పన్నులు కోతలు వెరసి నిరుద్యోగం -కార్టూన్


ప్రపంచ ఆర్ధిక సంక్షోభం మిగిల్చిన భారాన్ని కోశాగార క్రమశిక్షణతో (fiscal discipline) పూడ్చుకోవాలని ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు ల్లోని పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు బోధిస్తారు. అయితే క్రమ శిక్షణ ను వాల్ స్ట్రీట్ కంపెనీలు, ప్రవేటు బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు లాంటి ‘టూ బిగ్ టు ఫెయిల్’ ప్రవేటు బహుళజాతి కంపెనీలకు వర్తించవు. ఈ దగుల్బాజీ ఆర్ధికవేత్తల దృష్టిలో క్రమ శిక్షణ పాటించవలసింది ప్రజలే.

ప్రజలపై వీరు రుద్దే క్రమ శిక్షణ ను ముద్దుగా ‘పొదుపు ఆర్ధిక విధానాలు’ అని పిలుచుకుంటారు. ఈ పిలుపు లో ఉన్న ‘పొదుపు’ కూడా పైన చెప్పిన కంపెనీలకు వర్తించవు. అది కూడా ప్రజలే పాటించాలి. పొదుపు చేయడం అన్నా, కోశాగార క్రమశిక్షణ అన్నా మరే ఇతర పేరు పెట్టినా వాటి అంతిమ ధ్యేయం ఉద్యోగుల సదుపాయాలను రద్దు చేయడం, పెన్షన్ లో కోత పెట్టడం, వేతనాలు తగ్గించడం, బోనస్ లు రద్దు చేయడం (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీల సి.ఇ.ఒ తరగతి పారాసైట్లకి బోనస్ లు రద్దు చేయకూడదు. వీలైతే మరింత పెంచాలి), నిరుద్యోగ భృతిలో కోత పెట్టడం, పన్నులు మరిన్ని బాదడం… ఇవే. ప్రజలకిచ్చే సదుపాయాలపైన పెట్టే ఖర్చు ‘పెచ్చు’ అని పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తల అభిప్రాయం. అందువలన ఆ ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ‘కోశాగార క్రమ శిక్షణ’ పాటించాలనీ, ‘పొదుపు’ చేయాలనీ వారు బోధిస్తారు.

ఈ విధానాల పాలబడి అమెరికాతో పాటు జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్సు, స్పెయిన్, గ్రీసు, ఇటలీ, ఐర్లండు, పోర్చుగల్ లాంటి యూరప్ దేశాల్లోనూ  నిరుద్యోగం పెచ్చరిల్లుతోంది. ఈ కార్టూన్ ఐర్లండు ను దృష్టితో పెట్టుకుని వేసినా అది అమెరికా, యూరప్ దేశాలన్నింటికీ వర్తిస్తుంది.

Austerity and unemployment

-ఫస్ట్ పోస్టు నుండి-

వ్యాఖ్యానించండి