బూతోడుండేది అమెరికాలో, భారత్ లో ఉండేవారి దేశభక్తిపైనే అనుమానాలు


ఈ బూతు వెధవలు ఉండేది అమెరికాలో. ఐనా ఇండియాలో ఉండే వారి దేశ భక్తికి పరీక్షలు పెడుతుంటారు.

ఉదాహరణకి వీడిని చూడండి. వీడి ఐ.పి నంబరు: 117.192.199.112. వీడి పేరు needa అట. వీడి ఈ మెయిల్: avasarama@eesuttiki.com సొంత పేరు, సొంత ఈమెయిల్ ఐ.డి చెప్పుకోలేని దౌర్భాగ్యం ఇతన్ది. అందుకే వీడ్ని సన్నాసి అని పిలవాలనిపిస్తోంది.

కతార్ లో తాలిబాన్ ఆఫీసు తెరవడం పైన నేను రాసిన ఈ పోస్టు కింద వీడు ఒక పనికిమాలిన కామెంటెట్టాడు. అది ఇది:

“You support India or Pakistan?”

ఐ.పి నెంబర్ ని బట్టి వీడు ఉండేది అమెరికాలో. కాని నా దేశ భక్తి మీద తెగ అనుమానం వీడికి.

కతార్ లో తాలిబాన్ ఆఫీసు; తాలిబాన్ ఆఫీస్ తెరిచినందుకు అమెరికా, నాటోల సంతొషం; తాలిబాన్ తో చర్చలకు అమెరికాకి పాక్ సహకారం; తాలిబాన్ తో చర్చల విషయంలో పాక్ సహాయం తీసుకోవలసిన అనివార్యత వల్ల భవిష్యత్తులో ఆఫ్ఘనిస్ధాన్ లో భారత పాలకవర్గాల (భారత దేశం కాదు, భారత ప్రజలూ కాదు) ప్రభావం తగ్గిపోవడం ఇత్యాది విషయాలని అందులో చర్చించాను. ఈ ఎపిసోడ్ లో దక్షిణాసియాలోని ప్రాంతీయాధిపత్య రాజకీయాల్లో ‘ఆఫ్ఘనిస్ధాన్’ కి సంబంధించినంతవరకూ ఇండియాపైన పాకిస్ధాన్ ఆధిపత్యం సాధించినట్లేనని ఆ టపా ముగించా.

ఈ సన్నాసికి నేను రాసిన టపా మొత్తం చూస్తే ‘నా దేశ భక్తి’ పైనే అనుమానం వచ్చింది. ఇదెక్కడి చోద్యం? ఇండియా ప్రజల శ్రమతో చదివి అమెరికాకి చెక్కేసి అక్కడ సేవలు చేస్తూ భారత దేశంలో నివసిస్తున్న భారతీయుల దేశభక్తిపైనే అనుమానాలా? హవ్వ! నవ్విపోదురు గాక!!

ఇంకోడు న్నాడు. వీడి ఐ.పి: 117.206.233.24. పేరు: ram ట. ఈ మెయిల్: ahaohocha@gmail.com.

నేను రాసిన ఓ టపాకి మిత్రుడు ప్రవీణ్ రాసిన కామెంట్ ని బూతు బొమ్మలు, మత సంస్ధలు” అన్న హెడ్డింగ్ తో టపాగా మార్చాను. దానికింద జి.ఎల్.ఎన్.మూర్తిగారు కొంత చర్చ జరిపారు. ఆయనకి మద్దతుగా ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు. కాని వీడు రాసింది ఇక్కడ రాయడాన్కి నాకు మనస్కరించడం లేదు. అంత ఛండాలంగా రాశాడు. తలచుకుంటేనే కంపరంగా ఉంది. వీడెలా రాశాడోమరి. పైగా రాం పేరుతో. దేవుడి పేరుని అలియాస్ గా పెట్టుకుని ఈ ఛండాలపు రాతలు ఎలా రాస్తారో అర్ధం కాదు. ఇంత ఛండాలపు వెధవ జి.ఎల్.ఎన్ మూర్తిగారికి మద్దతుగా వచ్చినందుకు ఆయనకి నా సానుభాతి చెబుతున్నందుకు ఆయన మరోలా భావించరని భావిస్తున్నాను.

సద్విమర్శలని తప్పకుండా స్వీకరిస్తాం. పనికిమాలిన విమర్శలని ఏకి పారేస్తాం. తప్పదు మరి

248 thoughts on “బూతోడుండేది అమెరికాలో, భారత్ లో ఉండేవారి దేశభక్తిపైనే అనుమానాలు

 1. సద్విమర్శలని తప్పకుండా స్వీకరిస్తాం. పనికిమాలిన విమర్శలని ఏకి పారేస్తాం. తప్పదు మరి

  Nice మంచి పని చేసారు,

  ఉప్చ్ ఏమిటో మరి

  ఎక్కువగా తామసిక భావాలే ఇలా కామెంట్ చేసే వారిలో కనిపిస్తున్నాయి

  లేకుంటే ఈ అసభ్య పద జాలం వాడకుండా ఉండే అవకాసం బొత్తిగా కనపడటం లేదు

  నాకు మొన్న ఆమధ్య ఒక చెడు అనుభవం ఎదురైంది

  అసలు టపా ఒకటి వ్యాఖ్యానాలు వేరొకటి

  అందులో అదీ మరింత లోతుకు పోయె కొద్దీ నానా చండాలంగా అని పించి

  ఇంకా selected telugu blogs మాత్రమే చూడాలి రా బాబు అని

  new year resolution పెట్టేసుకున్న

  thanks అండీ

  ఎంచేతనంటే

  telugu media (కొన్ని) లాగా విషయం లో పస లేక పోయిన అనవసర రాద్ధాంతం చేసే

  టపా కి సంబంధ,మ్ లేక పోయినా వచ్చే comments hits కోసం ఏమాత్రం ప్రయత్నించ కుండా

  ఇలా censor చేయటం చేతా ఇక

  ధైర్యంగా site లో వార్తలు వ్యాఖ్యానాలు చదువ వచ్చును

  ?!

 2. మీ సపోర్టుకి ధన్యవాదాలండీ. ఇలాంటివారికి మద్దతు ఇవ్వకూడదని బ్లాగర్లు నిర్ణయించుకోవాల్సిన రోజు వచ్చేట్లుంది.

 3. రావు గారూ, విశేఖర్, ఫ్రాన్సిస్ రెండూ నా పేర్లే. ఒకటి జీసస్ ని నమ్మే అమ్మ పెట్టిన పేరు. మరొకటి మతం పై పట్టింపు లేని నాన్న పెట్టిన పేరు. విజీ ఫ్రాన్సిస్ అన్నది నా మిత్రుడి పేరు. చనిపోయాడు. స్మృత్యర్ధం అమ్మ పెట్టిన పేరు పొడిగించుకున్నా. చాలా.

  పోతే, నేను అలియాస్ పెట్టుకోవద్దని అనడం లేదు. పెన్ నేమ్, నిక్ నేమ్ పెట్టుకోవద్దనీ, రాదనీ అనడం లేదు. కానీ ఇలాంటి పుచ్చు కామెంట్లు రాసేవారు ఒకే పేరుతో రావడం లేదు. అనేక పేర్లతో వస్తూ ఛండాలం రాయవద్దనే నేను కోరుతున్నది. ఒకే బ్లాగ్ లో అనేక పేర్లతో కామెంట్లు పెట్టడం సరైందేనా? ముఖ్యంగా అసభ్యంగా రాయడం సరైందేనా?

  ఇంకా పోతే, నేను వారి ఈ మెయిల్ కూడా ప్రచురించాను. అవి మీకు ఆమోదయోగ్యంగా తోచాయా రావు గారూ? వాటి గురించి కూడా ఒక ముక్క మాట్లాడండి. లేని ఈ మెయిల్ ఐ.డిలతో కామెంట్లు పెట్టడం, అది కూడా అసభ్యంగా రాయడం సరైందేనా? నా టపాలో అసలు విషయం ‘బూతులు రాయడం.’ ఆ విషయాన్నెందుకు వదిలేశారు?

  ఇంతటితో సరిపుచ్చుకోకుండా నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా?

 4. ఆ ఐపి అడ్రెస్‌లు బెంగళూరుకి చెందినవి. whois.domaintools.com లో చూడండి, తెలుస్తుంది. వాళ్ళ దృష్టిలో దేశభక్తి అంటే అమెరికాని పొగడడం, పాకిస్తాన్‌ని తిట్టడం. పాకిస్తాన్‌కి తాలిబాన్‌తో ఉన్న సంబంధాలు బయటపడిన తరువాత అమెరికా తన సొంత semi-colony అయిన పాకిస్తాన్‌పై దాడి చేసింది. పాకిస్తానీయులకి కొంచెమైనా నిజాయితీ ఉంది. వాళ్ళు సామ్రాజ్యవాదులని నమ్మించి ద్రోహం చేస్తారు. మన ఇండియావాళ్ళకి అది కూడా లేదు.

 5. ఐ.పి అడ్రస్ లొకేటర్ లో చూస్తే ఒకటి అమెరికా, మరొకటి బెంగుళూరు అని వచ్చింది. ఒకవేళ బెంగుళూరు ఐ.పిని ప్రాక్సీ కింద వాడుతున్నారేమో. అమెరికా ఐ.పి ని కూడా ప్రాక్సీగా వాడుతుండవచ్చు. అయినా చూడండి. కన్నంలో దొంగల్లా నోరు మెదపకుండా ఎలా ఉన్నారో?

 6. ప్రాక్సీ కాదు. wordpress.com పాత ఐపి డేటా బేస్ చూపిస్తుంది. 177 శ్రేణిలో ఉన్న ఐపి అడ్రెస్‌లన్నీ BSNLవాళ్ళవి. WordPress.com లాంటి సర్వీస్‌ల నిర్వాహకులు ప్రాక్సీలని బ్లాక్ చేస్తారు. మనకి సొంత వెబ్‌సైట్ ఉంటే వెబ్‌సైట్ కంట్రోల్ పానెల్‌లోని డొమెయిన్ & ఐపి డెనీయల్ పానెల్‌లో ప్రాక్సీల అడ్రెస్‌లు ఇస్తే మన వెబ్‌సైట్ ప్రాక్సీలలో ఓపెన్ అవ్వకుండా ఉంటుంది.

 7. రెండు ఐ.పి లు 117 తో మొదలైనా ఒకటి అమెరికా, మరొకటి బెంగుళూరు ఎందుకు చూపిస్తున్నాయి?
  ఐ.పి లొకేటర్ అడ్రస్ ఇది: http://www.geobytes.com/IpLocator.htm
  దీనికీ, డొమెయిన్ టూల్స్ కీ మధ్య తేడా ఎందుకు ఉంది, ప్రవీణ్?

 8. నా ఐ.పి ప్రాక్సీ వెనక ఉండొచ్చని డొమెయిన్ టూల్స్ చెబుతోంది. అలా అన్నింటికీ చెబుతుందా?

  సవరణ: డొమెయిన్ టూల్స్ కాదు ఎ.పి.ఎన్.ఐ.సి చెబుతోంది.

 9. మరొక అనుమానం. ఒక ఐ.పి ప్రాక్సీ యా కాదా అన్నది తెలుసుకోవచ్చా? తెలుసుకోగలిగితే ఎలా?

  177 తో మొదలయ్యే ఐ.పి లు లాటిన్ అమెరికా రేంజ్ అని డొమెయిన్ టూల్స్ చూపిస్తోంది కదా?

 10. జియోబైట్స్ పాత డేటా చూపిస్తోంది. 117 శ్రేణి ఐపి అడ్రెస్‌లన్నీ BSNLవాళ్ళవి. BSNL హోమ్ కనెక్షన్స్ ఐపి అడ్రెస్‌లి 117 శ్రేణిలో ఉంటాయి, బిజినెస్ కనెక్షన్ ఐపి అడ్రెస్‌లు 59 శ్రేణిలో ఉంటాయి. డొకోమో కనెక్షన్ తీసుకోకముందు నా దగ్గర BSNL కనెక్షనే ఉండేది. అది 59 శ్రేణిలో ఉండేది. లొకేషన్ విజయనగరం అని చూపించేది. శ్రీకాకుళంలో ఉండే ఇద్దరు బ్లాగర్లు VOL కనెక్షన్ ఉపయోగిస్తున్నారు. వాళ్ళ ఐపి అడ్రెస్‌లు విశాఖపట్నంని లొకేషన్‌గా చూపిస్తాయి. శ్రీకాకుళంలోనే ఉండే ఇంకో బ్లాగర్ దుప్పల రవి గారి ఐపి అడ్రెస్ మీరట్ లొకేషన్‌గా చూపిస్తుంది. అతను ఉపయోగించేది రిలయెన్స్ కనెక్షన్. 117 శ్రేణి ఐపిలన్నీ BSNLవాళ్ళవే. ICANN ఆ శ్రేణిని ఇండియాకే అసైన్ చేసింది.

 11. ఒక ఐపి ప్రాక్సీ అయితే డొమెయిన్ టూల్స్‌లో “1 వెబ్‌సైట్ హోస్టెడ్ ఆన్ థిస్ సర్వర్” అని కనిపిస్తుంది లేదా ఆ సర్వర్‌లో ఎన్ని వెబ్‌సైట్‌లు ఉన్నాయో ఆ వెబ్‌సైట్‌ల సంఖ్య కనిపిస్తుంది.

 12. పైన 177 ఇండియాది అని రాశారు. 117 అని రాయబోయి 177 అని రాశారా ప్రవీణ్? మీరు 177 అని రాసినందునే నేను దాని గురించి అడుగుతున్నా.

 13. Commenting in this way should not come from educated people.
  For one thing, you are open for discussions.
  No need for people to comment like this, when you try to discuss rather than overrule.

 14. సంజయ్ గారూ, ముఖ్యమైన విషయం గుర్తించారు. ధన్యవాదాలు. ఇతర మిత్రులు కూడా ఈ విషయం గుర్తించగలిగితే మరిన్ని అర్ధవంతమైన చర్చలు సాధ్యం కావచ్చు.

 15. I am not saying what they did was correct. It was definitely wrong. I am only talking about using nicknames.
  I wanted to say one more thing. I am relatively new to this blogging world, reading blogs since a few months. However I have seen this user Praveen Sarma writing comments in a disgusting and vulgar language. I am surprised you are encouraging him while the entire blog world seems to loathing him.

  I initially thought he was not at fault and he was only reacting but after seeing the subsequent posts I realized that he only started the foul language (It is my observation only). Do you think you are doing a good thing by encouraging people like him? Or is it a gang thing meaning you can not criticize him because he seems to be your friend?

 16. రావు గారూ, మీరన్నట్లు ప్రవీణ్ నాకు మిత్రుడు కాదు. మీ లాగే నేను పరిశీలించి కొన్ని నిజాలు తెలుసుకున్నాను.
  నా పరిశీలనలో తేలిన విషయం ప్రవీణ్ కి వ్యతిరేకంగా చాలా అసభ్యకరంగా రాశాక వాటికి ప్రవీణ్ స్పందిస్తున్నాడు. ఒరిజినల్ గా ప్రవీణ్ కి అసభ్యకరంగా రాసే బుద్దుల్లేవన్నది నా అవగాహన.
  ప్రవీణ్ కి వ్యతిరేకంగా, కేవలం అతన్ని తిట్టడానికే ఒక బ్లాగ్ పెట్టారు. ఎందువల్లనో ఆ తర్వాత తీసేశారు.
  వాళ్ళే అతన్ని తిట్టి, ఆ తిట్లు మళ్ళీ ప్రవీణ్ పైకి నెట్టి అతనే తమని తిడుతున్నట్లు గోల చేయడం ఈ బూతు గ్యాంగ్ ప్రత్యేకత. నా పైన కూడా ఇదే ఎత్తుగడ అమలు చేసినా, నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు.
  ప్రవీణ్ అవసరమైన దానికంతే అధికంగా బూతు గ్యాంగ్ ని పట్టించుకుంటున్నాడు. అందువల్ల అతని స్పందన అతిగా మీకు కనిపిస్తోంది. ప్రవీణ్ అంతగా వారికి విలువ ఇచ్చి స్పందించడం అనవసరం అన్నది నా అవగాహన.
  నన్ను తిట్టడానికి కూడా బ్లాగ్ పెట్టి అసభ్యంగా రాస్తున్నారు. నేనది చూడ్డం ఎప్పుడో మానేశాను.
  ప్రారంభంలో ఆ బ్లాగ్ కి వెళ్ళి నేనే నేరుగా అడిగాను. ఎందుకలా చేస్తున్నారని.

  నాలాంటి వాళ్ళు నిజాలు రాస్తున్నారేమో అని అభిప్రాయం కలగజేస్తూ అబద్ధాలు రాస్తారట. అమాయకులకు లేనిపోనివి చెప్పి నమ్మిస్తామట. దాన్ని అడ్దుకోవడానికి వారు ఆ అసభ్య మార్గంలో వస్తారట! వారొక్కరే తెలివిగలవారనీ, నా వలలో పడే బ్లాగర్లు తెలివిహీనులనీ వారి అభిప్రాయం. ఆ నమ్మకంతో బ్లాగర్లను నా అభిప్రాయాల నుండి రక్షించడానికి కంకణం కట్టుకున్నారని ‘కుమార్.ఎన్’ అనే వ్యక్తి నాతో చెప్పాడు. ఇతను పరమ దరిద్రుడని ‘నీహారిక’ లాంటివారు చెప్పాక పట్టించుకోవడం మానేశాను.

  అమెరికాకి వ్యతిరేకంగా రాస్తే వీరికి నచ్చదు. తాము మాత్రమే హిందు మతాన్ని రక్షించగలమని వీరి నమ్మకం. అమెరికా విదేశీ విధానాలను ప్రస్తావించి, వివరించి, ఆ తర్వాత విమర్శించినా ఆ విమర్శలు వీరికి నచ్చవట. ఈ ప్రపంచాన్ని ముస్లింల బారినుండి రక్షించడానికి పుట్టిన అవతార పురుషుడిగా వీరు కీర్తిస్తారు. నమ్ముతున్నట్లు నటిస్తారు. ఆ భావాలతో అచ్చోసిన ఆంబోతుల్లా బ్లాగర్ల పైన పడి బూతులు తిడుతూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారు. వీరి బారిన చాలామంది పడ్డారు. ‘నీహారిక’ వీరిని మొదట సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని చాలామంది చెప్పారు. ఆ తర్వాత వీరి ప్రభ తగ్గుతూ వచ్చిందట.

  అమెరికా, హిందూ మతం అని వీరు చెబుతున్నా అవీ అబద్ధాలని కొందరి బ్లాగర్ల మనోగతం. వీరికి ఓ అగ్రిగేటర్ బ్లాగ్ ఉంది. వీరంతా అందులో భాగస్వాములు కాకపోవచ్చు. వీరికి వందిమాగధులు కొంతమంది ఉన్నారు. వారు కూడా వీరి తిట్ల వ్యవహారంలో భాగం పంచుకుంటారు. అగ్రిగేటర్ల ద్వరా వారి బ్లాగ్ లకు ప్రాచుర్యం దొరుకుతుందని ఈ పక్క వాయిద్యగాళ్ళ ఆశ అనీ అందుకే బూతు గ్యాంగ్ కి మద్దతు అనీ సీనియర్ బ్లాగర్ల ద్వారా, చదువరుల ద్వారా నాకు తెలిసింది. అలా తెలిపిన వ్యాఖ్యలు నా బ్లాగ్ లో ఉన్నాయి. వీరి అసలు ఉద్దేశ్యం బ్లాగింగ్ లోకంలో ఒకవిధమైన ఆధిపత్యం సాధించడం అని సీనియర్ బ్లాగర్లు తెలిపారు. అది సాధించడానికి ఎంతకైనా తెగించారని వారి ద్వారా తెలిసింది. వీరి ఆగడాలు ఒక దశలో భరించరాని స్ధితికి చేరాయట. నీహారిక గారు గట్టిగా ప్రశ్నించడం ప్రారంభించాక, ఆమెకు మరిన్ని చదువరులు తోడై బూతు గ్యాంగ్ కొంత వెనకబడిందని నా బ్లాగ్ లో వ్యాఖ్యల ద్వారా నాకు చెప్పారు.

  నీహారిక గారిని వీరు చాలా అసభ్యంగా తిట్టారని తెలిసింది. అక్రమ సంబంధాలు అంటగట్టడం వరకూ అది వెళ్ళిందని తెలిసి ఇంత ఛండాలురా అని ఆశ్చర్యపోయాను. ఆవిడ మళ్ళీ ఆ బూతు గ్యాంగ్ తో మామాలుగా ఉండడానికి ఈ మద్య కొన్ని ప్రయత్నాలు చేశారు. ఆవిడ ఒక అవగాహనతో అది చేసినా అందులో నాకు అమాయకత్వం ధ్వనించింది. ఈ బ్లాగ్ ల వ్యవహారం ఆమె వ్యక్తిగత జీవితంలోకి జొరబడినట్లు కూడా ఆమె రాతల్లో నాకు అర్ధం అయింది. ఇంతకంటె ఘోరం ఏముంటుంది?

  ఇన్ని జరిగినా, ఇంతమంది వేలెత్తి చూపినా వీరి ధోరణి అగలేదని మీ సమాచారం ద్వారా అర్ధం అవుతోంది. వీళ్ళే అనరాని మాటలూ అని అవన్నీ తమనే అన్నారని ప్రచారం చెయ్యడం వీరి ప్రత్యేకత. ప్రవీణ్ పేరుతో బూతులు ముందు వీళ్ళు రాసి తర్వాత ప్రవీణ్ పైన బూతుల వరద పారించారు. అందుకు వీళ్ళు ఇప్పటికీ సిగ్గుపడరు. బ్లాగింగ్ లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళు తమ తమ రంగాల్లో నిష్ణాతులైనవారు. వారినీ వీళ్ళు అనేక విధాలుగా ఎద్దేవా చేస్తుంటారు. బ్లాగింగ్ చేశేవారిలో ఇదొక మానసిక రోగమేమో అని నాకు అనిపిస్తోంది.

  వీళ్ళ గురించి ఇంత రాయడమే టైం దండగ. కాని మీరు కొత్త వారిలా కనిపిస్తున్నందున తెలియజేయడానికి రాశాను. మీరు ప్రయత్నిస్తే వీరి వివరాలు ఇంకొన్ని బ్లాగ్స్ లోనే తెలియకుండా పోదు. అదీ దండగే నని నా అభిప్రాయం.

  ప్రవీణ్ ఇంకా వారిపైన యుద్ధం కొనసాగిస్తున్నట్లయితే, ఈ సందర్భంగా అతనికి ఒక విషయం చెప్పదలిచాను. ఏమిటంటె వీరి కోసం సమయం, శక్తి వృధా చేసుకోవద్దు. ప్రవీణ్ ఎంత స్పందిస్తే వారికి అంత ప్రోత్సహం వస్తుంది. కేంద్రీకరించదగ్గ మంచి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అతిగా స్పందించి బూతు గ్యాంగ్ తో సమానంగా ముద్ర వేయించుకోవలసిన పని ప్రవీణ్ కి తగింది కాదు.

 17. Even I thought the same way before but after looking at all the details provided and here are my observations:

  1. It was Praveen Sarma who started his abuses his some blog belonging to some Innayya or somebody and only after that they started a blog against him, though I would like someone to verify this claim. Do you have any links that would prove they started it first? (I am just curious)

  2. From the screenshots somebody provided, I understood that it was a lady called Niharika who linked a blogger with a famous writer Kalpana Rentala and it was after that hell broke loose. At least 5 bloggers told me it was Niharika’s fault and thats why she closed her blog to hide the evidence.

  Remember one thing. If they are at fault they will not have the kind of massive support from all sections that they have now.

 18. One more thing. Just read this. (…link deleted)
  From its appearance looks like it is from the same gang.
  They have put it in a straight-forward manner. I am interested in seeing your response.

 19. Rao, I dont’t think they have massive support. Why are you repeating that they enjoy support?

  If you are referring the abussive blog against Praveen, what else you have known about the abusive blog against me? Why don’t you refer the facts about that blog (against me)? I’m just curious.

  It seems you are constantly trying to prove that there is nothing wrong with them and only Praveen did what all had been done. That too with me who has bitter and painfull experiences with them. I’ve given some other details about them which you don’t seem to take into consideration. If you want to say something that they are good, let it be. But I can’t prolong this waste of discussion.

  There are many other useful issues that can be discussed. Let us move on.

 20. Quote: Rao, I dont’t think they have massive support. Why are you repeating that they enjoy support?

  From what I have seen in the last few months they do have a lot of support from all sections of bloggers. I gain or lose nothing by proving anything. Since you were the first to say it I prolonged it.

  Quote: what else you have known about the abusive blog against me

  I have seen that blog. In fact thats where I read your real name was Francis and for some reason you didnt want to display that name. Though the blog owner has very good points I think he was too aggressive.

  Quote: That too with me who has bitter and painfull experiences with them.

  A blogger who choses to be controversial will have somebody hitting back at him very hard. I think it is natural on the Internet.

  Quote: If you want to say something that they are good

  I am not saying whether they are good or bad. I am looking at both sides from a neutral eye. Thats why I have asked you for any evidence that would prove my points wrong. When I asked them the same questions, they gave me all the evidence from their side. But, you chose to close the discussion. I understand it. OK we can move on.

 21. One final advice to you as a regular reader before I move on as you suggested. You may not publish this.

  That gang is very smart. They know that when they oppose someone Praveen Sarma joins the opposition gang. With the kind of image he has among most of the bloggers, the opposition loses credibility and that is their modus operandi. Many people seem to have fallen in that trap. It is up to you to take it or leave it.

 22. Exactly. What matters in Praveen for me is that he is very a knowledgeble person. He is also having progressive thoughts which are useful to the present day society. His weakness is his innocense. He doesn’t know how to present things in a required and understandable frame. Not that I know it well. Atleast, I know it to the extent that I need not care this gang’s behaviour.

  You know how my other name viji francis came to be knwon? It is only through Praveen. I mailed a letter to him inquiring about this gang’s behaviour. First thing he did was giving neeharika’s email, which, he shouldn’t have done. He asked me to enquire with her about this gang.

  When Praveen opened a blog to answer this gang in his own methods, he published my letter to him saying that it was from Viji Francis. I was taken aback but understood why he became a constant prey to this gang. Praveen should have asked my permission before publishing that letter. He didn’t. He didn’t find any reason for asking permission. I doubt if he finds even now. I responded to that post immediately revealing that Viji Francis is none but me. Actually there was no need for the revelation. But, somehow I felt it necessary.

  That matter should have been closed by then. But this gang constatly point out my two names, as they find it convenient for them.

  Being a person of grasping gang’s modus operandi, you may not admire their following that you attribute. They themselves named their blog like “kelukudu”, which is the secret of their following. People tell me that their aggregator attracts following. I don’t know it well.

 23. Why I mailed only to Praveen? Because he is the first person who placed a comment on my new blog. You can see in my blog’s annual report that the most comments placed on my blog was by Praveen. He found his own views in my blog. And I found I shared many views with him. I think it’s not a secret.

 24. I am no way innocent. Please read the link: https://kalpanarentala.wordpress.com/2009/06/17/%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%97%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b1%82-%e0%b0%b5%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b1%81-%e0%b0%9c/
  కల్పన గారు అయిదో గోడ కథ వ్రాసినప్పుడు కల్పన గారిని విమర్శించినవాళ్ళలో నీహారిక గారు ఒకరు. ఆ టైమ్‌లో నేను కల్పన గారికే సపోర్ట్ ఇచ్చాను. తరువాత నీహారిక గారు నాకు సపోర్టర్‌గా మారిన తరువాత ఆమెని మార్తాండవాది అని తిట్టడం మొదలుపెట్టారు. నా ఐడియాలజీని వ్యతిరేకించే నీహారిక గారు తరువాత నా వైపు ఎందుకు వచ్చారో ఆలోచించండి.

 25. Rao, one more point.
  If you find ‘very good points’ in that abussive blog, you may discuss them with me, except that they are about their following and all that.

  Two more point.
  I don’t need to prove they are bad. It’s not my job. If there is really bad about them, you may find it some other time.

  Three more point.
  My real name is not Viji Francis. It’s not in my records. My real name is Vijaya Sekhar. Francis is named by my religiously sensitive mother.

 26. నేను టపాకి సంబంధం లేని విషయాలు వ్రాస్తున్నానడానికి ఎలాంటి ఆధారాలు లేవు. రమణి అనే ఆవిడ నేను టపాకి సంబంధం లేని విషయాలు వ్రాస్తున్నానని తన బ్లాగ్‌లో వ్రాస్తే నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న కంచర గాడిదలు మేత దొరికిందనుకుని రెండున్నరేళ్ళ నుంచి అదే అరిగిపోయిన రికార్డ్ పట్టుకుని విమర్శిస్తున్నారు. ఈ లింక్ చదవండి: http://sumamala.blogspot.com/2009/07/blog-post_01.html ఈవిడ మొదట్లో నేను టపాకి సంబంధం లేని కామెంట్లు వ్రాస్తున్నానని విమర్శిస్తే ఈవిడ స్టైల్‌నే కాపీ కొట్టారు. ఒకవేళ నేను టపాకి సంబంధం లేకుండా వ్రాస్తే ఆవిడ పబ్లిష్ చెయ్యాల్సిన అవసరమే లేదు. పబ్లిష్ చేసిందంటే అవి సంబంధం ఉన్నవనే కదా దాని అర్థం.

 27. At first, they targeted Kathi Mahesh Kumar but not me or Niharika. When I expressed open support to Kathi Mahesh Kumar, then they targeted me. When Niharika express open support to me, then they targeted Niharika. Targeting one after another is their actual modus operandi.

 28. మొదట ప్రవీణ్ అమాయకుడు, కత్తి మహేశే నిజమైన విలన్ అని వాళ్ళే ప్రచారం చేసి కత్తి మహేశ్‌కి వ్యతిరేకంగా నన్ను ఉపయోగించుకోవాలనుకున్నారు. ప్రవీణ్ వ్రాతల్ని కేవలం వినోదం కోసం చదవాలి, కత్తి మహేశ్‌ని మాత్రమే ద్వేషించాలి అని ప్రచారం చేశారు. 2010 జులైలో నేను కత్తి మహేశ్‌కి ఓపెన్‌గా సపోర్ట్ ఇచ్చిన తరువాత వాళ్ళు నన్ను తీవ్రంగా దూషించడం మొదలుపెట్టారు. నేను అమాయకుడిలా నటించానని ప్రచారం చేశారు. నేను ఎన్నడూ అమాయకుడిలా నటించలేదు. నా ఐడియాలజీ మొదటి నుంచి నాదే. కత్తి మహేశ్‌కి వ్యతిరేకంగా నేను వాళ్ళకి ఉపయోగపడతానని నమ్మడం వాళ్ళ తప్పు. నేను కొన్ని విషయాలలో మాత్రమే కత్తి మహేశ్‌ని వ్యతిరేకిస్తూ ఉన్నాను. నిజానికి ఒక దళితవాదిగా కత్తి మహేశ్ అంటే నాకు మొదటి నుంచి అభిమానమే.

 29. ప్రవీణ్, మీ వ్యాఖ్యకీ టపాకి సంబంధం ఉంటేనే, మీకది అనిపిస్తేనే ఆ వ్యాఖ్య రాస్తారు. అందులో అనుమానం లేదు. కాని ఆ సంబంధం ఏమిటన్నదీ మళ్ళీ మీరు చెప్పేవరకూ తెలియకపోతే, తక్షణం అది సంబంధం లేనిదిగా కనిపిస్తుంది. సంబంధం ఏమిటా అని వెతుక్కునే అవసరం పాఠకులకు కలగకూడదు. ఆ జాగ్రత్త మీరు తీసుకోవడం లేదని నేను మళ్ళీ చెప్పదలిచాను.

 30. సో, ప్రవీణ్ ఉత్తముడు అంటారు. సరే, మరి జస్ట్ మొన్ననే మలక్‌పేట్ రౌడీ వాళ్ళ అమ్మగారిని పట్టుకుని నానా చండాలంగా వాగాడు కదా. అలా మాట్లాడినవాడు ఉత్తముడెలా అయ్యాడు? సరే తనని, తన కుటుంబాన్నీ మొదట అంటేనే తను ఇలా రెచ్చిపోయాడు అని మీరంటున్నారు. కానీ దానికి సాక్ష్యం ఉందా? తన వదినగారితో సంబంధం అంటగడుతూ బూతులు రాశారు అన్నాడు. ఎక్కడైనా తన వదిన గారి పేరుతో ఎక్కడైనా ఒక్క కామెంటు అయినా వేశారా? అందరికీ తెలిసి తన వదిన మరిది కథల గురించి ఎగతాళి చేశారు కానీ తన వదిన గారి గురించి ఎవరు కామెంటు చేశారు పేరు పెట్టి మరీ? ఇదే మాట శంకర్ గారు అడిగారు కదా, ఎందుకు సమాధానం చెప్పలేదు ప్రవీణు? ఒక్కటే సూటి ప్రశ్న. ఏ రకంగా ప్రవీణ్ బూతులని సమర్ధిస్తున్నారు మీరు?

 31. ఒకవేళ టపాకి సంబంధం లేదనిపిస్తే పబ్లిష్ చెయ్యాల్సిన అవసరమే లేదు. ఒక రచయిత గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఆ రచయిత వ్యక్తిగత జీవితం గురించి కూడా చర్చ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి, తెలుగు బ్లాగుల్లోనే. 2008 నుంచి తెలుగు బ్లాగులు చదువుతున్న నాకు ఈ విషయం తెలిసినదే. ఇంగ్లిష్‌లో అయితే ఎప్పటి నుంచో బులెటిన్ బోర్డ్స్ ఉన్నాయి. వాటిలో కూడా చర్చ ఇలాగే జరుగుతుంది.

 32. ఒకప్పుడు నీహారిక గారు నా ఐడియాలజీని వ్యతిరేకించారు. రమణి గారి బ్లాగ్ శ్రద్ధగా ఫాలో అయినవాళ్ళలో నీహారిక గారు ఒకరు. తరువాత నీహారిక గారు నాకు సపోర్ట్‌గా మాట్లాడేసరికి ఆమెని లేడీ మార్తాండం అనీ, ప్రవీణ్ గాడి వదిన అని తిట్టడం మొదలుపెట్టారు. ఈ లింక్ చదవండి: http://evidences.maalikaasalurangu.info/59990550

 33. ఈ బ్లాగ్ గొడవలతో ఎలాంటి సంబంధం లేని మా వదిన గారి పేరుతో వాళ్ళు బూతులు వ్రాయడం వల్ల వాళ్ళ లీడర్ భరద్వాజ వాళ్ళ అమ్మ పేరుతో బూతులు వ్రాసాను. నా వదిన మీద పగ సాధించడానికి అతను తన అమ్మని బజారున పెట్టుకుంటాడా? అటువంటప్పుడు అతను నన్ను వదిన పేరుతో తిట్టడం ఎందుకు? పైగా నేను వాళ్ళ అమ్మని తిట్టానని ఏడవడం ఎందుకు?

 34. Your first point:
  The whole point that I see in that blog is about the issue that you made a statement but could not show anything that would support it and that when they asked you about it, you deleted their comments.

  Your second point:
  It is okay if you have no evidence or links with you. Probably its just your opinion because they criticized you mercilessly. Its understandable.

  Your third point:
  Point taken. I am not concerned with the name. The whole issue arose because of the nicknames like that.

 35. ఇందాకే గూగుల్ ప్లస్‌లో శంకర్ అనే వ్యక్తి ప్రొఫైల్ బ్లాక్ చేశాను. అతని ప్రశ్నలకి సమాధానం చెప్పకపోయినా అడిగిన ప్రశ్నలే అరిగిపోయిన రికార్డ్‌లాగ అడుగుతున్నాడు. మనల్ని మానసిక రోగులు అని అంటూనే మన మీద వాళ్ళు హిస్టీరియా పేషెంట్లలాగ పడి ఏడుస్తారు. https://plus.google.com/111113261980146074416/posts/VgSHg4PDsD8 ఈ టాపిక్‌లోనే ఎన్ని సార్లు కామెంట్లు డిలీట్ చేసినా అడిగిన ప్రశ్నలే తిరిగి అడిగాడు. గూగుల్‌లో స్పామ్ ఫిల్టర్ ఉంది. ఒకే సారి రెండు బ్రౌజర్లలో వేర్వేరు ఐడిలతో లాగిన్ అయినా వ్యాఖ్యలు స్పామ్‌లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళ ఈ-మెయిల్ అడ్రెస్ మన అడ్రెస్ బుక్‌లో లేకపోయినా వ్యాఖ్యలు స్పామ్‌లోకి వెళ్ళిపోతాయి. అయినా కూడా వాళ్ళు స్పామింగ్ చేస్తారు.

