ఢిల్లీలో రేప్ లన్నీ బంధువులు, పొరుగువారూ చేసినవే -కమిషనర్


స్త్రీలపై అత్యాచారాలు జరగకుండా ఉండడానికి స్త్రీలే వివిధ జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రపంచ వ్యాపితంగా పోలీసు పెద్దలు సుద్దులు చెబుతుండగా అందుకు భిన్నమైన వివరాలని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఢిల్లీల్లో జరిగిన మాన భంగ అత్యాచారాల్లో తొంభై ఎనిమిది శాతం దగ్గరి బంధువులో, పొరుగున నివసించేవారో చేసినవేనని ఢిల్లీ పోలీసు అధికారులు ఓ షాకింగ్ నిజాన్ని వెల్లడించారు.

2011 సంవత్సరంలో మొత్తం 568 రేప్ కేసులు నమోదు కాగా, అందులో 550 కేసుల్లో నిందితులు బాధితులకి తెలిసినవారేనని ఢిల్లీ పొలీస్ కమిషనర్ బి.కె.గుప్తా వెల్లడించాడు. “కనుక ఇవి అవకాశం చూసుకుని ప్రవేటు స్ధలాల్లో జరిగిన అత్యాచారాలేనని ధృవపడుతోంది” అని గుప్తా వెల్లడించాడు. 2010 లో జరిగిన అత్యాచారాల్లో నాలుగు శాతం మాత్రమే బాధితులకు అపరిచితులుగా ఉన్నవారు నిందితులుగా తేలగా గత సంవత్సరం కేవలం రెండు శాతం మాత్రమే అపరిచితులు చేసినవని గుప్తా తెలిపాడు.

వార్షిక ఢిల్లీ పొలీస్ ప్రెస్ మీట్ లో ప్రసంగిస్తూ బి.కె.గుప్తా ఈ సంగతిని వెల్లడించాడు. ఈ వెల్లడితో అత్యాచారాలకు స్త్రీలనే బాధితులుగా చేసేవారి నోళ్లు మూతపడాలి. ఇటీవలనే కొన్ని రోజుల క్రితం స్త్రీలు, యువతులు ధరించే సల్వార్ కమీజ్ దుస్తుల ధారణపైన ప్రతికూల వ్యాఖ్యాలను చేసి రాష్ట్ర డిజిపి పెద్ద దుమారం లేపాడు. పల్లెల్లో కూడా యువతులు స్త్రీలు సల్వార్ కమీజ్ ధరిస్తున్నారని వ్యాఖ్యానించి డిజిపి తన దృష్టి లోపాన్ని చాటుకున్నాడు.

గత సంవత్సరం కెనడా కి చెందిన పోలీసు ఉన్నతాధికారి ‘స్త్రీలు స్లట్ ల లాగా దుస్తులు ధరించడం మానాలనీ, తద్వారా వారిపై అత్యాచారాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ’ సలహా ఇచ్చి ప్రపంచ వ్యాపితంగా ‘స్లట్ వాక్’ ప్రదర్శనలు జరగడానికి కారణభూతుడయ్యాడు. అత్యాచారం చేసే వాడి నేర ప్రవృత్తిని చూడడం మానేసి, ఎలాగైనా కోరిక తీర్చుకోవాలన్న కాముక దృష్టిని వదిలిపెట్టి స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకి తిరిగి వారినే బాధ్యులను చేయబూనుకోవడం పుండు మీద కారం చల్లడమే. అనాలనుకున్నది అనేసి, మనసులో ఉన్నదాన్ని వెల్లడించి అన్నదానిలో తప్పును నిజాయితీగా గుర్తించకుండాఅ ‘నా ఉద్దేశ్యం అది కాదు’ అని సవరణ ప్రకటనలు చేయడం పోలీసు అధికారుల కు ఉన్న అవకాశం.

గుప్తా గారు చేసిన విశ్లేషణ ఈ సందర్భంగా ప్రత్యేకంగా గమనించదగ్గది. “అవకాశాలు చూసుకుని ప్రయివేట్ స్ధలాల్లో జరుగుతున్న నేరాలివి అని ధృవపడుతోంది’ అని ఆయన చెప్పాడు. వస్త్ర ధారణ చూసి రెచ్చిపోయినవారు రేప్ చేయదలుచుకుంటే ఆ నేరం అక్కడికక్కడే జరగాలి. కెనడా, ఎ.పి పోలీసు అధికారుల అభిప్రాయం ప్రకారం ఈ రోజు నిక్కర్లు వేసిన పాపను చూసిన కాముకుడు రెచ్చిపోతాడు. ఆ పాప తన, లేదా వీలయిన ప్రవేటు స్ధలాల్లో దొరికేదాకా వేచి చూసి అత్యాచారానికి పాల్పడతారని ఢిల్లీ అధికారి నిర్ధారణ. ఈ రెండూ ఒకదానికొకటి పొంతనలేనివి. ఒకటే నిజం కావాలి తప్ప రెండూ నిజం కావు. ఢిల్లీ అధికారి నిర్ధారించినది ఎంత నిజమో ఆయన గణాంకాలే చెబుతున్నాయి.

