ఇందుకే ప్రవీణ్ కి నా మద్దతు


అంతిమంగా ప్రవీణ్ అమాయకత్వంపైన నేను చెప్పేది ఏమంటే:

అతను పూర్తిగా అమాయకుడా, కాదా అన్నది నేను తేల్చలేను. నేను, ప్రవీణ్, మా ఇద్దరి భావజాలం, గ్యాంగ్ ప్రచారంఈ అంశాల పరిధికి సంబంధించి ప్రవీణ్ కొన్నిసార్లు అమాయకంగా రాశాడు. అవి గ్యాంగ్ కి మేతలయ్యాయి. ఈ నిర్ధిష్ట పరిధిలో ప్రవీణ్ ప్రవర్తనలో తప్పు పట్టడానికి నేను ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను. కారణం అతను ఏళ్లపాటు జరిగిన వ్యతిరేక ప్రచారంలో బాధితుడు. ఆ ప్రచారం నా పైనా జరిగింది కనుక ఆ విషయం లోతుపాతులు నాకు అర్ధం అవుతాయి. అందుకే అతనికి మద్దతు ఇస్తున్నా.

ఇతర బ్లాగుల్లో ప్రవీణ్ కొన్నిసార్లు సంబంధం లేకుండా రాస్తున్నట్లు చాలామందికి కనిపిస్తోంది. నాకూ అనిపిస్తోంది. కాని ప్రవీణ్ వైపు నుండి చూసినపుడు ఏదో ఒక సంబంధం లేకుండా ఒక వ్యాఖ్యని రాయలేడు. అది అసంభవం. కాకుంటే అది సంబంధం ఉన్నదే అని ఆ వ్యాఖ్య ద్వారా నేరుగా చెప్పగలగడంలో అతని వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎలా సంబంధం ఉన్నదో అతను వివరిస్తే తప్ప సంబంధం కనిపెట్టలేని పరిస్ధితి నాకూ ఎదురవుతోంది.

కాని నేను సాధారణంగా భావించేది ఏమంటే, ఏ వ్యక్తి అయినా సంబంధం చూడకుండా ఒక వ్యాఖ్యని చేయలేడు. దీనిని ప్రవీణ్ కి అప్లై చేస్తే, వివిధ అంశాలపైన అతనికి ఉన్న అవగాహన ఇతరులకి లేకపోవచ్చు, నాక్కూడా. అలాంటి సమయంలోనే సంబంధం లేదని ఇతరులకి అనిపిస్తుంది. కనుక ప్రవీణ్, ఆ సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చెయ్యాల్సిన అవసరం అదనంగా ఏర్పడుతోంది.

ఈ అంశాన్ని ఎన్నిసార్లు చెప్పినా ప్రవీణ్ అర్ధం చేసుకున్నట్లు నాకు కనిపించలేదు. దీనికి అమాయకత్వం కారణం కావచ్చు. తుంటరితనం కారణం కావచ్చు. నేను ప్రధానంగా అమాయకత్వం వైపే మొగ్గుతున్నా. తుంటరితనాన్ని పూర్తిగా నిరాకరించలేను. దానికి సంబంధించిన అనుభవం నాకు వస్తే తప్ప తుంటరితనం ఉందా లేదా అన్నది నేను చెప్పలేను. ఇతరుల అనుభవాల పైన ఆధారపడి ప్రవీణ్ పైన నేనేమీ చెప్పలేను. అది సరికాదు. చెప్పినా అయి ఉండవచ్చుఅని మాత్రమే అనగలను.

పావని గారు లాంటి వారి అనుభవాలు ప్రవీణ్ పైన నాకున్న అవగానను ప్రశ్నిస్తున్నాయి. అయితే అది సంపూర్ణం కాదు. ప్రవీణ్ భావజాలం గురించి నాకు తెలిసిన స్ధాయిలో పావని గారి లాంటివారు ఎదుర్కొన్న అనుభవాలు నేను చూడలేదు. చూస్తే నేను తప్పని సరిగా ప్రవీణ్ ని ప్రశ్నిస్తాను.ఆ ప్రశ్నలకు ప్రవీణ్ ఇచ్చే సమాధానాన్ని బట్టి తనపైన ఓ అభిప్రాయానికి వచ్చే వీలుంది. ఈ లోగా ఓ అభిప్రాయానికి  రాలేను.

ఈ పరిధులు, అనుభావలన్నింటితో సంబంధం లేని సార్వజనీన అంశం ఒకటుంది. అది సామాజికంగా స్త్రీలపై జరుగుతున్న అణవిచివేత. ప్రవీణ్ ఈ అంశాన్ని అంగీకరిస్తారు. ఎట్టి పరిస్ధితుల్లోనైనా ఒక స్త్రీని ఆమెకు సంబంధం లేని విషయంలో ఆమెను నేరుగ సంబోధించి తిట్టడం సరికాదు. ప్రవీణ్ ఈ పని చేశానని స్వయంగా చెప్పాడు. దానికి కారణం చెప్పాడు. కారణం చెప్పినప్పటికీ దానితో సంబంధం లేకుండానే అటువంటి అంశాలపైన ఒక నిశ్చిత అవగాహన ఉన్నవాడిగా అతను అలా తిట్టడం తప్పు అనే చెప్పదలిచాను.  అందువల్లే ఆ వ్యాఖ్యలని అతను ఉపసంహరించుకోవాలని గట్టిగా కోరుతున్నా, మళ్ళీ. లేనట్లయితే ప్రవీణ్ నమ్మిన భావజాలంపై అతనికి గౌరవం ఉన్నదా లేదా అన్న అంశంపై నాకు అనుమానం తలెత్తుతుంది.

ఎలా మొదలైంది?

ఒకరి తల్లి గారిని తిట్టడం సరికాదు అని చెప్పే విషయంలో ఎవరికైనా నా మద్దతుఉంది. కాని ఇదంతా ఎలా మొదలైందీ అన్న విషయంలో మలక్ పేట రౌడీ ఇచ్చిన సమాచారం, ప్రవీణ్ ఇచ్చిన సమాచారంతో సరిపోలింది. అది చూశాను. అందులో నిర్ద్వంద్వంగా రుజువైనఅంశం ఏమిటంటే: ప్రవీణ్ పైన, అతని భావజాలంపైన దాడి జరిగాకే అతను స్పందించాడు. ఐ రిపీట్. ఇన్నయ్యగారి బ్లాగ్ పోస్టే ప్రారంభం అని మలక్ పేట్ రౌడీ చెబుతున్నది కరెక్టే ఐతే, ప్రవీణ్ పైన, అతని భావాజాలం పైనా దాడి జరిగాకే ప్రవీణ్ స్పందన మొదలైందని నేను చెప్పినది ఆ పోస్టు రుజువుచేస్తోంది.

ఒరేయ్అని ఒక పేరుతో ప్రారంభించి నీ లాంటి మెంటల్ కేసుఅని రౌడీగారి పేరుతో ఎద్దేవా ఎందుకు చేసారు? ఏ హక్కుతో చేస్తారు? ఏ మర్యాదతోచేస్తారు? ఏ సభ్యతతో చేస్తారు? ఏ విలువపై ఆధారపడి చేస్తారు? ఇలాంటి అమానవీయమైన స్పందనకు కారణం ఏమిటి? ప్రవీణ్ చేసిన ఈ వ్యాఖ్య.

