పేలుడు కళ -వీడియో (మిస్ అవద్దు)


కళలు అరవై నాలుగు అని పెద్దలు సూత్రీకరించారు. కాని హద్దుల్లేని సృజనాత్మకత ఎన్ని కళలకైనా జన్మనిస్తుందని ఏ పేలుళ్ళ కళ సూచిస్తోంది. పేలుళ్ళతో మానవ హననం జరుగుతుందని ఇప్పటివరకూ తెలిసిన నిజం. పేలుళ్ళతోనూ కళా సృష్టి కూడా జరుగుతుందని వీధి చిత్ర కళాకారులు వీడియో సాక్షిగా చూపిస్తుంటే కాదని అనగలమా? “ఎక్స్‌ప్లోజివ్ ఆర్ట్” అని చెబుతున్న ఈ కళను చూడండి.

ఈ కళ సృష్టికర్త లండన్ నివాసి అలక్జాండ్రే ఫార్టో. 1987 లో ఈయన జననం. నిండా పాతికేళ్ళయినా లేని ఈయన మరో లండన్ వీధి చిత్ర కళాకారుడు బ్యాంక్సీ చిత్రాల పక్కన చోటు సంపాదించి తానూ ప్రసిద్ధకెక్కాడు. ఈయన స్వంతంగా ప్రపంచం లోని వివిధ చోట్ల గ్యాలరీలు ప్రదర్శించాడు కూడా.

 

2 thoughts on “పేలుడు కళ -వీడియో (మిస్ అవద్దు)

  1. నమ్మశక్యం కాని చిత్రమైన కళ! అంత కచ్చితంగా – అవసరమైనవరకే పేలుడును నియంత్రించగలగటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. వీడియోలో నేపథ్య సంగీతం బదులు సహజ ధ్వనులనే ఉంచివుంటే ఇంకా బాగుండేది!

వ్యాఖ్యానించండి