
దేశంలో నక్సల్ పీడిత జిల్లాలలో దుర్భేధ్యమైన కోటల్లాంటి పోలీసు స్టేషన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభ్యుత్వం రు.120 కోట్లు మేరకు విడుదల చేసింది. పోలీసు ఠాణాల నిర్మాణం కోసం విడుదల చేస్తున్న ఈ సొమ్ము కేవలం మొదటి వాయిదా మాత్రమే. మరింత సొమ్ముని మరిన్ని వాయిదాలలో విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా నక్సల్ పీడిత జిల్లాలలోని ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2010-11 లో కేవలం రు.25 కోట్లు మాత్రమే విడుదల చేయగా ప్రస్తుత 2011-12 సంవత్సరానికి కూడా కేవలం రు.30 కోట్లు మాత్రమే కేటాయించింది.
సామాజిక, ఆర్ధిక సమస్య గా గుర్తించిన నక్సల్ సమస్య పరిష్కారంలో ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి బదులు వారినీ, వారి అసంతృప్తినీ అణచివేయడానికి వినియోగించే పోలీసు వ్యవస్ధను పటిష్టపరుచుకోవడంపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్లు ఈ కేటాయింపుల ద్వారా ప్రభుత్వం చాటి చెప్పుకుంది.
కేబినెట్ కమిటీ నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాపితంగా 83 జిల్లాలను నక్సల్ ప్రభావిత జిల్లాలుగా గుర్తించింది. ఈ జిల్లాల్లో మొత్తం 400 పోలీసు స్టేషన్లను ఒక్కొక్కటి రెండు కోట్ల రూపాయల చొప్పున ఖర్చు పెట్టి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని చోట్ల కొత్త పోలీసు స్టేషన్లను నిర్మించడానికీ, మరి కొన్ని చోట్ల ఉన్న పోలీసు స్టేషన్లను పటిష్టపరచడానికీ ఈ సొమ్ముని ఖర్చు చేస్తారట. అందుకోసం మొదటి విడతగా ఒక్కొక్క స్టేషన్ కి ముప్ఫై లక్షల రూపాయల చొప్పున నూట ఇరవై కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తొమ్మిది రాష్ట్రాల్లో ఈ నక్సల్ ప్రభావిత జిల్లాలు విస్తరించి ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
వివిధ రాష్ట్రాల్లో నిర్మించే పోలీసు స్టేషన్ల సంఖ్య ఈ విధంగా ఉంది. బీహార్-85, చత్తీస్ ఘడ్-75, జార్ఘంఢ్-75, ఒడిషా-70, పశ్చిమ బెంగాల్-18, మధ్య ప్రదేశ్-12, ఆంధ్ర ప్రదేశ్-40, ఉత్తర ప్రదేశ్-15, మహారాష్ట్ర-10. ఈ ఖర్చులో ఎనభై శాతం కేంద్రం, ఇరవై శాతం రాష్ట్రం నిధుల్ని కేటాయించి ఖర్చుచేయనున్నాయి. ఒక్కో పోలీసు స్టేషన్ లో కనీసం నలభై మంది పోలీసులు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త తీసుకుంటుంది. 2011 లో నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో నక్సల్ హింస వల్ల 447 మంది పౌరులు, 142 మంది పోలీసులు చనిపోయారని ఇదింకా అంగీకారయోగం కాదనీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.
పోలీసుల కోసమే కాదు జనం కోసం కూడా మేము ఖర్చు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 2010-11 లో రు.25 కోట్లు, 2011-12 లో రు.30 కోట్లు అందుకు కేటాయించామని అది చెబుతోంది. పోలీసు స్టేషన్ల కోసం ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడిన ప్రభుత్వం జనం కోసం మాత్రం కేవలం ముప్ఫై కోట్లు కేటాయించడం చూస్తే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఏ మాత్రం ఆసక్తి లేదని అర్ధం అవుతుంది.
ప్రజల ప్రాధమిమిక సమస్యలైన కూడు, గుడ్డ, నీడ సమస్యలను పరిష్కరించకుండా నక్సల్ సమస్య పుట్టి పెరగడానికి కావలసిన సమస్త పరిస్ధితులను యధా తధంగా కొనసాగిస్తూ, ఆ సమస్యలనుండి జనించే అసమ్మతిని, అసంతృప్తిని హింసాత్మకంగా అణచివేయడానికే ఈ ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. శాంత్రి భద్రతల సమస్యగా మాత్రమే తప్ప ఆర్ధిక, సామాజిక సమస్యగా నక్సల్ సమస్యను చూసి పరిష్కరించడానికి ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదు. అది తమ నైజం కాదని పదే పదే రుజువు చేసుకుంటున్నాయి. శాంతి భద్రతల పేరుతో ఈ దేశ మూలవాసులైన ఆదివాసీ ప్రజల ప్రాధమిక హక్కులైన పౌర హక్కులను అణచివేయడానికి వీలుగా నిధుల కేటాయింపులని ప్రతి సంవత్సరమూ పెంచుకుంటూ పోతున్నాయి.