రాం దేవ్ ఒక యోగి అనుకుంటే హాస్యాస్పదమే. నాన్ వెజ్ ఎముకలపొడితో వెజిటేరియన్ ఆయుర్వేద మందులు తయారు చేసి జనానికి పంగనామాలు పెట్టేదొంగ యోగి

ఇందులో ప్రవీణ్ భావజాలం ఉంది. నాన్ వెజ్ ఎముకల పొడితో వెజ్ మందులు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు రాందేవ్ పైన ఉన్నాయి. ఆ ఆరోపణలని ప్రవీణ్ సొంతంచేసుకుని ప్రస్తావించాడు. రాందేవ్ పై ఆరోపణలు నచ్చకపోతే ఆరోపణలకు ఆధారాలు అడగాలి. నిజానికి అడిగారు కూడా. కానీ అప్పటికే అవమానం జరిగిపోయింది. రాందేవ్ పబ్లిక్ వ్యక్తి. వైద్య శాస్త్రానికి పరిచయం లేని కొన్ని వైద్య ప్రక్రియలను ఆయన ప్రతిపాదిస్తున్నాడు. దానికి సంబంధించి ఆయనకీ, ఐ.ఏం.కి మధ్య ఆరోగ్యకరమైన చర్చ జరిగినట్లు పై పోస్టులో నే వ్యాఖ్యల్లో ప్రచురించబడిన ఆర్టికల్ ద్వారా తెలుస్తోంది.

రాండేవ్ పై ఆరోపణలు  ప్రస్తావిస్తే ఒరేయ్అంటారా? ‘మెంటల్అంటారా? అప్పటివరకూ ప్రవీణ్ కీ వీరికీ పరిచయం ఉందో లేదోతెలియదు. ఇక్కడి నుండే గొడవ మొదలైందని అంటున్నారు గనక పరిచయం లేదనే అనుకుంటున్నా. పరిచయం లేకుండా ఒక వ్యక్తి పైన, ఒక భావం వ్యక్తం చేసినందుకు ఇలా తూలనాడతారా? ఎదురుగా లేరని ఇష్టం వచ్చినట్లు తిడతారా? అపరిచయస్ధుల మధ్య ఇలాంటి మాటలు పదే పదే దొర్లాల్సిన అవసరం లేదు. ఒక్కసారి. ఒక్కసారి దొర్లితే చాలు అటువంటు వ్యక్తులు ఎంత కుసంస్కారులో చెప్పడానికి.

సరిగ్గా ఇదే విధంగా నా పైన, కొన్ని భావాలు వ్యక్తం చేసినందుకు, దాడి ప్రారంభమైంది. పద్ధతి కాదని మర్యాదగా చెప్పాను. తమరు ఓపిగ్గా చెబితే వదిలేస్తామనుకుంటున్నావా? అమాయకుల్ని చేసి మోసం చేద్దామనుకుంటున్నావా?” న్నారు. నన్ను రెచ్చ గొట్టి రొంపి లోకి లాగుతున్నారని అర్ధమైంది. అపుడు ఏం చేయాలి. నోర్మూసుకుని ఊరుకోవాలా? ఊరుకున్నాను. ఆ వ్యాఖ్య తొలగించాను. ఆశ్చర్యంగా ఆ వ్యాఖ్య మాలికలొ ప్రత్యక్షమైంది. “నా వ్యాఖ్య తొలగిస్తాడని అనుమానంగా ఉంది. అందుకే ఇక్కడ కూడా ప్రచురిస్తున్నా”అని పరిచయం చేసి మరీ ప్రచురించాడు. దాని ద్వారా మాలిక నిర్వాహకుల్లో ఇతనొకరనినా కర్ధం అయింది.

ఇంత ఘోరమా? అగ్రిగేటర్ అని ప్రకటించి మీ యు.ఆర్.ఎల్ ఇవ్వండి అని కోరి తీసుకుంటారు. తీరా తమకు నచ్చని భావాలు వ్యక్తం చేస్తే, దూషిస్తారా? అగ్రిగేటర్ వేదికగా విష ప్రచారం చేస్తారా? వ్యక్తిత్వంలో ఎంత వంకర ఉంటే ఇలా చేస్తారు? ఐనా ఊరుకున్నాను. రెచ్చగొట్టే ప్రయత్నం విఫలం కావడంతో దూషణల బ్లాగ్ మొదలైంది. నాకొక నిక్ నేమ్ వాళ్ళే పెట్టి, పేరుతో నన్ను నేనే తిట్టుకున్నట్లు రాసి, ఆ తిట్లకి స్పందనగా మరిన్ని పేర్లతో మరిన్ని తిట్లు తిట్టి, ఎందుకిందంతా చేస్తున్నారని అడిగితే “నీ భావజాలం మానుకో” అని బెదిరించి…. ఎవరండీ వీళ్ళు? వీళ్ల విషయంలో మర్యాదలు, పద్ధతులు వల్లిస్తే నేను వినను గాక వినను.

ఇన్నయ్య గారి బ్లాగ్ లో ప్రవీణ్ ఖర్మ, మెంటల్, ఇంకా ఇలాంటి పేర్లతో నానా ఛండాలం ఉంది. ఇవన్నీ ప్రవీణ్ కే ఆపాదించడం, దానికి మళ్ళీ ఛండాలపు ప్రతిస్పందనలు ఇంకొన్ని. ఈ గబ్బు ని ఎవరు భరించేది? ఆత్మ గౌరవం ఉన్న ఏ వ్యక్తీ భరించడు.

ప్రవీణ్ పైన దాడి మొదలైనప్పుడే అది సరికాదు అని చెప్పినట్లయితే, అడ్డు వచ్చినట్లయితే ఇంత జరగకపోను. భవిష్యత్తులో ప్రవీణ్ రెచ్చి పోవడానికీ, ఆగ్రవేశాలు బైటికి రావడానికి అక్కడే అడుగులు పడ్డాయి. ఈ అడుగులను ప్రశ్నించకుండా, ఈ చండాలం కొనసాగుతున్న క్రమంలో జరిగిన ఒకానొక తప్పును మాత్రమే సవరించుకోవాలని అడిగితే అలా అడుగుతున్నవారికి నిజాయితీ ఉన్నట్లా? ఆ తప్పు జరగడానికి దారి తీసిన పరిస్ధితులను వదిలేసి ఒక్క మాటతో ప్రవీణ్ ని రాక్షసీకరించడానికి జరుగున్న ప్రయత్నాలను నేను సంపూర్ణ మనస్సుతో ఆమోదించలేను. అక్కడే ప్రవీణ్ కి నా మద్దతు. మనసు గాయపడడానికి ఒక క్షణం చాలదా? ఒక వ్యాఖ్య చాలదా? ఒక తిట్టు చాలదా? ఒక వెటకారం చాలదా? ఎన్ని సంవత్సరాలుకావాలని? ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారైనా ప్రవీణ్ పైన సానుభూతి వ్యక్తం అయిందో నాకు తెలియదు కాని, వ్యక్తం కాలేదని ప్రవీణ్ చెబుతున్నాడు. అందుకే అతనితో నా సానుభూతి. ప్రవీణ్ చేస్తున్న వ్యాఖ్యలతో సంబంధం లేకుండా అతని పైన భావజాలం పరంగా జరుగున్న దాడిని నేను విస్మరించలేను.

