వీధి చిత్ర కళాకారులతో రోడ్డు పైన కనిపించే ప్రతి వస్తువూ, చోటూ మాట్లాడుతుంది. ఆ మాటకొస్తే మాట్లాడలని ఉండాలే గాని రోడ్డు మీద మనకు కనపడేవన్నీ మనతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్లుగానే ఉంటాయి. వీధి చిత్ర కళాకారులు ఆ విషయాన్ని తమ దైన చిత్ర కళ ద్వారా ఆ నిజాన్ని అందంగా చెప్పిస్తారు. అంతే.
–
–
–


మొదటి చిత్రం అద్భుతం! పడిపోయి ‘చనిపోయిన’ కాంక్రీట్ దిమ్మ ను చూస్తున్న ‘సహచరుల’ ముఖకవళికల్లోని వ్యత్యాసాన్ని చిత్రించిన తీరుకు చప్పట్లు..
రెండో బొమ్మ మాత్రం..? పక్కకు వంగిపోయిన పిల్లర్ ని ఏకంగా పీసా టవర్ ని చేసేయటం ఎంత బాగుందో!
వేణు గారూ,
పడిపోయి ‘గాయపడిన’ అనుకుంటా.
అవును. మినీ పీసా టవర్. పనికిరానిదిగా మారి, ఒరిగిపోయిన ఒ చిన్న నిర్మాణాన్ని ‘పీసా టవర్’ కి నమూనా గా మార్చడం రెండో బొమ్మ గొప్పతనం. ఆ ఆర్ట్ లేకుంటే దాన్ని ఇలా ఫొటోలో బంధించి ఇంటర్నెట్ లో మనదాకా తెచ్చే అర్హత దానికి ఉండేదా? చిత్ర కారుడి గొప్పతనం అది.
ఔను, పడిపోయి ‘గాయపడింది’. ఈ వీధిచిత్రంలో ఆ రెండో సహచరుడి వికటమైన నవ్వు మాత్రం వెంటాడుతోంది!