రెండు యుద్ధాల మధ్య విరామమే ‘శాంతి’ అని కారల్ మార్క్స్ మహాశయుడు చెప్పాడు. ఆధునిక మానవ జాతి సాగించిన యుద్ధాల చరిత్ర దానిని నిర్ద్వంద్వంగా రుజువు చేసింది.
యుద్ధాలని నివారించడానికే డిప్లొమసీ అని చెప్పే పాఠాల సంగతి ఎలా ఉన్నా, ‘డిప్లొమసీ’ అనాదిగా నమ్ముకున్నది మాత్రం ‘ఆయుధాలనే’నని ఈ కార్టూనిస్టు చెబుతున్నారు. ఆయుధాలను నమ్ముకున్న ‘డిప్లొమసీ’ సృష్టించేది యుద్ధాలనే కదా!
–

రెండు యుద్ధాల మధ్య కాలంలో శాంతి అనేది తప్పకుండా ఉంటుంది. ఆ మాత్రం శాంతి లేకపోతే పాలక వర్గంవాళ్ళు తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయా అనే భయంతో ఘడియారం దిక్కు చూస్తూ సమయం లెక్కపెట్టుకోవాల్సి వస్తుంది.
మొన్నటి ఇరాక్ యుద్ధంలో అమెరికాకి డబ్బులు బాగా ఖర్చై కొంత మంది అమెరికన్ పాలక వర్గంవాళ్ళే యుద్ధాన్ని వ్యతిరేకించడం జరిగింది.
ఏ యుద్ధమైనా శాంతిని సృష్టిస్తుంది కానీ ఆ శాంతి పాలక వర్గాలకి తమ ప్రాణాలు పోతాయనే భయం లేకుండా విశ్వాసం కలిగించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతే కానీ ఆ శాంతి యుద్ధాలని శాశ్వతంగా నివారించదు. అందుకే “Capitalism breeds war” అని కార్ల్ మార్క్స్ మహాశయుడు అన్నాడు.
ప్రవీణ్ మీరు చెప్పింది నిజం.
వేరే టపా (మీరు మారాలి) కింద మీనుండి రిప్లై కొసం క్రిష్ణవేణిగారు చూస్తున్నారు. మీరు చూశారా లేదా? ఆవిడకి సమాధానం ఇవ్వండి. ఆమెతో ఒకటో రెండో చర్చలు చేసి అర్ధంతరంగా ఆపేశారని ఆమె అడుగుతున్నారు ప్రవీణ్.