ఒక వ్యక్తిపైన దాడి కాదిది, ఒక భావజాలంపై దాడి

ప్రవీణ్ పై జరిగిన దాడి కేవలం వ్యక్తిగతమైనది కాదు. ఒక భావజాలం వ్యక్తం చేస్తున్నందుకే అతనిపై దాడి జరిగింది. అదే భావజాలం వ్యక్తం చేసినందుకు నా పైన దాడి జరిగింది. ఫలానా భావాజాలం అని చెప్పి మరీ దాడి చేశారు. శరీరానికి తగిలే గాయాలు కావివి. ఏళ్లతరబడి సంపాదించిన అనుభవంతో, ఏళ్ళతరబడి చేసిన అధ్యయనంతో సంపాదించిన ఒక భావజాలాన్ని గాఢంగా నమ్మినందుకు జరిగిన దాడులివి. ఒక భావజాలాన్ని నమ్మినపుడు దానిని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకే ప్రవీణ్ కి నా మద్దతు. తాము నమ్మిన భావజాలాన్ని ఎవరైనా విమర్శిస్తే ఏం చేయాలి? విమర్శలని ఆహ్వానీంచాలి. చర్చించాలి. జ్ఞానానికి, అనుభవానికి పదును పెట్టి వివరించే ప్రయత్నం చేయాలి. చర్చ క్రమంలో తప్పు ఒప్పుల్ని నిస్పక్షపాతంగా చర్చించాలి. తద్వారా మాత్రమే తమ భావజాలం పైన ఇతరులకి కూడా నమ్మకం కాకపోయినా కనీసం గౌరవం కలుగుతుంది. అది మరిచి తమ భావజాలం విమర్శకు గురి కావడమే ఘోరంగా భావించి వెటకారం, ఎద్దేవా, తిట్లు, వెంటపడడం, ఇవన్నీ జరిగిన ఫలితమే ఇప్పటి ప్రవీణ్ దూషణలు. దూషణలకు నా మద్దతు లేకపోయినా, అతను ఎదుర్కొన పరిస్ధితికి నా సానుభూతి ఉంటుంది.

భావజాలంపై రాజీ అసాధ్యం

ఫలానా పేర్లు ప్రవీణ్ కి ఆపాదించింది ఫలానా వారే అని ప్రవీణ్ ఎలాచెప్పగలరో నాకు తెలియదు. ఫలనా వారు కాదేమో అని చెప్పడానికంటె ముందు ఆ దాడి ఎందుకు చేశారు అని ప్రశ్నించడానికే నాకు ఆసక్తి ఎక్కువ. నేను నమ్మిన భావజాలం ప్రవీణ్ పైన దాడి ప్రతిదాడుల రూపంలో అవమానానికి,అవహేళనకూ గురైన పరిస్ధితివస్తే నేను సహించను. ప్రవీణ్ కొన్ని తప్పులు చేసినా నేను సంపాదించిన జ్ఞాన ఫలితాన్ని కాపాడుకోవడానికి కొన్ని మినయాయింపులతోనైనా ప్రవీణ్ లాంటివారికినేను మద్దతు ఇస్తా. చర్చలకే నా మొదటి ప్రాధాన్యత. అది కోరుకోని వారికే వారిప్రాధాన్యతలను బట్టే నా ప్రాధాన్యత మార్చుకోవలసిన అవసరం రావచ్చు. దానికికారణం నా భావజాలం విషయంలో నేను రాజీ పడకపోవడమే.

నేను నమ్మిన సామాజిక సిద్ధాంతం మానవాళి విముక్తి చెందడానికీ, సమస్త దోపిడీలు అంతం కావడానికి మార్గంగా నేను నమ్ముతున్నపుడు దానిని సమర్ధించడంకోసం ప్రవీణ్ లాంటి వారి అమాయకత్వాన్ని, తుంటరితనాన్నీ తాత్కాలికంగా భరించడానికి నేను సిద్ధం. పావని లాంటి వారికి గలిగిన గౌరవ భంగం కంటే మానవాళిని కాపాడగలదని నమ్మే నా సిద్ధాంతమే నాకు ముఖ్యం. ఆ విషయాన్ని పావనిలాంటి వారు కూడా అర్ధం చేసుకోగలరని నా నమ్మిక.

ఈ భావజాలం కలిగి ఉన్న ప్రవీణ్ కి అందుకే నా మద్దతు కొనసాగుతుంది. ఇప్పుడు దూషణలు, భూషణల రూపంలో వ్యక్తమవుతున్న ఘర్షణకు పునాది ఆ భావజాలం కలిగి ఉండడం. ఆ భావజాలంపై వ్యతిరేకతతోనే ప్రవీణ్ పైన దాడి మొదలయ్యింది. భావజాలం కలిగి ఉండడమే ఒక పాజిటివ్ పాయింట్ గా నేను చూస్తాను. ఎందుకంటేదానిని కలిగి ఉండడానికి అనేక ఆటంకాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ భావజాలం కలిగి ఉండడం ఇపుడు లగ్జరీ యేమీ కాదు. అందుకే అది అత్యంత పాజిటివ్ లక్షణం. ఆ తర్వాతమాత్రమే ప్రవీణ్ లోపాలు చూస్తాను. ప్రవీణ్ లోపాల కంటే అతని భావజాలం నాకుముఖ్యం. అతని లోపాలు ఇప్పుడు కాకుంటే రేపైనా అతను సవరించుకుంటారు. లోపాల సవరణ జీవిత పర్యంతం కొనసాగే ప్రక్రియ. దానికోసం నేను తొందర పడను.

ప్రవీణ్ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులు చేస్తున్నాడు. తప్పులు చేయనిదేవరు? నేనూ అందులో ఒకర్ని. ఎవరూ వందశాతం పవిత్రులు కారు. ఈ దృష్ట్యానే ప్రవీణ్ కి లోపాలున్నా అతనికి నా మద్దతు. ప్రవీణ్ కినేనిస్తున్న మద్దతు వ్యక్తిగతం కాదు. సామాజికం. సామాజిక ప్రయోజనాలను ఒక సిద్ధాంతం కాపాడుతుందన్న ఉమ్మడి తనం. అందుకే ప్రవీణ్ కి నా మద్దతు.

23 thoughts on “ఇందుకే ప్రవీణ్ కి నా మద్దతు

  1. అగ్రిగేటర్ అని ప్రకటించి ‘మీ యు.ఆర్.ఎల్ ఇవ్వండి’ అని కోరితీసుకుంటారు.
    _________________________________________________

    LOL Did we ask you for your URL or did you send your request to us first?

    In any case, if you are not interested – send us a mail and we will take your blog off the aggregator.

    About Innaiah’s blog:

    Dont try to find the escape route out. We said the filth started there not the original issue. He himself addressed other bloggers the same way. In any case, the bloggers have realized what is what.

    The bottom line is, if you are not interested – send a request, we will take your blog off. Got it?

  2. అహా. శుభ్రం. ఇదే నా ఈ మెయిల్ గా స్వీకరించి నా బ్లాగ్ నూ మీ అగ్రిగేటర్ నుండి తొలగించండి. నా నెత్తిన పాలే పోసారు.

    అవును. నేను రిక్వెస్ట్ చేయకుండా నా బ్లాగ్ ఒకటుందని మీకు తెలియదు. అగ్రిగేటర్ మాది. మీ తెలుగు బ్లాగ్ ఇవ్వండి అన్న ప్రకటన చూసి గంతేసి ఇచ్చాను. అప్పుడు తెలియదు, ఇలా బ్లాగ్ లు అడిగి తీసుకుని బ్లాగర్లపైన వ్యతిరేక ప్రచారం చేస్తారని.

    నా ఈ కోరిక ఇంతకు ముందే వ్యక్తం చేసినా ఈ స్పందన రాలేదు. ఇప్పుడైనా స్పందించారు సంతోషం.

    ఈ అగ్రిగేటర్ వ్యవహారానికి సంబంధీంచి ఇంకా రాసాను. ఆ అంశాలకు ఎందుకో మౌనం.

  3. అగ్రిగేటర్ మాది. మీ తెలుగు బ్లాగ్ ఇవ్వండి అన్న ప్రకటన చూసి గంతేసి ఇచ్చాను.
    _____________________________________________________

    Then why are you lying that we asked you the URL?

    అప్పుడు తెలియదు, ఇలా బ్లాగ్ లు అడిగి తీసుకుని బ్లాగర్లపైన వ్యతిరేక ప్రచారం చేస్తారని.
    __________________________________________________________

    తమరి బ్లాగుని ఇవ్వమని ఎవడూ తమని రిక్వెస్ట్ చెయ్యలేదు. It was you who started abusing Maalika before I responded. Check the mail you sent to Praveen about Maalika. Nobody spoke about you until then.
    Newayz your blog is out. Good riddance to bad rubbish :)

  4. నా ఈ కోరిక ఇంతకు ముందే వ్యక్తం చేసినా ఈ స్పందన రాలేదు.
    ________________________________________

    The only mail we have from you was about the request to add the blog. We never got any request to delete it.