 36. పద్మ గారు అలాగైతే నేను శ్రావ్య వాళ్ళ బావగారి మీద పేరడీలు వ్రాస్తానన్నాను కానీ శ్రావ్య వాళ్ళ బావగారి పేరు వ్రాయలేదు. అయినా శ్రావ్య గారు అభ్యంతరం ఎందుకు చెప్పినట్టు? వదిన-మరిది సంబంధానికీ, బావ-మరదలు సంబంధానికీ మధ్య తేడా ఏమీ లేదని ఆవిడకి అప్పుడే గుర్తొచ్చినట్టు ఎందుకు నటించారు?

 37. నీహారిక గారు కూడా ఇదే ప్రశ్న అడిగారు “అక్రమ సంబంధం పెట్టుకోవడానికి బావైతే ఏమిటి? మరిదైతే ఏమిటి? యండమూరి వ్రాస్తే శృంగారం, ప్రవీణ్ శర్మ వ్రాస్తే బూతా?” ఈ ప్రశ్నకి మీరెవరూ సమాధానం చెప్పకుండా నీహారిక గారి మీద పడి ఏడ్చారు.

 38. Rao,

  You are wrong. The whole point is not what you say. He mentioned the whole point specifically when I asked him why he was doing all that. The same point is carried to you in one of my above comments.

  I have screen shots of what they did, and how all this began. I don’t think this discussion will end even I produce them. I see it’s mere waste of time and energy to try to prove my case.

  I thought you would discuss topics discussed in my blog like US and the Hiduism, when I said you were welcome for discussioon. Your are bringing up the same issue which I don’t like, in some or other form, and trying to prove they are good and the whole issue began only because me. Your declared objective is not corroborating with the point of your discussion. If you feel that it was right whatever they were doing, let it be. I’m not bothered.

  “It is okay if you have no evidence or links with you. Probably its just your opinion because they criticized you mercilessly. Its understandable.”

  This sentence and other sentences like this in your previous comments, show for what you are up. You are just ignoring the actual central point and are merely concentrating what they expose as a central point, which was actually not.

  If I do not show something to support my statement, Does that empower or legitimize somebody to start an abussive blog against me? I don’t think so.

  Maybe I’ve to stop this discussion.

 39. పద్మ గారూ, ప్రవీణ్ బూతుల్ని నేను సమర్ధించడం ఏమిటి? అతని పైన నాకున్న అభిప్రాయాలు చెప్పాను. అవి మీకు నచ్చకపోతే వదిలెయ్యండి.

  తప్పు, ఒప్పుల్ని చెప్పుకుని సవరించుకుని బ్లాగుల్లో ఇదంతా జరగకుండా చేసే ప్రయత్నం ఎవరైనా చేస్తే వారికి మీరూ, రావు గారు అడిగిన సాక్ష్యాలు చూపడానికి నేను సిద్ధం. అది కూడా నాకు సంబంధించినంతవరకే. ఇంటర్నెట్ లో వ్యక్తుల గురించి వారి గుణ గుణాల గురించి చర్చించేంత జ్ఞానం నాకు లేదు. నేను బ్లాగింగ్ చేస్తున్నది అందుకు కాదు.

  కాని నా పైన దాడికి వస్తే నేను ఊరుకోను. దానికి స్పందన ఉంటుంది. (ఇది మిమ్మల్ని ఉద్దేశించింది కాదు).

 40. ప్రవీణ్ మీరు చేసింది కరెక్ట్ కాదు. మీ వదిన గారిపైన బూతులు రాస్తే అది అతని లేకి బుద్ధి. మీరు అతని అమ్మగారి పైన బూతులు రాయడం సరికాదు. అతను చేస్తే లేకితనం అయ్యేది మీరు చేస్తే గొప్పతనం ఐపోదు. ఆఫ్ కోర్స్ ఈ విషయం మీకు బాగానె తెలుసు. తెలిసి కూడా మీరు కూడా బూతులకి దిగడం సరికాదు. బూతులన్నవి ప్రధానంగా ఆ నిర్ధిష్ట సంఘటనలో పాత్రలేని స్త్రీలనే టార్గెట్ చేస్తాయన్న అభిప్రాయం మీకు ఉన్నపుడు ఆ అభిప్రాయాన్ని అవతలి లేకితనాన్ని బట్టి మీరు మార్చుకోజాలరు.

  మీరసలు ఇదంతా కట్టిపెట్టాలని నా సలహా. ఎందుకు సమయం వృధా చేసుకుంటారు? ఇది కేవలం బ్లాగ్లోకం. పూర్తి జీవితం కాదు. దీనికి అతి స్పందన, అతి ప్రాముఖ్యత అనవసరం. మీ స్పందనలు మరింత రచ్చ జరగడానికి దారితీస్తున్నాయి. గమనించారా? అది జరగకుండా నివారించే విషయం మీ చేతుల్లోనె ఉంది.

 41. అతను మూడేళ్ళ నుంచి మా వదిన మీద బూతులు వ్రాస్తున్నాడు. నేను కేవలం మూడు నెలలు క్రితమే అతని అమ్మ మీద పేరడీలు వ్రాయడం మొదలుపెట్టాను. అతను వదిన-మరుదుల సంబంధం యొక్క పవిత్రతని కాపాడడానికి అతను తన తల్లినే బజారున పెట్టుకునే త్యాగశీలి అని చెప్పుకుంటే ఎవరూ నమ్మరు. అతను మాటిమాటికీ నన్ను వదిన పేరుతో తిట్టి తన తల్లిని నా చేత తిట్టించుకుంటే ఎవరికైనా అతని గురించి అదే అనిపిస్తుంది. ఆ పరిస్థి రావాలనే నేను అతని తల్లి మీద బూతులు వ్రాసాను కానీ అలా వ్రాస్తే స్త్రీని టార్గెట్ చేసినట్టు అవుతుందని తెలియక కాదు.

 42. ప్రవీణ్ శర్మ నేను మీలాగా కథలు , కాకరగాయలు రాయలేదు , ఎందుకు వేరే వాళ్ళని బూతులు తిడుతున్నారు అని అడిగాను . అంటే మిమ్మల్ని ఎవరు ఇదేంటి అని అడిగితే వాళ్ళ మీద పారడీలు రాస్తారన్న మాట . మీకు ఇంకో మాట ఏవేవో సంభందాలు మంచివే అనుకుంటూ కథలు రాసుకుంది మీరు అలా నేను ఎక్కడన్నా కథలు రాసి ఉంటె, లేదా వాటిని సపోర్ట్ చేసి ఉంటె, లేదా మీరు రాసినట్లు వేరే మీద నేను రాసినట్లు ఉంటె చూపించండి . అప్పుడు రాద్దురు పేరడీలు .

  Mr. Vishekar you have published the comment hwere my name was mentioned, so I guess I have my right to respond on that.

 43. మూడేళ్ళ క్రితం నేను స్పందించకపోయినా వాళ్ళు ఇలాగే వదిన పేరుతో నా మీద పేరడీలు వ్రాసారు. స్పందిస్తే వాళ్ళ బతుకు ఏమిటో తెలుస్తుంది. కేవలం వదిన-మరుదుల సంబంధం యొక్క పవిత్రతని కాపాడడానికి ప్రవీణ్ చేత నేను నా తల్లిని తిట్టించుకుంటున్నాను అని భరద్వాజ అంటే అది ఎవరూ నమ్మరు కదా.

 44. మూడేళ్ళుగా అతను మా వదిన మీద పేరడీలు వ్రాస్తోంటే నోరుమూసున్నానంటే అది గొప్ప విషయమే కదా. ఇప్పుడు అతన్ని తల్లి పేరుతో తిట్టినా నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు. నేను మూడేళ్ళు ఆగడం వల్ల నాకే మంచి అవకాశం వచ్చింది.

 45. ఏ పరిస్ధితి కోసం రాసినా అది సమర్ధనీయం కాదు ప్రవీణ్.

  కొన్ని విలువలకి కట్టుబడి ఉండడం అన్న లక్షణం ఇలాంటి సందర్భాల్లోనే పరీక్షలకు గురవుతుంది. చాలా పెయిన్‌ఫుల్ గా ఈ పరీక్షలు ఉండొచ్చు ప్రవీణ్. ఆదర్శానికి సంబంధించిన కబుర్లు మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. కాని ఇలాంటి సందర్భాల్లో సంయమనం పాటించకపోతే ఆ కబుర్లకు విలువ ఉండదు.

  ఈ అంశం మీతో పాటు నాకూ, ఇతరులకీ వర్తిస్తుంది.

 46. శ్రావ్యగారూ, నేను పబ్లిష్ చెయ్యకపోతే, ఆ తర్వాత మీ చివరి వాక్యం రాసుండాల్సింది. అయినా, మునిగిందేమీ లేదులెండి.

 47. “అతని ప్రశ్నలకి సమాధానం చెప్పకపోయినా అడిగిన ప్రశ్నలే అరిగిపోయిన రికార్డ్‌లాగ అడుగుతున్నాడు”

  మరి సమాధానం చెప్పలేక దాటేస్తే అదే ప్రశ్న జవాబు వచ్చేదాకా అడుగుతారు ప్రవీణూ. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తీరా అందుకు ఆధారం చూపమంటే వెనకడుగేసింది నువ్వు కాదా? పోనీ సమాధానం చెప్పే ధైర్యం లేదని ఒప్పుకున్నావా అంటే అదీ లేదు. అంత ధైర్యం లేని వాడివి నీకెందుకు ప్రవీణూ మావోయిజాలు, మట్టిగడ్డలు.

  “మనల్ని మానసిక రోగులు అని అంటూనే మన మీద వాళ్ళు హిస్టీరియా పేషెంట్లలాగ పడి ఏడుస్తారు.”

  ఏంటి నీతో పాటు విశేఖర్ గారిని కూడా మానసిక రోగుల కేటగిరీలో కలిపెశావా?

 48. మీ వాదనను మరోసారి సరిచూసుకోవాలి.

  సమాజం స్త్రీలపైన అణచివేత అమలు చేస్తోందనీ, ప్రతి అంశంలోనూ అది వ్యక్తం అవుతుందనీ భావిస్తున్నప్పుడు ఆ దృక్పధం ఏ సందర్భంలోనూ మసిబార కూడదు. ఇతరులు ఎన్నేళ్లనుండి స్త్రీలను అవమానపరుస్తూ తిట్టినా, మీరు మొన్ననే, ఒక్కసారే తిట్టినా ఇతరులకు సంబంధించినంతవరకూ మీరు చెప్పిన కాలం పోలిక వర్తిస్తుందేమో కానీ, మీకు సంబంధించినంవరకూ అది వర్తించదు. మీ ఐడియాలజీ అన్నది అవతలివారి పద్దతులపైన ఆధారపడదు. మీరు దాన్ని నమ్మడంపైనె ఆధారపడి ఉంటుంది. ఆ ఐడియాలజీకి సమాజంతో సంబంధం ఉన్నదని మీరు గట్టిగా నమ్ముతున్నపుడు అది అన్ని కాలాల్లో కొనసాగుతుంది. ఎందుకంటే ఎవరి బందువైనా స్త్రీయే. ఏ స్త్రీని కూడా మనం చెప్పుకునే సామాజిక చట్రానికి బైటి వ్యక్తిగా చూడలేము. అది కూడా ఆ స్త్రీకి చెందిన మగ సంబంధీకులను బట్టి అస్సలు చూడలేము.

  మీరు అతని తల్లిగారిపైన ఏమన్నా రాస్తే వాటిని ఉపసంహరించుకోవడం ఉత్తమం. అలా చేయగలిగితే మీ పైన గౌరవం పెరుగుతుందే గాని తగ్గదు.

 49. మీరు పబ్లిష్ చేయరు అని కాదు నా ఉద్దేశ్యం , మీ టపా కి సంభంధం లేనిదన్న ఉద్దేశ్యం తో రాసాను .
  Thanks for publishing it !

 50. ఎవరి బంధువు అయినా స్త్రీ స్త్రీయే. నేను ఎన్నడూ కాదనలేదు. కానీ భరద్వాజ “నేను వదిన-మరుదుల సంబంధం యొక్క పవిత్రతని కాపాడడానికే ప్రవీణ్ అనే పిచ్చోడి చేత నా తల్లిని తిట్టించుకున్నాను” అని అంటే అతని మాటలు ఎవరైనా నమ్మగలరా? అతని అనుచరులు నమ్ముతారు అనేది వేరే విషయం. ఒకవేళ నేను నిజంగా పిచ్చోడినైనా భరద్వాజ కేవలం వదిన-మరుదుల సంబంధం యొక్క పవిత్రతని కాపాడడానికి నన్ను రెచ్చగొట్టి తన తల్లిని తిట్టించుకున్నాడంటే ఎవరూ నమ్మలేరు కదా. తల్లి-కొడుకుల సంబంధం కంటే వదిన-మరుదుల సంబంధమే గొప్పది అని అంటే ఎవరు నమ్మగలరు?

 51. ఈ సమాధానం నాకు ముందే తెలుసు. నేను మూడేళ్ళు ఆగితే నాకు ఈ సమాధానం చెప్పే అవకాశం వస్తుందనే మూడేళ్ళు ఆగాను కానీ సమాధానం తెలియక కాదు.

 52. శంకర్, నీకు హిస్టీరియా ఉంది కాబట్టే నీ వ్యాఖ్యలు ఎన్ని సార్లు స్పామ్‌లోకి వెళ్ళిపోయినా అరిగిపోయిన రికార్డ్‌లాగ అవే వ్యాఖ్యలు వ్రాసావు. నీ ఈ-మెయిల్ అడ్రెస్ నా అడ్రెస్ బుక్‌లో లేదు. నీ వ్యాఖ్యలు ఆటోమేటిక్‌గా స్పామ్ బిన్‌లోకి వెళ్ళిపోతాయి. గతంలో నల్లాన్ చక్రవర్తుల కిరణ్ గారి ఈ-మెయిల్ అడ్రెస్‌ని అడ్రెస్ బుక్‌లో యాడ్ చెయ్యకముందు అతని వ్యాఖ్యలు కూడా స్పామ్‌లోకి వెళ్ళిపోయాయి. మొదట్లో వ్రాసిన వ్యాఖ్యలు మాత్రమే కనిపించాయి. కొత్త వ్యాఖ్య వచ్చినప్పుడు ఫోన్‌లో డేటా ట్రాన్స్ఫర్ పెరిగి ఫోన్ యొక్క నెట్ కనెక్షన్ బిల్ పెరిగిపోతుంది. నా ఫోన్‌లో కొత్త వ్యాఖ్యలు ఆటోమేటిక్‌గా లోడయ్యే సౌకర్యం ఉంది కాబట్టే నీ ప్రొఫైల్ బ్లాక్ చేశాను. అంతే.

 53. శ్రావ్య వాళ్ళ బావగారి మీద పేరడీలు వ్రాస్తానన్నాను కానీ శ్రావ్య వాళ్ళ బావగారి పేరు వ్రాయలేదు. అయినా శ్రావ్య గారు అభ్యంతరం ఎందుకు చెప్పినట్టు?
  ———————————————————–
  శ్రావ్య మీ మీద పేరడీలు రాసారా? ఎప్పుడు? నేనెప్పుడూ శ్రావ్య పేరడీలు రాయగా చూడలేదే. మరి మీరు వాళ్ళ బావగారి మీద తన మీద ఎందుకు రాయాలనుకున్నారు? శ్రావ్య అభ్యంతరం చెప్పటంలో అభ్యంతరం ఏముంది? మీకా ఆలోచన రావటం అభ్యంతరకరం కానీ శ్రావ్య అభ్యంతరంలో తప్పేముంది?

  నేను మళ్ళీ అడుగుతున్నాను. మీ వదినగారి పేరు పెట్టి ఎవరైనా పేరడీలు రాశారా? నాకు తెలిసి భరద్వాజకి మీ వదిన గారి పేరు కాదు కదా ఆవిడ ఉందన్న విషయం కూడా తెలిసుండదు. పేరడీలు రాసినవి మీ కథల మీద. కథలో పాత్రల మీద. unless, మీ కథల్లో వదిన పాత్రకి మీ వదిన గారి పేరు పెట్టి ఉంటే తప్ప. మీ కథల్లో అక్రమ సంబంధం పెట్టుకున్న పాత్రలకి మీ వదిన గారి పేరు పెట్టారా? If so, that explains. అలాంటప్పుడు మీ వదిన గారి పేరు మీద పేరడీలు రాసినట్టు వాళ్ళనెలా అనగలరు?

 54. గతంలో అతని ఫ్రెండ్ శరత్ కూడా అతనికి అదే విషయం చెప్పాడు. “పిచ్చోడి మీదకి రాయి విసిరితే వాడు తిరిగి నీ మీదకే రాయి వేస్తాడు కానీ వాడు మారడు” అని. ఒకవేళ నేను నిజంగా పిచ్చోడినని నమ్మితే నా మీదకి రాయి విసరడం అనవసరం కదా. మంచోడి మీదకే రాయి విసిరి వాడు పిచ్చోడు కాబట్టే వాడి మీదకి రాయి విసిరాను అని చెప్పుకుంటున్నాడు.

 55. ఇప్పటికీ నువ్వు నేను అడిగినదానికి జవాబు చెప్పకుండా దాటేస్తున్నావు ప్రవీణ్

 56. పద్మగారూ ప్రవీణ్ ‘నేను అతని తల్లిగారి పేరు పెట్టాను’ అని అంటున్నది నిజంగా ‘తల్లిగారి పేరు’ అని కాదులా ఉంది. అతని తల్లిని ఉద్దేశించి తిట్టాను అనడానికి ‘తల్లి పేరు పెట్టి తిట్టాను’ అని ప్రవీణ్ అంటున్నట్లు నాకు తోస్తోంది.

  ఏమైనా, ఈ తల్లి, వదిన, మరదలు, వీరంతా బ్లాగ్స్ లో జరుగుతున్న వాటికి సంబంధం లేనివారు. అందునా స్త్రీలు. వారిపైన ఇంత చర్చ జరగడం భావ్యం కాదేమో. నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రచురించలేదు అంటారని మీ ఇద్దరి వాదనలను ప్రచురిస్తున్నాను. దయచేసి అర్ధం చేసుకొండి.

 57. మీరు అతని తల్లిగారిపైన ఏమన్నా రాస్తే వాటిని ఉపసంహరించుకోవడం ఉత్తమం.
  ——————————————————————————————-
  ఏమన్నా రాస్తేనా? ప్రవీణ్ తప్ప ఇంకెవరూ రాయలేరన్నంత చండాలం అది. ఉపసంహరించుకోవడమే కాదు. భరద్వాజ వాళ్ళ అమ్మగారికి సారీ కూడా చెప్పాలి. ఒక వేళ చేసింది తప్పు కాదు అనుకుంటే ఎందుకు అలాంటి రాతలు రాసాడో సాక్ష్యం చూపించాలి. అది తప్పు కాదు అనుకున్నప్పుడు దారి తీసిన పరిస్థితులని నిరూపించుకోవాలి లేదా చేసింది చండాలమైన తప్పు అని ఒప్పుకోవాలి.

 58. భరద్వాజ వాళ్ళ అమ్మగారి పేరు సీతామహాలక్ష్మి గారు. ఆవిడ పేరు పెట్టి నిన్న గాక మొన్న చాలా చండాలంగా రాశాడు. “ఉద్దేశించి” అన్నది ఎంత మాత్రమూ కాదు. డైరెక్ట్‌గా పేరు పెట్టి రాశాడు. అందుకే అడుగుతోంది. వాళ్ళ వదిన గారి పేరు పెట్టి ఎవరు పేరడీలు రాశారూ అని. సాక్ష్యం చూపించగలడా?

 59. పేరు వ్రాసినా, వ్రాయకపోయినా పేరడీ అనేది తిట్టే విధంగా ఉంటుంది కాబట్టే శ్రావ్య గారి బావ గారి మీద పేరడీ వ్రాస్తానంటే శ్రావ్య గారు అభ్యంతరం చెప్పారు. వదిన-మరుదుల సంబంధానికీ, బావ-మరదళ్ళ సంబంధానికీ మధ్య తేడా ఏమీ లేదని అప్పుడు గుర్తొచ్చినట్టు ఆవిడ మాట్లాడారు.

 60. విశేఖర్ గారూ మధ్యలో కలుగజేసుకుంటున్నందుకు క్షమించాలి. ప్రవీణ్ పచ్చి బూతులు తిడుతోంది అక్షరాలా ఇంటిపేరుతో సహా అతని తల్లి గారి పేరుని ఉపయోగించే. మరి ఇది ఏవిధమైన స్త్రీవాదం కిందకి వస్తుందో నాకు అర్థం కాదు.

 61. ఈ లింక్ చదవండి: http://sarath-kaalam.blogspot.com/2010/11/blog-post_22.html
  ఈ చర్చ జరుగుతున్నప్పుడు కూడా సీతామహాలక్ష్మి గారిని నేను తిట్టలేదు. కానీ తరువాత ఆవిడ పేరు డైరెక్ట్‌గా ఉపయోగించి ఎందుకు తిట్టానో అర్థమవుతుంది. కల్పన గారు వ్రాసిన తన్‌హాయీ నవల విషయంలో ఏదో గొడవ జరిగింది. ఆ నవలలో కేవలం ఒకటి రెండు ఎపిసోడ్లు చదివిన నాకు ఆ గొడవ ఎందుకు జరిగిందో తెలియదు. నేను ఆ నవల చదవలేదు అని అక్కడ కామెంట్ వ్రాస్తే నేను సంబంధం లేని కామెంట్లు వ్రాస్తున్నానంటూ నా కామెంట్ డిలీట్ చేశారు. ఆ కామెంట్‌ని శరత్ తన బ్లాగ్‌లో ప్రచురించాడు. నేను ఒకప్పుడు కల్పన గారి బ్లాగ్‌లో రెగ్యులర్‌గా కామెంట్లు వ్రాసేవాణ్ణి కానీ ఆవిడ వ్రాసిన తన్‌హాయీ నవల మాత్రం ఒకటిరెండు ఎపిసోడ్లు తప్ప వేరేవి చదవలేదు. అయినా ఆ నవల గురించిన గొడవలోకి నన్ను లాగడానికి ప్రయత్నించారు. అలాంటి వాళ్ళకి గడ్డి పెట్టాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులని లాగడం మేలైన మార్గంలా కనిపించింది. అలా చెయ్యకపోతే ఏ గొడవ జరిగినా, దానితో నాకు సంబంధం లేకపోయినా ఆ గొడవలోకి నన్ను లాగుతారు. వాళ్ళు మా వదిన పేరు డైరెక్ట్‌గా ఉపయోగించకపోయినా మా వదిన గారు వాళ్ళు వ్రాసిన పేరడీలు చదివితే బాధపడతారని వాళ్ళకి తెలుసు. అయినా వాళ్ళు మా వదిన పేరుతో పేరడీలు వ్రాసారు. తెలిసితెలిసి గడ్డి తినేవాళ్ళని కుటుంబ సభ్యుల పేరుతో తిట్టడం తప్పు కాదనే అనిపించింది.

 62. పద్మ గారూ, ప్రవీణ్ బూతుల్ని నేను సమర్ధించడం ఏమిటి? అతని పైన నాకున్న అభిప్రాయాలు చెప్పాను. అవి మీకు నచ్చకపోతే వదిలెయ్యండి.

  ———————————————————–
  మీ అభిప్రాయాలు నాకు నచ్చటం అన్నది సెకెండరీ. మీరు ప్రవీణ్‌ని ప్రతి చోట సమర్ధిస్తూ వస్తున్నారు. అతను చేసిన పని తప్పు అని మీరు ఎక్కడా అనలేదు. సరే అది కూడా మీ అభిప్రాయమే. ఇన్‌ఫాక్ట్ అతను బూతులు రాయటం గురించి కూడా మీరు ఒకచోట అతని కుటుంబం మీద రాశారు కాబట్టి అతను వాళ్ళ మీద రాశాడు అని అన్నారు. అంటే అతని బూతుల్ని, మాటల్ని సమర్ధిస్తున్నట్టే కదా? అతని కుటుంబ సభ్యుల మీద పేరు పెట్టి రాయటం మీరు చూశారా? చదివారా?

  ఇంటర్నెట్ లో వ్యక్తుల గురించి వారి గుణ గుణాల గురించి చర్చించేంత జ్ఞానం నాకు లేదు.
  ———————————————————————————————————
  అలాంటప్పుడు ప్రవీణ్ ఇన్నొసెంట్ అనీ, అతను ఫలానా పని చేశాడంటే అవతలివాళ్ళు ఇంకోటేదో చేసుంటారనీ ఎలా ఒక కంక్లూజన్‌కి రాగలరు?

 63. వాళ్ళు మా వదిన పేరు డైరెక్ట్‌గా ఉపయోగించకపోయినా మా వదిన గారు వాళ్ళు వ్రాసిన పేరడీలు చదివితే బాధపడతారని వాళ్ళకి తెలుసు. అయినా వాళ్ళు మా వదిన పేరుతో పేరడీలు వ్రాసారు

  ———————————
  డైరెక్ట్‌గా మీ వదిగారి పేరు ఉపయోగించలేదు. కానీ మీ వదిన పేరుతో పేరడీలు రాశారు. పేరు ఉపయోగించకుండా పేరు పెట్టి ఎలా రాస్తారు ప్రవీణ్?

 64. పద్మ గారు, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి:
  >>>>>
  భరద్వాజ “నేను వదిన-మరుదుల సంబంధం యొక్క పవిత్రతని కాపాడడానికే ప్రవీణ్ అనే పిచ్చోడి చేత నా తల్లిని తిట్టించుకున్నాను” అని అంటే అతని మాటలు ఎవరైనా నమ్మగలరా? అతని అనుచరులు నమ్ముతారు అనేది వేరే విషయం. ఒకవేళ నేను నిజంగా పిచ్చోడినైనా భరద్వాజ కేవలం వదిన-మరుదుల సంబంధం యొక్క పవిత్రతని కాపాడడానికి నన్ను రెచ్చగొట్టి తన తల్లిని తిట్టించుకున్నాడంటే ఎవరూ నమ్మలేరు కదా.
  >>>>>

 65. పేరు వ్రాసినా, వ్రాయకపోయినా పేరడీ అనేది తిట్టే విధంగా ఉంటుంది కాబట్టే శ్రావ్య గారి బావ గారి మీద పేరడీ వ్రాస్తానంటే శ్రావ్య గారు అభ్యంతరం చెప్పారు. వదిన-మరుదుల సంబంధానికీ, బావ-మరదళ్ళ సంబంధానికీ మధ్య తేడా ఏమీ లేదని అప్పుడు గుర్తొచ్చినట్టు ఆవిడ మాట్లాడారు.
  ————————————————————
  పాడిందె పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టు మాట్లాడి పాయింటు డీవియేట్ చెయ్యద్దు ప్రవీణ్.
  శ్రావ్యకి పేరడీలకి సంబంధం లేదు. ఆ అమ్మాయి ఎప్పుడూ పేరడీలు రాయలేదు. సో, తను అభ్యంతరం చెప్పటంలో తప్పు లేదు. లాబట్టి అది పక్కన పెడదాం. మీ వదిన గారిపేరు ఉపయోగించి కానీ మీ కుటుంబసభ్యులు అని చెప్పి కానీ పేరడీలు రాయనప్పుడు. మీరెందుకు సీతామహాలక్ష్మి గారి మీద బూతులు రాశారు?

 66. ప్రవీణ్, బహుశా కోపంలో మీరు అలా భావించి ఉండవచ్చు. కోపంలోనైనా మన విలువల్ని వదులుకోకూడదన్నదే నేను చెప్పదలిచాను. అతని తల్లి పేరుని నేరుగా ప్రస్తావిస్తూ తిట్టడం సరికాదు ప్రవీణ్. అదింకా ఘోరంగా తోస్తోంది. ఓ వ్యక్తిపై కోపంతో ఆవేశంలో ‘నీ….’ అంటెనే మనం వ్యతిరేకించాలనీ, అది పురుషాధిక్య భావాజాలానికి చిహ్నమనీ నమ్ముతున్నపుడు ఏ పరిస్ధితిలోనూ ఒక వ్యక్తి చేస్తున్నపనులకి అతని తల్లి పేరును నేరుగా లాగడం భావ్యం కాదు. ఏ పరిస్ధితుల్లో అలా చేసిందీ చెప్పాలని పద్మ గారు కోరుతున్నారు. ఆ సందర్భం చూపినట్లయితే మీ కోపం అర్ధం చేసుకోదగిందిగా కనిపించవచ్చునేమో గానీ అప్పుడు కూడా తల్లి పేరు నేరుగా చెప్పి తిట్టడం సరి కాదు.

  ప్రవీణ్, మీరు స్వతహాగా స్త్రీలను గౌరవించే వ్యక్తి అని నా అవగాహన. మీ భావజాలం ఇంకా మరికొన్ని ప్రగతిశీల అంశాలను కలిగుంది. ఇలాంటి తప్పు ఒకటైనా, రెండైనా మీరు చేయదగింది కాదు. మీరు క్షమాపణ చెప్పినా అది అతని తల్లిగారికి చెబుతున్న క్షమాపణ గానే గుర్తించి ఆ పని చెయ్యమని నా సలహా. మిమ్మల్ని గొడవల్లోకి లాగుతున్న వారి వ్యవహారం ఇప్పటికే బ్లాగర్ల దృష్టిలో ఉంది. అది కొత్తది కాదు. ఆ అంశాలపైన ఎవరికీ గౌరవం ఉంటుందని నేను అనుకోను. అవసరం కోసం గౌరవం ఉంచుకుంటున్నవారిని మీరు పట్టించుకోవడం అనవసరం. ఆ ప్రసక్తే మీకు అవసరం లేదు. మీ బంధు స్త్రీలపైన వ్యాఖ్యలు చెయ్యడం… అవన్నీ లేకితనమే. అనుమానం లేదు. కాని మీరు కూడా…

 67. భరద్వాజ గత మూడేళ్ళ నుంచి “ప్రవీణ్ తన వదినలకి లైన్లు వేస్తున్నాడు, వదినలనే కామిస్తాడు” అంటూ వ్రాసాడు. నేను కేవలం మూడు నెలలుగా మాత్రమే సీతామహాలక్షి గారి గురించి చెత్తగా వ్రాసాను. మూడేళ్ళు ఎక్కడా, మూడు నెలలు ఎక్కడ? పేరు డైరెక్ట్‌గా వ్రాసినా, వ్రాయకపోయినా మా వదిన గారు అవి చదివితే బాధపడతారు.

 68. అది ప్రశ్నా? First of all, భరద్వాజ ఆ మాట ఎప్పుడన్నారు? He never said that and he will never say that. Trust me on that. సో, భరద్వాజ అనని మాటని ఎవరైనా నమ్ముతారా అని అడగటం అనవసరం కదా ప్రవీణ్.

 69. ప్రవీణ్, బహుశా కోపంలో మీరు అలా భావించి ఉండవచ్చు.
  ——————————————————————–
  ఇక్కడ కూడా మీరు ఒక కంక్లూజన్‌కి వచ్చేస్తున్నారు. newayz, let us not go away from the point. సో, ప్రవీణ్, మీ వదిన గారి పేరు ఉపయోగించి డైరెక్ట్‌గా పేరడీలు ఎవరూ రాయనప్పుడు, మీరు అనవసరంగా సీతామహాక్ష్మి గారిని అన్ని అనకూడని మాటలు ఎందుకన్నారు? అన్నదుకు ఆవిడకి బ్లాగ్ముఖంగా క్షమాపణలు చెప్పాలని విశేఖర్ గారు కూడా అంటున్నారు. సో, క్షమాపణ ఎక్కడ చెప్తున్నారు?

 70. నేను బ్లాగర్‌ననే విషయం మా వదిన గారికి తెలుసు. ఒకవేళ ఆవిడ తెలుగు బ్లాగులు ఓపెన్ చేసి నా మీద వ్రాసిన పేరడీలు చదివితే ఆవిడ బాధపడతారు. కుటుంబ సభ్యుల గురించి చెత్తగా వ్రాసిన వ్రాతలు చదివితే ఎవరికైనా బాధ కలుగుతుంది. మా కుటుంబ సభ్యులని బాధ పెట్టే విషయాలు మీరు వ్రాసినప్పుడు మీ కుటుంబ సభ్యులని బాధ పెట్టే విధంగా నేను వ్రాయడం తప్పెలా అవుతుంది?

 71. ఇవి వాళ్ళు అక్కడ వ్రాసిన చెత్త కామెంట్లకి నిదర్శనాలు
  >>>>>
  Malakpet Rowdy said…

  Speaking for myself, yes I m moron 🙂 A thick skinned one :p

  I cant match Praveen n Praveena ( lady Praveen) in logic.
  December 21, 2010 10:33 PM
  Blind బేకార్ said…

  “Domga perlayinaa pettukondehe”

  Okay!
  Blind బేకార్
  December 21, 2010 10:33 PM
  Malakpet Rowdy said…

  By the way Praveena akkai has another name

  SSL (Snow’s Sister in Law) – adey Manchu gaari Vadina :p
  >>>>>

 72. పద్మ గారూ, ఈ వ్యాఖ్య ఎప్పుడు రాశారో చూసుకోలేదు.

  ప్రవీణ్ ని ప్రతిచోటా ఎక్కడ సమర్ధించాను? ఆశ్చర్యంగా ఉంది.

  నాపైన జరిగిన దాడివరకు నాకు పూర్తి మద్దతు ప్రవీణ్ నుండి వచ్చింది. నేను ప్రవీణ్ కి మద్దతు ఇస్తున్న కొత్త బ్లాగర్ని అని భ్రమించినందువల్ల నాపైన దాడి జరిగిందని ఆ తర్వాత అర్ధం అయింది. ఐనప్పటికీ ప్రవీణ్ భావజాలానికి మద్దతు ఇస్తున్నంత మాత్రాన నాపైన దాడి చేసేస్తారా? అదీ అసభ్యంగా? నేను ప్రవీణ్ ని గౌరవించడం అన్నది అతని భావజాలంపైనే ఆధారపడి ఉంది తప్ప అతను నాకిస్తున్న మద్దతు పైన కాదు.

  ఇప్పటికీ నేను నమ్ముతున్న విషయం ఏమిటంటే ప్రవీణ్ కి చాలామందికి లెని అభ్యుదయ భావాలు ఉన్నాయి. ఇప్పటి సామాజిక పరిస్ధితుల్లొ అటువంటి అభ్యుదయ భావాలు కలిగి ఉండడం అరుదుగానే ఉంటుంది. కనుక అటువంటి వ్యక్తులని ఆ అభ్యుదయ రంగాల్లో ప్రోత్సహించాలన్నది నా అవగాహన. అతను మార్క్సిస్టు సాహిత్యాన్ని చదివి దాని అవసరం సమాజానికి ఉన్నదని గుర్తించిన వ్యక్తి. ఆ రీత్యా కూడా అతనిపైన నాకు గౌరవం.

  ఐతే ఇలా స్త్రీల పెర్లు పెట్టి మరీ తిడుతున్న ఘటన తప్పనిసరిగా ప్రవీణ్ సవరించుకోవలసిన అంశం. అది ప్రవీణ్ మనః పూర్వకంగా చేశాడని నేను భావించడం లేదు. ఓ వ్యక్తిపైన కోపంతో చేశానని తనే చెబుతున్నాడు. అయినా అది తప్పే. ఈ సంఘటన ప్రవీణ్ పైన నా గౌరవం పలచపడడానికి దోహదం చేస్తుంది. దానినతను సవరించుకోవడమే మిగిలిన మార్గం.

  ప్రవీణ్ కుటుంబం పైన రాశారు కనుకనే అతను తిరగబడ్డాడని ఇప్పటికీ చెబుతున్నా. ఒక వ్యక్తిని కావలసినంత రెచ్చగొట్టి, ఒక బలహీనతకు గురి చేసి, అందులోనుండి ఇలాంటి వ్యాఖ్యలు రాబట్టడం నేనూ ఎదుర్కొన్నాను. నా స్వంత అనుభవం నుండే నేను ప్రవీణ్ విషయం అర్ధం చేసుకున్నా తప్ప కేవలం ప్రవీణ్ చెప్పిన మాటల్ని నమ్మి మాత్రమే కాదు. ఈ సంగతి మీరు గుర్తించాలి. నా పైనా, ప్రవీణ్ పైనా జరిగిన దాడి విషయం పక్కనబెట్టి అటువంటి దాడులకు వస్తుందన్న స్పందనలను మాత్రమే పట్టించుకోవడం అంటే నాణానికి ఓవైపు మాత్రమే చూడడం. వారేం దాడి చేశారు, దానికి సాక్ష్యాలు చూపండి అనడిగితే నేను అందరికీ చెప్పను. ఎవరైనా పెద్దలు, ఇటువంటి వ్యవహారం ఇకముందు బ్లాగుల్లో జరగకూడదు అన్న దృక్పధంతో పూనుకుని అందుకు కృషి చేస్తున్నట్లయితే నేను నా దగ్గర ఉన్న సాక్ష్యాలు చూపిస్తా. ఎందుకంటే కేవలం అవతలివారిని ఏదో విధంగా సమర్ధించడానికే వస్తున్నవారిని నేను ఎంటర్ టెయిన్ చేయలేను.