ఢిల్లీలో స్త్రీలపై అత్యాచారాలని నివారించడానికి మరిన్ని స్త్రీ పోలీసు అధికారులను నియమించనున్నట్లుగా గుప్తా తెలిపాడు. ఫిర్యాదు స్వీకరించడానికి స్త్రీలనే నియమించనున్నట్లుగా ఆయన తెలిపాడు. ఇది కొంత నయమే అయినా ఢిల్లీని స్త్రీలకు భద్రమైన నగరంగా మార్చాలంటే ‘వస్త్ర ధారణ’ పై సంకుచిత అభిప్రాయాలున్న పోలీసుల దృక్కోణాలను కూడా మార్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. స్త్రీలంతా ఇలాంటి సంకుచిత దృక్కోణాలకు దూరంగా ఉంటారన్న గ్యారంటీ ఏమీ లేదు. నేరాలపై అవగాహన, నేర స్ధలాలపై సరైన విశ్లెషణ, గణాంకాలు, వివరాల ద్వారా నేర కారణాలను విశ్లేషించుకోగల శక్తి ఉన్నవారు బాధ్యతలకు ఇవ్వాలి. ఈ అంశాలపైన ప్రత్యేక శిక్షణ కూడా పోలీసులకు ఇవ్వాలి.

స్త్రీ కేంద్రక (వుమెన్ సెంట్రిక్) పోలీసు స్టేషన్లను ఢిల్లీ యూనివర్సిటీలో రెండు ఏర్పాటు చేశామనీ, ఢిల్లీ లొని ఐదు జిల్లాల్లో స్త్రీలను డి.సి.పి లుగా నియమించామని గుప్తా తెలిపాడు.  గత సంవత్సరం 460 స్త్రీ కానిస్టేబుల్స్ కి కమేండో శిక్షణ ఇప్పించామని ఆయన తెలిపాడు. పాతిక మందికి సి.ఆర్.పి.ఎఫ్ చేత ఆధునిక శిక్షణ ఇప్పించామని ఆయన తెలిపాడు. బి.పి.ఓ (బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్) ఆఫీసుల వద్దా, ఇతర ఆఫీసుల వద్దా స్త్రీల రక్షణ కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామనీ ఒంటరిగా ఉన్న మహిళలనూ, అనుకోని పరిస్ధితుల్లో చిక్కుకుపోయిన మహిళలనూ ఆదుకొని సాయం చెయడానికి బస్ స్టాపులు, బస్సులు, మార్కెట్లు, సినిమా హాళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపాడు.

తమను తాము రక్షించుకోవడానికి స్త్రీలకు, విద్యార్ధినిలకూ స్వయం రక్షణ పద్ధతులు నేర్పిస్తున్నామనీ గత సంవత్సరం 6730 విద్యార్ధినులకు నేర్పామనీ గుప్తా తెలిపాడు. ఈ చర్యలన్నింటినీ రికార్డుల కోసం కాకుండా చిత్త శుద్ధితో నేరాల నివారణ జరగాలన్న దృక్పధంతో చేసినట్లయితే ఫలితాలు ఇవ్వక మానవు.

8 thoughts on “ఢిల్లీలో రేప్ లన్నీ బంధువులు, పొరుగువారూ చేసినవే -కమిషనర్

  1. I dont understand how you are intrespeting Gupta’s statement refutes the DGP Dinesh reddi’s statement.
    In fact relatives and the neigbhour’s will get more closer looks at the ladies and get more provacated!
    Results are the acts.
    Instead of dressing in a proper manner, its foolish for women to say, “its our body we will strip”.

  2. మీరు చెప్పిన దాన్ని బట్టి చుస్తే,

    మన సినిమాలకు సెన్సార్ గట్రా అవసరం అసలు ఉండకూడదు. జనం వాటిని చూసి ప్రభావం కారు అనే కదా మీరు చెపుతున్నది.

  3. బంధువులు రేప్ చేసినప్పుడు (incestuous rape జరిగినప్పుడు) కుటుంబ గౌరవం కోసం విషయం దాచిపెట్టడానికి ప్రయత్నించేవాళ్ళు ఉన్నారు. దీన్ని బంధువులు అవకాశంగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

  4. Please note I am not supporting the barbaric acts of the men who are doing the atrocities.
    I support death penalty for a rape. Eve-reasers shall be given a minimum of 1 year imprisonment.
    At the same time there shall be some sense of self imposed dresscode for women.

  5. బూతు సినిమాలు చూసి రెచ్చిపోయి రేప్‌లు చేసేవాళ్ళు కొంత మంది ఉండొచ్చు. నిజమే కానీ మన ఆంధ్రా డిజిపి అన్నది దాని గురించి కాదు. అతను సల్వార్-కమీజ్ కూడా అశ్లీల దుస్తులేనని అన్నాడు.

  6. ఇంతకుముందు జగదీశ్ గారి బ్లాగ్‌లో గురువులు శిష్యురాళ్ళని రేప్ చెయ్యడం గురించి చర్చ జరిగింది.

    ఒక అజ్ఞాత మనిషి ప్రాథమికంగా జంతువే కనుక గురువు శిష్యురాలిని రేప్ చెయ్యడం విచిత్రం కాదు అని వాదించాడు.

    (అయితే) జంతువు అడవిలో ఉన్నా, ఊరిలో ఉన్నా దాని బిహేవియర్‌లో తేడా ఏమీ ఉండదు. కానీ మనిషి అలా కాదు కదా. మనిషి పది మంది చూస్తున్నప్పుడు ఒకలాగ, పది మంది చూడనప్పుడు ఇంకోలాగ బిహేవ్ (చెయ్యగల తెలివి ఉంటుంది) చేస్తాడు.

    ఎవరూ లేని సమయం చూసి తమ బంధువుల స్త్రీని రేప్ చేసేవాళ్ళని చూస్తే ఈ విషయం అర్థం చేసుకోవచ్చునేమో.

వ్యాఖ్యానించండి