ఈ వీధి శిల్పాలు స్పెయిన్ దేశ శిల్పి ‘ఐజక్ కోర్డల్’ నెలకొల్పినవి. గాలీషియా నగరానికి చెందిన ఈయన స్పెయిన్ రాజధాని ‘బార్సిలోనా’ ఈ శిల్పాల్ని నెలకొల్పాడు. వివిధ చోట్ల కనిపించే కాంక్రీటు నుండి ఈ శిల్పాలను ఐజక్ రూపొందించాడు. కొన్ని అక్కడికక్కడే రూపొందించిన శిల్పాలు కాగా మరికొన్ని వేరే చోటి నుండి తెచ్చిన కాంక్రీటునుండి రూపొందించిన శిల్పాలు.
చిన్న చిన్న మానవ రూపాలను కాంక్రీటు నుండి మలచడంలో దిట్ట ‘ఐజక్ కోర్డల్’. రంగు లాంటి అంశాల్లో పూర్తి వివరం లేనప్పటికీ ఆ చిన్న రూపాలనుండే మానవ ఉద్వేగాలను రాబట్ట గలిగిన ప్రతిభ శిల్పాలలో మనం చూడవచ్చు. తన చిన్ని మానవులతో ఐజక్ కి చాలా సానుభూతి. మనం కూడా ఆ సానుభూతిని చూపకుండా ఉండలేం. వారి పరిస్ధితులు, వారి సమయం, బస్సుల కోసం వారి ఎదురుచూపులు, ప్రమాదాల్లో వారి మరణాలు, ఆత్మ హత్య, అంతిమ యాత్ర ఇలా అనేక పరిస్ధితుల్లో కనిపించే ఈ చిన్ని మానవుల పట్ల ఎవరికి మాత్రం సానుభూతి ఉండదు?
రోడ్డు పక్క గుంటలు, భవంతులపైన, బస్ షెల్టర్లపైన ఈ శిల్పాలు ఉండడం చూడవచ్చు.
–
–
–

























వాస్తవిక ప్రపంచాన్ని అద్దంలో చూపించినట్టుంది ఈ చిన్ని మానవుల లోకం. ఈ కళారూపంలో విషాదం, నిరాశ, దిగులు శక్తిమంతంగా వ్యక్తమవుతున్నాయి.
వరస ఘటనలను (నీళ్ళలో మునిగిపోవటం) శిల్పరూపంలో చూడటం ఇదే మొదటిసారి. చిన్నరూపాలు కాబట్టి ఘటనల క్రమాన్ని తక్కువ స్థలంలోనే చూపించటం సాధ్యమైంది.