  “అతని కుటుంబం మీద రాశారు కాబట్టి అతను వాళ్ళ మీద రాశాడు అని అన్నారు. అంటే అతని బూతుల్ని, మాటల్ని సమర్ధిస్తున్నట్టే కదా?”

  ఎలా అవుతుంది పద్మగారూ? అలా నేనన్నానంటే ఆ అంశాన్ని మొదటినుందీ పరిశీలించమని చెప్పానని అర్ధం. దానర్ధం అదే. అందులో మీకు ప్రవీణ్ కి నేనిస్తున్న మద్దతు మాత్రమే కనిపిస్తోందా? ఇది చాలా ఘోరం. దీన్ని బట్టి మీరు కూడా ప్రవీణ్ వ్యతిరేకుల్ని పూర్తిగా సమర్ధిస్తున్నారని ముద్ర వేయవచ్చా?

  ఇంతకీ మీరు ప్రవీణ్ అలా తల్లిగారి పేరు పెట్టినందునే రియాక్ట్ అవుతున్నారా లేక ఆ గ్యాంగ్ వ్యవహారం మొత్తానికి మద్దతు వస్తున్నారా? నేను ఇప్పటివరకూ మొదటి అంశం వల్లనే మీరు రియాక్ట్ అవుతున్నారని భావిస్తున్నా. ఇతరులని అన్ని కోణాలనుండీ చూసినట్లే ప్రవీణ్ ని కూడా అన్ని కోణాలనుండీ నేను చూస్తాను. ప్రవీణ్ ఒకానొక బలహినత నుండే ఇలా వ్యక్తిగతంగా దూషిస్తున్నాడనే నేను నమ్ముతున్నా. అందుకు సరిపడా అనుభవం నాకు ఉంది.

  నెట్ కోసం నాకుండే సమయం తక్కువ. ఇలా సెలవు పెడితే తప్ప అన్నీ చూడలేను. ఇప్పటికీ నా బ్లాగ్ వరకే చూడగలుగుతున్నా తప్ప ఇతర బ్లాగ్స్ కి వెళ్ళి ఏం జరుగుతున్నదీ చూసే అవకాశం నాకు లేదు. కనుక ప్రతీచోటా ప్రవీణ్ ని సమర్ధించడం నాకు సాధ్యం కానిపని.

 73. ప్రవీణ్ మీరు భరద్వాజ్‌గారి తల్లిగారి గురించి రాసిన నీచమైన రాతలు నేను చదివాను. గతంలో మీకు, వారికి ఏమి జరిగిందో నాకు తెలియదు. మీతో నాకు పరిచయం గానీ, మీ మీద వ్యక్తిగత ద్వేషం గానీ లేవు. ఇది కేవలం మీకు నేనిచ్చే సలహా మాత్రమే. మేధావిలా కబుర్లు చెప్పడం, కామెంట్లు పెట్టడం కాదు మాటలు అదుపులో పెట్టుకుని, పొదుపుగా వాడుకుంటేనే గౌరవం నిలబడుతుంది. మీ అభిప్రాయాలని ఎక్కడైనా, ఎలా అయినా వ్యక్తపరిచే హక్కు మీకుంది. కానీ ఒక బ్లాగ్‌లో ఒకరి తల్లి గురించి అంత నీచమైన కూతలు కూసే స్వేఛ్ఛ మాత్రం మీకు లేదు. ఇది మీ ఇద్దరి మధ్య వ్యవహారం అని మీరు అనుకోవచ్చు. కానీ నలుగురి మధ్య రాతలు రాసేటప్పుడు నియంత్రణ కోల్పోతే ఎవరైనా నిలదీసి అడగక తప్పదు. మీ పద్ధతి మార్చుకుంటే మీ మర్యాద నిలబడుతుంది. లేకపోతే మీ ఖర్మ..

 74. భరద్వాజ గత మూడేళ్ళ నుంచి “ప్రవీణ్ తన వదినని కామిస్తున్నాడు” అంటూ పది మందినీ వెంటేసుకుని మరీ వ్రాస్తున్నాడు. పది మంది వెనకాల ఉంటే ఏమి వ్రాసినా చెల్లిపోతుంది అనుకునే ఆ అడవి మనిషిని తిట్టడానికి అతని తల్లిని లాగడం నాకు తప్పని ఎలా అనిపిస్తుంది?

 75. ఇక్కడ ‘బహుశా’ అనీ, ‘భావించి ఉండవచ్చు’ అని రెండు పదాలు సంశయాత్మకంగా రాసాను. ఐనా మీకు కంక్లూజ్ చేసినట్లు ఎలా అనిపిస్తోంది? నాక్కూడా తెలియని నా అంతరంగమా ఇది? పద్మ గారూ.

 76. డైరెక్ట్‌గా వ్రాయకపోయినా మా వదిన గారు ఆ పేరడీలు చదివితే బాధపడతారు. వైజాగ్‌లో మా బంధువులకి కూడా ఇంటర్నెట్ కనెక్షన్‌లు ఉన్నాయి. వాళ్ళు చదవరని గ్యారంటీ లేదు. మార్క్సిజం విషయంలో నన్ను విమర్శించడం చేతకాకపోతే అది వాళ్ళ సమస్య కానీ వాళ్ళ వ్రాతలు చదివి మా వదిన గారు బాధపడాలా? మీ బావ గారి పేరు కూడా నాకు తెలియదు. అయినా నేను పద్మా నారుమంచి అనే అమ్మాయి తన బావ గారికి లైన్ వేస్తోంది అని వ్రాసాననుకోండి, అది మీ బావ గారు చదివితే ఎలా ఉంటుందో ఊహించండి.

 77. ఒక గ్లాసు మంచినీళ్లు తాగి, బుర్ర స్థిమితపడ్డాక మీరు రాసిన కామెంట్ మీరే చదువుకోండి. ఎవరో ఏదో అన్నారు కాబట్టి వాళ్ల తల్లిని, చెల్లిని తిడితే తప్పేంటి అంటున్నారు. నిజంగా వాళ్ళా మాట అన్నారో లేదో మీరు ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా చూపించలేదు. ఒకవేళ తప్పు వాళ్లదే అయినా కూడా సంస్కారవంతుణ్ణని మెడలో బోర్డు తగిలించుకు తిరుగుతారు మరి మీ బుద్ధి ఏమయింది? అంటే మీరు చెప్పినదాని ప్రకారం ఇప్పుడు మీరు భరద్వాజ్ తల్లిని తిట్టారు కాబట్టి, ఆయన కూడా మీ తల్లిని తిడితే చెల్లుబాటు అయిపోతుందా? అప్పుడు మీ లాజిక్ ప్రకారమే జరిగింది కాబట్టి మీరు నోరు మూసుకుని ఉంటారా? ఫెమినిస్ట్‌నని చెప్పుకుంటూ పేద్ద పేద్ద పోస్ట్‌లు, కామెంట్లు రాసే మీరు ఆడవాళ్ల గురించి, అందులోనూ వయసులో పెద్దవారి గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నారే.. మీ మాటలకీ, చెతలకీ మీకైనా పొంతన దొరుకుతోందా?

 78. మీ వదిన గారి పేరు పెట్టి బూతులు రాస్తే దానికి ప్రతిగా భరద్వాజ వాళ్ళ అమ్మగారిని మీరు నానా మాటలన్నారని అన్నారు. Show the proof. ఇదొక్కటే మొదటినించి అడుగుతున్నాను. If you cannot prove it, you have to apologize to her. అప్పుడు మీ వదినగారిని అన్నారనీ, ఇప్పుడు ఇంకొకరెవరినో అన్నారనీ ఇష్టం వచ్చినట్టు నాలిక తిప్పద్దు. అనవసరంగా, ఒక పెద్దావిడని, తల్లి స్థానంలో ఉన్నావిడని నోటికి వచ్చినట్టు చండాలం మాట్లాడటం చెయ్యకూడని నేరం.

 79. మూడేళ్ళు నిగ్రహం పాటించానంటే నాకు ఎంత సహనం ఉందో అర్థమైపోతుంది. ఇంత సహనం ఎవరికీ ఉండదు. ఈ విషయం తెలిసినా తెలియనట్టు నటిస్తూ నేను సీతామహాలక్ష్మి గారిని అన్నానని మీరు ఏడుపు.

 80. రాసినదానికి ప్రూఫ్ ఉందా? ఒకవేళ రాశారనుకున్నా, అవి మీ రాతల గురించి. ఒక రచయిత రాసిన కథకి అనేక రకాల స్పందనలొస్తాయి. ఆ రకాల స్పందనలు వద్దు అనుకున్నప్పుడు అటువంటి రచనలు మానెయ్యాలి. అంతే కానీ నా రచనలని అంటే నన్ను అన్నట్టే కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని బజారుకి ఈడుస్తాను అనటం తెలివితేటలనిపిస్తున్నాయా? మీ రచనలని బట్టి వచ్చిన అలాంటి కామెంట్స్ చదివితేనే మీ వదిన గారు బాధపడతారు అనుకున్నప్పుడు ఆ రచనలు చదివితే ఇంకెంత బాధ పడతారో తెలిసిందా మీకు? ఆ రచనలు ఆవిడని ఉద్దేశించినవి కావని ఆవిడకి తెలిసినప్పుడు, ఈ కామెంట్స్ మటుకు ఆవిడని ఉద్దేశించినవి అని ఎందుకనుకుంటారు? ఎందుకు బాధ పడతారు?

 81. అశ్లీల భాష గురించి రంగనాయకమ్మ గారు ఓ వ్యాసం వ్రాసారు. ఆ వ్యాసం టైటిల్ “స్త్రీలని కించపరిచే భాషని ఉపయోగించడం ప్రజాపంథాయేనా?” అని. ఆ వ్యాసంలో గద్దర్ అనే విప్లవ కవిని విమర్శించినప్పటికీ అందులో ఇంకో విషయం వ్రాసారు “పేదవాడు లంజకొడకా, నాకు ఆకలేస్తోందిరా అని అంటే అతను ఎంత ఆకలితో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు” అని. నా మీద గత మూడేళ్ళుగా పేరడీలు వ్రాస్తున్నవాళ్ళని బూతులు తిట్టానంటే నేను ఎంత కోపంలో ఉన్నానో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా.

 82. మీ అంతరంగాన్ని నేనెలా ఆవిష్కరించగలను విశేఖర్ గారూ. మీ అంతరంగాన్ని చదవగల తీరిక, ఓపిక, ఇంట్రెస్టు, అవసరం ఏవీ లేవు. నేనన్నది ప్రవీణ్‌కి మతి భ్రమించో బుఱ్ఱ చెడిపోయో ఆ మాటలు అని ఉంటాడేమో అనకుండా “కోపంతో అని ఉంటారు ” అని అన్నారు చూశారూ, దానికి అన్నాను. ఒక ఆడ మనిషి, పెద్ద వయసులో ఉన్న ఆవిడని అన్ని మాటలు అన్నారంటే ఎవరికైనా ఫస్ట్ అనిపించేది నేను ఐన అన్న మాటలే. కోపం అని ఎవరూ అనుకోరేమో. ఇలాగే ఒక కామెంటులో ప్రవీణ్ ఇన్నొసెంట్ కాబట్టి అలా చేశాడు/అన్నాడు అన్నారు (ప్రవీణ్ ఇన్నొసెంట్ అని మీరే ఫిక్స్ అయిపోయి.) బట్ వెంటనే నేనేం ఇన్నొసెంట్ కాను అని ప్రవీణ్ ముక్కలు చేశారనుకోండి. అది వేరే విషయం.

 83. మా వదిన గారి పేరు ఏమిటి అనేది ఇక్కడ అనవసరం. నీహారిక గారిని మా వదిన గారితో ఎందుకు పోల్చారు? ఇంకొకరిని తిట్టడానికి ప్రవీణ్‌ని, అతని వదినని అడ్డం పెట్టుకోవడమే కదా అది.

 84. చాలా బ్లాగుల్లో మీ కామెంట్లు చూశాను. ఇంత అసందర్భమైన కామెంట్లు పెట్టేది ఆంధ్రదేశంలో బహుశా మీరొక్కరే అయ్యుంటారు. పైగా ఏ బ్లాగ్‌లో కామెంట్ పెడితే అక్కడ పెద్ద రచ్చ. అందుకైనా బ్లాగర్లందరూ కలిసి మీకు… మిమ్మల్ని కామెంట్లు పెట్టకుండా బ్లాక్ చేసే పరిస్థితి తెచ్చుకోకండి.

 85. 1. సో, మీ వదిన గారి పేరు పెట్టి పేరడీలు రాశారు కాబట్టి మీరు భరద్వాజ అమ్మ గారి గురించి లేకిగా రాశారు అన్నది అబధ్ధం అన్నమాట. కరక్టే కదా?

  2. మీరు బ్లాగర్ అన్న విషయం ఆవిడకి తెలిసినప్పుడు, మీ రచనలు కూడా చదివే ఉంటారు కదా? మరి మీ రచనలు చదివి బాధ పడని వారు ఈ పేరడీలుచ్ హదివితే బాధ ఎలా పడతారు?

 86. మా బావగారు ఏవీ బాధపడరు. రాసినవాడి బుఱ్ఱ ఎంత చండాలంతో నిండి ఉందో కదా అనుకుంటారు. ఎందుకంటే నేనేంటో ఆయనకి తెలుసు కాబట్టి.

 87. ఏ విషయంలో నిగ్రహం? మీ వదిన గారి పేరు ఎక్కడా వాడలేదని మీరే అంటున్నారు. మీ వదిన గారి పేరూ ఊరూ కూడా ఎవరికీ తెలియవు. రాసిన పేరడీలు మీ వదిన గారి మీదే అని సాక్ష్యాలు చూపించలేకపోతున్నారు. ఇంక ఏం నిగ్రహం? ఏ విషయంలో నిగ్రహం?

 88. సహనమా..??? మీరు ఒక పని చెయ్యండి. వైజాగ్‌లో మంచి బుక్‌స్టోర్‌కి వెళ్లి తెలుగు నిఘంటువు ఒకటి కొనుక్కోండి. అందులో సహనంలాంటి పెద్దపెద్ద పదాలకు అర్థాలు ఉంటాయి. ఇక మీదట ఏదైనా రాసేటప్పుడు అది ఒకసారి చదూకుని రాయండి. కొన్నాళ్లకి తిన్నగా రాయడం అదే అలవాటవుతుంది.

 89. కదా. నేనూ అది అంటున్నది. నాక్కూడా తెలియని అంతరంగం వద్దనే అంటున్నది. నేనన్నది మార్చి రాసేసారు. “మీరు కోపంతో అని ఉండవచ్చు” అనడానికీ “మీరు కోపంతో అని ఉంటారు” అనడానికీ తేడా ఉంది. మొదటిది సంశయం ఐతే, రెండవది పూర్తి నిర్ధారణ కాకపోయిన ఒక విధమైన నిర్ధారణ. ఏ నిర్ధారణనూ నేను చెయ్యలేదు. ప్రవీణ్ తప్పుని తెలియజెప్పే కన్విన్సింగ్ ధోరణితో అది వచ్చింది. మీరిలా ప్రవీణ్ కి వచ్చే ప్రతి సమర్ధింపునూ వ్యతిరేకిస్తారని నాకు తెలియదు.

  “ఒక ఆడ మనిషి, పెద్ద వయసులో ఉన్న ఆవిడని” అనాలి అన్న ఉద్దేశ్యంతో ప్రవీణ్ అన్నాడనా మీ ఉద్దేశ్యం.

  మీరనుకున్నవే అందరూ అనుకోవాలంటారా?

  ఇందుకే నాకు తెలియని అంతరంగం ఆవిష్కరించవద్దు అంటున్నది. ప్రవీణ్ ఇన్నోసెంట్ అని నేను డిక్లేర్ చెయ్యలేదు. కొన్ని అంశాల్లో అతని ఇన్నోసెన్స్ గురించి చెప్పాను. ఇప్పటికీ చెప్తాను. దానర్ధం ప్రవీణ్ పూర్తిగా ఇన్నోసెంట్ అని డిక్లేర్ చేసినట్లు కాదు. ఇక్కడే మీరు అంటున్నట్లు ‘ముక్కలు చేయడం’ ఉంది చూశారూ. అది కూడా ఇన్నోసెన్సే అని నా అవగాహన. అది ప్రవీణ్ అంగీకరించవచ్చు, లేకపోవచ్చు. అతనిపైన నా అవగాహనకి అతని అంగీకరంతో పని లేదు కదా.

 90. ఆవేశం ఉన్నవాడు మూడేళ్ళు ఆగడు. నేను మూడేళ్ళు ఆగానంటే ఆవేశం నాకు లేదు అనే కదా దాని అర్థం. మూడేళ్ళు నిగ్రహం పాటించిన తరువాత కోపం పెరిగితే వయసు అనేది ఎందుకు గుర్తుంటుంది? మూడేళ్ళు చూసిన హరాస్మెంట్‌కి వెన్జియన్స్ తీర్చుకోవాలనే ఇక్ష మాత్రం ఉంటుంది.

 91. ప్రవీణ్ అతని బంధు స్త్రీలు, మరొకరి బంధు స్త్రీలు… ఇలా వీళ్లపైనే చర్చగా ఈ కామెంట్లు ఉంటున్నాయి. ఈ విధంగా బంధు స్త్రీలపై వచ్చే వ్యాఖ్యలని ఎడిట్ చేస్తాను. ఇప్పటికే ఈ మేరకు విజ్ఞప్తి చేసాను. ఇకనుండి తొలగిస్తాను. మరోలా భావించవద్దని మనవి.

 92. ప్రవీణ్ దీనినే వితండవాదం అంటారు. ఒక్క మాట చెప్పు నీ కథలలో (… ఎడిట్…) బయటకి రా ప్రవీణ్.

  … … అంతెందుకు? ఇందాకా నేను నీ బ్లాగులో పదే పదే ప్రశ్నలు అడిగి విసిగిస్తున్నాను అని నన్ను బ్లాక్ చేశాను అన్నావు, నాకు హిస్టీరియా అదీ ఇదీ అన్నావు. నేను ప్రశ్నలు అడిగినందుకే నీకు అంత కోపం, విసుగు, చిరాకు వస్తే నువ్వు ప్రతి బ్లాగులో ఆ బూతులు పోస్ట్ చేస్తే ఆ బ్లాగర్లకి ఎలా ఉంటుందో ఆలోచించావా? లేక అది సంస్కారం అనుకుని మురిసిపోతున్నావా??

  ఇప్పటికైనా విశేఖర్ గారు చెప్పినట్లు … … ఆవిడకి క్షమార్పణ చెబితే బాగుంటుంది.

 93. నన్ను తిట్టకుండా ఉంటే అతని … నాకు ఉండదు కదా. ఆ విషయం తెలిసే నన్ను తిట్టాడు కదా. ఇందులో నా తప్పేమి ఉంది?

 94. మూడేళ్ళుగా హరాస్ చేస్తూ “మేము వ్రాసినవి పేరడీలు మాత్రమే. వాటిని నోరుమూసుకుని సహించు” అంటే అర్థం చేసుకునే తత్వం ఎవరికీ ఉండదు.

 95. ప్రవీణ్ మీరు ఉపసంహరించుకోవలసింది నేరుగా సంబోధిస్తూ తిట్టడాన్ని. ఇతరులనెవరినైనా బూతులు తిట్టడం సమంజసం కాదనీ, ఆ బూతులు అంతిమంగా స్త్రీలని ఉద్దేశించి ఉండడమే దానికి కారణమనీ మీకు తెలుసు. మీకు తెలిసిన అవగాహన, మీరు అంగీకరించిన అవగాహన అది. ఆ రీత్యానే మీరు మీ తిట్లు ఉపసంహరించుకోవాలి. అలా చేస్తే మీరు గౌరవించే సిద్ధాంతాన్ని మరోసారి గౌరవించినట్లె అవుతుంది.

 96. 2009 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నా మీద వ్రాసిన పేరడీలని డిలీట్ చేస్తేనే నేను నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటాను. సహనం నాకొక్కడికే అవసరం అని అంటే నమ్మడానికి చెవుల్లో పూలు పెట్టుకోలేదు.

 97. నిన్నెవరూ నోరు మూసుకు సహించు అనటం లేదు ప్రవీణ్. చేతనైతే నువ్వు కూడా అలాంటి పేరడీలు రాయి. అంతే కానీ ఇలా కుటుంబ సభ్యులపై అసభ్యమైన భాషతో బూతులు వాడకు. జనాలు నీ సంస్కారాన్ని అసహ్యించుకుంటున్నారు.

 98. విశేఖర్ గారూ మీరు ఇప్పటివరకూ ప్రవీణ్ రాసిన ఆ రాతలని ఎప్పుడూ చూడలేదా? / ఆ ఆడియో లు వినలేదా? లేకపోతే ఒక సారి చూడండి. మీకే తెలుస్తుంది. (సభ్యత కాదని ఇక్కడ ఆ లింకులు ఇవ్వటం లేదు. అర్థం చేసుకోగలరు)

 99. ప్రవీణ్, మీ పైన పేరడీలను ఉపసంహరించుకోవాలన్న మీ డిమాండ్ లో న్యాయం ఉంది.

  తల్లిగారిని నేరుగా సంబోధించడమే బాగాలేదు. ఆ ఒక్క అంశాన్ని ఉపసంహరించుకోవాలి మీరు. అది మీరు పాటిస్తున్న ఒక సమున్నతమైన విలువకు మీరే పట్టం గట్టినట్లవుతుంది.

 100. మూడేళ్ళు నిగ్రహం పాటించినవాడు ఇతరుల గురించి చేసే సంబోధనల గురించి ఎలా ఆలోచిస్తాడు? వాళ్ళు 2009 నుంచి నా మీద వ్రాసిన పేరడీలని డిలీట్ చేస్తే నా వ్యాఖ్యలని కూడా ఉపసంహరించుకుంటాను. నాకొక్కడికే సహనం అవసరం అని అంటే నమ్మడం సాధ్యం కాదు.

 101. రేపు రాత్రి ట్రైన్‌కి నేను ఒరిస్సా వెళ్ళిపోతున్నాను, కోరాపుట్ జిల్లా కాకిరిగుమ్మ గ్రామానికి. అక్కడ నా సెల్‌ఫోన్‌కి సిగ్నల్ అందుతుందో లేదో తెలియదు, ఇంటర్నెట్ పని చేస్తుందో లేదో తెలియదు. ఇంటర్నెట్ పని చెయ్యకపోతే అక్కడి నుంచి సమాధానాలు వ్రాయలేను. నేను ఎప్పుడు తిరిగొస్తానో తెలియదు. ఒకవేళ రేపు రాత్రి నేను సమాధానం చెప్పడానికి అందుబాటులో లేకపోతే అది నా పరధిలోని విషయం కాదు. అయినా 2009 నుంచి నన్ను హరాస్ చేస్తూ నాకే స్థిరత్వం లేదని వాదిస్తున్నారు. వాళ్ళకి నేను జవాబ్‌దార్ కావాలా?

 102. మూడేళ్ళ పాటు పది మందిని వెంటేసుకుని హరాస్ చేసి నువ్వు కేవలం పేరడీలు వ్రాసి సరిపెట్టుకో అనడం జోక్ కాకపోతే ఏమిటి?

 103. వీళ్ళు నన్ను “శవాల మీద మురియాలు ఏరుకుని భేల్‌పురీ చేసుకుతినే చిల్లర ఎదవ” అని కూడా అన్నారు. అది కేవలం పేరడీ అనుకోవాలా? వీళ్ళని చూస్తే చిన్నప్పుడు తాగిన పాలు కక్కేంత అసహ్యం కలుగుతుంది.

 104. శంకర్ గారూ పేరడీలు రాయాలని ప్రోత్సహించడం సరికాదేమో. నచ్చిన, నచ్చని అంశాలపైన చర్చ పెట్టవచ్చు. కాని కొన్ని భావాలను వ్యక్తం చేసినందుకు ఎగతాళి చేస్తూ, చులకన చేస్తూ పేరడీలు రాయడం సరైందేనన్నట్లుంది మీ సూచన.

  ఒక వ్యక్తిని కన్న పాపానికి ఒక తల్లి ని నిందించవలసిన అవసరం లేదు. ‘అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు’ అన్న సామెత ఇక్కడ వర్తిస్తుంది. తల్లులు బిడ్డల్ని కంటారు గానీ వారి ప్రవర్తనలను కాదు. వారు మంచిగా ప్రవర్తిస్తే సంతోషిస్తారు. లేదంటే బాధపడతారు. సమాజం మొత్తం స్త్రీలను రెండో రకం పౌరురాలిగా చూస్తుంది కనక తప్పు చేసే ప్రతి మగవాడిని తిట్టడంలో అతనితో సంబంధం ఉన్న స్త్రీలను ప్రస్తావించడం జరుగుతోంది. బూతులు అంటేనే స్త్రీలను దూషించడం. నిర్ధిష్ట సంఘటనలతో సంబంధం లేని స్త్రీలను లాగడం అసభ్యత. ఆ రీత్యా మాత్రమే ప్రవీణ్ తిట్లు ఉపసంహరించుకోవాలని నేను కోరుతున్నాను.

  దీనర్ధం ఏ సంబంధం లేకుండా, ఏ పరిచయం లేకుండా, కేవలం బ్లాగ్ లో కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు సంబంధిత వ్యక్తి ఎదురుగా లేరన్న కుసంస్కార భావనతో దూషించడం, ఎగతాళీ చెయ్యడం అసభ్యత కిందకి రాదని నేను చెప్పడం లేదు. ఇవన్నీ జరిగాక, ఆగ్రహం పట్టలేక మాత్రమే ప్రవీణ్ తప్పటడుగు వేశాడు. ప్రవీణ్ చేసిన ఒక తప్పు, లేదా రెండు తప్పులు ఇతరులు చేసిన అనేక తప్పులను ఒప్పులుగా మార్చదు. ప్రవీణ్ దోరణి ఎవరి కుసంస్కారాలకూ సర్టిఫికెట్ కాదు. ప్రవీణ్ చేసిన ఒక తప్పు తప్పుగా నేను చెబితే అది అతని వ్యతిరేకులు చేసిన తప్పులకు నేని మద్దతు ఇస్తున్నట్లు కాదు.

  ప్రవీణ్ ఇక్కడ ఒక డిమాండ్ చెప్పాడు. అతనిపైన పేరడీలు ఉపసంహరిస్తే తాను తన వ్యాఖ్యలను ఉపసంహరిస్తానని. ఇక్కడ ప్రవీణ్ ని తిట్టినవారినీ, అతనిపైన ఎగతాళి చేస్తూ పేరడీలు రాసి వీడియోలు రూపొందించినవారినీ ఒక భాధ్యతలోనికి ప్రవీణ్ లాగాడు. తనను తిడుతూ రాసిన పేరడీలు ఉపసంహరించాలన్న అతని డిమాండ్ లో న్యాయం ఉంది. మూడేళ్లపాటు జరిగిన హెరాస్ మెంట్ ని ఓపిక పట్టి స్పందించాను అన్న ప్రవీణ్ వాదనను పట్టించుకోకుండా ఉండడం మీకు సాధ్యమేనా?

  ప్రవీణ్ డిమాండ్ లో న్యాయాన్ని మీరూ సమర్ధించండి. తద్వారా ప్రవీణ్ తన వ్యాఖ్య ఉపసంహరించుకునేలా సాయం చెయ్యండి. గతం అంతా నాస్తి అంటూ ప్రవీణ్ తిట్లతోనే చరిత్ర ప్రారంభం అయిందని చెప్పడం సరికాదు. మీరలా అన్నారని కాదు. అంటున్నవారికి ఈ సంగతి చెబుతున్నా.

 105. హైదరాబాద్‌లో నెక్లేస్ రోడ్ దగ్గర నాకు కనిపించిన ఒక బ్లాగర్ ఇదే ప్రశ్న అడిగాడు “వాళ్ళు నీ మీద పేరడీలు వ్రాస్తోంటే నువ్వు ఊరుకున్నావంటే నువ్వు పిచ్చోడివైనా అయ్యుండాలి లేదా సమాజం గురించి ఏమీ తెలియనివాడివైనా అయ్యుండాలి” అని. వాళ్ళని తిట్టకపోతే నన్ను పిచ్చోడనుకుంటారు కానీ తిడితే పిచ్చోడనుకోరు.

 106. రాత్రి తొమ్మిది గంటలకి నిద్రపోతాను. అప్పుడు కూడా నా నుంచి ఎలాంటి సమాధానాలు ఉండవు. నా ఈ-మెయిల్ అడ్రెస్ praveensarma@teluguwebmedia.in కి మెయిల్ పంపితే రేపు ఉదయం సమాధానాలు చెపుతాను.

 107. ఎలాగూ శీతాకాలమే కనుక ఇప్పుడు కూడా దుప్పటి కప్పుకుని నిద్రపోగలను. రేపు ఉదయం వరకు సమాధానాలు చెప్పను.

 108. వాళ్ళు నా మీద పేరడీలు వ్రాయడానికి నేను వ్రాసిన కథలొక్కటే కారణం కాదు. నేను కోస్తా ఆంధ్రలో ఉంటూ తెలంగాణావాదాన్ని సమర్థించడం, వైట్ కాలర్ కుటుంబంలో పుట్టినా మావోయిస్ట్‌లని సమర్థించడం, దళితవాది అయిన కత్తి మహేశ్ గారిని సమర్థించడం ఇలాంటి కారణాలు ఉన్నాయి. సమైక్యవాద ఉద్యమం ఎలాగూ హైదరాబాద్ కోసం నడపబడుతున్న ఉద్యమమే కానీ మనుషుల కోసం నడపబడుతోన్న ఉద్యమం కాదు. అలాంటి ఉద్యమాన్ని నేను సమర్థించే అవకాశమే లేదు. నేను కత్తి మహేశ్‌ని సమర్థించినా కొన్ని విషయాలలో అతన్ని ఓపెన్‌గానే విమర్శించాను. హైదరాబాద్‌లో అతన్ని కొన్ని సార్లు కలిసి మాట్లాడాను. అంత కంటే నాకు మహేశ్ గారితో ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఆంధ్రాలో ఉండే తెలబాన్ సపోర్టర్ అనీ, దళిత గిరీశం అనీ కూడా తిడుతూ వ్రాసారు. వాళ్ళలో ఉన్నది నిజం విద్వేష వాదం కానీ నాది విద్వేషవాదం ఎలా అవుతుంది?

 109. శంకర్ గారూ, ఇక్కడ ప్రవీణ్ ప్రశ్నలకు మీనుండి కూడా స్పష్టత అవసరం.

  దళిత గిరీశం అని ఎవరిని అవమానించినట్లు? దళితుల్నే కదా? తెలంగాణకి మద్దతు ఇస్తే తాలిబాన్ ని స్ఫురిస్తూ తెలబాన్ అంటారా? మావోయిజాన్ని ఇష్టపడడం నేరమా? అభ్యుదయ భావాలు ఉండడం నేరమా?

  మీరు పద్మ గారూ కూడా ఈ అంశాలపైన స్పందించాలి. ప్రవీణ్ బూతులు తిడితే అవి మాత్రమే అడుగుతాం కానీ, ప్రవీణ్ ని ఎవరు ఏమన్నా మేము పట్టించుకోం అని మీ ఇద్దరు చెప్పదలుచుకుంటే అది వేరే సంగతి.

  కాని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉండడం మీకూ, పద్మగారికీ భావ్యం కాదు. అలా అంటే తప్పె అని ఒక్క ముక్క కాదు. ఎందుకు తప్పో కూడా చెప్పండి. ప్రవీణ్ భావాలని తిట్టడం, ఎగతాళి చెయ్యడం తప్పని చెప్పగలరా మీరు?

 110. అవునూ, శంకర్ అన్నా Snkr అన్నా ఒకరేనా? ప్రవీణ్ గానీ శంకర్ గానీ లేక ఇంకెవరైనా తెలిసినవారు దీనికి సమాధానం చెప్పగలరా?

 111. ఓసారి నేను సమైక్యవాదులని ఆంధ్రా భింద్రన్‌వాలేలు అంటూ పంజాబ్ టెర్రరిస్ట్ నాయకుడు భింద్రన్‌వాలాతో పోలిస్తే దాన్ని పేరడీ అని ఎవరూ అనుకోలేదు. పైగా తెలంగాణావాళ్ళని తెలబాన్ అనకుండా ఆంధ్రావాళ్ళని భింద్రన్‌వాలేతో పోలుస్తావా? అని తిట్టారు. నిజానికి భింద్రన్‌వాలా పంజాబ్‌లో సిక్కు ఖల్సా నియమాలని హిందువులపై రుద్దడానికి ప్రయత్నించాడు. అలాగే ఇక్కడ సమైక్యవాదులు మెజారిటీ ప్రజలతో సంబంధం లేని హైదరాబాద్‌వాదాన్ని హైదరాబాద్ ముఖం ఎన్నడూ చూడని పల్లెటూరివాళ్ళ మీద కూడా రుద్దడానికి ప్రయత్నిస్తోంటే అందులో భింద్రన్‌వాలే స్టైల్ కనిపించింది. ఈ విషయం వాళ్ళకి చెప్పాను. కానీ వాళ్ళు తెలంగాణావాదులని తెలబాన్‌లు అనడానికి ఒక్క కారణం కూడా చూపించకుండా నన్ను తిట్టారు.

 112. ఎక్కడ ఏ గొడవ జరిగినా నన్నో, నీహారిక గారినో లాగడానికి ప్రయత్నిస్తారు. MF హుస్సేన్ గొడవలోకి కూడా నన్ను లాగారు, నేను MF హుస్సేన్‌ని విమర్శించినా కూడా. MF హుస్సేన్ సెక్స్ పిచ్చోళ్ళకి బొమ్మలు చూపించి డబ్బులు సంపాదించడానికి ఆ పెయింటింగ్స్ వేశాడు కానీ ఆ పెయింటింగ్స్‌కి మతగజ్జి కారణం కాదనే నేను నమ్ముతాను. MF హుస్సేన్ రామాయణ, మహాభారతాల గురించి కూడా పెయింటింగ్స్ వేశాడు. అతను ముస్లిం అయ్యుండి రామాయణ మహాభారతాలు చదవడం గొప్పే. అయితే అతను ముహమ్మద్ ప్రవక్త కూతురి బొమ్మని ఒంటి నిండా బట్టలతో ఎందుకు వేశాడు, ఆమెని నగ్నంగా వేసినా కొంటారు కదా అని అడిగేవాళ్ళు ఉంటారు. ముహమ్మద్ ప్రవక్త కూతురి బొమ్మని నగ్నంగా వేస్తే అతని మతంవాళ్ళే అతన్ని చంపుతారు. మన హిందువులకి అంత మతాభిమానం లేదు కదా. క్రికెట్‌లో ఇండియా గెలిచి పాకిస్తాన్ ఓడిపోయినప్పుడో, ISI ఏజెంట్లు బాంబులు పెట్టినప్పుడు పాకిస్తాన్‌ని తిట్టడానికో మతాభిమానం గుర్తొస్తుంది. అయినా నేను MF హుస్సేన్ బూతు బొమ్మలకి వ్యతిరేకం అని తెలిసి కూడా నన్ను అతని పేరుతో తిట్టడం ఎందుకు? ఆ బూతు బొమ్మలు వేసినవాడు ఏ అప్పారావో, రామారావో అయ్యుంటే అది ఇష్యూ అయ్యేది కాదు, అతను మక్బూల్ ఫిదా హుస్సేన్ కావడం వల్లే ఇష్యూ అయ్యింది అని నేను ఇప్పటికీ నమ్ముతాను. ఏది ఏమైనా నాకు సంబంధం లేని గొడవలలోకి నన్ను లాగడం నాకు నచ్చలేదు. ఇంత కంటే సంబంధం లేని తన్‌హాయీ నవల గొడవ లాంటి గొడవల్లోకి కూడా నన్ను లాగడానికి ప్రయత్నించారు.

 113. కాకపోవచ్చు. తెలకపల్లి రవి గారి బ్లాగ్‌లో నేను SNKR కామెంట్లు చదివాను. అందుకే ఇద్దరూ ఒకరు కాదు అనిపిస్తోంది.

 114. బతికించారు. ప్రవీణ్ ప్రశ్నలకు సంబంధించి నేను మిమ్మల్నీ, పద్మ గారినీ కోరిన అంశాలకు బదులివ్వగలరా? కానండీ, ఈ ‘హ హ హ’ లూ, స్మైలీలు వారి స్టైలే. సాధ్యమైనంతగా ఇవి లేకుండా చూస్తే నేను కృతజ్ఞుడను.

 115. అవి అంత ఆసక్తికరమైన సెక్స్ చిత్రాలు కూడా కావు. చిన్న పిల్లలు వాటర్ కలర్స్ వేసిన స్టైల్‌లో ఉన్నాయవి.

