మొదటి భారత మహిళా ప్రెస్ ఫొటోగ్రాఫర్ ‘హోమై’ ఫొటోలు


భారత దేశంలో మొట్టమొదటి మహిళా ఫొటోగ్రాఫర్ గా ప్రసిద్ధికెక్కిన ‘హోమై వ్యారవల్లా’ జనవరి 15 తేదీన మరణించింది. మరణించేనాటికి ఆమెకు తొంభై ఎనిమిదేళ్ళు. స్వతంత్ర భారత దేశం జన్మించినప్పటినుండీ పత్రికా ఫొటోగ్రాఫర్ గా ముప్ఫై మూడేళ్ల పాటు ఈమె తన వృత్తిని కొనసాగించారు. బ్రిటిష్ ఇండియా అంతం, స్వతంత్ర ఇండియా ప్రారంభానికి సంబంధించి ఈమె తీసిన ఫొటోలు ఇప్పటికీ చారిత్రాత్మకంగా మన్ననలు అందుకుంటున్నాయి.  1913 లో గుజరాత్ లోని నవసారి లో ఓ మధ్య తరగతి పార్శీ కుటుంబంలో జన్మించిన హోమై పత్రికా ఫొటోగ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించడం పెద్ద సాహసంగానే చెప్పుకోవచ్చు. గుజరాత్ లో జన్మించినప్పటికీ ఈమె పెరిగింది ముంబై లోనే. తన క్లాసులో మెట్రిక్యులేషన్ లో పాస్ అయిన ఏకైక అమ్మాయి ‘హోమై’ యేనట. తాను ఫొటోగ్రఫీ నేర్చుకున్న గురువు ‘మానెక్‌షా వ్యారవల్లా’ నే ఆమె ఆ తర్వాత పెళ్లాడారు.

భారత ప్రభుత్వాలు నెహ్రూవియన్ విధానాలను తుంగలో తొక్కడం ప్రారంభం అయ్యాక ఆమె 1990 లో ఫొటోగ్రాఫర్ గా తన కెరీర్ ని ముగించి వదోదర లో శేష జీవితం గడిపినట్లు తెలుస్తోంది. పరివర్తనలో దశలో ఉన్న భారత దేశాన్ని ఈమె తన ఫోటోల్లో బంధించింది. ఆ ఫోటోల్లో కొన్నింటిని ‘యాహూ ఇండియా’ వార్తల సెక్షన్ ప్రచురించింది.

One thought on “మొదటి భారత మహిళా ప్రెస్ ఫొటోగ్రాఫర్ ‘హోమై’ ఫొటోలు

  1. ఆవిడ ఫొటోలూ, ఆవిడ తీసిన ఫొటోలూ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి.

    అసలు ఇందిరా గాంధీ ఫొటో అద్భుతం!

    ప్రెస్ ఫొటో గ్రాఫర్….ఆ రోజుల్లో! చాలా గర్వంగా ఉంది ఈమెను చూస్తుంటే

వ్యాఖ్యానించండి