    Here is the only email that you sent us:

    From: viji francis
    Date: 16 April 2011 16:54:45 GMT+01:00
    To:
    Subject: My blog

    Hi you are doing a good job.

    My blog: https://teluguvartalu.wordpress.com/

    Vijay S Nutakki
    nuvise@live.in, nvijays@hotmail.com
    vsnutakki@yahoo.com, vsnutakki@gmail.com
    Contact Me
    nvs’ Blog RALLY IN COMMODITES

  5. ఈ అగ్రిగేటర్ వ్యవహారానికి సంబంధీంచి ఇంకా రాసాను. ఆ అంశాలకు ఎందుకో మౌనం.
    _______________________________________________________

    Because all those questions raised by you crybabies have already been answered. Do you want me to answer them again?

  6. రౌడీ గారూ,

    మీ తెలుగు బ్లాగు (Telugu blogspot blog, Telugu wordpress blog or any other Telugu blogs), లేదా మీకు నచ్చిన ఇంకేదైనా తెలుగు బ్లాగును/బ్లాగులను ఇక్కడ చూడాలి అనుకుంటే ఆ బ్లాగు వివరాలు admin {@} maalika.org కు ఈ-మేయిల్ ద్వారా పంపండి.
    ——————————————————————————————————

    మాలిక అగ్రిగేటర్ లో ‘మీ బ్లాగ్ ని చేర్చండి’ అన్న ట్యాబ్ కింద మీరిచ్చిన ప్రకటన ఇది. ఇది బహిరంగ ప్రకటన. ఆ ప్రకటన చూసే నేనిచ్చాను. ఇందులో నేను చెప్పిన అబద్ధం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు. మీ బ్లాగ్ కి వచ్చి ప్రకటన ఇచ్చామా అని అడగదలుచుకున్నారా? బహిరంగ ప్రకటన అన్ని చోట్లకూ వర్తిస్తుంది. బ్లాగులకే రానవసరం లేదు.

    :అగ్రిగేటర్ అని ప్రకటించి ‘మీ యు.ఆర్.ఎల్ ఇవ్వండి’ అని కోరితీసుకుంటారు: అని నే రాసాను.

    కోరి అంటే ప్రకటన ఇచ్చి తీసుకోవడమే అని అర్ధం. ప్రతి అంశమూ, ప్రతి అక్షరమూ, పదమూ, వాక్యమూ తూచి రాయడం సాధ్యం కాదు. అప్పటికే అటువంటి సందర్భాల్లో ఉన్న అవగాహన అటు ఇటుగా ఏ పదం రాసినా చెలామణి అవుతుంది. ఆ విధంగా పై పద ప్రయోగం తీసుకోవాలి.

    “బ్లాగ్ యు.ఆర్.ఎల్ అడిగి” అని నేనంటే దానర్ధం నా ఇంటికి వచ్చేరని అర్ధం కాదు. అలా బ్లాగ్స్ కి వచ్చి మీ యు.ఆర్.ఎల్ ఇవ్వండి ఏ అగ్రిగేటరూ నన్ను అడగలేదు. ఆ పరిభాషలోనే చెప్పాను. ‘గంతేసి వచ్చాను’ అనే కదా నేనంది. ఇలా మాటల్ని ట్విస్ట్ చెయ్యొద్దు.

    మాలిక నేను అబ్యూజ్ ఎందుకు చేస్తాను? అబ్యూజ్ చేసే వాడిని నా బ్లాగ్ ఎందుకిస్తాను? మీరెవరో తెలియకుండా ఎందుకు అబ్యూజ్ చేస్తాను. నా పైన దాడి చేస్తుంటే చాలా రోజులు ఊరుకున్నానని నేను చెబుతుంటే నేను మొదలు పెట్టానంటారేమిటి? పదే పదే అబద్ధాలు చెప్పి అబద్ధాల్ని నిజం చేద్దామనా? ప్రవీణ్ కి ఇచ్చిన మెయిల్ లో ‘ఒక అగ్రిగేటర్’ అని రాసినట్లు గుర్తు కాని ‘మాలిక’ అన్నట్లు నాకు గుర్తు లేదు. ఎందుకంటె ‘మాలిక’ లో ఇలా జరిగింది అని చాలా కాలానికి నేను బైటికి తెలిపాను. ఒకవేళ ప్రవీణ్ వద్ద సమాచారం అడగడంలో భాగంగా రాశానేమో గుర్తు రావడం లేదు. ఏమైనా నన్ను దూషించకుండా మాలిక ని ‘అబ్యూజ్’ చేసే అవకాశమె లేదు. దూషణలకు గురైన దిగ్భ్రాంతి నుండే బైట పడడానికె నాకు కొన్ని వారాలు పట్టింది.

    నా బ్లాగ్ లో నా భావాలు చూసి తిడుతూ వచ్చారు. తిట్టిన వాళ్ళలో మీ పేరు ఉందో లేదో నాకు గుర్తు లేదు. కాని నేను తొలగించిన కామెంటు మాలిక లో ప్రత్యక్షమైంది. దానికి కారణం చెప్పండి.

    నాపైన ప్రచారం జరగకుండా నేను మాలిక పైన మాట్లాడే అవకాశమే లేదు.

  7. మీరు చెబుతున్న లెటర్ లోనో, మరొకరి బ్లాగుల్లోనో వ్యాఖ్యలాగా రాసినదానిలో ఈ కొరిక వ్యక్తం చేశాను. నేను మాలిక బ్యాడ్జి తొలగించాను. నా బ్లాగ్ వారి జాబితా నుండి తొలగించాలని అడిగినా తొలగించేట్లు లేరు అని రాసేను. అది మీరు చూసినట్లు (మీరు లేదా మీ మిత్రులు) మీ స్పందనల్లోనే నాకు తెలిసింది.

  8. శ్రీకాంత్ M గారు

    స్పందించినందులకు ధన్యవాదములు. మీ నిర్ణయాన్ని మనస్పూర్తి గా స్వాగతిస్తున్నాను.

    బాధితులే వ్యాఖ్యలు వ్రాసే వాళ్ళయితే, కనీసం ఈ బ్లాగు లో రెండు టపాల్లో బోలెడు మంది విశేఖర్ కి మద్దతు తెలియపరచి ఉండాల్సింది.

  9. “కాని ప్రవీణ్ వైపు నుండి చూసినపుడు ఏదో ఒక సంబంధం లేకుండా ఒక వ్యాఖ్యని రాయలేడు. అది అసంభవం. ”

    విశేఖర్ గారూ చాలా బావుంది. ప్రవీణ్ పోస్ట్ కు సంబంధం లేకుండా ఎంత మంది బ్లాగులలో సదరు బూతులు పేస్ట్ చేశాడో మీకు తెలియకపోతే ప్రవీణ్ ని అడగండి. “అసంభవం” అనేది చాలా పెద్దపదం. తొందరపడి తీర్మానిమ్చేయకండి.

