
ఫేస్ బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ తదితర ఐ.టి సంస్ధలతో పాటు మొత్త ఇరవై ఒక్క సామాజిక వెబ్ సైట్లను వివిధ నేరాల క్రింద ప్రాసిక్యూట్ చెయ్యడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వివిధ తరగతుల ప్రజానీకం మధ్య శతృత్వాన్ని పెంపొందించడం, అశ్లీల సాహిత్యాన్ని పంపిణీ చెయ్యడం లాంటి నేరాలకు సాక్ష్యాలు ఉన్నందున సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్ సైట్లను ప్రాసిక్యూట్ చెయ్యవచ్చని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చిచెప్పడంతో ప్రభుత్వం ఈ అనుమతిని మంజూరు చేసింది.
శుక్రవారం ఈ మేరకు ఢిల్లీ హై కోర్టుకు ప్రభుత్వం సమాచారం అందించింది. ఈ వెబ్ సైట్ల చర్యలు జాతీయ సమగ్రతకు ప్రమాదకరంగా పరిణమించాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకి తెలిపింది. “అనుమతి మంజూరు చేసి అధికారి తన ముందుంచిన అన్ని రికార్డులను వ్యక్తిగతంగా తనిఖీ చేసారు. వివిధ అంశాలనూ, రుజువులను పరిశీలించాక నిందితులపై ఐ.పి.సి సెక్షన్లు 153 A, 153 B, 295 A కింద అభియోగలు నమోదు చేయడానికి తగిన మెటీరియల్ ఉందని నిర్ధారించారు” అని కేంద్ర ప్రభుత్వం కోర్టుకి తెలిపింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సుదేష్ కుమార్ ఈ కేసును విచారిస్తున్నారు.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను విదేశాలలో ఉన్న పది కంపెనీలకు సమన్లు ఇవ్వవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. సమన్లను డిసెంబరు 23 న జారీ చేసినప్పటికీ వాటిని సంబంధిత కంపెనీలకు చేరవేయలేదు. నేర పూరిత కుట్ర, యువతకు అశ్లీల పుస్తకాలనూ, అశ్లీల వస్తువులనూ అమ్మడం లాంటి నేరాలకు పాల్పడినందుకు ఇరవై ఒక్క సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లకు సమన్లను కోర్టు జారీ చేసింది.
వివిధ తరగతుల మధ్య శతృత్వాన్ని పెంపొందించడం, జాతీయ సమగ్రతకు భంగకరంగా ప్రవర్తించడం, మతాలనూ, మతపరమైన నమ్మకాలనూ హేళన చెయ్యడం తదితర నేరాల కింద కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు అనుమతి లేకుండా లేదా జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా సమన్లు జారీ చేయడానికి వీలు లేకపోవడంతో అవి అలానే ఉండిపోయాయి.
కేంద్రం ఆదేశాల మేఋఅకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఈ విషయమై ఒక నివేదిక తయారు చేసింది. ఇరవై ఒక్క వెబ్ సైట్లకు వ్యతిరేకంగా సమన్లు జారీ చేయడానికి ఈ నివేదిక అనుమతి ఇచ్చింది.
Profane videos are present in youtube (owned by Google) since long time. They just keep adult label on those videos but every one knows that even children watch those videos. Even if they mandate account login for view of those videos, children can enter wrong information about their age and create accounts to watch those adult videos.
అవును. గూగుల్ ది కేవలం ద్వంద్వ ప్రమాణాలు కాదు, బహుళ ప్రమాణాలు. ఎప్పటికి ఏది అవసరమో ఆ సూత్రం చెబుతుంది. దాని వ్యాపార ప్రయోజనాలే లక్ష్యంగా అది బహుళ ప్రమాణాలు పాటిస్తుంది. నైతికంగా పూర్తిగా పతనమైన సంస్ధ అది.