని ప్రమాదం అవేవీ లేని ఇరాన్ వల్ల ఉన్నదని పశ్చిమ పత్రికలు పచ్చి దుష్ప్రచారం చేస్తున్నాయి.

అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ తో సహా అనేక మంది అమెరికా నాయకులు ఇరాన్ తో గ్యాస్ పైప్ లైన్ ఒప్పందం కుదుర్చుకోవద్దని పాకిస్ధాన్ ను అనేకసార్లు హెచ్చరించారు. ఇదే హెచ్చరిక భారత్ కి కూడా అమెరికా చేయడంతో భారత ప్రజల ప్రయోజనాలను కాలరాస్తూ మన్మోహన్ సింగ్ గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని ముందుకు సాగనీయలేదు. అయితే, పాక్ మాత్రం ఇరాన తో పైప్ లైన్ ఒప్పందం కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. ఇరాన్ గ్యాస్ ఫైల్ లైన్ వల్ల పాక్ ఇంధన సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని ఖర్ తెలిపింది. భారత పాలకులకు ఈ కాస్త జ్ఞానం లేకపోయింది. 

One thought on “ఇరాన్ పై అమెరికా దాడికి ఒప్పుకోం -పాకిస్ధాన్

  1. మీరు చెప్పినది అక్షరాల నిజం.
    చాల బాగా విశ్లెషించారు.మన పాలకులు కళ్ళు ఎప్పటకి తెరుచుకుంటాయొ.

వ్యాఖ్యానించండి