శాండీ స్కాగ్లండ్ తీసిన ఫొటోలివి. ఫోటోలు చూసి ఫోటో షాప్ ద్వారా మలిచినవిగా పొరబడడానికి వీలుంది. ఈ ఫోటోలు తీసిన కాలానికి ఫోటో షాప్ ఇంకా కనిపెట్టలేదని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
సర్రియలిస్టు ఫోటోలు సృష్టించడంలో ఈమె దిట్ట. పెద్ద పెద్ద సెట్టింగులు సృష్టించి ఫోటోలు తీయడం ఈమె/ఈ కళలో ప్రత్యేకత. ఈ సెట్టింగ్ లు ఏర్పాటు చేయడానికి ఈమెకి ఒక్కోసారి నెలల తరబడి సమయం పట్టేదిట. ఒక్కే వస్తువుతో దృశ్యం అంతా నింపటం, పూర్తిగా పరస్పర విరుద్ధమైన రంగులను ఓ చోట చేర్చడం ఈ ఫొటోల్లో చూడవచ్చు.
1946లో క్వింసీ, మసాచూసెట్స్ లో జన్మించిన ఈమె స్టూడియో ఆర్ట్ ని అధ్యయనం చేసిందిట. నార్తాంప్టన్ లోని స్మిత్ కాలేజీలో ఆర్ట్ హిస్టరి (1964-68) చదివింది. ఆ తర్వాత 1972 లో న్యూయార్క్ నగరానికి తరలి వెళ్ళింది. కాన్సెప్టుయల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె ఆ తర్వాత వివిధ టెక్నిక్కులతో కళా సృష్టి చేయడం ప్రారంభించింది.
1973-76 లో శాండీ హార్ట్ ఫోర్డ్ యూనివర్సిటీ లో ఆర్ట్ ప్రొఫెసర్ గా పని చేసింది. ఇప్పుడేమో యూనివర్సిటీ ఆఫ్ న్యూజెర్సీ లో ఫోటోగ్రఫి పాఠాలు చేపుతోంది.
-సేకరణ: యూజీన్, మై ఫొటో మెట్.
–
















శాండీ తీసిన ఈ ఛాయాచిత్రాలు వింత లోకాన్ని కళ్ళ ముందుకు తెస్తున్నాయి. ప్రతి ఫొటో లోనూ ఆశించిన ఎఫెక్టు కోసం పడిన తపన, శ్రమ తెలుస్తూనే ఉన్నాయి!