పాకిస్ధాన్ లో ప్రభుత్వమూ, సైన్యా ల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఇరు పక్షాల విభేధాలు వివిధ రూపాల్లో రచ్చకెక్కుతున్నాయి. మరోసారి పౌర ప్రభుత్వాన్ని కట్టడి చెయ్యడానికి ఆర్మి తన చర్యలను ప్రారంభించింది. రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిని పదవినుండి తొలగించి ప్రభుత్వంతో అమీ, తుమీ కి సిద్ధపడింది.
పాక్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లను పాక్ ప్రధాని తీవ్రంగా విమర్శించడంతో సైన్యం వైపునుండి వరుస చర్యలు కనిపిస్తున్నాయి. “మిలట్రీ, ఐ.ఎస్.ఐ లను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది” అని ఆర్మీ ప్రధానిని హెచ్చరించింది. పాకిస్ధాన్ లో బుధవారం వేగంగా పరిణామాలు జరిగాయి. పాక్ ప్రభుత్వాన్ని రద్దు చేసి అధికారాన్ని తానే చేజిక్కుంచుకోవడానికి పాక్ మిలట్రీ మళ్లీ అడుగులు వేస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
జర్దారీ మెడకు చుట్టుకున్న ‘మెమో స్కాండల్’ విషయంలో ఆర్మీ అధిపతి కయానీ, ఐ.ఎస్.ఐ అధిపతి షుజా పాషాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఇవ్వడం చట్ట విరుద్ధం, చట్ట విరుద్ధం అని ప్రధాని గిలానీ ప్రకటించాడు. ఈ ప్రకటనను ఆర్మీ సీరియస్ గా పరిగణించింది. చైనా వార్తా పత్రిక ‘పీపుల్స్ డెయిలీ’ ఆన్ లైన్ విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని గిలాని వ్యాఖ్యలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయనీ మొత్తం దేశ భవిష్యత్తుపైనే ఈ పరిణామాలు ప్రభావం పడేస్తాయని ఆర్మి హెచ్చరించింది.
నాలుగేళ్ల పాక్ ప్రభుత్వం భవిష్యత్తుపై అనుమానాలు కమ్ముకుంటుండగానే రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ‘నయీమ్ ఖలీద్ లోధి’ని తన బాధ్యతలనుండి తొలగించింది. దానితో ఆర్మీ, పౌర ప్రభుత్వాల మధ్య విభేధాలు రచ్చకెక్కినట్లయింది. ఆర్మీలో కూడా కీలకమైన మార్పులు చోటు చెసుకుంటున్నాయి. రావల్పిండి లో ఉన్న 111 బ్రిగేడ్ కి ఆర్మీ కొత్త అధిపతిని నియమించింది. పాక్ లో జరిగిన సైనిక కుట్రలకు ఈ విభాగం కీలక పాత్ర పోషించడం గమనార్హం.
“తీవ్రమైన తప్పులకు పాల్పడుతున్నందున, చట్ట విరుద్ధ కార్యకలాపాలను పాల్పడుతున్నందున విధులనుండి తొలగిస్తున్నాం” అని చెబుతూ రక్షణ కార్యదర్శిని ఆర్మి తొలగించింది.
మన వాళ్ళలో పాకిస్తాన్ ద్వేషు లందరికీ పండగా :)
విశేఖర్ గారు, భారతీయుల శత్రుత్వం పాక్ ప్రజలు. ప్రభుత్వం తో నా, లేక సైన్యం తో నా ?
పాకిస్తాన్ ప్రజలతో శతృత్వం పెట్టుకుంటే ఏదీ రాదు. ఎందుకంటే నిజమైన విలన్ పాకిస్తాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ ప్రభుత్వం స్కూల్ పుస్తకాలలో హిందువుల గురించి చాలా చెత్తగా వ్రాసి పిల్లలలో మత విద్వేష భావనలని నూరిపోసింది.
ఇండియా-పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు రెండు దేశాలలోనూ మత ఘర్షణలు జరిగాయి. ఇండియాలో మత ఘర్షణలలో ఎంత మంది చనిపోయారో, పాకిస్తాన్‌లో జరిగిన మత ఘర్షణలలో కూడా అంతే మంది చనిపోయారు. ఇండియా నుంచి పాకిస్తాన్‌కి ఎంత మంది ముస్లింలు వలస వెళ్ళారో, పాకిస్తాన్ నుంచే సంతే సంఖ్యలో హిందువులు & సిక్కులు ఇండియాకి వలస వచ్చారు. వలసలు పోకుండా ఉన్నది క్రైస్తవులు & యూదులే. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం స్కూల్ పుస్తకాలలో ఇండియాలోనే హింస ఎక్కువ జరిగిందనీ, ఇండియాలోనే ఎక్కువ మంది చనిపోయారనీ వ్రాయించింది. ఇలా చిన్న పిల్లల మనసులలో మత విద్వేషపూరితమైన భావాలు చొప్పించింది.
పిల్లలకి తల్లితండ్రులు ఏ దేవుణ్ణి ప్రార్థించమంటే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు. వాళ్ళు తమ తల్లితండ్రులు విశ్వసించిన మతాన్నే విశ్వసించి పెద్దైన తరువాత కూడా తమ ఐడెంటిటీగా ఆ మతం పేరే చెప్పుకుంటారు. సామాజిక ప్రభావం వల్లో లేదా పాలక వర్గం యొక్క ప్రభావం వల్లో మతం పేరుతో ఇతర మతాలని ద్వేషిస్తారు. ఇక్కడ కేవలం వ్యక్తులని తప్పు పట్టలేము. ఇక్కడ సామాజిక పరిస్థితులనే తప్పు పట్టాల్సి వస్తుంది. అక్కడ స్కూల్ పుస్తకాల ద్వారా మత విద్వేష ప్రోపగాండా చేసేవాళ్ళు ఉన్నట్టే ఇక్కడ పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా సినిమాలు నిర్మించి పాకిస్తాన్‌ని తిట్టడమే దేశ భక్తి అని ప్రబోధించే సినిమా నిర్మాతలు ఉన్నారు. కుడి-ఎడమల తేడాలు ఉన్నా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి పరిస్థితులే ఇండియాలో కూడా ఉన్నాయి కదా.
ఈ పరిస్థితిలో పాకిస్తాన్ ప్రజలతో శతృత్వం పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. రాజకీయ ప్రయోజనాల కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో మత విద్వేషాలని రెచ్చగొట్టేవాళ్ళని మాత్రమే వ్యతిరేకించాలి.