    “నేను నమ్మిన సామాజిక సిద్ధాంతం మానవాళి విముక్తి చెందడానికీ, సమస్త దోపిడీలు అంతం కావడానికి మార్గంగా నేను నమ్ముతున్నపుడు దానిని సమర్ధించడంకోసం ప్రవీణ్ లాంటి వారి అమాయకత్వాన్ని, తుంటరితనాన్నీ తాత్కాలికంగాభరించడానికి నేను సిద్ధం. (…) లాంటి వారికి గలిగిన గౌరవ భంగం కంటే మానవాళిని కాపాడగలదని నమ్మే నా సిద్ధాంతమే నాకు ముఖ్యం. ”

    తప్పుగా అనుకోకండి. మీరు చెప్పింది చూస్తే ఎర్ర జండా పట్టుకుని ఎవరు ఎవర్నయినా ఎలాంటి కారుకూతలయినా కూయచ్చు. అందుకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ క్రమంలో ఎవరికీ ఎలాంటి గౌరవ భంగం కలిగినా నాకు అనవసరం. నాకు మానవాళి శ్రేయస్సే ముఖ్యం అని మీరు చెప్పినట్టు నాకు అనిపించింది. ఈ మానవాళి అంటే అదేమయినా ప్రత్యేకమయినా జాతి, వేరే గ్రహంలో ఉంటుంది అనుకుంటున్నారా? మనుషుల గౌరవం కాపాడలేని సిద్ధాంతం మానవాళి శ్రేయస్సుకు మరే విధంగా పనికొస్తుందో మీరే చెప్పాలి.

    మీరు చెబుతుంది చూస్తుంటే పౌర హక్కుల సంఘం అని పేరు పెట్టుకుని మావోయిస్ట్ లపై దాడులు మాత్రమే ఖండిస్తూ, నక్సల్స్ కు పోలీసులకు మధ్య పోరులో బలయ్యే అమాయక పౌరుల ప్రాణాల పట్ల మాత్రం మౌనం వహించే సోకాల్డ్ సిల్లీ ఫెలోస్ గుర్తొస్తున్నారు. క్షమించండి మానవాళి శ్రేయస్సే ముఖ్యం అనే మీరు ప్రవీణ్ కు, వాళ్లకు మధ్య జరుగుతున్న ఈ పోరులో (…) గారి లాంటి అమాయక బ్లాగర్లకు జరిగే వాటిని పట్టించుకోను అనడం చూస్తే నాకు వాళ్ళే గుర్తొచ్చారు.

    ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను అంటారా. సంతోషం. మీరు పట్టిన కుందేలుకి మూడు కాదు ఇంకా చెప్పాలంటే రెండే కాళ్ళని ఒప్పేసుకుంటున్నాను. సెలవు మరి.

  10. విశేఖర్ గారూ మీ వాదన సమంజసంగా లేదు. మాలిక లోకి వెళ్ళకుండా అక్కడున్న బహిరంగ ప్రకటన మీరెలా చూశారో నాకు అర్ధం కావటం లేదు. నాకు తెలిసి ఏ ఆగ్రిగేటర్ లో అయినా “‘మీ బ్లాగ్ ని చేర్చండి’ అనే ట్యాబ్ అక్కడే ఉంటుంది తప్ప వేరే బ్లాగుల్లోనో, బయట ఎక్కదోనో ఉండదు. పైగా “ఇక్కడ చూడాలి అనుకుంటే” అన్న పదం కూడా ఉందిగా. మీకు చూడాలి అని ఉంటేనే అని చెప్పారు గానీ మీ లింక్ ఇవ్వండీ అని వాళ్ళు మిమ్మల్ని దేబిరించలేదుగా. ఒక మాలికే కాదు, కూడలి, హారం, తెలుగు వెబ్ మీడియా, సంకలిని ఇలా ఎవరైనా మనకి ఇష్టం ఉండి, రిక్వెస్ట్ పంపితేనే మన బ్లాగు చేరుస్తారు తప్ప మన అనుమతి, అంగీకారం లేకుండా చేర్చరండీ.

    “కాని నేను తొలగించిన కామెంటు మాలిక లో ప్రత్యక్షమైంది. దానికి కారణం చెప్పండి.”

    ఏ అగ్రిగేటర్ లో అయినా మీరు సభ్యులైతే మీ బ్లాగులో పబ్లిష్ అయిన కామెంట్ వెంటనే ఆ ఆగ్రిగెటర్ కామెంట్ల విభాగంలో పబ్లిష్ అయిపోతుంది. ఇది జగమెరిగిన సత్యం. మీరు సభ్యత్వం రద్దు చేసుకున్నాక కూడా ప్రచురించ బడితే అప్పుడు మీకు ప్రశ్నించే హక్కు ఉంటుంది.

    “మీరు చెబుతున్న లెటర్ లోనో, మరొకరి బ్లాగుల్లోనో వ్యాఖ్యలాగా రాసినదానిలో ఈ కొరిక వ్యక్తం చేశాను. నేను మాలిక బ్యాడ్జి తొలగించాను. నా బ్లాగ్ వారి జాబితా నుండి తొలగించాలని అడిగినా తొలగించేట్లు లేరు అని రాసేను. అది మీరు చూసినట్లు (మీరు లేదా మీ మిత్రులు) మీ స్పందనల్లోనే నాకు తెలిసింది.”

    విశేఖర్ గారూ ఎందుకు తొలగించరు? మీరు వారికి చేరేటప్పుడు మెయిల్ చేసినట్టు గానే నా బ్లాగ్ మీ జాబితా నుండి తొలగించండి అంటే తొలగిస్తారు కానీ ఇలా ఎవరో బ్లాగుల్లోనో కామెంట్ గానో, ఎవరికో రాసిన లెటర్ లోనో పరోక్షంగా అడిగితే ఎలా తొలగిస్తారు? మళ్ళీ రేపు ఎప్పుడైనామీరు నేను మిమ్మల్ని నేరుగా అడగనప్పుడు నా బ్లాగ్ ఎలా తొలగించారు అని అడిగితే వాళ్ళు ఏం జవాబు చెప్తారు?

  11. క్షమించాలి. మీరు ఎలా అయినా ప్రవీణ్ నే సమర్ధించడానికి నిర్దారించేసుకున్నారు ఇక వాదన అనవసరం అనిపించి అలా అన్నాను. మీరు సమాధానం చెప్పదలిస్తే ఆ మాట ఉపసంహరించుకుంటున్నాను.

  12. శంకర్ గారూ, బహుశా నేను చెప్పదలుచుకున్నది సరిగ్గా ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యానేమో. మీరు కూడా మాలిక నిర్వాహకులా?

    మాలిక బహిరంగ బ్లాగ్, అక్కడ జరిగేవి బహిరంగం అన్న ఉద్డేశ్యంలో నేను ‘బహిరంగ ప్రకటన’ అని రాశాను. మాలిక వచ్చి నన్ను దేబిరించింది అన్నది నా ఉద్దేశ్యం కాదు. ప్రమోదవనం నేను వ్యాఖ్య పోస్ట్ చేశానని చెప్పి దానికి ఓ లింక్ మరో పోస్టులో ఇచ్చాను. అందులో సరిగ్గా రాసాననుకుంటా.

    అందులో ఇలా రాశాను.

    ముఖ్యంగా అగ్రిగేటర్ అని చెబుతున్న ఓ సైట్ కి నా బ్లాగ్ ఇచ్చిన దగ్గర్నుండీ ఈ కామెంట్లు వస్తున్నాయి. అది గమనించి సైడ్ కాలంలో ఉంచిన వాళ్ళ బేనర్ని తీసేశాను. కాని వాళ్ళ లిస్టులోంచి తీయలేను కదా. తీయమని చెప్పినా వినేట్లు లేరు.

    ఇది చాలా ఘోరం. అగ్రిగేటర్ సైట్ అని ప్రకటించి సబ్ మిట్ చేశాక ఇలా సాటి బ్లాగర్లమీద దాడులు చేయడం చాలా ఘోరం.

