ఈ ఫొటో ప్రచురణ చైనాని గొప్ప చేయడానికీ కాదు, ఇండియాని తక్కువ చేయడానికీ కాదు. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, వివిధ అవసరాల కోసం జనం కూడే ఇతర ప్రదేశాల్లో ఒకరిపై ఒకరు పడుతూ, ముందున్న వారిని నెట్టివేస్తూ తానే ముందుకు చేరాలన్న ఆత్రుతలో, తమ దాకా రాదేమో అన్న ఆందోళనతో ఉన్నపుడు, సాధారణంగా ఇటువంటి పరిస్ధితులు కనిపిస్తుంటాయి. అందరికి సరిపడా ఉంది, కనుక అందరికీ అందుతుంది అన్న భరోసా ఉంటే ఈ తోపులాటలు తప్పుతాయి. క్యూలో నిలబడ్డ ప్రతి ఒక్కరికీ కావలసింది అందుతుంది అన్న నమ్మకం ఉంటే ముందున్నవాడిని వెనక్కి నెట్టేయాలన్న ఆలోచన రాదు. అలా కాక అవసరమైనవీ, అత్యవసరమైనవీ కొద్ది సంఖ్యలో మాత్రమే ఉంటేనో, అవి అవసరమైనవారు అనేక రెట్లు ఉంటేనో తమ దాకా రాదన్న ఆత్రుత, ఆందోళన ఉదయించడం సహజం. అంటే, ప్రజలకు సౌకర్యాల కల్పన పూర్తి స్ధాయిలో అందుబాటులో ఉంచగల ప్రభుత్వాలు ఈ పరిస్ధితిని నివారించ గలవు. ప్రజలకు చెందవలసింది కూడా తామే నొక్కేస్తూ ఉన్న పాలకులు ఉన్న భారత దేశంలో ఈ పరిస్ధితి కాకుండా మరొక పరిస్ధితి ఎలా ఉంటుంది? ఈ చిత్రాన్ని ఆ కోణంలో నుండే చూడాలి.
నిజమే. ఈ చిత్రాలను చూడాల్సిన కోణం ఏమిటో బాగా చెప్పారు. సౌకర్యాల కల్పనలో లోపాలే ప్రధానమైన విషయం. అది సక్రమంగా ఉంటే మిగిలిన లోటుపాట్లు సరిచేసుకోవటం పెద్ద సమస్య కాదు.
అన్నట్టు – ఈ ఫొటో ఇవాళ ఈనాడు మెయిన్ ఎడిషన్లో వచ్చింది. దాన్నే ఎవరో ఫేస్ బుక్ లో షేర్ చేసివుంటారు!
మన ఇండియాలో రెండో తరగతి పెట్టెల్లో సీట్ సులభంగా దొరికే పరిస్థితి ఉంటే క్యూ ఎందుకు పాటించరు? నేను నౌపడ స్టేషన్ నుంచి శ్రీకాకుళం రోడ్ (ఆముదాలవలస) వరకు నలభై ఎనిమినిది కిలో మీటర్ల ప్రయాణానికి రెండో తరగతి టికెట్ తీశాను. రెండో తరగతి పెట్టెల్లో ఖాళీ లేదని స్లీపర్‌లో ఎక్కాను. ఆముదాలవలస స్టేషన్‌లో దిగిన తరువాత ఇంకో దృశ్యం కనిపించింది. రెండో తరగతి పెట్టెల్లో ఖాళీ లేదని అందులో ఉన్న ప్రయాణికులు ఎక్కబోయే ప్రయాణికులని కిందకి తోసేశారు. టిటిఇ ఇక్కడే ఉన్నాడు, అతనికి చెప్పండి అని నేను తోసివెయ్యబడ్డ ప్రయాణికులతో చెప్పాను. తాను ఎక్కడానికి కూడా ఆ పెట్టెల్లో ఖాళీ లేదని టిటిఇ సమాధానం చెప్పాడు. పెట్టెలో ఖాళీ దొరుకుతుందో, లేదో తెలియనివాళ్ళు క్యూ పాటిస్తారా?