 116. MF హుస్సేన్ బొమ్మలని మహేశ్ గారి బ్లాగ్‌లో నేను చూసాను. అవి వాటర్ కలర్ పెయింటింగ్స్ కంటే గొప్పగా లేవు కానీ వాటిని అద్భుత కళాఖండాలని మహేశ్, సెక్స్ బొమ్మలని హిందూత్వవాదులు అనడం ఆశ్చర్యం కలిగించింది.

 117. SNKR స్టైల్‌కీ, శంకర్ స్టైల్‌కీ మధ్య చాలా తేడా ఉంది. తెలకపల్లి రవి గారితో పాటు ఎవరు మార్క్సిజం గురించి వ్రాసినా SNKR అక్కడ దూరి రష్యాలో కమ్యూనిజం ఎందుకు విఫలమైంది అని అడుగుతూ అరిగిపోయిన రికార్డ్ తిప్పుతాడు. శంకర్ కేవలం నన్ను టార్గెట్ చేస్తూ ఇతరుల బ్లాగ్‌లలో కామెంట్లు వ్రాస్తుంటాడు.

 118. నాకు నిద్ర వస్తోంది. ప్రస్తుతం నా BSNL కనెక్షన్ కూడా పని చెయ్యడం లేదు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్టింగ్స్ మార్చి దాని ఇంటర్నెట్ కనెక్షన్‌ని కంప్యూటర్‌కి షేర్ చేసి నెట్ చేశాను. అలా చేస్తే ఒక MB డేటా ట్రాన్స్ఫర్‌కి 60 పైసలు బిల్ అవుతుంది. కనుక కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. రేపు ఉదయం సమాధానం చెపుతాను.

 119. విశేఖర్ గారూ నావరకు నేను ప్రవీణ్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను.

  “దళిత గిరీశం” అని ప్రవీణ్ ను అన్నారని నేను మొదటి సారిగా ఇక్కడే తన ముఖతా వింటున్నాను. నేను 2009 నవంబర్ లో బ్లాగుల్లోకి వచ్చాను. నాకు తెలిసి ఆ తరువాత ప్రవీణ్ ను ఈ పదంతో ఎవరూ పిలిచినట్టు నేను చూడలేదు. అంతకు ముందు జరిగిన వాటికి నన్ను సమాధానం చెప్పమనడం ఎంత వరకు సమంజసమో మీకే తెలియాలి. ఇక నా అనుమానం అసలు “దళిత గిరీశం” అని ఎవరైనా తను అని ఉంటె ఈ పదంలో అసలు తనకు అభ్యంతరకరమైనది “దళిత” అన్న పదమా? లేక “గిరీశం”తో పోల్చడమా? . “దళిత” అన్న పదమే తనకు తప్పుగా అనిపిస్తే నాకు తెలిసీ కొంత కాలం కిందట తి.తి.దే “దళిత గోవిందం” పేరుతొ నిర్వహించిన ఒక కార్యక్రమానికి దళిత జాతి నుండి విశేష స్పందన వచ్చింది. అప్పుడెవరూ ఎందుకో మరి ఆ పదాన్ని తప్పుబట్టలేదు. పైగా విశేషంగా ప్రశంసించారు కూడా. మరి ఆ పదం ఈ మధ్య ఏమన్నా బూతుగా పరిగనిస్తున్నారేమో నాకు తెలియదు. ఇక సమస్య “గిరీశం” అన్నందుకు అంటారా? నా వరకు గిరీశం పాత్ర విలన్ కాదు. సమయానికి తగు మాటలాడి తన పబ్బం గడుపుకునే లౌక్యుడు. అది తప్పు పట్టదగినదిగా నాకు అనిపించదు.

  ఇక తన రెండవ ఆరోపణగా మీరు చెప్పినది “తెలంగాణకి మద్దతు ఇస్తే తాలిబాన్ ని స్ఫురిస్తూ తెలబాన్ అంటారా?”. మీరు ప్రవీణ్ వాదాన్ని సరిగా గమనించినట్లు లేదు. తను అన్నది “నన్ను ఆంధ్రాలో ఉండే తెలబాన్ సపోర్టర్ అనీ”అని. రెండిటికీ తేడా మీరు గమనించే ఉంటారని అనుకుంటాను. నాకు తెలిసి ఇక్కడ ప్రవీణ్ ని తెలబాన్ మద్దతు దారు అన్నది తెలంగాణా కి మద్దతు ఇచ్చాడని కాదు ఉద్యమం పేరిట ఉన్మాదుల్లా ప్రవర్తించే కొంతమందిని (ఎవరు అనడం మొదలు పెట్టారో గానీ ఇటువంటి విధ్వంస కారులని తెలబానులు అనడం బ్లాగ్లోకంలో ఉంది. అది మీకూ తెలుసనీ నేను అనుకుంటున్నాను), వారి చర్యలను సమర్ధిస్తూ అదే సమయంలో ఆంధ్ర ప్రాంతం వారిని అవహేళన చేస్తూ మాట్లాడినందుకు. తను అటువంటి వారిని సమర్దిన్చాడో లేదో తననే అడిగి ఆ తరువాతే ఇందులో తప్పొప్పులు మీరే నిర్ణయించండి .

  ఇక మూడవది “మావోయిజాన్ని ఇష్టపడడం నేరమా?”
  నేరం అని బుద్ధున్న ఏ వెధవా అనడు. కాకపొతే తను ఆచరించే సిద్ధాంతాలే గొప్పవని భావిస్తూ ఇతర సిద్ధాంతాలను ఆచరించే వాళ్ళపై వ్యక్తిగత దూషణలకి దిగడాన్ని విజ్ఞులు ఎవరూ సమర్ధించరు. తను అలా *సిద్ధాంత పరమైన వ్యతిరేకతతో* వ్యక్తిగత దూషణలకు దిగినట్లు ఆధారాలు కావాలంటే ప్రవీణ్ సైట్ లోనే ఉన్న వీడియోలు/ ఆడియో లు చూస్తె మీకే తెలుస్తుంది.

  ఇక మీ చివరి ప్రశ్న “అభ్యుదయ భావాలు ఉండడం నేరమా?”

  నేరమని ఎవరంటారండీ? అయితే ప్రవీణ్ తన భావాల పట్లే పరస్పర విరుద్ధమైన ఆలోచనలు వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఈ బ్లాగులో http://vadrangipitta.blogspot.com/2011/04/blog-post.html ప్రవీణ్ ఈ కామెంట్ చూడండి. అందులో నేను * * మార్క్ చేసిన లైన్ చదివి ప్రవీణ్ రాతల్లో చూపించే అభ్యుదయ భావాలు,స్త్రీవాదం ఆచరణలో తనే ఎలా బూతు అన్నాడో గమనించండి. నాకు తెలిసి దీనిని అభ్యుదయ భావం అనరనుకుంటా.

  Praveen Sarma చెప్పారు…
  వడ్రంగి పిట్ట గారు, ఆ గజ్జి కుక్కలు ఇంతకు ముందు నాకు వ్యతిరేకంగా onlyforpraveen.wordpress.com అనే బ్లాగ్ పెట్టి నన్ను దళిత గిరీశం, *వేశ్యని పెళ్ళి చేసుకునే సంఘ సంస్కర్త అంటూ బండబూతులు తిట్టారు*. వాళ్ళే శ్రీరంగ నీతులు చెపుతున్నది.
  19 ఎప్రిల్ 2011 4:41 సా

  ప్రవీణ్ చేసిన ఆరోపణలకు నా పరిధిలో, నాకు తెలిసిన మేరకు సమాధానాలు చెప్పాననే అనుకుంటున్నాను. ఇంకా మీరేమయినా వివరణ కోరితే నా వీలు మేరకు ఇవ్వడానికి నేను సదా సిద్ధంగా ఉంటాను.

 120. విశేఖర్ గారూ నా ఉద్దేశ్యం పేరడీలు రాయమని ప్రోత్సహించటం కాదు. వేరొకరు తన మీద పేరడీలు రాస్తున్నారని ఉక్రోషపడి వారి కుటుంబ సభ్యులని బూతులు తిట్టడం చేతకానితనం. చేతనైతే నువ్వూ రాయి అంతే కానీ అలాంటి పనులు చేయకు అని అన్నాను.

 121. రాజీ కావాలంటే గొడవ ముందు మొదలు పెట్టిన వాళ్ళే ముందు వెనకడుగు వేయాలి ప్రవీణ్.

 122. “శంకర్ కేవలం నన్ను టార్గెట్ చేస్తూ ఇతరుల బ్లాగ్‌లలో కామెంట్లు వ్రాస్తుంటాడు.”

  నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు ప్రవీణ్. కేవలం నిన్ను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టడం తప్ప నాకు ఇంకో పని లేదనుకుంటున్నావా? కొన్ని బ్లాగుల్లో నా కామెంట్ తరువాత నువ్వు వచ్చి ఉండచ్చు అప్పుడు నువ్వు నన్ను టార్గెట్ చేస్తూ ఆ బ్లాగ్ లోకి కామెంట్ పెట్టడానికి వచ్చినట్టా?

 123. శవాలు మీద మురియాలు ఏరుకుని భేల్‌పురీ చేసుకున్తినే కక్కుర్తి ఎదవ అని తిట్టి ఆ తరువాత నువ్వు కూడా అలాంటి పేరడీలే వ్రాయు అని అంటే ఎవడు ఊరుకుంటాడు? నా చేత జుగుప్సకరమైన తిట్లు తిట్టించుకుని సానుభూతి పొందాలనుకుంటున్నాడు. పైగా అతనే ప్రవీణ్ గాడు ఒక మానసిక రోగి అనీ, అయినా అతన్ని ఇగ్నోర్ చెయ్యలేమనీ అంటున్నాడు. మానసిక రోగిని రెచ్చగొట్టి అతని చేత జుగుప్సకరమైన తిట్లు తిట్టించుకోవాలనే ఇంటెన్షన్ మానసిక రోగులకే ఉంటుంది కనుక మానసిక రోగి చేత తిట్టించుకున్నవాడు కూడా మానసిక రోగే అవుతాడు. భరద్వాజ తాను మానసిక రోగినేనని నిరూపించుకుంటే నాకు నష్టమా?

 124. సన్నాసి కబుర్లు ఎందుకు? ప్రనా గాడు దళితవాడల్లో వేశ్యలకి రెండు వందల రూపాయలు ఇస్తుంటాడు అని మీరే అన్నారు కదా. కోస్తా ఆంధ్రలో పట్టణాలలో పాకీ పనులు చేసుకునే రెల్లి అనే కులం ఉంది. ఇచ్చాపురం నుంచి తడ వరకు అన్ని పట్టణాలలోనూ వాళ్ళు కనిపిస్తారు. నా షాప్ ఒకప్పుడు రెల్లి వీధి దగ్గర ఉండేది. ఆ విషయం చెపితే వీడు రెల్లి వీధిలో వేశ్యకి రెండొందలు ఇస్తుంటాడు అంటూ వాగారు. నాకు తెలిసి కోస్తా ఆంధ్రలో భోగం కళావంతుల కులంవాళ్ళు మాత్రమే వ్యభిచారం చేస్తారు కానీ రెల్లి కులస్తులు ఎక్కడా వ్యభిచారం చెయ్యరు. వాళ్ళ వృత్తి పాకీ పని. పొట్ట కూటి కోసం పాకీ పనులు చేసుకునేవాళ్ళని వ్యభిచారులు అన్నందుకు వీళ్ళ మీద ఏ రెల్లి కుల సంఘం నాయకుడో పోలీస్ కంప్లెయింట్ ఇస్తే ఎలా ఉంటుంది? విశాఖపట్నంలోని రెల్లి వీధిలో డబ్బున్న రెల్లి కులస్తులు కూడా ఉన్నారు. వాళ్ళలో ఒకడు ఇంటర్నెట్ ఓపెన్ చేసి బ్లాగులు చదివినా ఈ విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. నేను ఇప్పటి వరకు కోస్తా ఆంధ్రలో భోగం(కళావంతుల) కులస్తులు మాత్రమే వ్యభిచారం చెయ్యడం గురించి విన్నాను. వీళ్ళు రెల్లి కులస్తుల గురించి వాళ్ళకి సంబంధం లేని వృత్తి పేరు చెప్పి చెత్తగా మాట్లాడితే అది వాళ్ళ కుసంస్కారం తప్ప ఏమీ కాదు.

 125. మీరు రెండు పూర్తి వ్యతిరేకమైన విషయాలని ముడిపెడుతున్నారు విశేఖర్ గారు. ప్రవీణ్ రాసిన బూతులనీ భరద్వాజ రాసిన పేరడీలనీ మీరు ఎలా ఒకటే అంశం కింద జమ కట్టగలరు? భరద్వాజ రాసిన పేరడీల్లో ఒక్కటంటే ఒక్కటి, ఒక్కటి ప్రవీణ్ కుటుంబ సభ్యులని ఉద్దేశించి ఉన్నది అని మీరు ప్రూవ్ చెయ్యండి, మీరైనా, ప్రవీణ్ అయినా. నిన్న ప్రవీణే ఒప్పుకున్నాడు కదా వాళ్ళ వదిన గారి పేరు ఎక్కడా ఉపయోగించలేదని. మరి వీళ్ళు రాసిన పేరడీలన్నీ వాళ్ళ వదిన గారి గురించే అని ఎలా ఫిక్స్ అయిపోయారు?

  ప్రవీణ్ రాసిన కథల మీద పేరడీలు రాస్తే అవి వాళ్ళ వదిన గారి మీదనే అని ఎలా అనుకుంటున్నారు? ఈ లెక్కన యండమూరి రాసిన కథల మీదా, మల్లాది రాసిన కథల మీదా, ఇలా రకరకాల రచయితల రచనల మీద పేరడీలు వచ్చాయి. అవన్నీ వాళ్ళ మీద వ్యక్తిగతమైన దాడులనుకోవాలా? మీరు అమెరికానీ, హిందుత్వ భావజాలాన్నీ ఎప్పుడూ దుయ్యబడుతూనే ఉన్నారు. అవన్నీ అమెరికా పౌరులనీ, హిందువులనీ వ్యక్తిగతంగా అన్నట్టనుకోవాలా? మీ అభిప్రాయం మీది. అలానే మీ అభిప్రాయం నచ్చనివాళ్ళు ఆ అభిప్రాయాన్ని దుయ్యబట్టవచ్చు. నా విషయమే తీసుకుంటే మీరు అమెరికాలో నివసించేవాళ్ళ దేశభక్తిని చాలా తీవ్రంగా అనుమానించారు. దానికి నేనూ తీవ్రంగానే స్పందించాను నా బ్లాగ్‌లో. అక్కడ నేను నిరసించింది మీ అభిప్రాయాన్ని మాత్రమే. మీ అభిప్రాయాల మీద నేను స్పందిస్తే అది మీ అభిప్రాయం మీదనే అవుతుంది కానీ మీ మీద కాదుగా? ఇన్‌ఫాక్ట్ మీరు ఆ పోస్ట్‌లో విదేశాల్లో నివసించే భారతీయులని చాలా చాలా మాటలన్నారు. అవన్నీ మీరు వాళ్ళని వ్యక్తిగతంగా అన్నట్టు అనుకోమంటారా? ప్రవీణ్ కథల్లో అక్రమ సంబంధం పెట్టుకున్న వదినా మరుదులు ఉంటే, ఆ కథలు నచ్చని వాళ్ళు ఆ కథల మీద పేరడీలు రాస్తే అవి తన వదిన గారి మీదనే అని ఎలా అనుకుంటారు మీరయినా ప్రవీణ్ అయినా? ఈ లాజిక్ కొంచెం అర్థం అయ్యేలా చెప్పండి. వదిన మరుదులు ఉండని ఇళ్ళు అరుదేమో. ఈ లెక్కన వాళ్ళందరినీ అన్నట్టా? Do you see any sense?

  “ప్రవీణ్ బూతులు తిడితే అవి మాత్రమే అడుగుతాం కానీ, ప్రవీణ్ ని ఎవరు ఏమన్నా మేము పట్టించుకోం అని మీ ఇద్దరు చెప్పదలుచుకుంటే అది వేరే సంగతి.”

  ప్రవీణ్‌ని ఇప్పటిదాకా ఎవరు ఎక్కడ బూతులు తిట్టారో చెప్పగలరా? చూపించగలరా? ఇక్కడ పాయింటు ప్రవీణ్‌ని అన్నారా, భరద్వాజని అన్నారా అని కాదు, కుటుంబసభ్యులని చర్చల్లోకి లాగడం గురించి ఏదో ఒకటి అనటం కాదు. దరిద్రపు బూతులు ఉపయోగించటం గురించి. ప్రవీణ్ వాడిన లాంటి బూతులు భరద్వాజ ఇన్నేళ్ళల్లో ఒక్కసారైనా వాడినట్టు చూపించండి.

  ఇన్నేళ్ళూ ప్రవీణ్ సహనంతో ఊరుకున్నాడా? మరి అన్ని ఆడియో వీడియోలు సహనం నించే పుట్టుకొచ్చాయా?

  నిన్న ప్రవీణె అన్నాడు కదా శ్రావ్య మీద వాళ్ళ బావగారి మీద రాస్తానంటే తను అభ్యంతరం చెప్పిందని? శ్రావ్య ప్రవీణ్ మీద ఏం పేరడీలు కథలు రాసిందని తను ఆ అమ్మాయినీ, వాళ్ళ బావగారినీ లాగాలనుకున్నాడు? శ్రావ్య భరద్వాజని సపోర్ట్ చేసినంత మాత్రాన ఆ అమ్మాయి మీద అవాకులు చెవాకులు రాస్తాడా? పైగా నేను రాస్తానంటే ఆ అమ్మాయి అభ్యంతరం చెప్పింది అని గొప్పగా చెప్పుకుంటున్నాడే, మీకు ఇందులో చీమ తలకాయంత అన్నా సెన్స్ కనిపిస్తోందా? ఇదా స్త్రీవాదం అంటే? ఇదా మీక్కనిపించిన అభ్యుదయవాదం?

 126. దళిత గిరీశం అని ఎవరిని అవమానించినట్లు? దళితుల్నే కదా?
  ——————————————————–
  దళిత అన్న పదం అవమానకరమైనదని మీరు చెప్తేనే తెలుస్తోంది విశేఖర్ గారూ. ఇక గిరీశం చాలా తెలివైనవాడు. శంకర్ గారు అన్నట్టు లౌక్యుడు. కానీ అసలీ పదం ఎప్పుడు ఎవరు ఎవర్ని అన్నారు? ఒకవేళ ప్రవీణ్‌ని అని ఉంటే ఆ పోలికని నేను ఖండిస్తున్నాను.

  తెలంగాణకి మద్దతు ఇస్తే తాలిబాన్ ని స్ఫురిస్తూ తెలబాన్ అంటారా?
  —————————————————————————-
  నచ్చని వాళ్ళు అంటారు. అది బూతేం కాదే? మీరు కూడా అమెరికాని చాలా దారుణంగా అంటూ ఉంటారు, ఆ దేశపు విధానాలు నచ్చక. అరి మీ లాజిక్ ప్రకారం అమెరికా పెటుబడిదారీవ్యవస్థని ప్రోత్సహించినంత మాత్రానా ఆ దేశాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా?

  మావోయిజాన్ని ఇష్టపడడం నేరమా?
  —————————————————
  ఎవరన్నారా మాట? హిందుత్వ భావజాలాన్ని మీరు ప్రవీణ్ ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారే. ఎవరు హిందుత్వం మీద పోస్ట్ రాసినా అక్కడ ప్రవీణ్ ప్రత్యక్షం అయిపోతాడే? Tell me then, హిందుత్వాన్ని ఇష్టపడి ప్రేమించడం నేరమా?

  అభ్యుదయ భావాలు ఉండడం నేరమా?
  —————————————————-
  అభ్యుదయవాదం అంటే ఒక వ్యక్తి తనని వ్యతిరేకించాడని వాళ్ళ తల్లిగారి గురించి చండాలంగా వాగటమా? ఏమీ సంబంధం లేని ఒక అడపిల్ల మీద అవాకులూ చెవాకులు పేలాలని ప్రయత్నించటమా? అదే అయితే అటువంటి భావాలు ఉండటం నేరమే.

  మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరికినట్టేనా? ఇంకా ఉంటే అడగండి.

  ఇక మాటలు ఉపసంహరించుకోవటానికి వస్తే, పేరడీలు వగైరాలు తర్వాత. ఒక వ్యక్తి మీద కోపం ఉంటే ఆ వ్యక్తి మీదనే తీర్చుకోవాలి. వారి కుటుంబసభ్యులని లాగకూడదు. అది తప్పు. ఆ తప్పు చేసింది ప్రవీణ్. కాబట్టి అతనికి పేరడీలు తీస్తే వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటాను అనే అర్హత కూడా లేదు. ఆ మాటలు భరద్వాజని డైరెక్ట్‌గా అని ఉంటే అప్పుడు అతను పేరడీలు ఇతను వ్యాఖ్యలు ఉపసమ్హరించుకుందాం అనుకోవచ్చు. కానీ లాగింది వీటికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని. కాబట్టి ప్రవీన్ అన్ కండిషన్ల్‌గానే క్షమాపణ చెప్పాల్సి ఉంటుందన్న నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారనే భావిస్తున్నాను.

 127. వీళ్ళు కత్తి మహేశ్ మీద పేరడీలు వ్రాసినప్పుడు కూడా అతని బంధువుల పేర్లు డైరెక్ట్‌గా వ్రాయకుండా MF అని మాత్రమే వ్రాసారు. పైగా MF అనేది తిట్టు కాదు, అది అతని గురువు గారి పేరు అని వాదించారు. మహేశ్ గారు హుస్సేన్ అభిమానే కావచ్చు కానీ అతని గురువు గారి పేరులోని మొదటి రెండు అక్షరాలు ఉపయోగించుకుని డబల్ మీనింగ్ వ్రాయడం వాళ్ళ కుసంస్కారం కాదా?

 128. _ఇదెక్కడి చోద్యం? ఇండియా ప్రజల శ్రమతో చదివి అమెరికాకి చెక్కేసి అక్కడ సేవలు చేస్తూ భారత దేశంలో నివసిస్తున్న భారతీయుల దేశభక్తిపైనే అనుమానాలా? హవ్వ! నవ్విపోదురు గాక!!_
  ఈ వ్యాఖ్య మీరు అన్నీ సరి చూసుకున్నాకే చేశారా అని నా అనుమానం! మీరు అన్నీ సరి చూసుకున్నాకే ఈ వ్యాఖ్య చేశారని చెబితే మరి నా దగ్గర కొన్ని ఆధారాలున్నాయి మీ వ్యాఖ్యలు తప్పని నిరూపించటానికి. లేదూ మీరా వ్యాఖ్యను సరిచేసుకుంటే మీకే క్రెడిబిలిటీ పెరుగుతుందని వేరే చెప్పనవసరము లేదని నా విశ్వాసం.

 129. చాలా ప్రశ్నలకి మీరు సమాధానాలే చెప్పలేదు. నాకు సంబంధం లేని తన్‌హాయీ నవల గొడవలోకి నన్ను ఎందుకు లాగినట్టు? తన్‌హాయీ నవల నేను చదవలేదు అని కామెంట్ వ్రాస్తే టాపిక్‌కి సంబంధం లేని కామెంట్లు వ్రాస్తున్నానని చెప్పి నా కామెంట్ ఎందుకు డిలీట్ చేసినట్టు? అదే కామెంట్‌ని నేను శరత్ బ్లాగ్‌లో CTRL+C & CTRL+V చేస్తే ఆ కామెంట్‌కి మీరెవేరూ అక్కడ ఎందుకు సమాధానం చెప్పలేదు. శరత్ ఆ కామెంట్‌ని డిలీట్ చెయ్యలేదంటే అది సంబంధం ఉన్న కామెంట్ అనే కదా దాని అర్థం. నేను చదవని నవల చదవలేదు అని నిజం చెపితే అది సంబంధం లేని కామెంట్ ఎలా అవుతుంది?

 130. ఎవరు ఏ కాంట్రోవర్సియల్ రచన వ్రాసినా ఆ గొడవలోకి నన్ను లేదా నీహారిక గారిని లాగుతారన్న మాట. శరత్ చెప్పినట్టు పిచ్చివాపొ డి మీదకి రాయి విసిరి పైశాచిక ఆనందం పొందడం చేస్తున్నారన్నమాట. మీ మోడస్ ఓపరాండీ అదేనని నిరూపించుకున్నారు కదా.

 131. ఏమిటి మీ ఆధారాలు? మీ పిడకల వేటకి ఇది సమయం కాకపోవచ్చు. నా ఊహ నిజమైతే చర్చ తీసుకెళ్ళి తెలంగాణ తో ముడిపెట్టి అది ఇదైతే ఇది అదే కదా లాంటిదేదో అంటారు.

  నా వ్యాఖ్యలో తేడా ఉండదు. మీకా అనుమానం అనవసరం. సమయం, సందర్భం చూసుకుంటే మంచిది.

  సందర్భంనుండి మాటల్ని లాగి పబ్లిక్ పరీక్షలు పెట్టడం ఎక్కువైనట్టుంది.

 132. ఒక మానసిక రోగిని రెచ్చగొట్టి అతని చేత జుగుప్సకరమైన తిట్లు తిట్టించుకుని వీడు నన్ను తిట్టాడు అని చెప్పి సానుభూతి పొందాలనే ఆలోచన ఇంకో మానసిక రోగికే వస్తుంది. కనుక నన్ను రెచ్చగొట్టిన భరద్వాజ కూడా ఒక మానసిక రోగి అనే అనుకోవాలి. అతను తనని తాను మానసిక రోగి అని నిరూపించుకుంటే నాకు అభ్యంతరం ఏముంటుంది? నేను తిట్టిన తిట్లు ఎంత జుగుప్సకరమైనవి అనే దాన్ని నేను మీటర్ పెట్టి కొలవలేదు. మూడేళ్ళ తరువాత నాకు అవకాశం దొరికింది కదా అని తిట్టాను. ఇంతకాలం పనిగట్టుకుని ఒక వ్యక్తి మీద పేరడీలు వ్రాస్తూ హరాస్ చేసిన తరువాత ఆ వ్యక్తి తిట్టకుండా ఉంటాడు అని ఎలా అనుకుంటారు?

 133. ఏమీ తెలియనట్టు నటించడం ఎందుకు? భరద్వాజ తన పేరడీలలో “ప్రవీణ్ తన అన్న భార్యకి లైన్ వేస్తాడు” అని అంటూ బహిరంగంగానే వ్రాసాడు. అది కుటుంబ సభ్యులని లాగినట్టు అవ్వదా? భరద్వాజ వ్రాసినవి పేరడీలు మాత్రమే అని స్రావ్య గారు వాదిస్తే నేను మీరు మీ బావగారికి లైన్ వేస్తున్నారని వ్రాస్తాను అని అన్నాను. దానికే శ్రావ్య గారు అభ్యంతరం చెప్పారు.

 134. నేను వ్రాసినవి అక్రమ సంబంధాల కథలని మీరు అన్నారు కానీ నేను అనలేదే. ఈ లింక్ చదవండి: http://patrika.teluguwebmedia.in/2010/03/blog-post_2392.html నేను వ్రాసిన కథలు అక్రమ సంబంధాల కథలు ఎలా అవుతాయి?

 135. పద్మ గారు, మీరు ఎవరిని నమ్మిస్తారు? మహేశ్‌గారి అమ్మగారి పేరు వ్రాయకుండానే మీరు మహేశ్ గారిని MF అని తిట్టారు. అది మహేశ్ కుటుంబ సభ్యులు చదివితే బాధపడరా? పైగా MF అనేది తిట్టు కాదు, అతని గురువు గారి పేరు అని చెప్పి మిమ్మల్ని మీరే జస్టిఫై చేసుకున్నారు. అతని గురువు గారి పేరులో ఆ రెండు అక్షరాలు ఉన్నంతమాత్రాన ఆ అబ్రీవియేషన్ ఉపయోగించి మహేశ్‌గారిని తిట్టాలా?

 136. విశేఖర్ గారూ నిన్న “తెలంగాణకి మద్దతు ఇస్తే తాలిబాన్ ని స్ఫురిస్తూ తెలబాన్ అంటారా?” అని ప్రవీణ్ ఆరోపణని కాస్త ట్వీక్ చేసి అడిగారు కదా( ఇది మీరు తన వ్యాఖ్య సరిగా చూసే ఉంటారని అనుకుని చెబుతున్నది.) మరి ప్రవీణ్ ఈ కామెంట్ ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అది తప్పు అనిపించినా మీకు ఇది అనిపించలేదా? సమైక్య వాదులని భింద్రన్ వాలేలతో పోలిస్తే పరవాలేదా?

  “ఇక్కడ సమైక్యవాదులు మెజారిటీ ప్రజలతో సంబంధం లేని హైదరాబాద్‌వాదాన్ని హైదరాబాద్ ముఖం ఎన్నడూ చూడని పల్లెటూరివాళ్ళ మీద కూడా రుద్దడానికి ప్రయత్నిస్తోంటే ”

  ఇది తను ఎలా చెప్పగలడు? తన అబిప్రాయాన్ని అందరూ అంగీకరించి తీరాలా?

  “కానీ వాళ్ళు తెలంగాణావాదులని తెలబాన్‌లు అనడానికి ఒక్క కారణం కూడా చూపించకుండా నన్ను తిట్టారు.”

  నాకు తెలిసి తెలంగాణా వాదులని తెలబాన్ లు అన్న వాళ్ళు అందుకు చూపిన కారణం ఆఫ్ఘన్ లో తాలిబాన్ల లాగే వీరూ విగ్రహ ధ్వంసం చేయడం, మూర్ఖంగా అతివాద ధోరణులు ప్రదర్శించడం. అది కూడా వాళ్ళు తెలంగాణా వాదులు అందరినీ అనలేదు. కేవలం ఈ “చంపండి, నరకండి” బాపతు బ్యాచ్ నే.

 137. గూగుల్ బజ్‌లో సౌమ్య నా గురించి వ్రాసిన పేరడీలు డిలీట్ చెయ్యడం వల్ల నేను ఆమె మీద వ్రాసిన పేరడీలు కూడా డిలీట్ చేశాను. ఈ లింక్ చదవండి: http://audios.teluguwebmedia.in/63055653 సౌమ్య తన పేరడీలని డిలీట్ చేసుకున్నట్టు వీళ్ళు తాము వ్రాసిన పేరడీలని డిలీట్ చెయ్యలేరా?

 138. “ముహమ్మద్ ప్రవక్త కూతురి బొమ్మని నగ్నంగా వేస్తే అతని మతంవాళ్ళే అతన్ని చంపుతారు. మన హిందువులకి అంత మతాభిమానం లేదు కదా. క్రికెట్‌లో ఇండియా గెలిచి పాకిస్తాన్ ఓడిపోయినప్పుడో, ISI ఏజెంట్లు బాంబులు పెట్టినప్పుడు పాకిస్తాన్‌ని తిట్టడానికో మతాభిమానం గుర్తొస్తుంది. ”

  ఓహో మతాభిమానం అంటే ఉన్మాదుల్లా చంపడమా. అలా ఉంటేనే మతాభిమానం ఉన్నాట్టా. సరే ప్రవీణ్ ఈ సారి నుంచీ హిందూ మతంపై ఏ చెత్త వెధవ ఏ కామెంట్ చేసినా నరుక్కుంటూ పోదాం. సరేనా.

  “ISI ఏజెంట్లు బాంబులు పెట్టినప్పుడు పాకిస్తాన్‌ని తిట్టడానికో మతాభిమానం గుర్తొస్తుంది. ”

  మొన్నేక్కడో నీ కామెంట్ లోనే చదివా ఇన్ని పాకిస్తాన్ ముస్లిం దేశమనే దాన్ని తిడతారు అని. అయితె ముస్లిం దేశాలన్నీ మన దేశంలో బాంబులు పెడుతున్నాయా ప్రవీణ్? అలా పెట్టినప్పుడు తిట్టడానికి కావలసింది మతాబిమానం కాదు దేశభక్తి. అది తెలుసుకో ముందు. ప్రపంచంలో ఏ దేశం వాడూ తను దేశ ద్రోహి అయితే తప్ప తన దేశంలో విధ్వంసాలు సృష్టించే వారిని ప్రేమించడు. ప్రేమించలేడు.

 139. LOL, Do you guys think you are smart? Think again.

  You both know that this all started with Praveen’s abuses on Narisetti Innaiah’s blog. All the parodies started after that.

  Everyone on blogs knew and ppl who didnt know that before came to know about it now.

  So it’s up to you guys. Take accountability for what you did in Innaiah’s blog and the videos made on me. Until you guys do it, I am NOT obliged to do anything.

  Do you get it in your brains at least now? 🙂

 140. విశేఖర్ గారూ,
  మీరు కాస్త అసహనం తగ్గించుకుంటే మంచిదని నా అభిప్రాయం అలాగే పిడకల వేటకు బయల్దేరిందీ మీరేననీన్నూ! అలాగే సమయమూ సందర్భమూ మహాబాగా చూసే మీ టపాకు సంబంధించిన వ్యవహారం గురించే నేను వ్యాఖ్యానించాను. మరి మీరు తెలంగాణ అంశం గురించి ఎందుకు ఊహించేసి తీర్పు తీర్చేయటం మొదలుపెట్టారో నాకర్థం కాలేదు.
  మీరు బూచాడని, సన్నాసనీ ఎవనో ఏదో అంటూ రాశారు దానికి పైగా ఓ రెండు మీ పోస్టులు, వాటి కామెంట్లు ఆధారాలుగా చూపించారు.
  అవన్నీ చదవడమూ, వారు అడిగినదానికి మీరు నోరేసుకుని పడటమూ అన్నీ అయిన తర్వాతే నేను కామెంటు పెట్టాను. మీ దోరణి చూస్తే మిమ్మల్ని వ్యతిరేకించేవారందరిపై నోరేసుకుని పడిపోయి, వాడిని చెడమడా నాలుగు తిట్టేసి అలాగే వారి ఐపిలను(?) బహిరంగ పర్చటం మీదున్న దృష్టి, ఆసక్తి మీ టపాలపై వచ్చిన విమర్శలకు సరైన ఆధారాలు చూపించినట్టు నాకైతే కనబడలేదు మరి! అసలు మీ కామెంట్ల పాలసీకీ, మీరు అనుమతిస్తున్న వ్యాఖ్యలకీ ఏమైనా సంబంధం ఉందా? రెండ్రోజుల క్రితం ప్రవీణ్ శర్మగారు బ్లాగులమీద పడి వారు బూతు ఆడియోలను, వీడియోలనూ వరుసబెట్టి కామెంటు పెట్టారు. మరి వారి కామెంట్లు ఈ బ్లాగులో ఎందుకు పబ్లిష్ అవుతున్నట్లు? పైగా వారు చేసింది తప్పే అని మీరే అంగీకరించారు కదా! దీన్ని బట్టే మీరు చెప్పే మాటలకూ, చేస్తున్న పనులకూ పొంతన లేదనీ స్పష్టంగానే అర్థమవుతున్నది కదా! ఇదే నా తొలి ఆధారం మీ వ్యాఖ్యల పరిధిని నిర్ణయించటములో!

 141. చాలా ప్రశ్నలకి మీరు సమాధానాలే చెప్పలేదు.
  ———————————————————-
  Did you ask any question? మొదట అసలు ఏమడుగుతున్నారో ఎవరిని అడుగుతున్నారో కాస్త అడ్రెస్ చేసి అడగటం నేర్చుకోవాలనుకుంటాను ప్రవీణ్. విశేఖర్ గారు స్పష్టంగా పద్మ గారూ, శంకర్ గారూ అని అడ్రెస్ చేసి అడిగారు. అంతే స్పష్టంగా వారికి సమాధానం ఇచ్చాము. ఎవర్ని అడుగుతున్నారో అసలు ప్రశ్నలేవో తెలీకుండా అడిగి సమాధానం ఎక్స్పెక్ట్ చెయ్యటం ఏ దేశపు పధ్ధతి?

  నాకు సంబంధం లేని తన్‌హాయీ నవల గొడవలోకి నన్ను ఎందుకు లాగినట్టు? తన్‌హాయీ నవల నేను చదవలేదు అని కామెంట్ వ్రాస్తే టాపిక్‌కి సంబంధం లేని కామెంట్లు వ్రాస్తున్నానని చెప్పి నా కామెంట్ ఎందుకు డిలీట్ చేసినట్టు?
  ———————————————————————————————————

  ఎవరు లాగారు? అక్కడ ఎవరన్నా బొట్టు పెట్టి ప్రవీణూ రా అని పిలిచారా? మీ అంతట మీరు వెళ్ళి కామెంటు పెట్టి ఉంటారని, తర్వాత గొడవ ఏదైనా జరిగి ఉండచ్చనీ నేను ఘంటాపధంగా చెప్పగలను.
  ఇక నవల చదవనప్పుడు, ఆ నవల మీద కామెంట్ రాయటానికి ఏ ఉద్దేశంతో వెళ్ళారు? నవల చదవకుండా పెట్టిన కామెంట్ టాపిక్‌కి సంబంధం ఉన్నది ఎలా అవుతుంది? ఇంక డిలీట్ చెయ్యటంలో తప్పేం ఉంది?