తమకు ఓట్లేసి ప్రభుత్వంలో అధికార పదవులు నిర్వహించడానికి కృషి చేసిన ప్రజలను ప్రభుత్వాలు కన్నబిడ్దల్లా చూసుకుంటాయని భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలు ప్రచారం చేస్తాయి. ప్రజలకు, వారి ఆస్తులకు, సౌకర్యాలకు ట్రస్టీలుగా వ్యవహరించడమే తమ పనని అవి ప్రచారం చేస్తుకుంటాయి. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉన్నదని తాజా ప్రభుత్వ కేటాయింపులే చెబుతున్నాయి. ప్రజల కనీస సౌకర్యాలు తీర్చవలసిన బాధ్యతను వదిలిపెట్టిన ప్రభుత్వాలు తమ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల తలెత్తిన ఉద్యమాల అణచివేతకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు పట్టడానికి సిద్ధపడడం అంటే ఈ ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు నిర్ద్వంద్వంగా రుజువు చేసుకున్నట్లే.
నక్సల్ అణచివేత కోసం గ్రామాల్లో తిష్ట వేసే పోలీసు బలగాలు ఆక్రమించుకునే ప్రబుత్వ పాఠశాలలను లేదా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను. పాఠశాలలను శాశ్వతంగా మూసివేసి అందులో తాము ఉంటూ ఏజెన్సీ గ్రామాల్లో పోలీసులు హంతక పాలనను నడుపుతాయి. ఈ కారణంతోనే పోలీసులకు స్ధావరం చేయాలనే ఉద్దేశంతో నక్సల్స్ కూడా పాఠశాల భవనాలను ధ్వంసం చేయడం కూడా కద్దు. నక్సల్స్ పాఠశాలలను ధ్వంసం చేస్తున్నారనీ, గిరిజనులు చదువుకోవడం వారికి ఇష్టం లేదనీ ప్రచారం చేసేది కూడా ప్రభుత్వాలే. టి.డి.పి, కాంగ్రెస్ ల పాలనలోని ఆంధ్రప్రదేశ్, వామపక్షాల పాలనలోని పశ్చిమ బెంగాల్, బి.జె.పి పాలనలోని జార్ఖంఢ్, ఛత్తీస్ ఘర్… ఇలా భారత దేశంలోని అన్ని పాలకవర్గాల పార్టీల నాయకత్వంలోని ప్రభుత్వాలు ఇవే విధానాలనూ, దుర్మార్గాలనూ అనుసరించాయి. ప్రజలను అణచివేయడంలో ఎవరికి ఎవరూ తీసిపోలేదు.
గిరిజనులకు విద్యా సౌకర్యాలు కల్పించడం లోనూ, వైద్య సేవలు అందించడంలోనూ నిజానికి ప్రభుత్వాలు ఎన్నడూ శ్రద్ధ చూపలేదు. ఇప్పటికే ఏజన్సీ ప్రాంతాలలఓ అనేక మంది గిరిజనులు మలేరియా జ్వరం వల్ల చనిపోతున్న పరిస్ధితి నెలకొని ఉంది. ఇంటెగ్రెటెడ్ యాక్షన్ ప్లాన్ (ఐ.ఎ.పి) కింద నక్సల్ ప్రభావిత జిల్లాల్లో 2010-11 (రు.25 కోట్లు) 2011-12 (రు.30 కోట్లు) కేంద్ర ప్రభుత్వం కేటాయించగా అందులో పదహారు శాతం పాఠశాలల నిర్మాణానికీ, పదమూడున్నర శాతం అంగన్ వాడీ నిధుల కోసం ఖర్చు చేశారు. అంటే ఈ సంవత్సరాలలో పాఠశాలల నిర్మాణం కోసం వరుసగా రు.4 కోట్లు, రు.4.8 కోట్లు అంగన్ వాడీల కోసం వరుసగా రు.3.37 కోట్లు, రు.4.05 కోట్లు కేటాయించారన్న మాట! తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఆర్ధిక, సామాజిక సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఇలా ఏడ్చింది. ప్రత్యేకంగా చేస్తున్న కృషే ఇలా ఉన్నపుడు లెక్కా డొక్కా లేని సాధారణ బడ్జెట్ లద్వారా చేసే కృషి ఎలా ఉంటుందో తేలిగ్గానె అర్ధం చేసుకోవచ్చు.
గ్రామీణ ప్రాంతాలలో రైల్వే లైన్‌లు వెయ్యకుండా మిగిలిన సిమెంట్, ఇనుముతోనే ఢిల్లీలో మెట్రో లైన్‌లు నిర్మించారని మనలో ఎంత మందికి తెలుసు? పత్రికలు తెరిచి చూస్తే మనం చదివేవి సినిమా వార్తలు, సొల్లు కబుర్లే కానీ సామాజిక విషయాలు కాదు కదా. ఎందుకో ఈ లింక్ చదివితే అర్థమవుతుంది: http://praveensarma.in/66649534