ఎసి పెట్టెలలో ఖాళీ సులభంగా దొరుకుతుంది. శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో అర్థరాత్రి పూట ఆగే అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌లలో ఎసి పెట్టెలలో ప్రయాణించిన అనుభవం ఉంది. అర్థరాత్రి పూటకి ఎసి పెట్టెలో బెర్త్ రిజర్వ్ చేస్తే ట్రైన్ స్టేషన్‌లో ట్రైన్ ఆగేటప్పుడే టిటిఇ ఎసి పెట్టె తలుపు తీసి బెర్త్ రిజర్వ్ చేసిన ప్రయాణికుడు ఎక్కిన తరువాత తలుపు మూస్తాడు. ఏ స్టేషన్‌లో ఏ ప్రయాణికుడు దిగుతాడో కూడా చార్ట్‌లో వ్రాసి ఉంటుంది కనుక ప్రయాణికుడు దిగబోయే స్టేషన్ రావడానికి ముందే టిటిఇ ప్రయాణికుణ్ణి నిద్రలేపుతాడు. ఎవరినీ తోసుకోవాల్సిన అవసరం రాకూడదంటే ఎసి పెట్టెలలో ప్రయాణించడమే మేలు.
చైనా గొప్ప, ఇండియా తక్కువ అనే భావాన్ని మీ కథనం వ్యక్తపర్చటం లేదు. 140 కోట్ల జనాభా కలిగిన చైనా తన ప్రజలకు ఇలాంటి క్రమశిక్షణను నేర్పగలుగుతున్నప్పుడు మనం ఎందుకు విఫలమవుతున్నాం అన్నదే ఇక్కడ ప్రధానాంశం. మన రాష్ట్రంలో ఎక్కడ బస్సు ప్రయాణీకుల కేసి చూసినా పది నిముషాలకు ఒక బస్సు చొప్పున తిరిగే ప్రదేశాల్లో కూడా జనం తొక్కిడి భయంకరంగా ఉంటుంది. అయినా సరే ఆర్టీసికి ప్రతి ఏటా 350 కోట్ల రూపాయల నష్టం వస్తూనే ఉంటుంది.
ముందుగా సీటు నాకే దక్కాలి అనే తాపత్రయం జనం సైకాలజీకి సంబంధించింది కాగా, ఆర్డినరీ బస్సులను, మూడో తరగతి కంపార్ట్‌మెంట్లను మన వ్యవస్థ నిర్వహిస్తున్న తీరు ఘోరాతిఘోరంగా ఉంటోంది. అందుకే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనేది సీట్లకోసం కడా ఇక్కడ తండ్లాటలకు దారితీస్తూంటుంది.
‘అందరికి సరిపడా ఉంది, కనుక అందరికీ అందుతుంది అన్న భరోసా ఉంటే ఈ తోపులాటలు తప్పుతాయి’
చైనాలో కూడా ఈ భరోసా ఇప్పుడు లేదనుకుంటాను. అపార అవకాశాలు కొందరికే ఉండటం అక్కడా సహజమే అయినప్పటికీ ఇలాంటి పోలికలు ఎక్కడో మననూ, మనసులనూ ఖేదపరుస్తుంటాయి.
క్రమశిక్షణ అనేది ఉక్కుపాదంతోనూ, నియంతృత్వంతోనూ రాదు. నిజమే. కాని క్రమశిక్షణ అనేది మన దేశంలో ఒక సాధారణ పోలీసు, రైల్వే కంపార్టుమెంట్ వద్ద నిలబడి జనాల్ని క్యూలో నిలబెట్టి మరీ పంపించినపుడు మాత్రమే దాని నిజమైన అర్థంలో కాస్సేపయినా అమలవుతుంది. క్యూ నిర్వహణ విషయంలో ఒక సాధారణ పోలీసుకు సాధ్యమవుతున్నది మన మహా వ్యవస్థకు సాధ్యం కావటం లేదు. ఇదే విచారకరం.
కేవలం క్యూల విషయంలోనే కాదు, చాలా విషయాలలో ప్రయాణికులకి జ్ఞానం లోపిస్తోంది.