  అసలు ఆ బ్లాగ్ కల్పనా రెంటాల గారిది. విశేఖర్ గారికి ఉన్నట్టే ఆవిడకీ కామెంట్స్ పబ్లిష్ చేసే విషయంలో కొన్ని రూల్స్ ఉన్నాయేమో. ఆవిడ కామెంట్స్ తీసేస్తే అది ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఎందుకయింది? అంటే ఎవరు ఎక్కడ మీ కామెంట్స్ తీసేసినా మిమ్మల్ని విమర్శించినా మీరు భరద్వాజ మీద కోపం పెంచుకుని వాళ్ళ కుటుంబాన్ని బూతులు తిట్టేస్తారా? Does it have any sensel? any little sense?

 142. ఎవరు ఏ కాంట్రోవర్సియల్ రచన వ్రాసినా ఆ గొడవలోకి నన్ను లేదా నీహారిక గారిని లాగుతారన్న మాట. శరత్ చెప్పినట్టు పిచ్చివాపొ డి మీదకి రాయి విసిరి పైశాచిక ఆనందం పొందడం చేస్తున్నారన్నమాట. మీ మోడస్ ఓపరాండీ అదేనని నిరూపించుకున్నారు కదా.
  —————————————————————————————————–

  ఎవరు లాగారు ప్రవీణూ? పైన అడిగిన ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నాను. ఎవరైనా మీ ఇద్దరినీ బొట్టు పెట్టి పిలిస్తే మీరెళ్ళి ఇరుక్కున్నారా? ఎక్కడ కాంట్రవర్సీ జరిగినా (అసలు అది కాంట్రవర్సీ అయ్యేదే మీ ఇద్దరు అడుగు పెట్టిన తర్వాత కాదూ?) అక్కడికి వెళ్ళి పిచ్చి పనులు చేస్తే ఎవరైనా రాయే వేసి కొడతారు మరి. దాన్ని పైశాచిక ఆనందం అనరు. అక్కడి నించి ఆ పిచ్చివాళ్ళు పోతే మంచిదన్న ఉద్దేశం. అసలు మీ ఇద్దరినీ వాళ్ళంతట వాళ్ళే ఎవరైనా కానివ్వండి యే కాంట్రవర్సీలోకి లాగారో చెప్పండి. మొన్నటికి మొన్న రమణగారి బ్లాగ్‌లో ఆ పోస్ట్‌కి సంబంధం లేకుండా నీహారిక గారు బ్రాహ్మణులని ఎందుకు తిట్టింది? నేను ఆవిడ పది పాయింట్లకీ సమాధానం ఇస్తూ పోస్ట్ వేస్తే ఆ పాయింట్స్ కి వేటికీ సంబంధం లేకుండా ఆవిడ యశోవంతురాలు అని మీరెందుకు కామెంట్ పెట్టాల్సొచ్చింది? ఆవిడ భాస్కర్ గారి బ్లాగ్‌లో గూగుల్ వాడి మాపుల గురించి రాసిన పోస్ట్‌లో సంబంధం లేకుండా భాస్కర్ గారిని ఎందుకు తిట్టింది? ఆ పైన కుమార్జీని ఎందుకు తిట్టింది? ఆ తర్వాత తమరొచ్చి ఎందుకు బూతులు వాగాల్సొచ్చింది? ఎవ్వరైనా మిమ్మల్ని రమ్మని పిలిచారా? అడిగారా? ఎందుకు ఆ బ్లాగ్స్‌కి వచ్చి అంత లొల్లి చెయ్యాల్సొచ్చింది? ఎవరు లాగారు మిమ్మల్ని అందులోకి?

 143. పద్మ గారూ, ప్రవీణ్ వైపునుండి తప్పులు దొర్లితే (భాష, సామీప్యత లాంటివి) వాటిని పట్టుకుని ఎగతాళీ చెయ్యడమే కాని ఇది తప్పు అని నేరుగా చెప్పిన వారు, నేను చూసినంతవరకు, తక్కువ. ప్రవీణ్ తనని ఎగతాళి చెయ్యడానికి తగిన దినుసులు సమకూర్చుతున్నాడన్న విషయాన్ని అతని గ్రహించలేకపోతున్నాడు. అక్కడే నాకు అమాయకత్వం కనిపిస్తోంది. అది అమాయకత్వం అని నేను అనుకుంటున్నా. మీరు దానికి పెడుతున్న పేర్లు వేరేవిగా ఉంటున్నాయి.

  ఈ చర్చను ఆపాలని నాకు బలంగా తోస్తోంది. కాని ఎక్కడ అపాలో అర్ధం కావడం లేదు.

 144. తన్‌హాయీ నవల గురించి నేనేమీ మాట్లాడలేదు. ఆ నవల నేను చదవలేదు అని నిజం చెపితే నేను సంబంధం లేని కామెంట్లు వ్రాస్తున్నానంటూ నా కామెంట్ డిలీట్ చేశారు. నేను ఆ నవల చదవలేదు అనే నిజం చెపితే తప్పెలా అవుతుంది? వాళ్ళు ఒక అజ్ఞాత పేరుతో అఫ్సర్ గారి గురించి చెత్తగా వ్రాసి ఆ కామెంట్ నేను వ్రాసానని వాదించారు. అలాంటి కామెంట్లు ప్రనా వ్రాస్తాడు అని కార్తీక్ అన్నాడు. ఆ అజ్ఞాత కామెంట్ నేను వ్రాయలేదు. తన్‌హాయీ నవల నేను చదవలేదు కనుక ఈ గొడవతో నాకు సంబంధం లేదు అని కామెంట్ వ్రాస్తే మలక్ నా కామెంట్‌ని డిలీట్ చేసి అజ్ఞాత కామెంట్‌ని కూడా డిలీట్ చేశాడు. పైగా నేను సంబంధం లేని విషయాలు వ్రాస్తున్నానని వాదించాడు. ఆ అజ్ఞాత కామెంట్ నాది కాదు, ఆ నవల కూడా నేను చదవలేదు అని చెపితే అది సంబంధం లేని సమాధానం ఎలా అవుతుంది? కల్పన గారి పర్సనల్ మెయిల్ అడ్రెస్ నా దగ్గర ఉంది గనక ఒకవేళ నేను నిజంగా తన్‌హాయీ నవల చదివితే నా అభిప్రాయం ఆవిడకే డైరెక్ట్‌గా చెపుతాను. ఆ నవల గురించి ఎక్కడో చర్చించాల్సిన అవసరం నాకు లేదు.

 145. బొట్టు పెట్టి పిలవకపోయినా పద్మ గారూ, అది ప్రవీణ్ నే ఉద్దేశించి అన్నవని అందరికీ తెలిసేట్లుగా చాలా ఉన్నాయి. వీటన్నంటినీ పట్టించుకోవడం ప్రవీణ్ చేస్తున్న పెద్ద తప్పు.

  పిలవకపోయినా వస్తున్నవారు, నేను కేవలం నావిగా వ్యక్తం చేస్తున్న భావాజాలానికి అసభ్యంగా స్పందిస్తున్నవారు ఉన్నారు. అలాంటివి మొదలవకుండా నేను రూడ్ గా స్పందించే అవకాశాలు ఉండవు. ఇలాంటి ఘటనలు ప్రారంభంలో ప్రవిణ్ కి జరిగాయి. ప్రవీణ్ నుండి అదే స్ధాయిలో, లేదా అంతకంటే ఎక్కువగానో వచ్చింది. ప్రవీణ్ పైన దాడి చేస్తున్నది అనేకులయితే స్పందిస్తున్నది ఒక్కరే. అందువలన అనేకుల కంటే ప్రవీణ్ వ్యాఖ్యలు సహజంగానే ఎక్కువ కనిపిస్తాయి. దీనివలన పర్సెప్షన్ లో తేడా వస్తోన్నట్లు కనిపిస్తోంది.

  పేరు చెప్పకుండా, సంబంధన లేకుండా వ్యాఖ్య చెయ్యడం చెయ్యరాదని నేను కూడా ప్రవీణ్ కి సలహా ఇస్తున్నా.

 146. నేను తన్‌హాయీ నవల గురించి కల్పన గారి బ్లాగ్‌లో కామెంట్లు వ్రాయలేదు. మలక్ బ్లాగ్‌లో వాళ్ళు ఒక అజ్ఞాత పేరుతో అఫ్సర్ గారి గురించి చెత్తగా వ్రాసి ఆ అజ్ఞాత కామెంట్ నాదని వాదిస్తే ఆ అజ్ఞాత కామెంట్ నాది కాదనీ, ఆ నవల కూడా నేను చదవలేదనీ చెప్పాను. అంతే కానీ ఆ కామెంట్లు కల్ప్న గారి బ్లాగ్‌లోనివి కావు, కల్పన గారు ఆ కామెంట్లని డిలీట్ చెయ్యలేదు. నేను చలం సాహిత్యం లాంటి విషయాలలో మాత్రమే కల్పన గారి బ్లాగ్‌లో కామెంట్లు వ్రాసాను. నా కామెంట్లని ఎన్నడూ డిలీట్ చెయ్యలేదు ఆవిడ. ఆవిడకీ, నాకూ మధ్య గొడవ పెట్టడానికే అఫ్సర్ గారి గురించి ఒక అజ్ఞాత కామెంట్ వ్రాసి, నేనే వ్రాసానని వాదించి తరువాత డిలీట్ చేశారు.

 147. అచంగ గారూ, తెలంగాణ కాకుండా విషయం పైనే స్పందిస్తున్నందుకు ఈ సమాధానం. తీర్పేమీ ఇవ్వలే. ముందు జాగ్రత్తగా ఒక ప్రయత్నం చేశా.

  “మీరు బూచాడని, సన్నాసనీ ఎవనో ఏదో అంటూ రాశారు దానికి పైగా ఓ రెండు మీ పోస్టులు, వాటి కామెంట్లు ఆధారాలుగా చూపించారు.
  అవన్నీ చదవడమూ, వారు అడిగినదానికి మీరు నోరేసుకుని పడటమూ అన్నీ అయిన తర్వాతే నేను కామెంటు పెట్టాను. మీ దోరణి చూస్తే మిమ్మల్ని వ్యతిరేకించేవారందరిపై నోరేసుకుని పడిపోయి, వాడిని చెడమడా నాలుగు తిట్టేసి అలాగే వారి ఐపిలను(?) బహిరంగ పర్చటం మీదున్న దృష్టి, ఆసక్తి మీ టపాలపై వచ్చిన విమర్శలకు సరైన ఆధారాలు చూపించినట్టు నాకైతే కనబడలేదు మరి!”

  నేను నోరేసుకుని అరవడం అన్నది ప్రారంభం కాదు. అది స్పందన మాత్రమే. నేను బ్లాగుల్లోకి అడుగు పెట్టిందే తడవుగా నేను వ్యక్తం చేస్తున్న భావాలు నచ్చనివారు అసభ్యం ప్రారంభించారు. దానికి నేను అప్పుడప్పుడూ స్పందిస్తూన్నా. ఈ కధ మొత్త సాక్ష్యాధారాలతో చూపించే ఓపిక ప్రస్తుతం నా వద్ద లేదు. అందువల్ల పెద్దలు ఎవరైనా, ఇలాంటివి భవిష్యత్తులో జరగరాదన్న దృక్పధంతో, అందుకు పూనుకున్నట్లయితే నా వద్ద ఉన్న సాక్ష్యాలను చూపుతా. ఆ విషయం నేనిప్పటికి ఈ చర్చలోనే రెండు సార్లు చెప్పాను. మీరు చూసినట్లు లెదు. మళ్ళీ ఒకసారి ఈ వ్యాఖ్యలన్నీ చూడండి. రెండు సార్లు ఆ విషయమ్ చెప్పినట్లు మీకు కనపడతుంది.

  “అసలు మీ కామెంట్ల పాలసీకీ, మీరు అనుమతిస్తున్న వ్యాఖ్యలకీ ఏమైనా సంబంధం ఉందా?”

  ఉంది. కత్తికీ గాయానికీ తేడా నేను చూస్తాను. నాకూ గాయమైంది నాకూ రక్తం కారుతోంది అని కత్తి వాదిస్తే నేను నమ్మను. ప్రవీణ్ గాయపడ్డవాడు. మర్యాదగా ఉన్న వ్యక్తులు ప్రవీణ్ లాగా స్పందించేవరకూ రెచ్చగొట్టి సంవత్సరాలవుతోంది. అప్పటి నుండీ ఉన్న చరిత్ర ఒకసారి చూడండి. నేను అవసరమైనంతవరకూ చూశా. తర్వాత చూడలేక, అసహ్యం వేసి, వదిలేశా. కనుక ప్రవీణ్ పట్ల ఉన్న నా కున్న అవగాహన గాయం పట్ల ఉన్న అవగాహనే. దానికి సాక్ష్యాలు నా వద్ద ఉన్నాయి. చెప్పా గదా, పెద్దలెవరైనా పూనుకుంటే వారి ముందుంచడానికి నేను సిద్ధం. నేనెందుకు ఇలా స్పందిస్తున్నది గతంలో నేను కొన్ని పోస్టులు రాశాను. అవి కూడా మీరు చూడాలి. ఇలా ప్రత్యేకంగా రాసిన పోస్టులే కాక, వివిధ సందర్భాలల్లో నేను రాసిన వ్యాఖ్యల్లో చెప్పాను.

  ప్రవీణ్ రాసినపుడు బూతులు రాస్తే, హద్దు మీరితే, నేను చాలాసార్లు కట్ చేశాను. ఎడిట్ చేశాను. చెప్పకుండా ఎడిట్ చేశా. అవి మీకు కనపడే అవకాశం లేదు కనక మీరు పొరబడే అవకాశం ఉంది. సాక్ష్యాలున్నాయా అనడిగితే ఉన్నాయి. చెప్పాను కదా, పెద్దలెవరైనా పూనుకుంటే….

  ప్రవీణ్ పెట్టిన బూతు ఆడియోలు, వీడియోలు చూడలేదు. మీరంతా చెబుతున్నారు గనక నమ్ముతున్నా. ఆ విషయంలో ప్రవీణికి ఈ వ్యాఖ్యల వరుసలోనే సలహా ఇచ్చా. మీరు అవి చూసారు. ఐనా….

  అది పొంతన లేకపోవడం కాదు. కత్తికీ, గాయానికి మధ్య నేను తేడా చూస్తున్నందువల కనిపిస్తున్న తేడా. మొత్తాన్ని కలిపి చూసినపుడు నా స్పందనలో తేడాగా అది కనిపించదు. సాక్ష్యాలు గురిమ్చి చెప్పా కదండీ, ఎవరైనా పెద్దలు….

  మీ మలి అధారాలు కూడా ఇంకా ఉండవచ్చు. అవన్నింటికీ బహుశా ఇదే సమాధానం కావచ్చునేమో.

 148. వివరణాత్మక దృక్పధం లేకుండా లేదా ముందస్తు వివరణ లేకుండా ఇలాంటి పోలికలు తప్పె అవుతాయి శంకర్ గారూ.

 149. బొట్టు పెట్టి పిలవకపోయినా పద్మ గారూ, అది ప్రవీణ్ నే ఉద్దేశించి అన్నవని అందరికీ తెలిసేట్లుగా చాలా ఉన్నాయి. వీటన్నంటినీ పట్టించుకోవడం ప్రవీణ్ చేస్తున్న పెద్ద తప్పు.
  ————————————————————————
  ప్రవీణ్ వెళ్ళకుండా అక్కడ ఏమీ మాట్లాడకుండా ఎవరు ఏం అన్నారో చెప్పగలరా? నాకు తెలిసి ఏ బ్లాగ్ అయినా ఏ పోస్ట్ అయినా ప్రవీణ్ వెళ్ళి అక్కడ ఏదో ఒకటి అననిదే ఎవరూ ఏమీ అనలేదు. ఇది కూడా ఘంటాపధంగా చెప్పగలను. బ్లాగ్స్ కాస్త రెగ్యులర్‌గా ఫాలో అయినవారెవరికి అయినా ఆ విషయం తెలుస్తుంది.

  పిలవకపోయినా వస్తున్నవారు, నేను కేవలం నావిగా వ్యక్తం చేస్తున్న భావాజాలానికి అసభ్యంగా స్పందిస్తున్నవారు ఉన్నారు.
  ——————————————————————————-
  అలా స్పందించినవారిని మీరేం చేస్తున్నారు? ఊరికే వదిలేస్తున్నారా? మీ కోపం నిగ్రహించుకుంటున్నారా? లేదు కదా? మరి ఇదే పని అవతలి వాళ్ళు ఇదే సిట్యువేషన్‌లో చేస్తే అది తప్పని ప్రవీణ్‌ని కావాలని అంటున్నారనీ మీకెందుకు అనిపిచింది?

 150. ఈ లింక్‌లో ప్రవీణ్ ఖర్మ అనే పేరుతో దొంగ ఐడి పెట్టి కామెంట్లు వ్రాసినది ఎవరు? ప్రవీణ్ ఖర్మ అనే పేరుతో వ్రాసిన వ్యక్తికి పేన్ కార్డ్ చూపించమంటే ఎందుకు చూపించలేదు? ఈ లింక్ చదండి: http://naprapamcham.blogspot.com/2009/09/blog-post_26.html
  మలక్పేట్ మెంటల్ అనే పేరుతో దొంగ ఐడి నేను పెట్టలేదు అని మీరే ఒప్పుకుని తరువాత నువ్వు పెట్టినట్టు నువ్వే ఒప్పుకున్నావు కదా అంటూ నా మీద ఆరోపణలు చేశారు.

 151. by praveen >>>ఒకవేళ నేను టపాకి సంబంధం లేకుండా వ్రాస్తే ఆవిడ పబ్లిష్ చెయ్యాల్సిన అవసరమే లేదు. పబ్లిష్ చేసిందంటే అవి సంబంధం ఉన్నవనే కదా దాని అర్థం.>>

  విశేఖర్ గారు,

  ప్రవీణ్ ఇలా చెప్పడం చక్కగా ఉంది. ఈ బ్లాగర్ల కి ప్రవీణ్ వ్యాఖ్యల వ్యసనం ఉంది, అందుకే ప్రచురించి మరీ సంబంధం లేదని సొల్లు మొదలు పెడతారు.

  ఈ మధ్య శ్రీకాంత్ M గారు కూడా ప్రచురిస్తున్నారు (వారికి ఇది సలహా మాత్రమె, నొప్పించాలని కాదు). ప్రవీణ్ పేరు చెప్పుకుని ఎవరో ఒకరు ముందే రెచ్చగొట్టి పిలుస్తారు .వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకొని ఏడవొచ్చు కదా. ప్రవీణ్ వి ఏ బ్లాగు లో నో నచ్చక పొతే 🙂

  ఈ రెండు వాఖ్యాలు ప్రవీణ్ మాట గా అందరికి అందుబాటు లో ఉంచండి 🙂

 152. సిబి రావు గారు నెక్లేస్ రోడ్ దగ్గర కలిసినప్పుడు ప్రపీసస గొడవల గురించి అడిగారు. సిబి రావు గారికి విషయమంతా చెప్పాను. ఇన్నయ్య గారి బ్లాగ్‌లో యోగా గురించి వచ్చిన పోస్ట్ పేరు చెప్పి నాకు వ్యతిరేకంగా ప్రపీసస పెట్టారని ఆయనకి చెప్పాను.

 153. ప్రవీణ్ వెళ్ళకుండా అక్కడ ఏమీ మాట్లాడకుండా ఎవరు ఏం అన్నారో చెప్పగలరా?

  నేను చూశాను. పాతవి చూసి ఆ నిర్ణయానికి వచ్చాను. మీకు రుజువు చేసే పని నెనిప్పుడు పెట్టుకోవడం లేదు. నేను ముందే చెప్పినట్లు ఎవరైనా పెద్దలు పూనుకుంటే…

  అలా స్పందించినవారిని మీరేం చేస్తున్నారు? ఊరికే వదిలేస్తున్నారా? మీ కోపం నిగ్రహించుకుంటున్నారా? లేదు కదా? మరి ఇదే పని అవతలి వాళ్ళు ఇదే సిట్యువేషన్‌లో చేస్తే అది తప్పని ప్రవీణ్‌ని కావాలని అంటున్నారనీ మీకెందుకు అనిపిచింది?

  చెప్పా కదండీ. నా పరిమితి వరకూ ఊరు కున్నాను. ప్రవీణ్ అంత సహనం నాకు లేకపోవడం నిజమే. ఎందుకుండాలి? కేవలం నా భావాల ప్రాతిపదికన నాపై దాడి చేస్తే నేను ఊరుకోను. ఊరుకోకూడదని కొన్ని నెలల తర్వాత నిర్ణయించుకుని ఎదురుదాడి మొదలెట్టాను. నేను ఊరుకున్నవి ఉన్నాయి. మీరు గమనిస్తే ఇప్పటికీ ఊరుకుంటున్నాను. నాకు సమయం తక్కువ కనుక అన్నింటికీ సమయం చెప్పలేను. అందుకే నాకు తోచిన పద్ధతి ఎన్నుకున్నా. అసలు నాపైన తిడుతూ బ్లాగ్ పెట్టినపుడు నేను నేరుగా వారినే ఎందుకిలా చేస్తున్నారు అనడిగినపుడు వారు చెప్పిన సమాధానం ఇప్పటికీ అక్కడ ఉంది. అది చూసి ఆ తర్వాత నా దాడిని ప్రశ్నించండి. మీరు ఇప్పుడొచ్చి సాక్ష్యాలు చూపండంటే నాకు సాధ్యం కాదు. మీకు సమాధానం ఇచ్చాక, మీకు సాక్ష్యాలు చూపాక ఇక ఇదంతా ఆగిపోతుందని హామీ ఇవ్వగలరా? ఇస్తే అందుకు మీ అధారిటీ ఏమిటో నిరూపించండి. మీకు నా వద్ద ఉన్న ఆధారాలు ఇస్తాను.

  నేను నిన్ననే మీ బ్లాగ్ చూశాను. అందులో ‘కెబ్లాస’ మీ బ్లాగ్ గా మీరు చెప్పుకున్నారు? కెబ్లాస్ అంటే?

 154. నా ప్రపంచం బ్లాగ్‌లో నేను PKMCT అని నా షాప్ పేరుతో కామెంట్లు వ్రాస్తే ప్రవీణ్ ఖర్మ అనే దొంగ ఐడితో నన్ను తిట్టింది ఎవరు? మలక్పేట్ మెంటల్ అనే పేరుతో దొంగ ఐడి నేను పెట్టలేదని మీరే ఒప్పుకుని తరువాత పెట్టానని నేను ఒప్పుకున్నాను అని ఆరోపించింది ఎవరు?

 155. ప్రవీణ్ ఈ ఇన్నయ్య గారి బ్లాగ్ విషయానికి లింక్ ఇవ్వగలరా? ఇక్కడే అంతా మొదలని మలక్ పేట్ రౌడీ వ్యాఖ్యానించారు. అందువలన అడుగుతున్నాను. మీరు సంబోధన కూడా రాయండి అంటే వినరేం.

 156. నేను లింక్ ఇచ్చాను. కామెంట్ స్పామ్‌లోకి వెళ్ళిందేమో చూసుకోండి. ఎందుకంటే లింక్ ఉన్న కామెంట్లు ఆటోమేటిక్‌గా స్పామ్‌లోకి వెళ్ళిపోతాయి.

 157. మలక్ బ్లాగ్‌లో వాళ్ళు ఒక అజ్ఞాత పేరుతో అఫ్సర్ గారి గురించి చెత్తగా వ్రాసి ఆ అజ్ఞాత కామెంట్ నాదని వాదిస్తే ఆ అజ్ఞాత కామెంట్ నాది కాదనీ, ఆ నవల కూడా నేను చదవలేదనీ చెప్పాను.
  ———————————————————————————————
  భరద్వాజకి అఫ్సర్ ఫ్రెండ్. ఆయన గురించి భరద్వాజ ఎందుకు చెత్త కామెంట్ రాస్తారనిపించింది? అదీ మిమ్మల్ని తిట్టటానికి ఉపయోగించుకోవటానికా? అజ్ఞాతగా వచ్చి అఫ్సర్ గారి మీద మీరు రాసినట్టు చెత్త రాసి మళ్ళీ అసలు పేరుతో వచ్చి మిమ్మల్ని తిట్టారనా మీరు చెప్పేది? అంత టైమ్ వేస్ట్ చేస్తారని నిజంగా అనిపిస్తోందా ప్రవీణు? రాసింది ఆ అజ్ఞాత అయినప్పుడు ఆ కోపం ఆ అజ్ఞాత మీద పెంచుకోవాలొ కానీ భరద్వాజ మీద ఎందుకు? పైన అడిగిందే మళ్ళీ అడుగుతున్నాను. ఎక్కడ ఎవరు ఎది మిమ్మల్ని అన్నా అది భరద్వాజ ఎకౌంట్‌లో పడిపోతుందా? వాళ్ళ అమ్మగారిని నోటికి వచ్చినట్టు అనేస్తారా? ఈ వాదన మొదలయిన దగ్గర నించి అడుగుతున్నాను. భరద్వాజ వాళ్ళ అమ్మగారిని అంత దారుణంగా అనటానికి కారణం ఏంటి అని. మీ వదిన గారి మీద రాతలు అని మళ్ళీ మీరే అబ్బే మా వదిన మీద రాయలేదు అన్నారు. కామెంట్స్ డిలీట్ చేశారు, ఆ మాట అన్నారు ఈ మాట అన్నారు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడేమో అవన్నీ అజ్ఞాత వ్యాఖ్యలు అంటున్నారు. మీ వదిన గారి పేరు ఎక్కడా లేదు. మీ కుటుంబ సభ్యులనీ ఎవరూ బైటికి బజార్లోకి లాగలేదు మిమ్మల్ని తిట్టిన వారు ఎవరో అజ్ఞాత. మరి దీనిలో మూడేళ్ళ తర్వాత సహనం కోల్పోయి వెలమకన్ని సీతామహాలక్ష్మి గారిని అనాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రవీణు?

 158. ప్రవీణ్ ఇలా చెప్పడం చక్కగా ఉంది. ఈ బ్లాగర్ల కి ప్రవీణ్ వ్యాఖ్యల వ్యసనం ఉంది, అందుకే ప్రచురించి మరీ సంబంధం లేదని సొల్లు మొదలు పెడతారు.

  ఈ మధ్య శ్రీకాంత్ M గారు కూడా ప్రచురిస్తున్నారు (వారికి ఇది సలహా మాత్రమె, నొప్పించాలని కాదు). ప్రవీణ్ పేరు చెప్పుకుని ఎవరో ఒకరు ముందే రెచ్చగొట్టి పిలుస్తారు .వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకొని ఏడవొచ్చు కదా. ప్రవీణ్ వి ఏ బ్లాగు లో నో నచ్చక పొతే 🙂

  సరిగ్గా ఇదే నేనూ చెబుతున్నది. మీరన్న వ్యసనం వీరికి ఉందని నాకు తోస్తుంది. ప్రవీణ్ ని ఒక మాట అనడం అతన్ని రెచ్చగొట్టడం, ప్రవీణ్ అమాయకంగా వారు ఊహించినట్లే రావడం నేనూ వివిధ సందర్భాల్లో చూశను. ఆ విషయం వీరు ఒప్పుకోరు. ప్రవీణ్ తేలికగా దొరుకుతున్నందున వీళ్లకి అతనిని ఎగతాళీ చెయ్యడం తేలిక.

 159. లింక్ ఇందాకే పోస్ట్ చేశాను. తిరిగి పోస్ట్ చేస్తున్నాను. http://naprapamcham.blogspot.com/2009/09/blog-post_26.html నేను PKMCT అని నా షాప్ పేరుతో కామెంట్లు వ్రాస్తే ప్రవీణ్ ఖర్మ అనే దొంగ ఐడితో నన్ను తిట్టింది ఎవరు? మలక్పేట్ మెంటల్ అనే పేరుతో దొంగ ఐడి నేను పెట్టలేదని మీరే ఒప్పుకుని తరువాత పెట్టానని నేను ఒప్పుకున్నాను అని ఆరోపించారు.

 160. “అంత టైమ్ వేస్ట్ చేస్తారని నిజంగా అనిపిస్తోందా ప్రవీణు?”

  అయ్యో రామ! పద్మగారూ టైం వేస్ట్ చెయ్యడం కాకుండా మీకు ఇంత చర్చించే అవకాశం ఎలా దొరుకుంది చెప్పండి?

  ఇదంతా సమయం వృధా ప్రయాస. నాకీ అవసరం ఎందుకు వచ్చిందంటే, నా పైన అనవసరంగా రాయడం వల్లె. అదీ ప్రవీణ్ విషయంలో జరిగిందని నేను గుర్తించాను. అందుకే అతనికి నా మద్దతు.

 161. మీ ఇద్దరి మధ్య సంభాషణలో జోక్యం చేసుకుంటున్నందుకు మన్నించాలి.

  “కత్తికీ గాయానికీ తేడా నేను చూస్తాను. నాకూ గాయమైంది నాకూ రక్తం కారుతోంది అని కత్తి వాదిస్తే నేను నమ్మను. ప్రవీణ్ గాయపడ్డవాడు. మర్యాదగా ఉన్న వ్యక్తులు ప్రవీణ్ లాగా స్పందించేవరకూ రెచ్చగొట్టి సంవత్సరాలవుతోంది. ”

  విశేఖర్ గారూ మీ ఈ స్టేట్మెంట్ చూస్తె మీరు ప్రవీణ్ ని సమర్ధించే క్రమంలో మీ విధానాల విషయంలో (కామెంట్ పాలసీ) కూడా రాజీ పడుతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఆమాట కొస్తే అసలు ఈ విషయాలతో సంబంధం లేకుండా తమ దారిన తాము పోయే బ్లాగర్ల పోస్ట్లులలో కూడా ప్రవీణ్ ఇష్టారాజ్యంగా తను ఎవరినో తిట్టిన బూతులని పేస్ట్ చేసినప్పుడు, ఏమిటీ హింస? అని ఆ బ్లాగర్ల మనసు గాయపడి ఉండదంటారా? అక్కడ కత్తి ఎవరో, గాయపడ్డదేవరో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

 162. వాళ్ళు అఫ్సర్ గారి గురించి చెత్తగా వ్రాసినది కల్పన గారికీ, నాకూ మధ్య గొడవ పెట్టడానికే. కల్పన గారి నవలలు చదవకపోయినా ఆవిడ కథలు మాత్రం శ్రద్ధగా చదివాను. అజ్ఞాత పేరుతో ఆవిడ భర్త అఫ్సర్ గారి గురించి చెత్తగా వ్రాసి అది మార్తాండ కామెంట్ల స్టైల్‌లాగ ఉందని చెప్పి ప్రచారం చేస్తే కల్పన గారికీ, నాకూ మధ్య గొడవ జరుగుతుందని అనుకున్నారు. కానీ ఇంకో కాంట్రోవర్సీ అవుతుందని అజ్ఞాత కామెంట్‌ని కూడా డిలీట్ చేశారు.

 163. ఎవరు ఆరోపించింది? సీతామహాలక్ష్మి గారా? అందుకని ఆవిడని అన్ని మాటలన్నారా?
  మలక్పేట్ మెంటల్ అడ్రెస్‌తో వచ్చింది మీరే అని ఐ.పితో సహా అక్కడ భరద్వాజ స్క్రీన్‌షాట్ కూడా పెట్టారే. దానికేమంటారు?

 164. చెప్పా కదండీ. నా పరిమితి వరకూ ఊరు కున్నాను. ప్రవీణ్ అంత సహనం నాకు లేకపోవడం నిజమే. ఎందుకుండాలి?
  —————————————————
  ఒక్క విషయం చెప్పండి విశేఖర్ గారూ, ప్రవీణ్ సహనశీలుడని కితాబు ఇస్తున్నారు కదా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నీహారిక గారు అన్న పది పాయింట్లకీ రమణ గారి బ్లాగ్లోనో ఆవిడ గారి ప్లస్‌లోనో నేను రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే అవన్నీ వారి పర్సనల్ స్పేసెస్ కాబట్టి. నా బ్లాగ్‌లో ఒక పోస్ట్ వేశాను. నేను క్లియర్‌గా నీహారిక గారు అని పెట్టాను ఆవిడని ఆహ్వానించాను. ప్రవీణ్‌ని నేను పిలవలేదే. కానీ వచ్చాడు. వచ్చి అక్కడ అర్థం పర్థం లేని లాజిక్కులు, ఇంత అభ్యుదయవాది అయ్యుండీ నీహారిక గారి కులం ఏంటో విశ్లేషణలు మొదలు పెడితే (మీరన్నారే ఎవరూ అతనికి క్లియర్‌గా చెప్పట్లేదు అని) నేను క్లియర్‌గా చెప్పాను. నాకు కావలసింది నీహారిక గారి రెస్పాన్స్ మాత్రమే, వీలైతే ఆవిడ రెస్పాన్స్ కనుక్కొమ్మనీ. దానికి ఈ సహనశీలుడు నన్ను హినీస్, మ్యూల్స్ అని తిట్టిపోయాడు. నేను అక్కడ పిలవలేదు, అతని అభిప్రాయము అడగలేదు, అతన్ని తిట్టనూ లేదు. మరి నన్నెందుకు ఆ మాటలనాల్సి వచ్చింది? ఇది మీ దృష్టిలో అమాయకత్వం అనిపిస్తోందా? సహనం కనిపిస్తోందా? అతన్ని తిడితేనే బిగపట్టుకుని ఎప్పటికో బూతులు తిట్టే తత్వం కనిపిస్తోందా?

 165. ఆమాట కొస్తే అసలు ఈ విషయాలతో సంబంధం లేకుండా తమ దారిన తాము పోయే బ్లాగర్ల పోస్ట్లులలో కూడా ప్రవీణ్ ఇష్టారాజ్యంగా తను ఎవరినో తిట్టిన బూతులని పేస్ట్ చేసినప్పుడు, ఏమిటీ హింస? అని ఆ బ్లాగర్ల మనసు గాయపడి ఉండదంటారా? అక్కడ కత్తి ఎవరో, గాయపడ్డదేవరో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

  శంకర్ గారూ ఇందులో చర్చ ఎందుకు? ప్రవీణ్ వల్ల ఎవరైనా బ్లాగర్లు బాధపడే అవకాశాలు ఉండవచ్చు. ఆ మాటకోస్తే ఎవరు ఎవరి పేరుతో వస్తున్నారో అర్ధం కాక నేను కూడా ఒకరిద్దరిపైన అనవసరంగా దాడి చేశాను. ఆ తర్వాత అది గ్రహించి వెనక్కి తీసుకున్నా. ఇప్పటికైనా నేను అందుకు సిద్ధమే. కాను నాకుండే పర్సెప్షన్ వివిధ అంశాలపైన ప్రవీణ్ కి లేకపోవచ్చు. ప్రవీణ్ వల్ల నిజంగా బాధితులు ఉండే అవకాశాలను నేను కొట్టిపారేయడం లేదు. నేను చెబుతున్నది ఒక పర్టిక్యులర్ గ్యాంగ్ గురించే. ఆ గ్యాంగ్ కి బైటి ఉన్నవారి విషయంలో నేనే లేదా ప్రవీణే ముందు తప్పు రాసి ఉండవచ్చు. వాటిని సవరించుకోవడానికి ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి.

  ఒక పద్ధతి ప్రకారం, టార్గెట్ చేసి హింస పెట్టడంలో నేనూ, ప్రవీణ్ బాధితులం. ప్రవీణ్ నాకంటే వెయ్యి రెట్లు బాధితుడు. అతని స్పందన అందుకొక కారణం కావచ్చు. కాని ప్రారంభం అయింది ప్రవీణ్ పైన దాడితో నే నని ఇన్నయ్య గారి పోస్టు ద్వారా కూడా నాకు అర్ధం అయింది. ఆ పోస్టునే మలక్ గారు కూడా చూపిస్తున్నారు. ఇక్కడ మలక్ రిఫరెన్సూ, ప్రవీణ్ రిఫరెన్సూ సరిపోలింది కనుక ప్రవీణ్ కేసు రుజువవుతోంది.