    ఆ లింక్ ఇక్కడ చూడండి

    అవును. అన్ని అగ్రిగేటర్లకీ నేనే నా బ్లాగ్ ఇచ్చాను. అగ్రిగేటర్లు బ్లాగులని అగ్రిగేట్ చేస్తాయి అన్న ప్రధాన అర్ధంతోనే ఎవరైనా బ్లాగ్స్ ఇస్తారు. అగ్రిగేటర్లకి ఎలాంటి భావాలు ఉన్నా అగ్రిగేటర్ నడిపే విషయంలో ఆ ప్రభావం పడకూడదని ఆశిస్తాం. పొరబాటున పడినా సవరించుకుంటారని ఆశిస్తాం. అయితే నేను ఓ వ్యాఖ్యని ప్రచురించకుండా అక్కడ ప్రచురితమైంది. దానికి పరిచయం కూడా ఉంది. ‘నా ఈ వ్యాఖ్య బ్లాగర్ తొలగిస్తాడని అనుమానంగా ఉంది. అందుకే ఇక్కడ పబ్లిష్ చేస్తున్నా’ అని. మాలిక ఆర్గనైజర్లకు తప్ప అటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది. దానితో నేను చాలా డిస్ట్రబ్ అయ్యాను.

    ఇక్కడ బ్లాగుల్లో చాలా ఘోరంగా మాటలు అనుకుంటున్నందున (ఈ మధ్యాహ్నమే క్రిష్ణశ్రీ, వికట కవి తదితర బ్లాగుల్లో కొన్ని సంభాషణలు చూశాను. అంతకు ముందు ప్రపీసస లో కొన్ని పోస్టులు చూశాను) అంతా ఒక దశకు చేరుకున్నందున సున్నితత్వం నశించిందని నాకు తోస్తోంది. కాని అప్పటికి నా చుట్టూ అటువంటి చెడు వాతావరణం లేనందున నా బ్లాగ్ లో రాసిన దానికే హర్ట్ అయి తొలగించాను. అది అగ్రిగేటర్ లో కూడా ప్రత్యక్షమయ్యేసరికి బాగా హర్టయ్యాను. ఇప్పుడైతే నాకు కొన్ని బ్లాగులు చూడ్డానికి కూడా భయం.

    సబ్యత్వం రద్దు గురించి.

    ఇలా ఈమెయిల్ ఇస్తే తొలగిస్తారని నాకు తెలియదు. రాత్రి భరద్వాజ్ నా బ్లాగ్ కి వచ్చి ‘తీసెయ్యాలంటే ఈ మెయిల్ ఇవ్వండి” అని చెప్పేదాకా తెలియదు. అందుకే ‘అడిగినా తీసేట్లు లేరు’ అని పై కోట్స్ లో అన్నాను. నేను రాసింది ఏమిటంటే ఇక్కడ వ్యాఖ్య చూసి భరద్వాజ్ తీసేశ్తాను అని వచ్చారు కదా, గతంలోనే ప్రమోదనం వ్యాఖ్యలోనే తీసేయాలన్న కొరికి వ్యక్తం చేసాను కదా, అది కూడా వారు చూశారు కదా, అప్పుడే తొలగించవచ్చు కదా అని. నేను తొలగించిన వ్యాఖ్య ప్రత్యక్షమైనాక నేను మళ్ళీ ఆ అగ్రిగేటర్ కి వెళ్ళలేదు. అంతకుముందు కూడా వెళ్ళింది తక్కువే అనుకొండి. అదే కాదు ఇతర అగ్రిగేటర్లకు వెళ్ళింది కూడా చాలా తక్కువ. నాకున్న సమయం తక్కువ ఐనందున అది నేను చేయలేను.

    ఇలా ఇప్పుడు రాయగలుగుతున్నది కూడా నేను సెలవులో ఉన్నందున. ఆరోగ్యం బాగాలెక రెండు వారాలనుండి ఇంట్లో ఉన్నాను. అందువల్ల వరుసగా ఈ పోస్టులు రాయగలుగుతున్నా. మామూలుగా నైతే సబ్జెక్ట్ పోస్టుల్లు రాయడంపైనా, వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వడం పైనా కేంద్రీకరణకే సమయం చాలదు.

    ఎందుకు తొలగించరు? అని ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు. కాని అప్పుడు నేను ఎదుర్కొన్న దాడి నేపధ్యంలో తొలగించరనే భావించాను.

    ఇప్పటికైనా ఏముంది. ఇదే ఈ మెయిల్ అనుకుని వారు తొలగించవచ్చు. ఈ మెయిల్ ఇస్తేనే టెక్నికల్ గా తొలగించడం సాధ్యమని చెబితే ఇస్తా. కాని I don’t thik that is the case.

  13. శంకర్ గారికి

    (ఒక వేళ బోర్ కొట్టినా ఓపిగ్గా చివరికంటా చదవగలరు)

    అసంభవం అన్నది మీరు ప్రవీణ్ నేపధ్యంలో చూస్తున్నట్లుంది. నా ఉద్దేశ్యం అది కాదు. సాధారణంగా చూసినపుడు, ఒక పోస్టు లేదా ఒక వ్యాఖ్య చదివాక దానికి సమాధానంగా ఎవరైనా ఓ వ్యాఖ్య రాస్తే వారి దృష్టి కోణం నుండి ఏదో ఒక సంబంధం చూడగలిగితేనే ఆ సమాధానం రాయగలరు తప్ప ఆర్బిట్రరీగా రాయలేరని చెప్పదలిచాను. ఆ దృక్కోణం ఏమిటన్నదే సమస్య. అందరూ ఒకే దృక్కోణంతో ఉండరు. కానీ అందరి దృక్కోణాలు సాధారణంగా ఏదో విధంగా సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల అందరి వ్యాఖ్యలూ దాదాపు అందరికీ ఏదో విధంగా అర్ధం అవుతాయి. కొందరు ప్రత్యేక దృక్కోణాలను కలిగి ఉంటారు. ఆ దృక్కోణాలతో ఇతరులకి పరిచయం లేనపుడు అటువంటి వ్యాఖ్యలు అర్ధం కాకుండా పోయే అవకాశం ఉంది.

    ప్రవీణ్ కి సంబంధించినంతవరకూ, అతను మార్క్సిజం, నవీన స్త్రీవాదం, నవ్య మానవతా వాదం, హెగెల్ భావ భౌతికవాదాలు మొదలైన దృక్కోణాలను చర్చిస్తున్నారు. హెగెల్ జర్మనీ తత్వవేత్త. నవ్య మానవతా వాదం, నవీన స్త్రీ వాదం ఇవన్నీ మానవ ఆచరణకి దూరంగా ఉండడం వల్ల సమసిపోయిన భారతీయ వాదాలు. నవ్య మానవతా వాదం అన్నది మార్క్సిజానికి ఆల్టర్నేటివ్ గా పుట్టించినది. దానికి కరెన్సీ లేక సమసి పోయింది. ఆ వాదాల వారి మీటింగ్ లకి నేను గతంలో కొన్నింటికి హాజరయ్యాను. వారి ప్రాపంచిక దృక్పధం వివరిస్తున్నపుడు వారు భూమ్మీద ఉన్నారా అన్న అనుమానం నాకు కలిగింది. వారు తమను తాము మానవ సమాజానికి అతీతమైన వ్యక్తులుగా భావించినట్లు, రోజువారి జీవితాలను వారు గడపకుండా కేవలం చర్చోపచర్చలకే పరిమితమైనారేమో అన్న అనుమానం నాకు కలిగింది. వారి దృక్కోణం అర్ధం చేసుకున్నాక వారి అర్ధం లేని భాష్యాలకు అర్ధం బోధపడింది. సామాజిక వాస్తవాలకు సుదూరమైన తాత్విక చింతన వల్ల వారి భాషణలకు వివరణలకూ ప్రాపంచిక దృక్పధానికి మామూలు అర్ధాలు లేవని అర్ధం అయింది. అవి సమాజానికి పూర్తిగా పనికిరాని సిద్ధాంతాలని అందుకే నశించాయని అర్ధం అయింది.