ట్రైన్‌లు, రైల్వే స్టేషన్‌లలో పొగతాగకూడదు అని చట్టం తయారు చేసినా ఆ చట్టం తయారు చేసినట్టు బోర్డ్‌ల మీద వ్రాయని చరిత్ర మన రైల్వేవాళ్ళకి ఉంది. మూడు నెలల క్రితం అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో ఒక రైల్వే కానిస్టేబుల్ ఒక ప్రయాణికునితో గొడవ పడడం చూశాను. ఆ ప్రయాణికుడు సిగరెట్ తాగుతున్నాడని అతన్ని రైల్వే పోలీస్ ఔట్‌పోస్ట్‌లోకి రమ్మన్నాడు. రైల్వేలలో సిగరెట్లు తాగకూడదనే రూల్ ఉందని తనకి తెలియదని ప్రయాణికుని ఆర్గ్యుమెంట్. ఇక్కడ ప్రయాణికునిది తప్పంటామా, సిగరెట్లు తాగకూడదని బోర్డ్ పెట్టని రైల్వేవాళ్ళది తప్పంటామా?
అంతకు ముందు ట్రైన్‌లోనే సిగరెట్ తాగుతున్న ప్రయాణికుణ్ణి చూశాను. సిగరెట్ తాగకూడదు, టిటిఇ వస్తే రెండు వందల రూపాయలు పెనాలిటీ అడుగుతాడని చెప్పాను. టిటిఇ వస్తే కదా అని ఆ ప్రయాణికుడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అది రెండో తరగతి పెట్టె. అతను కాల్చిన తరువాత సిగరెట్ ముక్కని కిటికీ లోంచి బయట పారెయ్యగలడు. ఒకవేళ ఎసి పెట్టెలో అతను కర్టైన్ మీద సిగరెట్ పడేస్తే అది కాలిపోయి పెట్టె మంటలు అంటుకోదని గ్యారంటీ ఏమిటి? ఎసి పెట్టెలో టిటిఇ తప్పకుండా ఉంటాడు కానీ టిటిఇ వచ్చేలోపే సిగరెట్ కర్టైన్‌ల మీద పడి మంటలు అంటుకోవని గ్యారంటీ లేదు. రెండో తరగతి పెట్టెలోనైనా ఒక పల్లెటూరి వ్యక్తి కిరోసీన్ పట్టుకెళ్తున్నప్పుడు దాని మీద సిగరెట్ ముక్క పడదని గ్యారంటీ లేదు. పది నిముషాల తాత్కాలిక ఆనందం కోసం సిగరెట్ తాగినా పది మంది ప్రాణాలు పోగలవు.
రిస్క్ తీసుకుని తమ ప్రాణంతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా పోయే పని చేసేవాళ్ళకి క్యూ ఒక లెక్క అని నేను అనుకోను. నేను ఒకప్పుడు రెండో తరగతి పెట్టెల్లో ప్రయాణించేవాణ్ణి. ట్రైన్‌కి ముందు రెండు, వెనుక మూడు రెండో తరగతి పెట్టెలు ఉంటాయి. అంత తక్కువ సంఖ్యలో ఉన్న ఆ పెట్టెల్లో సీట్ కావాలనుకునేవానికి క్యూ గురించి ఆలోచించే సమయం ఉండదు. ఎక్కిన తరువాత కూడా వాటిని శుభ్రంగా ఉంచుతారా అంటే అదీ లేదు. వేరు శనగ తొక్కలూ, అరటి పండు తొక్కలూ పెట్టెలలోపలే పడేస్తారు. ఆ పెట్టెలలో టిటిఇ లేకపోవడం వల్ల హిజ్రాలు(eunuchs లేదా కొజ్జావాళ్ళు) కూడా వాటిలో విహరిస్తారు, ప్రయాణికుల జేబుల్లో చేతులు పెట్టి మరీ డబ్బులు లాక్కుంటారు. అందుకే రెండో తరగతి పెట్టెలలో ప్రయాణించడం మానేసి ఎసి పెట్టెలలో ప్రయాణించడం మొదలుపెట్టాను.
రిజర్వేషన్ చెయ్యించుకోవడానికి డబ్బులు లేనివాళ్ళు ఇప్పుడు కూడా రెండో తరగతి పెట్టెల్లో నరకయాతనలు పడుతూ ప్రయాణాలు చేస్తున్నారు.
Reblogged this on తాతా వారి డైరీ.. and commented:
మేరా భారత్ మహాన్
నా కామెంట్ ముందు పెట్టండి…తప్పుకోండి..తప్పుకోండి……హెహె…తోసెయ్…