 166. ఐపి అడ్రెస్ ఎక్కడ చూపించాడు? నేను బ్లాగుల్లోకి వచ్చిన కొత్తలోనే శ్రీకాకుళం పట్టణం నుంచి తెలుగు బ్లాగులు చదివేవాళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు. తరువాత ఆ సంఖ్య పెరిగిందనేది వేరే విషయం. ఆముదాలవలస, విజయనగరం, పార్వతీపురంలలో కూడా తెలుగు బ్లాగర్లు ఉన్నారు. తెలుగు బ్లాగర్ … (ఎడిట్) ఆముదాలవలసే. BSNL వాళ్ళు ఉపయోగించేవి డైనమిక్ ఐపిలనీ, కేవలం ఐపి లొకేషన్ వైజాగ్ అని కనిపిస్తే దాని ఆధారంగా ఆ బ్లాగర్ వైజాగ్‌లో ఉన్నాడనో, శ్రీకాకుళంలో ఉన్నాడనో, ఆముదాలవలసలో ఉన్నాడనో చెప్పలేమనీ మీకు తెలియదా? ఈ నెట్వర్కింగ్ బేసిక్స్ తెలియని మీకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు ఎవరిచ్చారు? … (పేరు ఎడిట్) గారి ఐపి అడ్రెస్ కూడా విశాఖపట్నం అనే చూపిస్తుంది, VOL బ్రాడ్‌బ్యాండ్ అని కూడా చూపిస్తుంది. కానీ అతని షాప్ ఉన్నది …లో. వైజాగ్ పేరుతో ఏ ఐపి అడ్రెస్ కనిపించినా అది నాదేనని అనుకుంటే మీకు నెట్వర్కింగ్ బేసిక్స్ ఎవరు నేర్పించారా అని సందేహం వస్తుంది. ఎందుకంటే DHCP నెట్వర్కింగ్ అనేది 1993 నుంచి ఉన్నదే.

  (ఇందులో పేర్లు తొలగించాను. ప్రవీణ్, పేర్లు రాయవద్దు. ఇతరుల ఐ.డి బహిరంగపరిచే రైట్ మీకు లేదు. అది గుర్తించండి)

 167. ప్రవీణ్, మీ లింక్ చూశాను. అందులో మీరు చెప్పిన ఫేక్ ఐడి స్క్రీన్ షాట్ మలక్ గారు పెట్టారని పద్మ గారు అంటున్నారు కదా?

 168. వెల్, నేను టైమ్ వేస్ట్ అనుకోవటంలేదులెండి. చెత్త ఏరి పారేద్దాం అనుకునే ప్రయత్నం టైమ్ వేస్ట్ ఎందుకవుతుంది చెప్పండి. మీ మద్దతు ప్రవీణ్‌కే అని తెలుస్తూనే ఉంది కదండి. అతను బూతులు రాయటం కూడా అతన్ని కుటుంబాన్ని అనబట్టే అని కూడా సమర్ధిస్తున్నారు. మీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు పోనీ మచ్చుకి ఒక్కటి బైట పెట్టండి. ఈ చర్చ ఇంతటితో ఆపేద్దాం.

  ఈ వాదన మొదలైనప్పటి నించి అడుగుతున్నాను. ఇప్పుడూ సూటిగా అడుగుతున్నాను. ఎందుకు సీతామహాలక్ష్మి గారిని చండాలమైన మాటలు అనాల్సొచ్చింది? స్ట్రైట్ కారణం చూపించండి లేదా తప్పు ఒప్పుకుని ఆవిడకి క్షమాపణలు చెప్పండి.

 169. అది అమాయకత్వం అని నేను అనుకుంటున్నా. మీరు దానికి పెడుతున్న పేర్లు వేరేవిగా ఉంటున్నాయి.
  ——————————————–
  మీరు ఇందాకెక్కడో పర్సెప్షన్ అన్నారు చూశారూ అదే. మీరు అమాయకత్వం అని ఫిక్స్ అయిపోయారు కాబట్టే నేను ఇన్నోసెంట్ కాదు అని ప్రవీణ్ చెప్తున్నా, అబ్బే నాకతని అభిప్రాయంతో పని లేదు ఇన్నోసెంటె అనుకుంటున్నారు. ఆ పర్సెప్షన్‌తోటే అతను బూతులు మాట్లాడటం తప్పని తెలిసీ అతను ఆ బూతులు అనవసరం గా అర్థం పర్థం లేకుండా ఒక స్త్రీమూర్తిని పట్టుకుని అన్నాడని తెలిసీ బలమైన కారణం ఉండబట్టే తిట్టాడు పాపం అంటున్నారు. ఒక్క బలమైన కారణం ఏదీ అతనిప్పటి దాకా చూపకపోయినా సరే.

 170. అంత సందేహం వద్దులే ప్రవీణ్. పాపం నాకు, భరద్వ్వజకి నెట్వర్కింగ్ తెలీదులే. అది వైజాగ్ ఐపి. నువ్వొక్కడివే అనుకోటానికి వీలు లేదు. మరి అమెరికాలో ఉన్న భరద్వాజ వైజాగ్ ఐ.పితో ఎలా రాసారంటావు? నెట్వర్కింగ్ క్వెస్చెన్ కాదులే. కామన్ సెన్స్ క్వెస్చెనే.. కాస్త చెప్తావూ.

 171. (…) గారూ ప్రవీణ్ వల్ల మీరు నిజమైన బాదితులే అయిఉండవచ్చు. ఎవరు ఎవరి పేరుతో వస్తున్నరో తెలియని స్ధితిలో నేనూ ఒకరిద్దర్ని బాధపెట్టాను. తెలిసాక వెనక్కి తీసుకున్నా.

  అంతెందుకు? కుమార్.ఎన్ అన్న త్రాష్టుడి ఒకడున్నడని చెప్పాకదా. ఆతనికి ఇచ్చిన ఒక సమాధానంలో కూడా ఓసారి నా పొరబాటును సవరించుకుంటూ రాస్తే దాన్ని డిలిట్ చేసేశాడు. దానివల్ల నాపైన దాడి చేసే అవకాశం పోతుందని ఆ పని చేసినట్లు నాకు అర్ధమైంది. ఏదో విధంగా దాడి చెయ్యడమన్నది వీరి లక్ష్యం. కారణం మా భావజాలం. విషయం ఇంత స్పష్టంగా ఈ గ్యాంగే స్పష్టం చేశాక వారికి మంచి బుద్దులే ఉన్నాయని సర్టిఫై ఎవరు చేసినా నేనెందుకు స్వికరిస్తాను? (ఇది మీ విషయం కాదు)

  మీ అనుభవంలో ప్రవీణ్ ది తప్పే అయితే సవరించుకోవాల్సిందే. ఆ సలహా నేను అందరికీ ఇస్తాను. తప్పును సవరించుకోవడం వల్ల మనసు తేలికపడుతుంది. అనవసర రాద్ధాంతం తగ్గుతుంది. అది మీలాంటి విషయంలో. కాని గ్యాంగ్ విషయంలో అది సాధ్యపడకపోవచ్చు. కారణం వారు సవరించుకుంటారన్న గ్యారంటీ లేదు. సవరించుకోవడం వారి లక్షణం కాదు.

 172. పద్మగారూ, ప్రవీణ్ స్పందనల్లో కొన్ని లోపాలున్నాయి. అది నేను అతనికీ చెప్పాను. కొన్ని అమాయకత్వం కిందికి వచ్చేవి ఉన్నాయి. అన్నీ అమాయకత్వం కాకపోవచ్చు. ముందు చెప్పినట్లు (మీకో మరొకరికో) నేను పూర్తిగా ప్రవీణ్ ని గానీ మరొకరిని గానీ విశ్లేషించలేను. నా దృష్టిలోకి వచ్చినంతవరకూ, నాకు ఎదురైన అనుభవాల మేరకూ ప్రవీణ్ లో అమాయకత్వం కనిపించింది. ఇంకా కొన్ని పాజిటివ్, నెగిటివ్ అంశాలు నాకు కనిపించాయి. అవి అప్రస్తుతం కనుక నేను చెప్పలేను.

  మీరు ప్రవీణ్ కీ ఇతరులకీ జరిగిన రచ్చలో ప్రవీణ్ నే పూర్తిగా తప్పు పడుతున్నారు. నేను దానికి అంగీకరించను. ప్రవీణ్ పైన దాడి ప్రారంభం కాకుండా ప్రవీణ్ నుండి రూడ్ స్పందన ప్రారంభం అయిందని ఎవరైనా అంటే నేను నమ్మను. ఇన్నయ్య గారి బ్లాగ్ లింక్ ప్రవీణ్ ఇచ్చారు. అది చూసినా నా అవగాహన రుజువవుతోంది.

  మీకు ప్రవీణ్ కీ జరిగిన ఘర్షణ పూర్తిగా నాకు తెలియదు. ఎవరివైపునుండైనా తప్పులు జరిగే అవకాశం నేను కొట్టివేయలేను. ఎవరిది తప్పైనా సవరించుకోవలసిందే. కాని ఇన్నేళ్ళు జరిగాక, ఒకరి అనుభవాలతో మరొకరి అనుభవాలు కలగలిసిపోయిన సంక్లిష్ణ స్ధితి నాకు కనిపిస్తోంది. ఈ స్ధితిలో ప్రవీణ్ వైపు గానీ, మీ వైపు గానీ నేను మొగ్గలేను.

  క్లియర్ గా చెబుతున్నాను అని నేను మీరు భావించినా ప్రవీణ్ కి అర్ధం కావలసిన అవసరం ఉంది. అది బ్లాగుల్లో సాధ్యం కాకపోవచ్చు. ఆ మాట కొస్తే నాకూ, ప్రవీణ్ కీ మధ్య కొన్ని బేధాలు ఈ చర్చల్లో వ్యక్తం అయ్యాయి కదా. భేధాలను అభిప్రాయ బేధాల వరకే పరిమితం చెయ్యకుండా వ్యక్తిగత దాడి చెయ్యడమే దీనికి మూలకారణం. (మీ విషయం ఇందులో కలిసి లేదు).

 173. “కాని ప్రారంభం అయింది ప్రవీణ్ పైన దాడితో నే నని ఇన్నయ్య గారి పోస్టు ద్వారా కూడా నాకు అర్ధం అయింది. ఆ పోస్టునే మలక్ గారు కూడా చూపిస్తున్నారు.”

  మీరు మలక్ గారి పోస్ట్ మరొక సారి శ్రద్ధగా చదివితే బావుంటుంది. ఎవరు మొదలెట్టారో అక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అన్నట్టు ఈ ఇన్నయ్య గారి పోస్ట్ లింక్ మీదగ్గర ఏమన్నా ఉందా? ఉంటె ఇవ్వగలరు.

 174. నేను కాని ఫిక్సింగ్ నాకు అంటగట్టకండి పద్మ గారూ. మళ్లీ చెబుతున్నా. ప్రవీణ్ ఇన్నోసెంట్ అని డిక్లేర్ చేస్తే అది దాదాపు అన్నింటికీ వర్తిస్తుంది. అతని వ్యాఖ్యల్లో కొంత అమాయకత్వం కనిపిస్తుంది అనంటే కొన్ని వ్యాఖ్యల్లో అని అర్ధం. రెంటికీతేడా గమనించండి. ప్రవీణ్ ఫలానా సందర్భంలో అమాకత్వం ప్రదర్శించాడు అని నేనన్నపుడు అది ప్రవీణ్ అంగీకరిస్తాడని నేను నమ్మాల్సిన పని లేదు. కొన్ని అంశాల పట్ల నాకున్న పర్సెప్షన్ నుండి ఆ అవగాహనకు రావచ్చు. మా ఇద్దరికే పరిమితమైన అవగాహనలు కొన్ని ఇక్కడున్నాయి. అవి కూడా ఇక్కడ కలిసి ఉన్నాయి. అందువల్ల మీకూ నాకు మధ్య తప్పని సరిగా విశ్లేషణ్లో తేడాలుంటాయి. అది ప్రవీణ్ కావచ్చు మరొకరి కావచ్చు ఇంకొక అంశం కావచ్చు.

  బలమైన కారణాన్ని మీరు అర్ధం చేసుకోలేక పోతున్నారు. నేను అర్ధం చేసుకున్నప్పటికీ, బూతులు తిట్టడం తప్పని చెప్పడం లో వెనకడుగు వేయలేదు. కారణంతో సంబంధం లేకుండానే అది తప్పని ఈ చర్చలోనే రెండు మూడు సార్లు చెప్పాను. అది కూడా పరిగణీంచి నాపైన పర్సెప్షన్ మీరు రూపొందించుకోవాలి. మీకు నచ్చిన, కావలసిన అంశాన్ని మాత్రమే పరిగణించి మీ పర్సెప్షన్ రూపొందించుకుంటే అది నాకు సంబంధం లేని విషయం. అలాంటివి భవిష్యత్తులో సవరణకు గురి అయ్యే అవకాశాలు ఉంటాయి.

  ప్రవీణ్ వ్యక్తిగతంగా తిట్టడానికి బలమైన కారణం అతనిపైన అతనికి ఉన్న భావాజలం కారణంగా తెంపులేకుండా జరిగిన దాడి అని నేను చెబుతూనే ఉన్నా. ఆ రీత్యా అతనికి నా పూర్తి సానుభూతి ఉంది. ఇప్పటికీనూ. అతనిపైన దాడిని అసలేమాత్రం మీరు పట్తించుకోకపోవడమే అర్ధం కాని విషయం.

 175. పద్మ గారూ, మీరు చాలా సార్లు పేర్లతో సంబోధించడం లేదు. ఇంత చర్చలో నలుగురైదుగురు, వివిధ సందర్భాల్లో స్పందిస్తున్నపుడు ఎవరికి స్పందిస్తున్నారో పోల్చుకోవడం కష్టంగ ఉంది. దీని వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతున్న సూచనలు కనిపిస్తున్నయి.

 176. పద్మ గారూ, ఓ ప్రశ్న. అడగొచ్చో లేదో అర్ధం కాకుండా ఉంది సాహసించి అడిగేస్తున్నా. మీరు స్త్రీయా, పురుషులా,

  … గారి బ్లాగ్ ఒకటి రెండు సార్లు చూశాను. స్త్రీయే అనుకున్నా. కాని తన వ్యాఖ్యలో తను ‘అతను’ గా తెలిసి తొట్రుపడాల్సి వచ్చింది.

  మీ పట్ల ఏమన్నా పొరబాటు జరగకుండా ఈ ప్రశ్న. సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని మీరు భావిస్తే ఇవ్వకండి. నేను అర్ధం చేసుకోగలను.

 177. నేను తెలకపల్లి రవి గారి బ్లాగ్‌లో కామెంట్లు వ్రాయడం మానేసి చాలా రోజులు అవుతోంది. అతని బ్లాగ్‌లో కామెంట్లు వ్రాస్తే చెవిటోడి ముందు శంఖం ఊదడం అనే సామెత గుర్తొస్తోంది. తెలకపల్లి రవి తాను మార్క్సిస్ట్‌నని చెప్పుకున్నా అతను మార్క్సిజం గురించి ఒక్క ముక్క కూడా వ్రాయలేదు. కనీసం తాను ప్రజాశక్తి ఎడిటర్‌గా సంకలనం చేసిన పుస్తకాలలో వ్రాసిన విషయాలైనా వ్రాయలేదు. “ఏ రాజకీయ నాయకుడు ఎన్ని కోట్లు తిన్నాడు, ఏ రాజకీయ నాయకునికి ఎంత కులగజ్జి ఉంది” లాంటి విషయాలకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అన్నా హజారే స్టైల్‌లోనే అతను మాట్లాడాడు. రాజకీయ నాయకులు కూడా సమాజం నుంచి వచ్చినవాళ్ళే. సమాజంలో ఎక్కువ మందికి కులగజ్జి ఉంటే రాజకీయ నాయకులకి కూడా కులగజ్జి ఉంటుంది. మనిషి యొక్క ప్రవర్తనపై సామాజిక పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉంటుందనే విషయం మార్క్సిజం చదివిన తెలకపల్లి రవి గారికి తెలియదంటే అది నమ్మశక్యంగా లేదు. నేను వ్రాసిన కామెంట్లని తెలకపల్లి రవి గారు డిలీట్ చేశారు కానీ మీలాగ నేను సంబంధం లేని విషయాలు వ్రాస్తున్నానని ఆరోపణలు చెయ్యలేదు. మీ కంటే తెలకపల్లి రవి గారు చాలా నయం. అతనికి మీతో పోలిక అనవసరం.

 178. నేను ఇక్కడ రెస్పాండ్ అవుతోంది మీతోనూ, ప్రవీణ్‌తోనూ. ప్రవీణ్‌తో మాట్లాడినప్పుడు అతని పేరు సంబోదిస్తూనే ఉన్నాను. సో, కంఫ్యూజన్‌కి ఆస్కారం లేదనే అనుకుంటున్నాను. బట్ ఎస్, పైన కామెంట్‌లో my bad ప్రవీణ్‌ని ఉద్దేసించిన చోట అతని పేరు చెప్పలేదు. మళ్ళీ ఇక్కడ ఆ కామెంట్ పోస్ట్ చేస్తున్నాను.

  విశేఖర్ గారూ, వెల్, నేను టైమ్ వేస్ట్ అనుకోవటంలేదులెండి. చెత్త ఏరి పారేద్దాం అనుకునే ప్రయత్నం టైమ్ వేస్ట్ ఎందుకవుతుంది చెప్పండి. మీ మద్దతు ప్రవీణ్‌కే అని తెలుస్తూనే ఉంది కదండి. అతను బూతులు రాయటం కూడా అతన్ని కుటుంబాన్ని అనబట్టే అని కూడా సమర్ధిస్తున్నారు. మీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు పోనీ మచ్చుకి ఒక్కటి బైట పెట్టండి. ఈ చర్చ ఇంతటితో ఆపేద్దాం.

  ప్రవీణ్, ఈ వాదన మొదలైనప్పటి నించి అడుగుతున్నాను. ఇప్పుడూ సూటిగా అడుగుతున్నాను. ఎందుకు సీతామహాలక్ష్మి గారిని చండాలమైన మాటలు అనాల్సొచ్చింది? స్ట్రైట్ కారణం చూపించండి లేదా తప్పు ఒప్పుకుని ఆవిడకి క్షమాపణలు చెప్పండి.

 179. అవేవూ పూలు అవీ ఉంటాయి కదండీ. మీరు కాదా? పొరబడ్డాను. క్షమాపణలు. బహుశా మీ వ్యాఖ్య చూసానేమో.

 180. ప్రవీణ్, పావని గార్లకు విన్నపం. మీ మధ్య చర్చను ఇంతటితో ఆపగలరని విన్నపం. మరొక అంశంపైన చర్చ మొదలయ్యేలా ఉంది. అందుకని ఆపమని కొరుతున్నాను.

  ఇక్కడ జరుగుతున్న చర్చ కంక్లూడ్ కావడానికి ప్రవీణ్, పద్మ గార్లు సహకరించాలని కూడా కోరుతున్నాను. అంటే ఏదో ఒకటి తేల్చి చెప్పెయ్యమని కాదు. కొన్ని అంశాలను పరస్పరం తెలియజేసుకున్నాం. వాటివల్ల గతంలో తెలియని కొన్ని అంశాలు కొత్తగా తెలియడం, తెలిసిన అంశాలు తప్పుగా తేలడమో తప్పన్న అనుమానం రావడమో జరగడం, కొన్ని అంశాలు సవరించుకోవాల్సి రావడం జరిగిందని భావిస్తున్నా. సవరణ అన్నది వెనక్కి ఉండవచ్చు, ముందుకైనా ఉండవచ్చు. కాని ఇదే అంతిమం కాబోదు.

  కనుక ఈ చర్చను ముగించడానికి ప్రతిపాదిస్తున్నా. మిత్రులు పద్మ, ప్రవీణ్, ఇతర మిత్రులు ఆమోదిస్తే ముగిస్తాను.

 181. విశేఖర్ గారు, మీకు చరిత్ర తెలిసినట్టు లేదు. కేవలం రెండు వందల రూపాయల ఫీజ్ కోసం జాతకాలు చెప్పే సత్యనారాయణ శర్మ అనే బ్లాగర్‌ని కూడా వీళ్ళు హరాస్ చేసి అతన్ని నిత్యానంద శర్మ గారు అని కూడా సంబోధించారు. సత్యనారాయణ శర్మ గారు షిర్డీ సాయిబాబా గురించి ఏదో అన్నారని వీళ్ళు సత్యనారాయణ శర్మ గారిని గొడవల్లోకి లాగారు. షిర్డీ సాయిబాబా సనాతన దేవుడు కాదు అనేది నిజమే. రాష్ట్రంలో ఎక్కువ మంది షిర్డీ సాయిబాబాని ఆరాధిస్తున్నా అతన్ని నమ్మని సనాతన ధర్మజ్ఞులు ఇప్పటికీ ఉన్నారు. కెలుకుడు బేచ్‌వాళ్ళు తాము హిందువులమని చెప్పుకుంటారు, సత్యనారాయణ శర్మ గారు కూడా తాను హిందువుననే చెప్పుకున్నారు. అయినా వాళ్ళ మధ్య గొడవ జరిగింది, నిత్యానంద శర్మ గారు అని సంబోధించడం జరిగింది. ఒక వ్యక్తిని అంత ఓపెన్‌గా నిత్యానంద అని తిట్టడం భావ్యమా?

 182. అతని వ్యాఖ్యల్లో కొంత అమాయకత్వం కనిపిస్తుంది అనంటే కొన్ని వ్యాఖ్యల్లో అని అర్ధం. రెంటికీతేడా గమనించండి.

  —————————————–
  మీ పర్సెప్షన్ మీది విశేఖర్ గారు. నేను ఏం అంటగట్టగలను చెప్పండి. ఉదాహరణకి పైన వాక్యంలో కొంత అమాయకత్వం అంటే మీరు కొన్ని వ్యాఖ్యల్లో అమాయకత్వంగా తీసుకున్నారు. కానీ అర్థం అది కాకపోవచ్చు. అతని వ్యాఖ్యల్లో కొంత అమాయకత్వం అంటే అతని అన్ని వ్యాఖ్యల్లో కొంత అమాయకత్వం కొంత వేరే తత్వం కనిపిస్తోంది అని కూడా కావచ్చు. ఇన్‌ఫాక్ట్ ఆ వాక్యాన్ని బట్టి రెండో దానికే ఎక్కువ అవకాశం ఉంది.

  ప్రవీణ్ వ్యక్తిగతంగా తిట్టడానికి బలమైన కారణం అతనిపైన అతనికి ఉన్న భావాజలం కారణంగా తెంపులేకుండా జరిగిన దాడి అని నేను చెబుతూనే ఉన్నా. ఆ రీత్యా అతనికి నా పూర్తి సానుభూతి ఉంది. ఇప్పటికీనూ. అతనిపైన దాడిని అసలేమాత్రం మీరు పట్తించుకోకపోవడమే అర్ధం కాని విషయం.
  ———————————————-
  అతని పైన దాడి జరిగిందని అంటున్నారు కానీ అతను మిగతావారి మీద చేసిన దాడి మీరు ఎందుకు పక్కన పెడుతున్నారు? మీరు భరద్వాజ రీసెంట్ పోస్ట్ చూశారా? క్లియర్‌గా జరిగిన విషయం ఎక్స్ప్లయిన్ చేశారు. అది చదివితేనే అర్థం అవుతోంది ఎవరు మొదలు పెట్టారో. పోనీ అది పక్కన పెట్టండి. ప్రవీణ్ మీద ఇన్నిరోజులు వ్యక్తిగతంగా దాడి చేయటం వల్లే అతను రెచ్చిపోయి చివరికి తప్పుడు మాటలు మాట్లాడాడు అంటున్నారు. సరే. మరి నేను నా విషయం చెప్పాను కదా? నాకూ ప్రవీణ్‌కి ఇదివరకు ఎప్పుడూ చిన్న సంభాషణ జరగలేదు. నేనెప్పుడూ అతన్ని ఏ మాటన్నదీ లేదు. మరి మొన్న నా బ్లాగ్‌లో నన్నెందుకు మ్యూల్స్, హినీస్ అన్నట్టు? దీన్ని బట్టి అర్థం అవటం లేదంటార? అతను సహనం నశించి చెత్త మాట్లాడతాడో లేక అతనిది తప్పు అంటేనే చెత్త మాట్లాడతాడో.

  అతను చేసిన పని సాక్ష్యంతో సహా చూపించినా మీరు అబ్బే పొరపాటు అయ్యుండచ్చు అంటున్నారు. అదే అతని పైన జరిగిన దాడికి సాక్ష్యం లేకపోయినా జరిగింది అతని తప్పేం లేదు అవతలివాళ్ళది పొరపటూ కాదు. అది తప్పే అంటున్నారు. ఇది ఏ రకంగా కరెక్ట్ అంటారు చెప్పండి?

 183. ఈ రోజు రాత్రే నేను రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈ రోజు నేను సమాధానం చెప్పలేను. అవతల నేను ట్రైన్ దిగబోయే ఊరి దగ్గర డొకోమో టవర్ ఉందో, లేదో నాకు తెలియదు. అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ పని చేస్తుందో, లేదో నాకు తెలియదు. నేను ఊరి నుంచి తిరిగొచ్చేంత వరకు కామెంట్లు వ్రాయడానికి అవ్వదు. సమాధానం చెప్పకపోతే అది నా పరధిలో లేని విషయం.

 184. నేనేమీ అబద్దం చెప్పడం లేదు. నమ్మకపోతే ఈ PNR నంబర్ చూసుకోండి 640 5177137 http://www.indianrail.gov.in/pnr_Enq.html రైల్వే స్టేషన్‌కి వెళ్ళే బస్ రాత్రి పది గంటలకి దొరికితే ఆ టైమ్‌కి స్టేషన్‌కి వెళ్ళి ఉదయం ఒంటిగంటకి ట్రైన్ ఎక్కుతాను. ఆముదాలవలస(రైల్వే స్టేషన్) దగ్గర ఎలాగూ డొకోమో టవర్ ఉంది. కాకిరిగుమ్మ దగ్గర డొకోమో టవర్ ఉందో, లేదో తెలియదు కాబట్టి నేను అక్కడ ఉన్నప్పుడు మీరు డిలీట్ చెయ్యమ్మన్న బూతులు నేను డిలీట్ చెయ్యగలనో, లేదో చెప్పలేను.

 185. విశేఖర్ గారూ,
  ఇక్కడ నా సమస్య ప్రవీణ్ శర్మగారు కాదులెండి. వారికి నేను నాకు తెలిసినంతవకు ఎదురుపడింది రెండుమూడు సార్లే. మీ అసహనం ఏ స్థాయికి వెళ్ళిపోయిందీ కాస్త తెలియజేద్దామని పై వ్యాఖ్య చేయవలసి వచ్చింది. కాకుంటే మీరు సమర్థిస్తున్న వ్యక్తి మరీ అమాయకుడేమీ కాదని ఆతని చర్యలవల్ల బ్లాగుల్లో ఉన్నవారికి తెలుసు. అంతో ఇంతో మీరూ అంగీకరించారు. పోతే అసలు నా వాఖ్య దేనికి సంబంధించినదో కనీసం అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేయకుండా ‘అచంగ’ పేఱు కనిపించగానే తెలంగాణ అంశాన్ని ఎలా అంటగట్టేశారు మరి మీరు తీర్పు తీర్చటం మొదలెట్టకుండా ఉంటే? ఈ చర్చను ఇంకెవ్వరూ గమనించట్లేదని మీ అభిప్రాయమైతే నేను చెయ్యగలిగిందేమీ లేదు. నేనూ అనేకానేక వివాదాస్పద అంశాలపై గత యేడాదిగా బ్లాగు నడుపుతున్నవాడినే. నేను విషయం పైనే మాట్లాడదలిచాను.

  “అచంగ గారూ, తెలంగాణ కాకుండా విషయం పైనే స్పందిస్తున్నందుకు ఈ సమాధానం. తీర్పేమీ ఇవ్వలే. ముందు జాగ్రత్తగా ఒక ప్రయత్నం చేశా.”
  అంటే మీరు నన్ను ఆదిశగా కవ్వించే ప్రయత్నం చేశారని అర్థమవుతున్న్దది కదా!

  సరే విషయానికొస్తా, భారతదేశములో ఉండేవారందరికీ దేశభక్తి ఎలా ఉంది? కడుపుకూటికి మరో దేశం పోతే ఎలా లేదు? కాస్త వివరిస్తే బావుంటుంది. పైగా మీరన్ని విషయాలు పరికించే ఆ వ్యాఖ్య చేశానని చెప్పారు గదా!

 186. సారీ విశేఖర్ గారూ. మీరు, ప్రవీణ్ అడిగిన ప్రశ్నలకి నేను శంకర్ గారూ సమాధానాలిచ్చాము. మరి ఇప్పుడు ప్రవీణ్ కూడా ఇవ్వాలి కదా. పైగా పైన ఒక కామెంట్‌లో కత్తి మహేష్‌ని నేను MF అని తిట్టానని ఆరోపించాడు. I want him to show the proof.

  అమాయకుడు పాపం అని మీరు బాధపడుతున్నారు కదా, ఈ కేండిడేట్ ఎలా అవతలి వాళ్ళ మీద అభాండాలు వేస్తాడో ఉన్నవి లేనివి ఎలా కల్పిస్తాడో తెలుస్తుంది, మీరు తెలుసుకోదలుచుకుంటే.

  You better show me the proof where I used the word MF, Praveen.

 187. పద్మ గారూ,

  అవును రెండో దానికె అవకాశం ఎక్కువ.

  అంతిమంగా ప్రవీణ్ అమాయకత్వంపైన నేను చెప్పేది ఏమంటే: అతను పూర్తిగా అమాయకుడా, కాదా అన్నది నేను తేల్చలేను. నేను, ప్రవీణ్, మా ఇద్దరి భావజాలం, గ్యాంగ్ ప్రచారం… ఈ అంశాల పరిధికి సంబంధించి ప్రవీణ్ కొన్నిసార్లు అమాయకంగా రాశాడు. అవి గ్యాంగ్ కి మేతలయ్యాయి. ఈ నిర్ధిష్ట పరిధిలో ప్రవీణ్ ప్రవర్తనలో తప్పు పట్టడానికి నేను ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను. కారణం అతను ఏళ్లపాటు జరిగిన వ్యతిరేక ప్రచారంలో బాధితుడు. ఆ ప్రచారం నా పైనా జరిగింది కనుక ఆ విషయం లోతుపాతులు నాకు అర్ధం అవుతాయి. అందుకే అతనికి మద్దతు ఇస్తున్నా.

  ఇతర బ్లాగుల్లో ప్రవీణ్ కొన్నిసార్లు సంబంధం లేకుండా రాస్తున్నట్లు చాలా మందికి కనిపిస్తోంది. నాకూ అనిపిస్తోంది. కాని ప్రవీణ్ వైపు నుండి చూసినపుడు ఏదో ఒక సంబంధం లేకుండా ఒక వ్యాఖ్యని రాయలేడు. అది అసంభవం. కాకుంటే అది సంబంధం ఉన్నదే అని ఆ వ్యాఖ్య ద్వారా నేరుగా చెప్పగలగడంలో అతని వైఫల్యం కొట్టుచ్చినట్లు కనిపిస్తుంది. ఎలా సంబంధం ఉన్నదో అతను వివరిస్తే తప్ప సంబంధం కనిపెట్టలేని పరిస్ధితి నాకూ ఎదురవుతోంది.

  కాని నేను సాధారణంగా భావించేది ఏమంటే, ఏ వ్యక్తి అయినా సంబంధం చూడకుండా ఒక వ్యాఖ్యని చేయలేడు. దీనిని ప్రవీణ్ కి అప్లై చేస్తే, వివిధ అంశాలపైన అతనికి ఉన్న అవగాహన ఇతరులకి లేకపోవచ్చు, నాక్కూడా. అలాంటి సమయంలోనే సంబంధం లేదని ఇతరులకి అనిపిస్తుంది. కనుక ప్రవీణ్, ఆ సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చెయ్యాల్సిన అవసరం అదనంగా ఏర్పడుతోంది.

  ఈ అంశాన్ని ఎన్నిసార్లు చెప్పినా ప్రవీణ్ అర్ధం చేసుకున్నట్లు నాకు కనిపించలేదు. దీనికి అమాయకత్వం కారణం కావచ్చు. తుంటరితనం కారణం కావచ్చు. నేను ప్రధానంగా అమాయకత్వం వైపే మొగ్గుతున్నా. తుంటరితనాన్ని పూర్తిగా నిరాకరించలేను. దానికి సంబంధించిన అనుభవం నాకు వస్తే తప్ప తుంటరితనం ఉందా లేదా అన్నది నేను చెప్పలేను. ఇతరుల అనుభవాల ద్వారా ప్రవీణ్ పైన నేనేమీ చెప్పలేను. చెప్పినా ‘వచ్చు’ అని మాత్రమే అనగలను.

  పావని గారు లాంటి వారి అనుభవాలు ప్రవీణ్ పైన నాకున్న అవగానను ప్రశ్నిస్తున్నాయి. కాని ఇది సంపూర్ణం కాదు. ప్రవీణ్ భావజాలం గురించి నాకు తెలిసినంతగా పావని గారి లాంటివారు ఎదుర్కొన్న అనుభవాలు నేను చూడలేదు. చూస్తే నేను తప్పని సరిగా ప్రవీణ్ ని ప్రశ్నిస్తాను.

  ఈ పరిధులు, అనుభావలన్నింటితో సంబంధం లేని సార్వజనీన అంశం ఒకటుంది. అది సామాజికంగ స్త్రీలపై జరుగుతున్న అణవిచివేత. ప్రవీణ్ ఈ అంశాన్ని అంగీకరిస్తారు. ఎట్టి పరిస్ధితుల్లోనైనా ఒక స్త్రీని ఆమెకు సంబంధం లేని విషయంలో ఆమెను నేరుగ సంబోధించి తిట్టడం సరికాదు. ప్రవీణ్ ఈ పని చేశానని స్వయంగా చెప్పాడు. దానికి కారణం చెప్పాడు. ఆ కారణం తో సంబంధం లేకుండా అతను అలా తిట్టడం తప్పు. అందువల్లే అతని ఆ వ్యాఖ్యలని ఉపసంహరించుకోవాలని గట్టిగా కోరుతున్నా, మళ్ళీ. లేనట్లయితే ప్రవీణ్ నమ్మిన భావజాలంపై అతనికి గౌరవం ఉన్నదా లేదా అన్న అంశంపై నాకు అనుమానం తలెత్తుతుంది.

  ————————

  పద్మ గారూ, తల్లిగారిని తిట్టడం సరికాదు. ఈ విషయంలో మీకు నా మద్దతు ఉంది. ముందు నుండీ చెబుతున్నా ఇది. భరద్వాజ రీసెంట్ పోస్టు నేను చూడను. అనవసరం. కాని ఇదంతా ఎలా మొదలైందీ అన్న విషయం అతనిచ్చిన సమాచారం, ప్రవీణ్ ఇచ్చిన సమాచారంతో సరిపోలింది. అది చూశాను. అందులో నిర్ద్వంద్వంగా రుజువైన అంశం ఏమిటంటే: ప్రవీణ్ పైన, అతని భావజాలంపైన దాడి జరిగాకే అతను స్పందించాడు. ఐ రిపీట్. ఇన్నయ్యగారి బ్లాగ్ పోస్టే ప్రారంభం అన్నది మలక్ పేట్ రౌడీ చెబుతున్నది కరెక్టే ఐతే ప్రవీణ్ పైన, అతని భావాజాలంపైనా దాడి జరిగాకే ప్రవీణ్ స్పందన మొదలైందని నేను చెప్పిన అంశం స్పష్టంగా రుజువు చేస్తోంది.

  “ఒరేయ్” అని ఒక పేరుతో ప్రారంభించి “నీ లాంటి మెంటల్ కెసు” అని రౌడీ గారి పేరుతో ఎద్దేవా ఎందుకు చేసారు? ఏ హక్కుతో చేస్తారు? ఏ మర్యాదతో చేస్తారు? ఏ సభ్యతతో చేశ్తారు? ఇలాంటి అమానవీయమైన స్పందనకు కారణం ఏమిటి? ప్రవీణ్ చేసిన ఈ వ్యాఖ్య.

  “రాం దేవ్ ఒక యోగి అనుకుంటే హాస్యాస్పదమే. నాన్ వెజ్ ఎముకల పొడితో వెజిటేరియన్ ఆయుర్వేద మందులు తయారు చేసి జనానికి పంగనామాలు పెట్టే దొంగ యోగి”

  ఇందులో ప్రవీణ్ భావజాలం ఉంది. నాన్ వెజ్ ఎముకల పొడితో వెజ్ మందులు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు రాందేవ్ పైన ఉన్నాయి. ఆ ఆరోపణలని ప్రవీణ్ సొంతం చేసుకుని ప్రస్తావించాడు. రాందేవ్ పై ఆరోపణలు ప్రస్తావిస్తే ‘ఒరేయ్’ అంటారా? ‘మెంటల్’ అంటారా? అప్పటివరకూ ప్రవీణ్ కీ వీరికీ పరిచయం ఉందో లేదో తెలియదు. ఇక్కడి నుండే గొడవ మొదలైందని అంటున్నారు గనక పరిచయం లేదనే అనుకుంటున్నా. పరిచయం లేకుండా ఒక వ్యక్తిపైన, ఒక భావం వ్యక్తం చేసినందుకు ఇలా తూలనాడతారా? ఎదురుగా లేరని ఇష్టం వచ్చినట్లు తిడతారా? అపరిచయస్ధుల మధ్య ఇలాంటి మాటలు పదే పదే దొర్లాల్సిన అవసరం లేదు. ఒక్కసారి. ఒక్కసారి చాలు అటువంటు వ్యక్తులు ఎంత కుసంస్కారులో చెప్పడానికి.

