‘ఎస్&పి’ తాకి ‘ఇ.యు’ ఓడ మునక -కార్టూన్


EU economy ran into S&P

సముద్రంలో అడుగు తాకి ఇటలీ లగ్జరీ ఓడ మునక -వార్త

2 thoughts on “‘ఎస్&పి’ తాకి ‘ఇ.యు’ ఓడ మునక -కార్టూన్

  1. సంజయ్ గారూ, ఈ వాదనలేవీ కొత్త కాదు.

    నూతన ఆర్ధిక విధానాలు రైతులు, కార్మికులకు హాని చేస్తున్నాయన్న నిజాన్ని మరుగుపరచడానికి ఇటువంటి అర్ధ సత్యాలతో కూడిన వాదనలు చాలా వ్యాప్తిలోకి తెచ్చారు.

    ఆర్టికల్ లోనే చెప్పినట్లు రైతులకి ఇస్తున్నామని చెబుతున్న సబ్సిడీలు దొడ్డిదారిన ఎరువులు, పురుగుమందుల కంపెనీలే పొందుతున్నాయి తప్ప అవి రైతులవరకూ రావడం లేదు. నేను కొద్ది రోజుల క్రితం ఒక మిత్రుడికి సమాధానం ఇస్తూ రాశాను. వ్యవసాయం దండగ అనీ, రైతులు అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ పత్రికలు రాస్తుంటాయి గానీ నిజానికి వ్యవసాయ రంగం రైతులకి దండగగా మారింది తప్ప అందరికీ కాదని. ‘వ్యవసాయం దండగ’ అన్న ప్రచారం వెనకే పెద్ద కుట్ర ఉంది. కొంచెం సేపు కుట్ర సంగతి పక్కనబెడదాం.

    వ్యవసాయం లేకుండా భారత దేశంలో పరిశ్రమల్లేవు, సేవల రంగమూ లేదు. భారత దేశంలో సరైన సమయానికి రుతుపవనాలు వస్తాయా రావా అన్న అంశంపైన ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక విశ్లేషక సంస్ధల అంచనాలు ఆధారపడి ఉంటాయి. భారత దేశంలో రుతుపవనాల రాకకు సంబంధీంచిన అంచనాలపైన పాశ్చాత్య వార్తా పత్రికలతో పాటు అక్కడి వ్యాపార వార్తా పత్రికలు కూడా కేంద్రీకరణ చేస్తాయి. ఐబిఎన్, బిబిసి, సి.ఎన్.ఎన్ లాంటి అంతర్జాతీయ వార్తా పత్రికలకు అనుబంధంగా ఉన్న బిజినెస్ విభాగాలతో పాటు రాయిటర్స్ లాంటి బిజినెస్ వార్తా సంస్ధలు కూడా భారత దేశ రుతుపవనాలపైన అంచనాలను పట్టించుకుంటాయి. ఆ తర్వాత ఆ అంచనాలు నిజం అవుతున్నాయా లేదో కూడా పరిశీలించి వాటిపైన వార్తా కధనాలు ప్రచురిస్తాయి.

    ఇవన్నీ ఎందుకని? ఎందుకంటె భారత వ్యవసాయ రంగం రుతుపవనాల రాకపైన ఎంతగా ఆధారపడి ఉన్నాయో వారికి తెలుసు గనక. ఊరికే ఆ విషయం వారికి తెలిసినందువల్లనే కాదు సుమా. రుతుపవనాలు రాకపోతే వ్యవసాయరంగంలో జరిగే ఉత్పత్తి బాగా కుంటుపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపైన అనేక పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. టెక్స్ టైల్స్ దగ్గర్నుండి, ప్రాసెసింగ్ పరిశ్రమలు, రవాణా రంగం, కొండొకచో కమ్యూనికేషన్ల రంగం అన్నీ ఆధారపడి ఉన్నాయి.

    సేవల రంగం (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మొ.వి) అయితే ఇక చెప్పనవసరం లేదు. భారత దేశంలోని జిడిపిలో సర్వీసెస్ సెక్టార్ వాటా యాభై ఐదు శాతం దాకా ఉంటుంది. వర్క్ ఫోర్స్ లో పాతిక శాతం సేవల రంగమే. ( అధమం చూసుకున్నా, వ్యవసాయ రంగం యాభై ఐదు నుండి అరవై శాతం వరకూ వర్క్ ఫోర్స్ కి ఉపాధి కల్పిస్తుంది.) ఈ సేవల రంగానికి పునాది వ్యవసాయ రంగమే అని గుర్తుంచుకోవాలి.

    వ్యవసాయ రంగానిది ప్రాధమిక ఉత్పత్తి లెదా ముడి ఉత్పత్తి అయితే దానిపైన జరిగే అనేక పారిశ్రామిక, సేవల రంగ కార్యకలాపాలు నడుస్తుంటాయి. వ్యవసాయం బాగా నడిస్తే ఆ ప్రభావం ఇండియా జిడిపిలోని ఎనభై శాతం పైన పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తి జరిగితే పరిశ్రమలకు ముడి సరుకు దొరకడం ఒక సంగతి. వ్యవసాయం ద్వారా రైతులకి, కూలీలకీ వచ్చే ఆదాయం సేవింగ్స్ రూపంలొ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలోకి వెళుతుంది. అక్కడి నుండి పరిశ్రమలకి అప్పుల రూపంలో పెట్టుబడులు వెళ్తాయి. బ్యాంకుల్లో సేవింగ్స్ పెరిగితే అది స్వయం ఉపాధిదారులకు కూడా అప్పులు పెరగడానికి దోహదపడుతుంది. ఇన్సూరెన్స్ రంగంపైన కొన్ని పదుల లక్షలమంది ఏజెంట్లు ఆధారపడి ఉంటారు. వీరికి కూడా వ్యవసాయం పండగే. రైతుల వద్ద డబ్బులు కూడితే వీరికి బోలెడంత ఆదాయం.

    ఈ కారణాల వల్ల భారత దేశంలో రుతుపవనాలు….

    (మిగిలిన భాగం తదుపరి పోస్టు లో చూడగలరు.)

వ్యాఖ్యానించండి