‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ సైగల భాష -బొమ్మలు


ఉద్యమాలు సృజనాత్మకతకు కేంద్రాలుగా భాసిల్లడం అనాదిగా వస్తున్న చరిత్ర. ఉద్యమాలకు ఉండే వివిధ అవసరాలు సృజనాత్మకతకు పదును పెడుతుంటాయి. వందలు, వేల మందిని ఆర్గనైజ్ చెయ్యవలసిన పరిస్ధితుల్లో ఒకరు వందల మందితో, తిరిగి వందలమంది ఒకరితో సంభాషించవలసిన పరిస్ధితుల్లో, దూరంగా ఉంటూ పరస్పరం సంభాషించుకోవలసిన పరిస్ధితుల్లో సైగల భాషకు ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమం జన్మనిచ్చింది. జన్మనిచ్చింది అనడం కంటే పదును పెట్టింది అనడం సరిగా ఉంటుంది.

‘ఆకుపై’ ఉద్యమాలకు మైక్ పర్మిషన్ ఇవ్వని పరిస్ధుతులనుండి ‘హ్యూమన్ మైక్’ పుట్టింది. మైకు అందుబాటులో లేని పరిస్ధితుల్లో ఇది ఉపయోగపడింది. బహిరంగ సమావేశంలో మైక్ సెట్టింగ్ లేని చోట చెప్పదలుచుకున్నదానిని ఒకరు చదువుతుండగా ఆ వ్యక్తి చుట్టూ సమీపంలో ఉన్న దానిని పెద్ద గొంతులతో ఒక్కుమ్మడిగా పలకడమే ‘హ్యూమన్ మైక్’ పదిమందీ పలికినపుడు అది మరింత శబ్దంతొ వెనక ఉన్నవారికి వినపడేలా చేయడానికి ఈ ఎత్తుగడని కార్యకర్తలు అవలంభించారు. జైలు పాలైన చోట జైలు లోపల ఉన్నవారికి తమ సందేశం వినిపించడానికీ, ‘భయం లేదు, మీ వెంట మేం ఉన్నాం’ అని చెప్పడానికీ ఈ ‘హ్యూమన్ మైక్’ ని శక్తివంతంగా కార్యకర్తలు వినియోగించుకున్నారు.

OWS hand signals

Hand signals in Zuccotti park

వాల్ స్ట్రీట్ వద్ద జుకొట్టి పార్కులో చేతి సైగలతో అభిప్రాయం చెబుతున్న కార్యకర్తలు

One thought on “‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ సైగల భాష -బొమ్మలు

వ్యాఖ్యానించండి