  సరిగ్గా ఇదే విధంగా నా పైన, కొన్ని భావాలు వ్యక్తం చేసినందుకు, దాడి ప్రారంభమైంది. పద్ధతి కాదని మర్యాదగా చెప్పాను. “తమరు ఓపిగ్గా చెబితే వదిలేస్తామనుకుంటున్నావా? అమాయకుల్ని చేసి మోసం చేద్దామనుకుంటున్నావా?” అనడిగితే ఏం చేయాలి. నోర్మూసుకుని ఊరుకోవాలా? కాని ఊరుకున్నాను. ఆ వ్యాఖ్య తొలగించాను. ఆశ్చర్యంగా ఆ వ్యాఖ్య ‘మాలిక’ లొ ప్రత్యక్షమైంది. ‘నా వ్యాఖ్య తొలగిస్తాడని అనుమానంగా ఉంది. అందుకే ఇక్కడ కూడా ప్రచురిస్తున్నా’ అని పరిచయం చేసి మరీ ప్రచురించాడు. దాని ద్వారా మాలిక నిర్వాహకుల్లో ఇతనొకరని నా కర్ధం అయింది.

  ఇంత ఘోరమా? అగ్రిగేటర్ అని ప్రకటించి మీ యు.ఆర్.ఎల్ ఇవ్వండి అని కోరి తీసుకుని వారు తమకు నచ్చని భావాలు వ్యక్తం చేస్తే దూషిస్తారా? అగ్రిగేటర్ వేదికగా విష ప్రచారం చేస్తారా? వ్యక్తిత్వంలో ఎంత వంకర ఉంటే ఇలా చేశ్తారు? ఐనా ఊరుకున్నాను. దూషణల బ్లాగ్ మొదలైంది. నాకొక నిక్ నేమ్ వాళ్ళే పిట్టి. ఆ పేరుతో నన్ను నేనే తిట్టుకున్నట్లు రాసి, ఆ తిట్లకి స్పందనగా మరిన్ని తిట్లు తిట్టి, ఎందుకిందంతా చేస్తున్నారని అడిగితే ‘నీ భావజాలం మానుకో’ అని బెదిరించి…. ఎవరండీ వీళ్ళు? వీళ్ల విషయంలో మర్యాదలు, పద్ధతులు వల్లిస్తే నేను వినను గాక వినను.

  ఇన్నయ్య గారి బ్లాగ్ లో ప్రవీణ్ ఖర్మ, మెంటల్, ఇంకా ఇలాంటి పేర్లతో నానా ఛండాలం ఉంది. ఇవన్నీ ప్రవీణ్ కే ఆపాదించడం, దానికి మళ్ళీ ఛండాలపు ప్రతిస్పందన. ఈ గబ్బు ని ఎవరు భరించేది?

  ప్రవీణ్ పైన దాడి మొదలైనప్పుడే మీరంతా అడ్డు వచ్చినట్లయితే ఇంత జరగకపోను. అక్కడే ప్రవీణ్ కి నా మద్దతు. మనసు గాయపడడానికి ఒక క్షణం చాలదా? ఒక వ్యాఖ్య చాలదా? ఒక తిట్టు చాలదా? ఒక వెటకారం చాలదా? ఎన్ని సంవత్సరాలు కావాలని? ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారైనా ప్రవీణ్ పైన సానుభూతి వ్యక్తం అయిందో నాకు తెలియదు కాని, వ్యక్తం కాలేదని ప్రవీణ్ చెబుతున్నాడు. అందుకే అతనితో నా సానుభూతి.

  ప్రవీణ్ పై జరిగిన దాడి కేవలం వ్యక్తిగతమైనది కాదు. ఒక భావజాలం వ్యక్తం చేస్తున్నందుకే అతనిపై దాడి జరిగింది. అదే భావజాలం వ్యక్తం చేసినందుకు నాపైన దాడి జరిగింది. ఫలానా భావాజాలం అని చెప్పి మరీ దాడి చేశారు. శరీరానికి తగిలే గాయాలు కావివి. ఏళ్లతరబడి సంపాదించిన అనుభవంతో, ఏళ్ళతరబది చేసిన అధ్యయనంతో సంపాదించిన ఒక భావజాలాన్ని గాఢంగా నమ్మినందుకు జరిగిన దాడులివి. ఒక భావజాలాన్ని నమ్మినపుడు దానిని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకే ప్రవీణ్ కి నా మద్దతు. తాము నమ్మిన భావజాలాన్ని ఎవరైనా విమర్శిస్తే ఏం చేయాలి? విమర్శలని ఆహ్వానీంచాలి. చర్చించాలి. జ్ఞానానికి, అనుభవానికి పదును పెట్టి వివరించే ప్రయత్నం చేయాలి. చర్చ క్రమంలో తప్పు ఒప్పుల్ని నిస్పక్షపాతంగా చర్చించాలి. తద్వారా మాత్రమే తమ భావజాలంపైన ఇతరులకి కూడా నమ్మకం కాకపోయినా కనీసం గౌరవం కలుగుతుంది. అది మరిచి తమ భావజాలం విమర్శకు గురి కావడమే ఘోరంగా భావించి వెటకారం, ఎద్దేవా, తిట్లు, వెంటపడడం, ఇవన్నీ జరిగిన ఫలితమే ఇప్పటి ప్రవీణ్ దూషణలు. దూషణలకు నా మద్దతు లెకపోయినా, అతను ఎదుర్కొన పరిస్ధితికి నా సానుభూతి ఉంటుంది.

  ఫలానా పేర్లు ప్రవీణ్ కి ఆపాదించింది ఫలానావారే అని ప్రవీణ్ ఎలా చెప్పగలరో నాకు తెలియదు. ఫలనావారు కాదేమో అని చెప్పడానికంటె ముందు ఆ దాడి ఎందుకు చేశారు అని ప్రశ్నించడానికే నాకు ఆసక్తి ఎక్కువ. నేను నమ్మిన భావజాలం ప్రవీణ్ పైన దాడి ప్రతిదాడుల రూపంలో అవమానానికి గురైన పరిస్ధితి వస్తే నేను సహించను. ప్రవీణ్ ఎన్ని తప్పులు చేసినా నేను సంపాదించిన జ్ఞాన ఫలితాన్ని కాపాడుకోవడానికి కొన్ని మినయాయింపులతోనైనా ప్రవీణ్ లాంటివారికి నేను మద్దతు ఇస్తా. చర్చలకే నా మొదటి ప్రాధాన్యత. అది కోరుకోనివారికే వారి ప్రాధాన్యతలను బట్టే నా ప్రాధాన్యత మార్చుకోవలసిన అవసరం రావచ్చు. దానికి కారణం నా భావజాలం విషయంలో నేను రాజీ పడకపోవడమే.

  నేను నమ్మిన సామాజిక సిద్ధాంతం మానవాళి విముక్తి చెందడానికీ, సమస్త దోపిడీలు అంతం కావడానికి మార్గంగా నేను నమ్ముతున్నపుడు దానిని సమర్ధించడం కోసం ప్రవీణ్ లాంటి వారి అమాయకత్వాన్ని, తుంటరితనాన్నీ తాత్కాలికంగా భరించడానికి నేను సిద్ధం. … లాంటి వారికి గలిగిన గౌరవ భంగం కంటే నాకు మానవాళిని కాపాడగలదని నమ్మే నా సిద్ధాంతమే నాకు ముఖ్యం. ఆ విషయాన్ని … లాంటి వారు కూడా అర్ధం చేసుకోగలరని నా నమ్మిక.

  ఈ భావజాలం కలిగి ఉన్న ప్రవీణ్ కి అందుకే నా మద్దతు కొనసాగుతుంది. ఆ భావజాలం కలిగి ఉండడమే ఒక పాజిటివ్ పాయింట్ గా నేను చూస్తాను. ఎందుకంటే దానిని కలిగి ఉండడానికి అనేక ఆటంకాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ప్రవీణ్ లోపాలు చూస్తాను. ప్రవీణ్ లోపాల కంటే అతని భావజాలం నాకు ముఖ్యం. అతని లోపాలు ఇప్పుడు కాకుంటే రేపైనా అతను సవరించుకుంటారు.

  ప్రవీణ్ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులు చేస్తున్నాడు. తప్పులు చేయనిదేవరు? నేనూ అందులో ఒకర్ని. ఎవరూ వందశాతం పవిత్రులు కారు. ఈ దృష్ట్యానే ప్రవీణ్ కి లోపాలున్నా అతనికి నా మద్దతు. ప్రవీణ్ కి నేనిస్తున్న మద్దతు వ్యక్తిగతం కాదు. సామాజికం. సామాజిక ప్రయోజనాలను ఒక సిద్ధాంతం కాపాడుతుందన్న ఉమ్మడి తనం. అందుకే ప్రవీణ్ కి నా మద్దతు.

 188. అచంగ గారూ, మీరు కొన్ని పదాల్లో, వాక్యాల్లో మొదట నా కమిట్ మెంట్ తీసుకుని ఆ తర్వాత దాడి చేసే ఉద్దేశ్యం మీ మాటల ద్వారా వ్యక్తం చేశారు. బహుశా ఆ ఉద్దేశ్యం లేదేమో అని రెండో వ్యాఖ్య ద్వారా అనుకున్నా. కానీ ఈ వ్యాఖ్య అది నిజమేనని చెబుతోంది.

  ఈ ప్రశ్న మీరు మొదటే వేయవలసింది. మొదట నా చేత కమిట్ చేయించి … ఆ తర్వాత… ఇంత అవసరం లేదు. ఒక తప్పును సవరించే అవకాశం లేకుండా ఒప్పించే ఆత్రుత మీరు చూపారు.

  నేను అడిగింది విదేశాల్లో ఉంటూ దేశాన్ని విడవని వారి దేశభక్తిపైన అనుమానం ఏమిటని?

 189. తె.ర అంటే తెలకపల్లి రవి అని నాకు తెలియదు. ప్రవీణ్ ఆయనపై కామెంట్లో రాసినపుడు తొలగించాలని భావించా. కాని మీది ప్రచురించి ప్రవీణ్ ది ప్రచురించకపోవడం భావ్యం కాదని భావిస్తూ, ఏదీ నిర్ణయించుకోలేక ఒ.కె చెప్పాను.

  ఓ నిజం చెబుతాను. ఇన్ని కామెంట్లలో మోడరేషన్ కష్టంగా ఉందండీ. పొద్దున్నుండీ ఇదే పన్లో ఉన్నా.

  ఇప్పుడైనా మీ ఇద్దరి కామెంట్లు. తె.ర గురించి వచ్చినవి, తొలగిస్తాను. మీరు అనుమతిస్తే.

  సందర్భం వచ్చింది కనుక ఇక్కడ ఒక ప్రస్తావన. నాపైన ఇలాగే నేను లేని చోట ఈ గ్యాంగ్ వంది మాగధులు విమర్శలు, ఎగతాళి చేసారు. ఐనా నేను వారి జోలికి వెళ్లలేదు లెండి.

 190. ఇలాంటి వ్యాఖ్యల తోనే ప్రవీణ్ అమాయకత్వం పైన గురి కుదురుతోంది. నేను చెబుతున్న ఈ అమాయకత్వాన్ని అన్ని రంగాల్లో అమాయకత్వం ఉన్నట్లు నెను చెబుతున్నట్లు చూస్తున్నారు. నేను చెబుతున్నది ఇలాంటి, మరికొన్ని అమాయకత్వాల గురించి.

 191. నేను …(అచంగ) గారికి రెండుమూడు సార్లు మాత్రమే ఎదురుపడ్డాను. నిజమే. … గారు ఎక్కువగా కామెంట్లు వ్రాసేది విశాలాంధ్ర మహాసభ బ్లాగ్‌లో. నేను ఒకప్పుడు ఆ బ్లాగ్‌లో కామెంట్లు వ్రాసాను. ఆ బ్లాగ్ అడ్మినిస్ట్రేటర్లలో ఒకరైన చైతన్య అనే అతను నా కామెంట్లని డిలీట్ చేస్తానని అన్న తరువాత నేను ఆ బ్లాగ్‌లో కామెంట్లు వ్రాయలేదు. … విశాలాంధ్ర మహాసభవాళ్ళు ప్రాంతీయతత్వాన్ని ప్రోత్సహించే వ్రాతలు వ్రాసారు కానీ నేను వాళ్ళని విమర్శించినప్పుడు నా దగ్గర డొంక తిరుగుడు సమాధానాలు చెప్పలేదు. వాళ్ళు చెప్పాలనుకున్నది డైరెక్ట్‌గా చెప్పారు కానీ సంబంధం లేని వ్యాఖ్యలు వ్రాస్తున్నానని ఆరోపించలేదు. నువ్వు కావాలంటే తెలబాన్‌లకి సంఘీభావం తెలుపుకో కానీ మా బ్లాగ్‌లో కామెంట్లు వ్రాస్తే డిలీట్ చేసేస్తాం అని అన్నారు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చెయ్యడానికి ఏమీ లేదనుకుని నేను విశాలాంధ్ర మహాసభ బ్లాగ్ ఓపెన్ చెయ్యడం మానేశాను. విశాలాంధ్ర మహాసభ బ్లాగ్ నేను ఓపెన్ చెయ్యడం మానేసిన తరువాత అక్కడ కామెంట్లు వ్రాసినవాళ్ళవి ఎలా కనిపిస్తాయి? అందుకే అరుణ్‌చంద్ర గారు నాకు రెండు మూడు సార్లు కంటే ఎక్కువ ఎదురవ్వలేదు. విశాలాంధ్ర మహాసభ లాగ మా బ్లాగ్‌లో కామెంట్లు వ్రాస్తే డిలీట్ చేసేస్తాం అని డైరెక్ట్‌గా చెప్పొచ్చు కానీ పేరడీలు వ్రాసి వేధించడమే నాకు అసహ్యం కలిగించింది. విశాలాంధ్ర మహాసభ వాళ్ళకి అదైనా నిజాయితీ ఉంది కానీ కెలుకుడు పేరుతో పేరడీలు వ్రాసేవాళ్ళకి అది కూడా లేదు.

  (ప్రవీణ్, మీరు పేర్లు బహిర్గతం చేస్తున్నారు. అది అపాలి. ఇది రెండోసారి మీకు చెప్పడం)

 192. విశేఖర్ గారు, మీకు విషయం అర్థం అవ్వలేదు. నేను అమాయకునిలా నటించాను అని వాళ్ళు అంటున్నది వేరే కాంటెక్స్ట్ గురించి. గతంలో వీళ్ళకీ, కత్తి మహేశ్ గారికీ మధ్య గొడవ జరిగింది. అయితే నేను క్రీమీ లేయర్ లాంటి విషయాలలో మహేశ్ గారిని విమర్శించడం వల్ల వీళ్ళు మహేశ్ గారికి వ్యతిరేకంగా నన్ను ఉపయోగించుకోవాలనుకున్నారు. అందు కోసం వీళ్ళు ప్రవీణ్ అమాయకుడు, వాడి పోస్ట్‌లని కామెడీ కోసం మాత్రమే చదవాలి, మహేశ్‌ని మాత్రమే విలన్ అనుకోవాలి అని ప్రచారం చేశారు. నాకు మహేశ్ గారి మీద ద్వేషం లేదు. దళితవాదిగా అతనంటే నాకు అభిమానమే. అందుకే నేను 2010 జులైలో మహేశ్ గారిని ఓపెన్‌గా పొగిడాను. ప్రవీణ్ ఇంత కాలం అమాయకుడిలా నటించాడు, వీడికీ కత్తి మహేశ్‌కీ తేడా లేదు అని వాదించడం అప్పుడు మొదలుపెట్టారు. అదీ సంగతి. ఇంకో విషయం. భరద్వాజ మహేశ్‌ని తిడుతూ ఓరెగాన్ ఓబులేసు MF అనే పేరడీ వ్రాసినప్పుడు నేను మహేశ్ గారి వైపే ఉన్నాను. హుస్సేన్ పేరులోని మొదటి రెండక్షరాలలో డబల్ మీనింగ్ ఉంది, నిజమే. మహేశ్ గారు హుస్సేన్ అభిమాని, నిజమే. కానీ అంత మాత్రాన మహేశ్ గారిని MF అనడం నాకు నచ్చలేదు. పైగా వాళ్ళు MF అనేది తిట్టు కాదు, మహేశ్ వాళ్ళ గురువు గారి పేరులోని మొదటి రెండక్షరాలు అని చెప్పి జస్టిఫై చేసుకోవడం కూడా నాకు నచ్చలేదు. అయినా నేను చాలా సందర్భాలలో మహేశ్ గారితోనే ఉన్నాను.

 193. అచంగ గారూ, ఈ పోస్టు కింద మీ వ్యాఖ్యలు మళ్ళీ చూశాను. నిజానికి పోస్టు తో సంబంధం ఉన్న వ్యాఖ్య మీదేనని గమనించాను. మీకు ఇచ్చిన సమాధానాల్లో నిజంగానే అసహనం ఉంది. ప్రవీణ్, గ్యాంగ్, తిట్లు ఇదే చర్చ జరుగుతోంది. దానితొ నా పోస్టేంటో నేనే మర్చిపోయినట్లుగా తోస్తోంది.

  ఈ వ్యక్తి వ్యాఖ్యానించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో బూతులు పెట్టాడు. బూతులు బహిర్గతం చేస్తే నా రియాక్షన్ ఎందుకో అర్ధం అవుతుందెమో కాని, అది చెయ్య కూడదు కనుక చెయ్యలేకపోతున్నా.

  నా పోస్టుతో సంబంధం లేకుండా, అక్కడి సబ్జెక్టు తో సంబంధం లేకుండా పాకిస్ధాన్ అనీ, తాలిబాన్ అనీ, ఆఫ్ఘనిస్ధాన్ అనీ వస్తే చాలు వీళ్ళు దిగబడి బూతులు రాసేస్తున్నారు. ఆ రాతల్ని నివారించడానికే ఈ పోస్టు. ఐ.పి బహిరంగం చేయడం మొదలు పెడితే ఆగుతారని ఒక ఆలోచన.

  దేశ భక్తి, విదేశాల్లో నివాసం, స్వదేశీ దేశ భక్తి ఇలాంటి అంశాలపైన నాకున్న భావాలు ఈ పోస్టులో సమగ్రంగా వ్యక్తం కాలేదు. సందర్భం వచ్చినపుడు వివరిస్తాను. మీ వ్యాఖ్య ముందే వచ్చినట్లయితే వివరంగా రాసేవాడినేమో. కాని ఈ పోస్టు కింద వ్యాఖ్యానాలకు ఇప్పటికే చాలా సమయం కేటాయించాను. అసలు పోస్టులపైన కేంద్రీకరించలేకపోతున్నా.

  ఇంకెవరైనా వ్యాఖ్యానించారేమో, స్పందించకపోతే ఏవైనా అనుమానాలు వస్తాయేమో అనుకుంటూ ఇక్కడే కేంద్రీకరించాను.

 194. “అచంగ గారూ, మీరు కొన్ని పదాల్లో, వాక్యాల్లో మొదట నా కమిట్ మెంట్ తీసుకుని ఆ తర్వాత దాడి చేసే ఉద్దేశ్యం మీ మాటల ద్వారా వ్యక్తం చేశారు. బహుశా ఆ ఉద్దేశ్యం లేదేమో అని రెండో వ్యాఖ్య ద్వారా అనుకున్నా. కానీ ఈ వ్యాఖ్య అది నిజమేనని చెబుతోంది.”

  నేను మొదటే మీ కమిట్‌మెంట్ అడిగిన మాట ముమ్మాటికీ వాస్తవమే! అది నా చర్చ పరిధిని మీకు తెలియజేయటానికే. నేను మీ బ్లాగులో కామెంటు పెట్టటం ఇది రెండవసారి. ఒక్కసారి ఇంతకుముందు నా కామెంట్ల సరళిని పరిశీలించండి అవసరానికి మించి మాట తూలింది లేదు అది మీరూ యెరుగుదురనే అనుకుంటున్నాను. మరి మీకు నేను దాడి చేయటానికే వచ్చానని ఎలా అనిపించిందో మీకే తెలియాలి. సరే ఇది దాడే అనుకుందాం నేనేమీ మిమ్మల్ని వ్యక్తిగతంగా పడతిట్టిపోయటము లేదు కదా? మీరు చేసిన వ్యాఖ్యను మీరు సవరించుకోని పక్షములో చర్చకు సిద్ధంకమ్మని మాత్రమే సూచించాను. దానికే మీరు తెలంగాణ అంశాన్ని నాకు అంటగట్టినది వాస్తవమే కదా!
  —————————————————————————————————————————————–
  “ఈ ప్రశ్న మీరు మొదటే వేయవలసింది. మొదట నా చేత కమిట్ చేయించి … ఆ తర్వాత… ఇంత అవసరం లేదు. ఒక తప్పును సవరించే అవకాశం లేకుండా ఒప్పించే ఆత్రుత మీరు చూపారు.”

  పొరపాట్లను మాత్రమే సవరించుకోగలం తప్పులను సవరించుకోలేము వాటిని అంగీరించి మరోసారి ఆ తప్పు చేయబోమని హామీ ఇవ్వటము మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. విఙ్ఞులు మీరెరుగనిది కాదు. అలాగే మీరు చేసిన వ్యాఖ్యకు కట్టుబడి ఉండి దాన్ని వ్యతిరేకించే వ్యక్తుల చర్చను దాడిగా వర్ణించటమూ మీవంటివారికి పాడి కాదు.
  —————————————————————————————————————————————–
  నేను అడిగింది విదేశాల్లో ఉంటూ దేశాన్ని విడవని వారి దేశభక్తిపైన అనుమానం ఏమిటని?

  నేను మిమ్మల్ని చర్చకు పిలిచింది సరిగ్గా ఈ విషయమ్మీదే. నేనూ అడుగుతున్నది అదే దేశాన్ని విడువకుండా దేశములో ఉన్నంత మాత్రము చేతనే దేశభక్తి మెండుగా ఉన్నదని మీరు ఎలా జనరలైజేషన్‌కి వచ్చారు? అందుకు మీ దగ్గర ఉన్న ఆధారాలేమిటి అని అడిగాను మీరు అది తప్పించి మిగతా అంతా చెప్పారు.

 195. ప్రవీణ్ ఈ ఎం.ఎఫ్ ఏమిటి? అది తాను అన్లేదని పద్మ చెబుతున్నారు గదా? మీరు సమాధానం ఇవ్వరేం? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు పూర్తిగా మిమ్మల్ని చేరడం లేదా? మీరు చూడడం లేదా? సమాధానం ఎందుకని ఇవ్వలేకపోతున్నారు?

  మీ మొబైల్ లో అన్ని వ్యాఖ్యలూ చూడలేకపొతున్నారా? ఏదో ఒకసమాధానం ముందు ఇవ్వండి.

 196. ప్రవీణ్ ఎం.ఎఫ్ కి ఉన్న ఇంకో అర్ధం ఏమిటి? ఘోరంగా ఉంటే మెయిల్ ఇవ్వండి. నా ఈ మెయిల్ మీ దగ్గర ఉండాలి. విజి ఫ్రాన్సిస్ పేరుతో ఉంది.

  సరే. ఆ తిట్టుని పద్మకి అపాదిస్తున్నారెందుకు? అది అన్నది పద్మ గారు కాదా? ఎవరు? పద్మ గారు అన్నారని మీరెందుకు అన్నారు? సూటిగా చెప్పండి.

  ఇంతకీ నేను అమాయకుడు అంటున్నది వేరే అంశాల గురించి. దానికీ వారికీ సంబంధం లేదు. రెండింటికీ సంబంధం మీరూ చూడొద్దు.

 197. MF అంటే … అని అర్థం. అది ఇంగ్లిష్‌లో చాలా చెత్త తిట్టు. అలాంటి పదాలు వర్డ్‌ప్రెస్‌లో వ్రాయడం నిషిద్ధం. తెలుగులో వ్రాయడం ఎందుకు అని సంస్కృత అర్థం వ్రాసాను. భరద్వాజ మహేశ్ గారిని ఓరెగాన్ ఓబులేసు MF అని అన్నాడు. పైగా అది తిట్టు కాదు, మహేశ్ గారి గురువు గారి పేరులోని మొదటి రెండక్షరాలు అంటూ తనని తాను జస్టిఫై చేసుకున్నాడు.

 198. మై గుడ్ నెస్. ఇంగ్లీసు సినిమాల్లో నేనూ విన్నానిది. చాలా సులువుగా వాడేస్తారు. ఆ సంస్కృతిని వంటబట్టించుకున్నవారు ఆ తిట్టుని పెద్ద తిట్టుగా చూడరు. భారతీయులై ఉండీ, హిందూ సంస్కృతి పరిరక్షకులుగా ఫోజు పెడుతూ ఈ తిట్లు వాడడం ఘోరం. మరి దీన్ని పద్మ గారికి ఎందుకు ఆపాదిస్తున్నారు? అది చెప్పరేం?

 199. మహేశ్ గారిని అలా తిట్టడం వల్లే వీవెన్ గారికీ, భరద్వాజ గారికీ మధ్య గొడవ జరిగింది. కెలుకుడు బ్లాగులని ఉంచాలా, పీకెయ్యాలా అని వీవెన్ గారు పోల్ పెట్టారు. ఆ పోల్‌లో దొంగ వోట్లు వెయ్యడం సులభమే అని భరద్వాజ వాదించి తన బ్లాగుని పీకకుండా చూసుకున్నాడు. పోల్‌లో సెలెక్ట్ చేసిన ఆప్షన్‌ని కుకీల నుంచి డిలీట్ చేసి దొంగ వోట్లు వెయ్యొచ్చు. కానీ ఆ తరువాత భరద్వాజ మహేశ్ గారికి వ్యతిరేకంగా సొంత అగ్రెగేటర్ పెట్టుకుని దానికి మాలిక అని పేరు పెట్టుకున్నాడు. ఆ మాలికలో కేక అనే సెక్షన్ పెట్టి అందులో నా గురించి కూడా చెత్తగా వ్రాయించాడు. మొదట్లో నా అనుమతి లేకుండానే నా బ్లాగ్‌ని వాళ్ళ అగ్రెగేటర్‌లో పెట్టారు. నా బ్లాగ్‌కి ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది అని అనిపించి నా బ్లాగ్‌ని వాళ్ళ అగ్రెగేటర్ నుంచి పీకేశారు. నా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియాలో మాత్రం ఎన్నడూ కెలుకుడు బ్లాగులు పెట్టలేదు.

 200. అలాగే విశేఖర్ గాఱూ.. నేనడిగిన అంశమ్మీద మీ సమగ్రమైన వివరణకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు పోస్టు చెయ్యగానే నాకో మెయిల్ కొట్టటం మరువకండి. ఈ టపాకు సంబంధించి మరి శెలవు.

 201. ప్రమాదవనం బ్లాగ్ పెట్టినప్పటి నుంచి పద్మ గారు ఆ బేచ్‌లోనే ఉన్నారు. అయితే మహేశ్ గారిని ఆ తిట్టు తిట్టింది 2010లో. అయినా ఆ ప్రమాదవనం రచయితల లిస్ట్‌లో ఉన్నవాళ్ళు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. పైగా ఆ లిస్ట్‌లో ఉన్న కాలనేమీ, లత వొరువూరు, నిప్పురవ్వ అనేవి సూడోనిమ్స్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ లింక్ చదవండి: http://appalaraj.blogspot.com/2010/11/blog-post.html ఈ బ్లాగ్ పెట్టింది కూడా కెలుకుడు బేచ్‌వాళ్ళేనని అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు తమ మీద తామే పేరడీలు వ్రాసుకుని సానుభూతి పొందాలనుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

 202. పద్మ గారిని కెబ్లాస అంటే ఏమిటని అడిగాను. చెప్పలేదు. రేపు చెబుతారేమో! ప్రవీణ్ మీకు తెలుసా?

 203. కెబ్లాస అంటే కెలుకుడు బ్లాగర్ల సంఘం. అది పెట్టినవాడు ఏకలింగం. తరువాత అది మలక్ చేతుల్లోకి వెళ్ళింది. ఏకలింగం నేను మావోయిస్టులతో తిరుగుతున్నట్టు నా మీద కొన్ని కథలు వ్రాసాడు. దాని గురించి నేను అభ్యంతరం చెప్పలేదు. కానీ మలక్ అనవసరంగా మా కుటుంబ ప్రస్తావన తేవడం వల్ల నాకూ, మలక్‌కీ మధ్య గొడవ జరిగింది. ఏకలింగం కేవలం నేను మావోయిస్ట్‌లతో తిరుగుతున్నట్టు వ్రాసాడు కానీ మా కుటుంబ సభ్యులని లాగలేదు. అందుకే ఎకలింగం విషయంలో సైలెంట్‌గా ఉన్న నేను మలక్ విషయంలో అలా ఉండలేదు.

 204. ప్రవీణ్, ‘మీరు’ అంటే, ‘మీ కెబ్లాస’ అని అర్ధమా. ఐ.సీ. ‘కెలుకుడు బ్లాగర్ల సంఘం’ లో పద్మ ఎందుకు ఉన్నట్లు? ఎవరిని కెలకాలని ఈవిడ అందులో ఉన్నట్లు? అసలు కెలికే బ్లాగర్ల సంఘం ఎందుకు పుట్టింది? అది కూడా మీ పైనేనా? అసలు ‘కెలకడం’ అన్న కాన్సెప్టే నెగిటివ్ గా ధ్వనిస్తోంది. ఒక నెగిటివ్ ఉద్దేశ్యంతో బ్లాగ్ పెట్టారా వీళ్ళు?

 205. Praveen Sarma 10:51 ఏ ఎమ్ వద్ద జనవరి 07, 2012
  పద్మ గారు, మీరు ఎవరిని నమ్మిస్తారు? మహేశ్‌గారి అమ్మగారి పేరు వ్రాయకుండానే మీరు మహేశ్ గారిని MF అని తిట్టారు. అది మహేశ్ కుటుంబ సభ్యులు చదివితే బాధపడరా? పైగా MF అనేది తిట్టు కాదు, అతని గురువు గారి పేరు అని చెప్పి మిమ్మల్ని మీరే జస్టిఫై చేసుకున్నారు. అతని గురువు గారి పేరులో ఆ రెండు అక్షరాలు ఉన్నంతమాత్రాన ఆ అబ్రీవియేషన్ ఉపయోగించి మహేశ్‌గారిని తిట్టాలా?

  Praveen Sarma 8:16 సాయంత్రము వద్ద జనవరి 07, 2012
  మీరు అంటే మీ కెబ్లాసవాళ్ళు మహేశ్‌ని MF అన్నారని అర్థం. అంతే కానీ ఒక్కరేనని కాదు.

  visekhar 6:41 సాయంత్రము వద్ద జనవరి 07, 2012
  ప్రవీణ్ ఎం.ఎఫ్ కి ఉన్న ఇంకో అర్ధం ఏమిటి? ఘోరంగా ఉంటే మెయిల్ ఇవ్వండి. నా ఈ మెయిల్ మీ దగ్గర ఉండాలి. విజి ఫ్రాన్సిస్ పేరుతో ఉంది.

  ——————————————————————————
  మీకు నమ్మకం కలిగించాలనే ప్రవీణ్. పైనించి కింద దాకా మీలో ఎంత బూతు నిండి ఉందో మీకు తెలియజెప్పాలనీ, మీకా నమ్మకం కలిగించటం కోసమే ఈ ప్రయత్నం.

  నా పేరుతో అడ్రెస్ చేసి, మీరే అన్నారు అని అంత గట్టిగా చెప్పి ప్రూఫ్ చూపించమంటే అబ్బే మీరంటె మీ కెబ్లాస అని మాట మార్చటమా? ఇవి కావూ వెధవ్వేషాలంటే? అంటే నేను గట్టిగా ప్రూఫ్ అడక్కపోతే పద్మ గారే కత్తి మహేష్‌ని బూతులు తిట్టారని ప్రచారం. రైట్? అసలు ఆ పదం బూతు కాదు. అది వాడింది నేను కాదు. కానీ ఈ రెంటికీ లంకె పెట్టేసి ప్రచారం. ఇందుక్కాదూ, అందరికీ మండి తిట్టేది? వాళ్ళందరూ నన్ను ఏకుతున్నారో అని ఏడ్చే బదులు వాళ్ళు ఒకవేళంటూ ఏకితే ఆ ఏకే పనులు మనం ఏం చేస్తున్నాం అని చీమ తలకాయంత ఆలోచన కూడా రాదా ఎప్పుడూ?

  ఈ MF అన్నది తిట్టు అని మీరు చెప్తే కానీ విశేఖర్‌గారికి కూడా అర్థం కాలేదు ప్రవీణ్. బూతులు శరీరంలో రక్తంతో పాటు ప్రవహిస్తున్న మీకు అన్నింట్లోనూ బూతులే ధ్వనిస్తున్నాయంటే అది వింతేమీ కాదు. ఆ పోస్ట్‌లో చాలా క్లియర్‌గా అది వారి గురువుగారి పేరు అని చెప్పారే. అది కనబడలేదా? ఇదిగో తమరిలాంటి వాళ్ళ బుఱ్ఱలు బూతుపరంగానే ఆలోచిస్తాయని తెలుసు కాబట్టే ముందుజాగ్రత్తగా ఆ వివరణ ఇచ్చుకున్నారు. అది తెలీలేదా? ఇందుకే విశేఖర్ గారు కూడా కామెంట్స్ పెట్టేటప్పుడు అవి అవతలివారికి అర్థం అవవనుకున్నప్పుడు వివరణ ఇస్తూ కామెంట్ చేస్తే సందర్భం అందరికీ అర్థం అవుతుందని మొదటినించి తమరికి గొంతు చించుకుని పాఠాలు చెప్తున్నారే? ఇందుకే ప్రవీణు. మీకు పోస్ట్‌కి సంబంధించిన కామెంట్స్ వెయ్యటం రాదు, విశేఖర్ గారన్నట్టు వివరణ ఇచ్చుకోవటం రాదు. అవతలివాళ్ళు వివరణ ఇచ్చినా అర్థం చేసుకోవటం రాదు.

  చాలామంది అభిమానులు వాళ్ళకిష్టం అయిన వారి పేరునో వాళ్ళకి సంబంధించిన వాటినో పేర్ల పక్కన తగిలించుకుంటారు. అది తెలుసా? చేగువెర పేరు, పేరు పక్కన కలం పేరుగా తగిలించుకున్నవారు కోకొల్లలు. అది తెలీదా? ప్రతీ దాన్లోనూ బూతు తప్ప ఇంకోటి చూడటం రాదా? మీలాంటివాళ్లకి ప్రవీణు అన్నా బూతుగా ధ్వనించటం, నిజమే, వింత కాదు.

 206. విశేఖర్ గారు, నేను multiple questions కి రిప్లైస్ ఇచ్చే ప్రయత్నంలో మీ ప్రశ్న మిస్ అయినట్టున్నాను, ప్రవీణ్ కత్తి గారిని నేను MF అని తిట్టానని ఆరోపించిన కామెంట్ లాగానే. బట్ ఎస్, కెబ్లాస అంటే కెలుకుడు బ్లాగుల సంఘం.

  విశేఖర్ గారు, మీరు మీ వార్తల కోసం బ్లాగ్ పెట్టి మీ ఆలోచనలనీ, అభిప్రాయాలనీ ఏ దేశం మీదనైతే అవనివ్వండి ఏ విధానాల మీద అయితే అవనివ్వండి, ప్రచురిస్తున్నట్టే కెబ్లాస కూడా తన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకునే ప్రయత్నం చేస్తోంది. మీరు మీకు నచ్చనివి నచ్చలేదు అని ఎలా చెప్తున్నారో వాళ్ళూ అలానే మీ అభిప్రాయాలు నచ్చలేదని చెప్తూంటారు, కాస్త హాస్యంగా. బూతులు లేకపోయేసరికి ప్రవీణ్ లాంటివారికి అవి నచ్చవనుకోండి. అది వేరే విషయం. BUT, all they did till date is to react to something somebody did or said. They have never been proactive. వాళ్ళంతట వాళ్ళే ముందుకి వచ్చి ఎవర్నీ ఏ మాటా అనలేదు. మీకు తెలిసిందే కదా. మీరు కొన్ని తీవ్రమైన కాంట్రవర్షియల్ అభిప్రాయాలని వెల్లడిస్తే వాటి మీద మరొకరు కూడా వాళ్ళ అభిప్రాయాలు వెల్లడించవచ్చు. అదే కెబ్లాస చేసేది. Unfortunately, though I was supposed to be a content provider to that blog, I have never contributed anything except for the ప్రమాదసూచిక title. I regret for not being active in that blog.