    అదే విధమైన సంబంధం లేనితనం నాకు ప్రవీణ్ వ్యాఖ్యల్ళో గోచరించింది. ప్రవీణ్ ఆ దృక్కోణాలనుండే వ్యాఖ్యలు చేస్తున్న సంగతిని నేను ధృవీకరించలేను. కాని ఇతరులు అర్ధం కాలేదు, సంబంధం లేదు అని చెప్పిన కొన్ని ప్రవీణ్ వ్యాఖ్యలు నాకు సంబంధం కలవిగానే తోచింది. హెగెల్ భావ (భౌతిక) వాదం, మార్క్సిజం లకి సంబంధించిన వ్యాఖ్యలు అతను రాసినపుడు నాకు అర్ధం అయ్యాయి. ఆ విధంగా వ్యాఖ్యలు రాసేటప్పుడు మొదట పరిచయం, వివరణ ఇవ్వాలన్న సూత్రాన్ని ప్రవీణ్ పాటించడం లేదు. ఇంకా చెప్పాలంటే ఆ పరిచయం, వివరణ ఎలా ఇవ్వాలో అతనికి తెలియదని నాకు అనుమానం.

    అంటే ప్రవీణ్ గొప్ప తాత్వికవేత్తా. అది మేము నమ్మాలా అని కొంతమంది యుద్ధానికి రావచ్చు. ప్రవీణ్ చెబుతున్న వాదాల గురించి కొంతైనా తెలిస్తే ఆ విషయంపైన ఒక నిర్ణయానికి రావచ్చు. నిజానికి ప్రవీణ్ కి ఈ వాదాలపైన సంపూర్ణ పరిజ్ఞానం లేకపోవచ్చు. తాను అర్ధం చేసుకున్న దాని మేరకే ఆ వ్యాఖ్యలు చేస్తుండవచ్చు. అప్పుడు కూడా అర్ధం కాకుండా పోయే అవకాశం ఉంది కదా. ప్రవీణ్ కి కొంత విషయ పరిజ్ఞానం ఉందని మాత్రం చెప్పగలను.

    ఈ వాదాలతో సంబంధం లేకుండా కూడా ప్రవీణ్ కొన్ని వ్యాఖ్యల్లో సంబంధం చూపడంలో విఫలం అవుతున్నాడు. అందుకే ప్రవీణ్ ని ఆ విషయంలో హెచ్చరించాను. ఇప్పటికీ హెచ్చరిస్తూన్నా. అతను ఎప్పుడు గుర్తిస్తాడో తెలియదు. ముందు నేను లేదా మనం చెబుతున్న ఈ అంశాలపైన అతను దృష్టి పెట్టాలి. ప్రయత్న లోపం లేకపోయినా కొందరికి స్వతహాగా ఉండే లోపాల వల్ల ఆచరణలోకి చూపలెకపోవచ్చు. ప్రవీణ్ వైవల్యం ఎందువల్లో నాకు అర్ధం అయితే అదేంటో నేను తీర్మానించగలను. లెకుంటే సాధ్యం కాదు. నేను దగ్గరిగ పరిశీలిస్తే చెప్పగలనేమో. అందుకు అవకాశాలు లేవు. లేనపుడు ఏదో ఒకటి తేల్చడం భావ్యం కాదు.
    ——

    మానవాళికి ఉపయోగపడగల సిద్ధాంతం అని నేనంటున్న దానిపైన మనద్దిరకి కొంత ఏకీభావం ఉండాల్సిన అవసరం ఉంది. అది లేకపోవడం వల్ల నేను పూర్తి వివరణ ఇవ్వలేకపోతున్నా. అయితే కొన్ని అంశాలు చెప్పవచ్చు.
    ఎర్రజెండా, లేదా ఆ సిద్ధాంతం నమ్ముతున్నవారికి తప్పని సరిగా కొన్ని బాధ్యతలుంటాయి. నమ్ముతున్న విలువలను పక్కాగా పాటించడం, కనీసం ప్రయత్నించడం అందులో ముఖ్యమైన బాధ్యత. అందుకే బూతు ఉపసంహరించుకోవాలని కోరాను. వీడియో బూతులు మానేయాలని కోరాను. బూతులు లేని అతని వీడియో ఒకటి చూసి ఆ తర్వాత ఏం చేయబోతున్నారో గ్రహించి అది ఆపేయాలని పరోక్షంగా కోరాను. గ్రహించారో లేదో తెలియదు. ఇలా స్త్రీల బూతు వరకు వస్తాడని ఊహించలేదు గాని కొంత ఊహించాను. తెలిసాక కూడా ఈ రెండు రోజుల్లోనే అతన్ని ఉపసంహరించుకోవాలని అనేక సార్లు కోరాను. మీరు చూశారు కదా. ఐనా ఒకే ఒక అర్ధాన్ని మీరు తీసుకుని బై ఎలా చెప్పారు? ఇంతింత ఎందుకు రాస్తున్నానంటే నా దృక్కోణం సమగ్రంగా వివరించాలనే కదా? సమగ్ర దృక్కోణం లో అనేక అంశాలను, పాజిబిలిటీస్ ని నేను ప్రస్తావిస్తూ వివరణ ఇస్తున్నాను. వాటన్నింటినీ పరిగణీంచండి. వ్యాఖ్యలలో అందరికీ తెలియదేమో నని పొస్టులుగా రాస్తున్నది అందుకే.

    ————-

    మరొక విషయం ప్రధానంగా చెప్పాను. మా ఇద్దరి పైనా ఒక నిర్ధిష్ట భావజాలం ఉన్నందుకే దాడి ప్రారంభం అయిందన్నాను. భావజాలం ఉన్నందున వ్యక్తిగత ద్వేషం, హింస చేశారని చెప్పాను. ఆ నేపధ్యంలో మాత్రమే ప్రవీణ్ కి నేను మద్దతు అని చెప్పాను. మాట సాయం అని చెప్పాను. అతనికి పద్ధతులకి నా మద్దతు లేదు గాని అతను ఆదిలో భరించిన హింసకు నా సానుభూతి అని చెప్పాను. అందుకే మద్దతు అని చెప్పాను. దానర్ధం ప్రవీణ్ పాల్పడుతున్న అన్ని చర్యలకూ నా మద్దతు ఉందని అర్ధమా? ఈ అంశాలనేవీ మీరు చూడరా? నా వివరణలని పట్టించుకోరా?

    —————–

    ఈ మానవాళి అంటే అదేమయినా ప్రత్యేకమయినా జాతి, వేరే గ్రహంలో ఉంటుంది అనుకుంటున్నారా? మనుషుల గౌరవం కాపాడలేని సిద్ధాంతం మానవాళి శ్రేయస్సుకు మరే విధంగా పనికొస్తుందో మీరే చెప్పాలి.

    లేటుగానే అయినా చక్కగా చెప్పారు. నిజంగానే చప్పట్లు శంకర్ గారూ.

    ఇదే నేనూ అడిగేది. మనుషులకు గౌరవం ఇవ్వలేని మన భావాలు ఎందుకని? మనుషులను మనుషులుగా గుర్తించని మన నమ్మకాలు ఎందుకని? ప్రవీణ్ అర్ధం లేకుండా వ్యాఖ్యలు రాస్తే అతనికి నానా రకాల పేర్లు పెట్టి ఎగతాళి చేయాలా? సాటి బ్లాగర్ గా, సాటి మనిషిగా అతని లోపాలను సవరించే ప్రయత్నం చెయ్యలేమా? ఇప్పుడంటే అందరూ అన్నీ అనుకున్నారు గనక అది సాధ్యం కాదు గాని అతని లోపాలనూ, బలహీనతలనూ సానుభూతితొ మనం చూడలేమా?

