ప్రాణాంతక మధురై జల్లికట్టు -ఫొటోలు


తమిళనాడులొ మధురై సమీపాన ఉన్న అనంగనల్లూరు గ్రామంలో జరిగిన జల్లికట్టు దృశ్యాలివి. ‘జల్లి కట్టు’ పేరుతో ఆంబోతులతో తలపడే ఆచారం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కే పరిమితం కాదన్నమాట! ‘ఈ ఎద్దులు మాకు దైవంతో సమానం’ అని జల్లికట్టు జరిగిన ప్రాంగణంలో ప్రదర్శించబడిన ఒక బ్యానర్ చెబుతోంది. దైవం అంటూనె వాటిపై హింసకు పాల్పడడం కేవలం ‘జీవన వైవిధ్యం’ గానో, ‘సంస్కృతి’ గానో చెప్పుకుని సరిపెట్టుకోగలమా?

జల్లికట్టు సందర్భంగా క్రీడలో పాల్గొన్న వారు యూనిఫారం ధరించారు. యూనిఫారం పైన ముఖ్యమంత్రి బొమ్మ ఉండేసరికి వాటిని కలెక్టర్ అడ్డుకున్నాడట. జల్లి కట్టు పశు (జీవ) హింస గా పేర్కొంటూ సుప్రీం కోర్టుని కొందరు ఆశ్రయించడంతొ సుప్రీం కోర్టు ఈ క్రీడకి సంబంధించి కొన్ని నిబంధనలను రూపొందించింది. ఆ నిబంధనలు అమలు జరుగుతున్నాయా లేదా అని చూడడానికి మదురై జిల్లా కలెక్టర్ స్వయంగా ‘జల్లి కట్టు’ కి హాజరు అయినట్లు తెలుస్తోంది.

వ్యాఖ్యానించండి