చైనాలో ఐ ఫోన్ కోసం చలిలో, గడ్డకడుతూ… -ఫొటోలు


ఇది చైనాలో ప్రజాస్వామిక సంస్కరణల కోసం జరుగుతున్న నిరసన ప్రదర్శన కాదు. కేవలం ‘ఐ ఫోన్ 4 ఎస్’ కొనుగోలు చేయడానికి గుమికూడిన జనం. ‘వినియోగదారీ సంస్కృతి’ వెర్రి తలలు వెయ్యడం అంటే ఇది కదా! ఐఫోన్ ఎట్టి పరిస్ధితుల్లోనూ జీవితావసరం కాదు. ఐనా వీరి ఆత్రుతను ఎలా అర్ధం చేసుకోవాలి?

చైనా తో పాటు మరొ పదమూడు దేశాల్లో శుక్రవారం అమ్మకాలు ‘ఐ ఫోన్ 4 ఎస్’ మొదలు పెట్టనున్నట్లు ప్రకటించింది. చైనాలోని ప్రధాన నగరాల్లో ఏపిల్ స్టోర్లు ఉన్న చోట ముందు రోజు రాత్రినుండే క్యూలు మొదలయ్యాయి. రాత్రంతా షాపుల ముందు నిలబడి ఉన్న వీరికి శుక్రవారం ఎంత సేపటికీ షాపులు తెరవకపోవడంతో కోడిగుడ్లు విసరడానికి కూడా సిద్ధపడ్డారు. తోపులాటలో ఒకరిద్దరు ఆసుపత్రి పాలయ్యారు.

ఐ ఫోన్, ఐ పాడ్ లు సొంత చేసుకోవడానికి కిడ్నీ అమ్ముకున్న చైనా యువకుడి ఉదంతం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.

 

3 thoughts on “చైనాలో ఐ ఫోన్ కోసం చలిలో, గడ్డకడుతూ… -ఫొటోలు

  1. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి,
    చైనాలో మొత్తం 5 ఆపిల్ స్టోర్స్ ఉంటే కేవలం ఒక స్టోర్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది, మిగతా స్టోర్స్ వద్ద నిలబడి ఉన్న జనాన్ని గమనించి నిర్ణీత సమయం కంటే ముందుగానే తెరిచి అమ్మకాలు ప్రారంభించారు.
    ఇలా నిలుచున్న వారందరు ఐఫోను మీద మోజున్నవారు కాదు, సాధారణంగా ఐఫోన్లకు ఉన్న డిమాండ్ కారణంగా అమ్మకాలు మొదలైన కొద్దిసేపట్లోనే స్టాక్ ఐపోవడం సహజం. కొంతమంది కేవలం బ్లాక్ మార్కెట్లలో అమ్మడం కోసమే కొనడం చైనాలో సాధారణం. మరికొంతమంది ఇంకో అడుగు ముందుకేసి ఐఫోన్ కొనడానికి కూలీలను నియమించుకుంటారు. ఇక్కడ చూపించిన ఫోటోల్లో కూడా అలాంటి కూలీలు ఉన్నారని బ్లూమ్ బర్గ్ కథనం

    http://www.bloomberg.com/news/2012-01-12/apple-iphone-4s-beijing-debut-delayed-as-main-store-unopened.html

  2. ఆ బ్లాక్ మార్కెటింగ్ కంపెనీకి తెలియకుండా జరుగుతోందని అనుకుంటాను. ఎందుకంటే తమ కంపెనీ ఉత్పత్తులకి అంత మార్కెట్ డిమాండ్ ఉందని తెలిస్తే ధర పెంచుతారు కానీ బ్లాక్ మార్కెట్‌ని అనుమతించరు.

వ్యాఖ్యానించండి