    హిందూ మతంలో ఒక లోపాన్ని గుర్తిస్తే, హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నవారి లోపాలను చెబితే ఎగతాళి, తిట్లు, హేళన, కులం ఇలా దొరికిన అన్ని ఆయుధాలను పట్టుకుని దూకాలా? ఒరేయ్ అనీ, మెంటల్ అనీ అతని బలహినతలని ఎక్స్ ప్లాయిట్ చేస్తూ నిందించాలా? తోటి బ్లాగర్ అని కూడా చూడకుండా అతని గాలి తీయడానికి సర్వావస్ధలయందూ ప్రయత్నించాల్సిందేనా? అర్ధం కాని అతని వ్యాఖ్యలని చూసి చూడలేనట్లు వదిలేసి మనదారి మనం చక్కా పోవచ్చు గదా? మన బ్లాగ్ కి వచ్చినపుడు సంబంధం ఉన్నవే రాయి అని ఓపిగ్గా మనం చెప్పలేమా? దూషించడానికంటే ముందు మనం తొక్కవలసిన దారులువి. ఆఫ్ కోర్స్, ఒకరి ఇష్టా ఇష్టాలపైనా, ఆసక్తులపైన ఆధారపడి ఉంటుంది. అలా చూసినప్పటికీ బ్లాక్ చెయ్యడం, నేరుగా అతనికే నా బ్లాగ్ కి రావద్దని హెచ్చరించడం చెయ్యవచ్చు. ఇవన్నీ అయ్యాక కూడా ఒక వ్యక్తిని ఒరేయ్, అనీ మెంటల్ అనీ తిట్టలేము. నా కైతే సాధ్యం కాదు శంకర్ గారూ.

    ———————

    పౌర హక్కుల సంఘం అలా చెప్పేటప్పుడు కూడా రాజ్య హింస, పౌర హింసకూ తేడా చూడాలని చెప్పింది. అందుకు మనం ఆమోదిస్తామా లేదా అన్నది మనపైన ఆధారపడి ఉంటుంది. అది తప్పు అని వివిధ వర్గాలవారు ఆ సంఘానికి చెప్పారు. కొందరి విన్నారు. కొందరు వినలేదు. ఆ సంఘం రెండుగా చీలడం వెనుక ఈ హింస కారణం కూడా ఉంది. మీరు గమనించలేదా?

    నేను రాసింది సమగ్రంగా చూడాలి మీరు. నేను నమ్మిన సిద్ధాంతాన్ని సమర్ధించుకోవలసిన పరిస్ధితుల్లో కొన్ని లోపాలను, అమాయకత్వాన్ని భరిస్తానని చెప్పాను గాని అతని బూతులనూ విడియోలాను సమర్ధిస్తానని చెప్పలేదే. మా ఇద్దరి కి ఉన్న భావజాలం నేపధ్యంలో మాపైన దాడి మొదలైంది అని చెబుతూ, ఆ పరిస్ధితుల నేపధ్యంలో నా భావజాలం కోసం ప్రవీణ్ కి నా మద్దతు ఇస్తాను అని చెప్పా. నా భావజాలం సమర్ధించుకోవలసి వచ్చినపుడు ప్రవీణ్ భావజాలం అదే అయినందున దాడి ప్రారంభం అయిందని చెబుతూ ఆ రీత్యా ప్రవీణ్ కి మద్దతు అని చెప్పాను గానీ ప్రవీణ్ ప్రతి చర్యకూ నా మద్దతు అని చెప్పలెదు. ప్రవీణ్ తిరుగుబాటు క్రమంలో అతని పద్ధతులకు నేను వ్యతిరెకం అని ఎర్ర అక్షరాలలో కూడా చెప్పానే. ఇవాన్ని ఎలా వదిలేస్తారండీ? ప్రవీణ్ ని ఎలాగైనా బూతులు తిట్టాల్సిందే అని మీరు నిర్ణయించుకుని బై చెబితే ఒకే గాని నాపైన అభాండాలు మోపి బై చెప్పడం ఏమిటి శంకర్ గారు? అన్నీ వివరించాక కూడా.

  14. శంకర్ గారూ, ఇంత సేపు చర్చలో పాల్గొన్నారు కదా. నా పైన దాడులు విషయం తెలిపాను కదా. ప్రవీణ్ పైన దాడి ఎలా మొదలైందో చూపాను కదా.

    నన్ను తిడుతూ బ్లాగ్ తెరవడం తప్పు అని సూత్ర రీత్యా మీరు చెప్పలేరా? బ్లాగర్ల భావాలు నచ్చనంత మాత్రాన బ్లాగర్లను వ్యక్తిగతంగా కెలకడం సరికాదని ఒక సూత్ర ప్రకటన మీరు చెయ్యలేరా? ప్రవీణ్ ని మొదట వాళ్ళే రెచ్చగొట్టడం నిజమే అయితే అది తప్పు అని చెప్పలేరా? మనుషుల (బ్లాగర్ల) గౌరవాన్ని కించపరిచే కెబ్లాస రద్దు చేసుకోవాలని కోరలేరా?

    మీలాంటివారు అలా ప్రకటిస్తే ఒక మంచి దోరణిని సమర్ధించినవారవుతారు. ఇకముందైనా ఇది ఆగాలి మీరు కోరితే, మీకు మరికొంతమంది జత కలిస్తే, అది ఇంతింతై వటుడింతై అన్నట్లైతే జరిగేది మంచే కదా?

    పద్మ గారి లాంటి వారు కూడా ప్రవీణ్ బూతుని విశేఖర్ కూడా ఉపసంహరించుకోవాలని కొరాడు గనక అది మద్దతుగా తెస్తూ ‘ఎప్పుడు ఉపసంహరించుకుంటున్నావ్?’ అని ప్రవీణ్ ని కవ్వించడానికి ప్రయత్నించారే గాని, విశేఖర్ ని వ్యక్తిగతంగా దూషిస్తూ, ద్వేషిస్తూ దూషణల బ్లాగ్ తెరవడం సరికాదు అని ఒక్క మాట మర్యాదకైనా చెప్పలేకపోయారు.

    మీ మిత్రులకు ఒక న్యాయం, మీ మిత్రులు అకారణంగా ద్వేషించేవారికి ఒక న్యాయమా పద్మ గారూ?

  15. విశేఖర్ గారు,

    ఇప్పుడు మిమ్మల్ని ఈ కెలుకుడు లొనికి వారు ఎందుకు దింపారో తెలుసా? మీరు వ్రాసె వ్రాతల నుండి మీ మైండ్ ను డైవర్ట్ చెయటానికే.
    వారు ఈ విషయంలొ సక్సెస్ అయ్యారనిపిస్తుంది. ఇప్పుడు ఒక్క రౌడి గారే వచ్చారు. ఇక గుంపులు గుంపులుగా వచ్చి మీ బ్లాగు పైన దాడి చేస్తారు. అప్పుడు మీ ద్యానం అంత వీళ్ళు అడిగె/వ్రాసె వ్రాతల పైనే వుంటుంది. ఇంకేం మీ వార్తల బ్లాగు, ఎంచక్కా మరో ప్రమోదవనం అవుతుంది. ఈ ప్రవీణ్ గొడవ, రౌడి గొడవ వదలండి. మీ సబ్జెక్ట్ పై consantrate చేయండి. మీరు రాసే వార్తలు మాకు కావాలి.

  16. శీను గారూ నిజమే. నా వ్యాసంగం పక్కకు వెళ్ళింది. కాని ఎక్కడో ఒక దగ్గర ఏదో కొంత మొత్తంలొ ప్రారంభం ఉండాలి కదా. అందుకని.

  17. ప్రవీణ్ వారితో నాకు నిమిత్తం లేదు. వారు తాము ‘కెలుకుడు గ్యాంగ్’ అని చాటుకున్నాక వారి విలువల ప్రాతిపదిక కాదు. మీరు నమ్మామని చెబుతున్న విలువల ప్రాతిపదిక గానే మీకు నా విన్నపం.

  18. పావని గారూ, ద్యాంక్స్. ఈ నిర్ణయానికి అందురూ రావాలి. ఏ పక్షానా లేనివారు ముందీ ప్రకటన చేయాలి. మరొసారి ధ్యాంక్స్.

వ్యాఖ్యానించండి