 207. visekhar 6:47 సాయంత్రము వద్ద జనవరి 07, 2012
  మై గుడ్ నెస్. ఇంగ్లీసు సినిమాల్లో నేనూ విన్నానిది. చాలా సులువుగా వాడేస్తారు. ఆ సంస్కృతిని వంటబట్టించుకున్నవారు ఆ తిట్టుని పెద్ద తిట్టుగా చూడరు. భారతీయులై ఉండీ, హిందూ సంస్కృతి పరిరక్షకులుగా ఫోజు పెడుతూ ఈ తిట్లు వాడడం ఘోరం. మరి దీన్ని పద్మ గారికి ఎందుకు ఆపాదిస్తున్నారు? అది చెప్పరేం?
  ——————————————————-

  పద్మ గారూ మీ క్రానాలజీ ఆఫ్ ఈవెంట్స్ లో ఇది ఎందుకు మిస్ చేశారు? నాకు సహజంగానె బూతులు గుర్తుకు రావు. నాకు తెలిసింది తక్కువ. అందునా పర భాషలో వాడేవి అసలు గుర్తుకు రావు, చెప్పేదాకా. దీనిని కూడా మీ వాదనకు మద్దతుగా తెచ్చుకుంటున్నారే? ప్రవీణ్ పై చేస్తున్న వాదనల్లో తరచు మీరిలా చేస్తున్నారు. అక్కడికి నేను చెబితే ఫైనల్ అయినట్లు. నేను చేసే ఇతర వాదనలని, మీకు వ్యతిరేకంగా ఉంటే విస్మరించడం, ప్రవీణ్ కి వ్యతిరేకంగా ఉంటే ఉటంకించడం, సమర్ధవంతంగా చేస్తున్నారు. వీటిని ఏ వేషాలు అనాలి?

  మీరు అంటె కెబ్లాస అని ప్రవీణ్ చెప్పిన వివరణ మాట మార్చడంగా నాకేమీ కన్పించడంలే. మీకు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. మల్టిపుల్ క్వశ్చెన్స్ మిస్ అవుతున్నానంటూనే మల్టిపుల్ రోల్స్ పోషిస్తున్నారు. మీరు ఏకడం ప్రారంభం అయ్యాకే ప్రవీణ్ ఏడ్పులు ప్రారంభం అయ్యాయని నేను చూపాను. అది వదిలేసి మిగతావి మాట్లాడండేం? ఇతరత్రా అన్ని రకాలుగ తిట్టి, ఎం.ఎఫ్ హుస్సేన్ గారినీ బూతులు తిట్టి, ఎం.ఎఫ్ అన్నది మాత్రం తిట్టు కాదు అది గురువు గారి పేరు అని గౌరవ సూచకంగా వాడేమని చెబితే నమ్మెయ్యాలేం? వారు తిట్టాలనుకుంటే నానా బూతులూ ఎం.ఎఫ్ గారి మీద వాడుతారు. ఒక్క ఎం.ఎఫ్ తిట్టు మాత్రం గౌరవ సూచకంగా వాడుతారు. గుడ్ ఎనాలజీ! కదండి?

 208. ఇక్కడ జరుగుతున్న చర్చ కంక్లూడ్ కావడానికి ప్రవీణ్, పద్మ గార్లు సహకరించాలని కూడా కోరుతున్నాను.
  —————————–
  నిన్న ఈ మాట మీరన్నారు. మమ్మల్ని అడిగిన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పినట్టే మేమడిగిన ప్రశ్నలకి ప్రవీణ్ కూడా సమాధానాలు చెప్తే తప్పకుండా చర్చ ముగించేద్దాం. ఇదే మాట నిన్న చెప్పాను. కానీ ప్రవీణ్ దేనికీ సమాధానం చెప్పలేదు సరి కదా, కత్తి MF అంటూ చర్చ పక్క దారి మళ్ళించే ప్రయత్నం చేశాడు. But I am sure we are smart enough to get back to the point of discussion. So here are the questions for Praveen.

  1. భరద్వాజ వాళ్ళ అమ్మగారి గురించి అర్థం పర్థం లేకుండా చెత్త వాగటానికి గల కారణం ఏంటి? మీ వదిన గారి మీద ఏవో రాశారు అందుకనే అన్నారు. ప్రూఫ్ అడిగితే పేరు పెట్టి ఎక్కడా రాయలేదు అన్నారు. మరింక మీ వదిన గారినే అన్నారు అనటానికి సాక్ష్యం ఏది? పేరడీలు అన్నారు. పేరడీల్లో మీ వదిన గారి పేరు ఎక్కడా లేదని మీరే ఒప్పుకున్నారు. ఇంక మీ కుటుంబాన్ని విమర్శించింది ఎక్కడ? మీ కుటుంబాన్ని విమర్శించనప్పుడు మీరు ఇంకొకరి కుటుంబాన్ని ఎందుకు బైటికి లాగాల్సి వచ్చింది?

  2. ఎక్కడ ఎవరు ఏది చేసినా భరద్వాజకి లింక్ పెట్టి వాళ్ళ కుటుంబాన్ని బైటికి లాగటం లాంటి చండాలమైన పనులు ఎందుకు చేస్తున్నారు?

  3. గత మూడేళ్ళుగా హెరాస్ చేశారంటున్నారు. మూడేళ్ళూ సహనంతో భరించానన్నారు. మరి ఆడియో వీడియోల ప్రహసనం ఏ అసహనంతో మొదలెట్టారు?

  4. శ్రావ్య భరద్వాజని సపోర్ట్ చేసినంత మాత్రాన తన మీద అవాకులూ చెవాకులూ ఎందుకు పేలాలనిపించింది? అంటే ఎవరు భరద్వాజకి సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద ఇటువంటి ప్రయత్నాలు చేస్తారా? ఇదేనా మీ మోడస్ ఆపరాండి?

  5. సపోర్ట్ కూడా అక్కరలేదు. భరద్వాజ వేసిన పోస్ట్‌లో ” :))) ” అని పెట్టినా వాళ్ళు మీకు వ్యతిరేకులనే ఫిక్స్ అయిపోయి వాళ్ళని ఎందుకు వేధిస్తారు?

  6. అజ్ఞాత రూపంలో ఎవరెవరో తిడితే అవన్నీ భరద్వాజ, వాళ్ళ “మీరనే గాంగ్” కి ఎందుకు ఆపాదించి వాళ్ళని బూతులు తిట్టారు? ఆ అజ్ఞాతలు భరద్వాజ అండ్ గాంగ్ అనటానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా?

  7. onlyforkarthik బ్లాగ్ ఎందుకు ఓపన్ చేసి కార్తీక్‌ని మర్యాదస్తులూ, సహనశీలురూ అనలేని, పలకలేని బూతులు తిట్టాల్సొచ్చింది? అలాంటి తిట్లు కార్తీక్ మిమ్మల్ని తిట్టారా? తిడితే, ఏ సందర్భంలో?

  8. ఏకలింగం, భరద్వాజ ఒక్కరే అని ఆరోపించి అది నిరూపించమని అడిగితే ఇప్పటిదాకా (దాదాపు మూడేళ్ళు) నోరెందుకు మెదపలేదు? సాక్ష్యం ఎందుకు చూపించలేదు? విశేఖర్ గారూ, ఇది మీరు కూడా గమనించాలి. మీరనే దాడికి గురి కాబడ్డ అమాయకుడు ఆరోపించటమే తప్ప ఆధారాలు చూపలేడన్నది.

  9. కుటుంబసభ్యులని గొడవల్లోకి లాగటం అనేది 2009 నించే చేస్తున్న మీరు ఈరోజు వచ్చి గత మూడు నెలలుగా మాత్రమే అని అబధ్ధాలు ఎందుకు చెప్తున్నారు?

  ప్రవీణ్ ఈ పై ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాలి. బేషరుతుగా సీతామహాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పుకోవాలి. స్త్రీవాదం, అభ్యుదయవాదాలు కలిగి ఉండటం అంటే బూతులు తిట్టటం కాదని తెలుసుకోవాలి.

 209. విశేఖర్ గారు, మీరు మీ వార్తల కోసం బ్లాగ్ పెట్టి మీ ఆలోచనలనీ, అభిప్రాయాలనీ ఏ దేశం మీదనైతే అవనివ్వండి ఏ విధానాల మీద అయితే అవనివ్వండి, ప్రచురిస్తున్నట్టే కెబ్లాస కూడా తన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకునే ప్రయత్నం చేస్తోంది. మీరు మీకు నచ్చనివి నచ్చలేదు అని ఎలా చెప్తున్నారో వాళ్ళూ అలానే మీ అభిప్రాయాలు నచ్చలేదని చెప్తూంటారు, కాస్త హాస్యంగా.
  ———————————————————

  మీ ఆలోచనలనీ, అభిప్రాయాలని పంచుకోవడానికి ‘కెలుకుడు బ్లాగర్ల సంఘం’ పెట్టారా? నచ్చలేదని హాస్యంగా చెప్పడానికి కెలకాలా? ఏం వివరణ అండీ?

  కెబ్లాస అన్నది బూతు కాకపోయినా నెగిటివ్ పదజాలం అన్నది సుస్పష్టం. నెగిటివ్ పదజాలం ఎన్నుకుని ‘హాస్యం’ కోసం అని కవర్ చేస్తున్నారు. ‘కె.బ్లా.స’ అన్న పేరులోనే నెగిటివ్ ఉద్దేశ్యాలున్నట్లు నాకు తోస్తొంది.

  బూతులు లేకపోయేసరికి ప్రవీణ్ లాంటివారికి అవి నచ్చవనుకోండి
  ——————————————-

  ఈ జనరలైజెషన్ సరికాదు. ఇవే ఆ గ్యాంగ్ అనుసరిస్తూన్న తెలివితేటలు. బూతులు తిట్టేది గ్యాంగు. వాటిని ఆపాదించేది ప్రవీణ్ కి. ఆపాదిస్తూనే మరిన్ని బూతులు తిట్టే అవకాశం దొరకబుచ్చుకునే చచ్చు తెలివితేటలు బూతు గ్యాంగ్ వి. ఇవే ఎత్తుగడలు నాపైన అమలు చేశారు. ఇంకా చేస్తున్నారు. నా పైనా ఇంకా కొనసాగుతున్న దుష్ప్రచారం, విద్వేషం, ఎగతాళి.. వీటిలో ఫ్రాక్సన్ భాగాన్ని రాత్రి చూశా. ఇవేవీ మీకు కనపడవు. కదండీ. కాని ఎక్కడన్నా నాలాంటి వారో ప్రవీణ్ లాంటి వారో ఓ మాట పొరబాటున వాడారో, ఇంకేం, ఏ పెద్ద కత్తితో రేడీ. సవరించుకోవాలని డిమాండ్లు. ‘ప్రవీణ్ అలా ఎందుకు అన్నావు? అని ఓ మందలింపు నాలాంటి వారు చేస్తే దాన్ని ఓ కత్తిగా చేసి పారెయ్యడం. “ప్రవీణ్, విశేఖర్ కూడా క్షమాపన చెప్పాలన్నారు. ఎప్పుడు చెబుతున్నావ్? అని తుంటరిగా ప్రశ్నలు” చప్పట్లండీ పద్మ గారూ?

  పద్మ గారూ, I regret you for being with the gang. I’m sorry. పైగా ‘కెలుకుడు’ అని గొప్పగా ప్రకటించుకున్న గ్యాంగ్ లో. మీ బ్లాగ్స్ లిస్ట్ లో ‘కెబ్లాస’ ఉండడం నన్ను నిర్ఘాంతపోయేలా చేసింది. మీరు సాగించిన నైతిక చర్చ, పద్ధతులపైన చర్చ, క్షమాపణల కొసం చర్చ, ఇవన్నీ ‘కెబ్లాస’ లొ ఉంటూ చేశారని తలచుకుని నిర్ఘాంతపోతున్నా. అవున్లెండి ‘కెబ్లాస’ పేరే చెబుతోంది. కెలుకుడికి పద్ధతులేముంటాయి?

  కెబ్లాస కి మీరు ఏమీ రాయకపోయినా, అందులో భాగం వహిస్తూన్నపుడు, అది కూడా “I regret for not being active in that blog” అని ఘనంగ చెప్పుకుంటున్నపుడు ఆ బ్యాచ్ చేసే అసంబద్ధ వాదనలు, బూతుల అట్రిబ్యూషన్లు, కెలుకుడులు… అన్నింటికీ మీ మద్దతు ఉన్నట్లే. అందుకు నాకే అనుమానమూ లేదు. ప్రవీణ్ ని ‘ఎరా’ అని అనడం దగ్గర్నుండి, ‘మెంటల్’ అని తిట్టి, బూతులను అట్రిబ్యూట్ చేసి, పేరడీలు రాసి… ఇలా అన్నింటిలో మీ ఆమొదం ఉంది. ఇక మీకు ‘ప్రవీణ్ నీ బూతు ఉపసంహరించుకో’ అని అడిగే నైతిక హక్కు లేదు. ప్రవీణ్ పైన ప్రారంభించిన బూతు పురాణం ఉపసంహరించుకోవాలని మీరు మీ మిత్రులకు చెప్పాకే ప్రవీణ్ కి ఏమైనా మీరు చెప్పడం సమంజసంగ ఉంటుంది. అది చెయ్యకుండా ప్రవీణ్ బూతులు ఉపసంహరించాలని డిమాండ్ మీరు చెయ్యలేరు.

  ఈ వివరాలు నాకు ముందు తెలియదు. మీరు కెబ్లాస లో భాగం అని నాకు తెలియదు. కెబ్లాస అంటే పూర్తి రూపం తెలియదు. ఇవేవీ తెలియని పరిస్ధితుల్లో ‘ఒకరి తల్లిగారిపై ప్రవీణ్ బూతు ఉపసంహరించుకోవాలి’ అన్న మీ డిమాండ్ లో భాగం పంచుకున్నాను. అవన్నీ ఇప్పుడు తెలిసాయి కనుక మీకు నా మద్దతు ఉపసంహరించుకుంటున్నాను. దీనర్ధం “ప్రవీణ్, ఓ స్త్రీ పై నీ బూతు ఉపసంహరించుకో” అన్న నా డిమాండ్ లో మార్పు ఉందని కాదు. నేను వ్యక్తిగతంగా ప్రవీణ్ ని ఆ డిమాండ్ చేస్తున్నా. అందులో మార్పు లెదు. కాని కెబ్లాస లో భాగస్వామిగా మీరు చేస్తున్న డిమాండ్ల కి నా మద్దతు ఉండదు.

  విశేఖర్ గారూ, వెల్, నేను టైమ్ వేస్ట్ అనుకోవటంలేదులెండి. చెత్త ఏరి పారేద్దాం అనుకునే ప్రయత్నం టైమ్ వేస్ట్ ఎందుకవుతుంది చెప్పండి.
  ——————————————————————————————-
  కెబ్లాస నుండి బైటికి రాకుండా ‘చెత్త ఏరివేసే’ కార్యక్రమానికి పూనుకోవడం ‘విజ్ఞత’ అనిపించుకోదు. మీ పెరట్లో కొండల కొద్దీ చెత్త పెట్టుకుని వీధుల్లో చెత్త ఏరతానని మీరు చెబ్తే నేనెందుకు నమ్మాలి? మీ ప్రయత్నాల్లో నిజాయితీ లేకుండా నేను మద్దతు ఇవ్వలేను.

 210. visekhar 6:47 సాయంత్రము వద్ద జనవరి 07, 2012
  మై గుడ్ నెస్. ఇంగ్లీసు సినిమాల్లో నేనూ విన్నానిది. చాలా సులువుగా వాడేస్తారు. ఆ సంస్కృతిని వంటబట్టించుకున్నవారు ఆ తిట్టుని పెద్ద తిట్టుగా చూడరు. భారతీయులై ఉండీ, హిందూ సంస్కృతి పరిరక్షకులుగా ఫోజు పెడుతూ ఈ తిట్లు వాడడం ఘోరం. మరి దీన్ని పద్మ గారికి ఎందుకు ఆపాదిస్తున్నారు? అది చెప్పరేం?
  ——————————————————-

  పద్మ గారూ మీ క్రానాలజీ ఆఫ్ ఈవెంట్స్ లో ఇది ఎందుకు మిస్ చేశారు? నాకు సహజంగానె బూతులు గుర్తుకు రావు. నాకు తెలిసింది తక్కువ. అందునా పర భాషలో వాడేవి అసలు గుర్తుకు రావు, చెప్పేదాకా. దీనిని కూడా మీ వాదనకు మద్దతుగా తెచ్చుకుంటున్నారే?
  ————————————————————————————-
  హహహ. isn’t that a question you asked Praveen? How did you even expect a response from me? You should have said in your comment, that you were expecting a response from me. I would have gladly responded.

  మీకు బూతులు వచ్చో రావో గుర్తు ఉంటాయో ఉండవో ఎవరికి తెలుసండి? దాన్ని నా వాదనకి మద్దతుగా తెచ్చుకోవటమేంటి? as if I am running short of valid points? Please don’t be under that assumption. MF అన్న పదం వినగానే అందరికీ బూతే గుర్తొచ్చేట్టయితే MF హుస్సేన్ గారు ఎప్పుడో పేరు మార్చుకునేవారు. ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే అదే రంగులో ప్రపంచం కనిపిస్తుందని నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కరలేదనుకుంటాను. అది తిట్టు అని మీరు మీ అమాయక మిత్రుడు ఫిక్స్ అయ్యారు కానీ అది తిట్టు కాదని సవివరంగా ఆ పదం వాడబడ్డ పోస్ట్‌లో చెప్పారు. మీరు తిట్టు/బూతు కళ్ళద్దాలు తీయం, అక్కడ రాసింది చదవం అనుకుంటే అది వేరే సంగతి.

  ఇంగ్లీష్ ప్రాంతంలో ఉంటూ ఇంగ్లీష్ సంస్కృతి వంటబట్టించుకున్నవాళ్ళైతే పర్లేదేమో. ఎందుకంటే మీరన్నట్టు వాళ్ళకి అది చిన్న పదం కదా. కానీ భారతదేశంలో ఉంటూ అక్కడి సంస్కృతి నరనరానా వంటబట్టించుకున్నాం అనే కొంతమంది దేశభక్తులుంటారండి, సంఘ సంస్కర్తలు, సంస్కరణాభిలాషులూ సమసమాజ నిర్మాతలు వాళ్ళు ఇదే తిట్టు వాడతారండి ఇంకా దారుణమైన తిట్లు కూడా. అదీ పక్కవాడి కుటుంబం అయితే మరీ. అడ్డూ అదుపులుండవు. మీ దృష్టిలో వారినేమంటారు?

 211. పద్మ గారూ కెబ్లాస అని సంఘం పెట్టుకున్నారు. అందులో మీరు సభ్యురాలు.

  అందులో ఇప్పుడే ఓ పోస్టు చూసాను. (ఇంతకు ముందెప్పుడూ అది చదవలేదు) నా పేరును ‘విష శేఖర్’ గా ప్రస్తావించారు. ఇది హాస్యం అని నేను నమ్మాలా? ఓ త్రాష్టుడు నా పేరు మారిస్తే దాన్ని అరువు తెచ్చుకుని మీరు (మీ బ్యాచ్) ఉదహరిస్తే అది హాస్యం అని నేను నమ్మాలి. కదండీ పద్మ గారూ?

  మీరు మొత్తం సంఘంలో ఉన్నాక ఒకరి పోస్టులకు మరొకరు అటోమేటిక్ గా బాధ్యులవుతారు. ‘మేమంతా కెబ్లాస’ అంటూనే ఒకరి పోస్టులకి మరొకరు బాధ్యత లేదని మీరు చెబుతున్నారు. అది సమంజసం కాదు. పైగా అందులో యాక్టివ్ గా భాగం కానందుకు ఇప్పుడు చింతిస్తున్నానని కూడా అంటున్నారు. ఓ సంఘంలో ఉంటూ అందులో ఒకరికొకరు బాధ్యత వహించకపోవడం ఏంటసలు? ఆ బ్లాగ్ లో రాసే ప్రతీ రాతా, ఆ సంఘంలో ఉండే ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. అలా బాధ్యత తీసుకోలేని పక్షంలో బైటికి వచ్చి సెపరేట్ బ్లాగ్ పెట్టుకోవచ్చు. అది చేయకుండా ‘నా బాధ్యత లేదు’ అని మీరు అనలేరు. అది నైతికం కాదు.

  నేను ప్రవీణ్ భావాలని మాత్రమే షేర్ చేస్తాను. ఆ భావాలు నమ్ముతున్నందుకు ప్రవీణ్ పైన కొన్ని బాధ్యతలు ఉంటాయి. అందులో ‘స్త్రీలను బూతులు తిట్టకపోవడం’ ఒకటి. నేను, ప్రవీణ్ ఒక సంఘం కాకపోయినా, కేవలం భావాలు షేర్ చేసుకుంటున్నందుకే అతన్ని ‘బూతు ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేస్తున్నా. అతను నమ్ముతున్న భావజాలం నాకలా అడిగే నైతిక హక్కు ఇచ్చింది.

  ఇదే నైతికత, బాధ్యత మీరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. పాటించకపోతే సంఘం అని పెట్టడంలోనే సీరియస్ నెస్ లేదని అర్ధం అవుతోంది. కేవలం కొన్ని భావాలను వ్యక్తం చేస్తున్నందుకే ఓ బ్యాచ్ చేస్తున్న బూతు దాడిలో మీరు భాగస్వాములని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది.

  పద్మ గారూ, ఇకనుండి ‘మీరు’ అని నేనన్నపుడు ‘కెబ్లాస’ అని అర్ధం చేసుకోవాలి. మిమ్మల్ని వ్యక్తిగా సంబోధిస్తే అది ప్రత్యేకంగ చెబుతాను. పొరబాటున అప్పుడు చెప్పలేకపోయినా తర్వాతయినా ‘అది వ్యక్తిగత సంబోధన’ అని చెబుతాను.

  Padma gaaruu, I’m very much distrubed for the fact that you are part of ‘keblaasa’. Even if you haven’t provided a bit, you have been very much part of it. This is shocking to me.

 212. పద్మ గారూ, మళ్లీ అదే తీరు.

  పైన మీరు నా కామెంట్లు వరుసగా ఉటంకించారు. ఆ ఉటంకనలో ఒకటి మిస్ చేసారు అంటున్నా. దానికి మీనుండి రెస్పాన్స్ ఆశించడం ఏమిటి? కన్ఫ్యూషన్.

  ‘హహహ’ అని సాధ్యమైనంత లేకుందా చూడండి. దాని వెనుక భావం నేను గ్రహించలేకున్నాను. ఇంతవరకూ వాడలేదు. ఇకముందూ వాడకపోతే సంతోషం.

 213. మీ ఆలోచనలనీ, అభిప్రాయాలని పంచుకోవడానికి ‘కెలుకుడు బ్లాగర్ల సంఘం’ పెట్టారా? నచ్చలేదని హాస్యంగా చెప్పడానికి కెలకాలా? ఏం వివరణ అండీ?
  ——————————-
  నేనేం చెప్పానండి, మీరేం కవర్ చేస్తున్నారండి? నేనన్నది “మీరు మీకు నచ్చనివి నచ్చలేదు అని ఎలా చెప్తున్నారో వాళ్ళూ అలానే మీ అభిప్రాయాలు నచ్చలేదని చెప్తూంటారు, కాస్త హాస్యంగా. ” మీలాంటి బ్లాగర్ల అభిప్రాయాలు నచ్చనివి ఉంటే వాటిని కెలకటానికే ఉన్నది. అది కూడా ఎందుకు పుట్టిందో తెలుసా? మీలాంటివాళ్ళు “కావలసిన” వ్యాఖ్యలే పబ్లిష్ చేసుకుని “వ్యతిరేకంగా” మాట్లాడేవారి వ్యాఖ్యలు ప్రచురించలేదు కాబట్టి. That’s the exact reason why ke.bla.sa was born. నేను ఇంతకు ముందే చెప్పినట్టు అక్కడిదంతా reaction మాత్రమే. proactiveగా వాళ్ళు రాసిన ఒక్క పోస్ట్ చూపించండి.

  కెబ్లాస అన్నది బూతు కాకపోయినా నెగిటివ్ పదజాలం అన్నది సుస్పష్టం.
  ————————
  ఎలా అంత సుస్పష్టం అయింది మీకు? కెబ్లాస అన్న పదానికి డిక్షనరీలో నెగటివ్ అని ఉందా అర్థం?

  ఈ జనరలైజెషన్ సరికాదు. ఇవే ఆ గ్యాంగ్ అనుసరిస్తూన్న తెలివితేటలు. బూతులు తిట్టేది గ్యాంగు. వాటిని ఆపాదించేది ప్రవీణ్ కి. ఆపాదిస్తూనే మరిన్ని బూతులు తిట్టే అవకాశం దొరకబుచ్చుకునే చచ్చు తెలివితేటలు బూతు గ్యాంగ్ వి. ఇవే ఎత్తుగడలు నాపైన అమలు చేశారు. ఇంకా చేస్తున్నారు. నా పైనా ఇంకా కొనసాగుతున్న దుష్ప్రచారం, విద్వేషం, ఎగతాళి.. వీటిలో ఫ్రాక్సన్ భాగాన్ని రాత్రి చూశా. ఇవేవీ మీకు కనపడవు. కదండీ. కాని ఎక్కడన్నా నాలాంటి వారో ప్రవీణ్ లాంటి వారో ఓ మాట పొరబాటున వాడారో, ఇంకేం, ఏ పెద్ద కత్తితో రేడీ. సవరించుకోవాలని డిమాండ్లు. ‘ప్రవీణ్ అలా ఎందుకు అన్నావు? అని ఓ మందలింపు నాలాంటి వారు చేస్తే దాన్ని ఓ కత్తిగా చేసి పారెయ్యడం. “ప్రవీణ్, విశేఖర్ కూడా క్షమాపన చెప్పాలన్నారు. ఎప్పుడు చెబుతున్నావ్? అని తుంటరిగా ప్రశ్నలు” చప్పట్లండీ పద్మ గారూ?
  ——————————————————–
  బూతులు తిట్టేది గాంగ్. ఈ విషయం మీద ఇప్పటికి ఎన్ని సార్లు అడిగి ఉంటానో మీరే తేల్చుకోండి విశేఖర్ గారూ. సాక్ష్యం చూపించమంటే ఒక్కటంటే ఒక్కటి చూపించలేకపోయారు.

  కాని ఎక్కడన్నా నాలాంటి వారో ప్రవీణ్ లాంటి వారో ఓ మాట పొరబాటున వాడారో, ఇంకేం, ఏ పెద్ద కత్తితో రేడీ. సవరించుకోవాలని డిమాండ్లు.
  —————————————————————
  పొరబాటున? మీకలా అనిపించే ఆ పొరపాటుని సవరించుకోవాలని మీరు కూడా రిక్వెస్ట్ చేశారా విశేఖర్ గారూ?

  ఇవేవీ మీకు కనపడవు.
  ———————
  ఏవి కనిపించలేదంటారు? మీ మద్దతు విషయం మీద పోస్ట్సా? అందులో బూతులు లేవే? వాళ్ళడిగినవేవీ అసమంజసమైనవి లేవే? ఇంక ఏం కనపడలేదంటారు? మీరు మద్దతు ఇచ్చారు. అది మీ ఇష్టం. కానీ దాని మీద ఎవరూ ఏమీ అనకూడదనుకుంటే ఏలా? బూతులు కానంతవరకు తప్పు ఉందంటారా? ఈ లెక్కన మర్ మీరు కూడా ఏ వార్తలూ రాయకూడదే?

  కెబ్లాస కి మీరు ఏమీ రాయకపోయినా, అందులో భాగం వహిస్తూన్నపుడు, అది కూడా “ఈ రెగ్రెత్ ఫొర్ నొత్ బైంగ్ అచ్తివె ఇన్ థత్ బ్లొగ్” అని ఘనంగ చెప్పుకుంటున్నపుడు ఆ బ్యాచ్ చేసే అసంబద్ధ వాదనలు, బూతుల అట్రిబ్యూషన్లు, కెలుకుడులు… అన్నింటికీ మీ మద్దతు ఉన్నట్లే. అందుకు నాకే అనుమానమూ లేదు. ప్రవీణ్ ని ‘ఎరా’ అని అనడం దగ్గర్నుండి, ‘మెంటల్’ అని తిట్టి, బూతులను అట్రిబ్యూట్ చేసి, పేరడీలు రాసి… ఇలా అన్నింటిలో మీ ఆమొదం ఉంది. ఇక మీకు ‘ప్రవీణ్ నీ బూతు ఉపసంహరించుకో’ అని అడిగే నైతిక హక్కు లేదు. ప్రవీణ్ పైన ప్రారంభించిన బూతు పురాణం ఉపసంహరించుకోవాలని మీరు మీ మిత్రులకు చెప్పాకే ప్రవీణ్ కి ఏమైనా మీరు చెప్పడం సమంజసంగ ఉంటుంది. అది చెయ్యకుండా ప్రవీణ్ బూతులు ఉపసంహరించాలని డిమాండ్ మీరు చెయ్యలేరు.
  ——————————-
  కెబ్లాస గ్రూప్‌లో ఒక్కరంటే ఒకక్రు బూతు రాసినట్టు చూపించండి. ఎక్కడ బూతులు రాశారు? ఏం రాశారు. కేవలం రాశారు అంటే సరిపోదు కదండి.

 214. పద్మ గారూ,

  మీరన్నది: “మీరు మీకు నచ్చనివి నచ్చలేదు అని ఎలా చెప్తున్నారో వాళ్ళూ అలానే మీ అభిప్రాయాలు నచ్చలేదని చెప్తూంటారు, కాస్త హాస్యంగా” అని.

  నేనన్నది: “మీ ఆలోచనలనీ, అభిప్రాయాలని పంచుకోవడానికి ‘కెలుకుడు బ్లాగర్ల సంఘం’ పెట్టారా? నచ్చలేదని హాస్యంగా చెప్పడానికి కెలకాలా? ఏం వివరణ అండీ?” అని.

  మీరన్నదానికీ, మీరన్నారని నేను చెబుతున్నదీ పైన ఇచ్చాను. ఈ రెండింటికీ తేడా ఉందా?

  —- —- —-

  కెబ్లాస అన్న ‘పదజాలం’ నెగిటివ్ కాదా? కెలకడం నెగిటివ్ కాదా?

  నచ్చని అభిప్రాయాలు ఉంటె చర్చకు దిగుతారని మాత్రమే నాకు తెలుసు. కాని ‘విష శేఖర్’ అని ద్వేష పూరితంగ కెలుకుతారని మీ ద్వారా తెలుసుకుంటున్నా.

  మీలాంటి బ్లాగర్ల అభిప్రాయాలు నచ్చనివి ఉంటే వాటిని కెలకటానికే ఉన్నది. అది కూడా ఎందుకు పుట్టిందో తెలుసా? మీలాంటివాళ్ళు “కావలసిన” వ్యాఖ్యలే పబ్లిష్ చేసుకుని “వ్యతిరేకంగా” మాట్లాడేవారి వ్యాఖ్యలు ప్రచురించలేదు కాబట్టి.
  —————————————————————————-

  ఆధారాలు చూపండి పద్మ గారూ.

  నేను ఇంతకు ముందే చెప్పినట్టు అక్కడిదంతా reaction మాత్రమే.
  ——————————————-
  వాదనలకి రియాక్షన్ పేరుతో విష శేఖర్ అంటూ వ్యక్తిగత విద్వేషం వెళ్లగక్కుతారన్నమాట.

  బూతులు తిట్టేది గాంగ్. ఈ విషయం మీద ఇప్పటికి ఎన్ని సార్లు అడిగి ఉంటానో మీరే తేల్చుకోండి విశేఖర్ గారూ. సాక్ష్యం చూపించమంటే ఒక్కటంటే ఒక్కటి చూపించలేకపోయారు.
  ————————————————————————————

  ఇవే మీ ‘కెలుకుడు’ తెలివితేటలు.
  బ్లాగింగ్ కి ఒక పేరు, కెలకడానికి ఒక పేరు. బూతులకి ఒక పేరు.
  బ్లాగింగ్ పేర్లతో కెలుకుడు ఉండదు. కెలుకుడు పేర్లతో బూతు ఉండదు. బూతులకి వాడే పేర్లతో బ్లాగింగ్, కెలుకుడులు ఉండవు.
  మీరంతా టెక్నీషియన్లు. పేర్లు, ఐ.పిలు లాంటివాటిలో జాగ్రత్తలు తీసుకోగలరు.
  అంతిమంగా కెలుకుడు పేర్ల కింద ఒక్క బూతు చూపండి చూద్దాం అని తుంటరి సవాళ్ళు. (చప్పట్లు)

  కెలుకుడు గాళ్ళే బూతు గ్యాంగ్ అని శైలి ద్వారా, వే ఆఫ్ రియాక్షన్ ద్వారా, ఏకీకృత భావాల ద్వారా టెక్నికల్ నాలెడ్జి లేని నాలాంటి వారు తెలుసుకోవాలి తప్ప ఆధారాలు ఎలా చూపగలం? కెలుకుడు గాళ్ళలోనే బూతు గాళ్ళూ ఉన్నారని ఆధారాలు చూపలేకపోవడమే మీ బలం. ఆ బలంలేనితనం ఉంది గదాని మీ కెలుకుడిని, బూతుని వ్యతిరేకించకుండా ఉండలేం.

  — — —

  మీ కెలుకుడు బ్యాచ్ ప్రత్యేకత మరొకటుంది.

  నేను అమెరికానీ, దాని విదేశాంగ విధానాలనీ విమర్శిస్తాను. హిందూ, (ముస్లిం కూడా) మత దురహంకారాలని విమర్శిస్తాను. కాని వ్యక్తిగతంగా ఎవర్నీ విమర్శించను.
  కెలుకుడు గ్యాంగేమో నాపైనే వ్యక్తిగత దాడి చేస్తారు. విశేఖర్ అయితే ‘విష శేఖర్’ అంటూ పచ్చి వ్యక్తిగత ద్వేషం వెళ్లగక్కుతారు.
  నేను ద్వేషం వద్దు. పద్ధతిగా, మర్యాదగా మాట్లాడండి అంటాను. విషయం చర్చించండి అంటాను.
  అప్పుడు కెలుకుడు గ్యాంగ్ యాక్టివ్ గా రియాక్ట్ అవుతుంది. ఏమని? “మీకు ఇతరులని విమర్శించే హక్కు ఎలా ఉంటుందో, మాకు మిమ్మల్ని విమర్శించే హక్కు ఉంటుంది” అని. ఎవరైనా “నీకు నన్ను విమర్శించే హక్కు ఎలా ఉందో నాకూ నిన్ను విమర్శించే హక్కు ఉంది” అంటారు. వీళ్ళు మాత్రం ‘(మమ్మల్ని విమర్శించకపోయినా) అమెరికా విధానాల్ని, హిందూ మత దురహంకార విధానాల్ని విమర్శిస్తే మాకు నిన్ని ద్వేషిస్తూ దుష్ప్రచారం చేసే హక్కు ఆటోమెటిక్ గా వస్తుంది’ అంటారు. కెలుకుడు గ్యాంగ్ కదా!
  ఇది ఓ కెలుకుడు తెలివి. కెలుకుడు గ్యాంగు నాపైన ప్రయోగించిన నీచ నికృష్ట ‘కెలుకుడు’ తెలివి ఇది.
  నేను రాసింది అమెరికా, దాని విదేశాంగ విధానం, హిందూ, ముస్లిం మత దురహంకారాలు, హిందూ మతంలో దళితుల అణచివేత ఈ అంశాలపైన. కాని కెలుకుడు గ్యాంగ్ రాతలన్నీ నాపైనే. నా రాతలపైన కాదు. నేనా రాతలు రాశాను గనక నన్ను వ్యక్తిగతంగా కెలుకుతారు. విష శేఖర్ అంటారు. తిట్టడానికే బ్లాగులు పెడతారు. అన్నీ చేసి మేమేమన్నా బూతులు రాశామా అని ఆరిందల్లా అడుగుతారు?
  ఏమన్నా పొంతన ఉందా?
  అమెరికా విదేశాంగ విధానం పైన నేను విమర్శ చేస్తే, ఆ విదేశాంగ విధానం ఎలా సరైందో చెప్పరు. హిందూ మతంలో దళితుల అణచివేతను ప్రశ్నిస్తే దళితుల అణచివేత ఎందుకు సరైందో చెప్పరు. హిందూ (ముస్లిం) మతోన్మాదాన్ని విమర్శిస్తే ఆ మతోన్మాదం ఎలా సరైందో చెప్పరు. కాని విధానాలపైన, ఉన్మాదంపైన విమర్శ చేసిన నాపైన మాత్రం వ్యక్తిగత ద్వేషం వెళ్లగక్కుతారు.
  పైగా అమెరికా, హిందూ (ముస్లిం) మతోన్మాదాల పైన నువ్వు విమర్శిస్తున్నావు గనక మేము నిన్ను వ్యక్తిగతంగా ద్వేషిస్తూ రాస్తాం. నువ్వు అమెరికా విదేశాంగ విధానాల్ని ద్వేషిస్తావు కనుక మేము నిన్నే ద్వేషిస్తాం అంటారు.

  ప్రపంచంపైన అచ్చోసిన ఆంబోతులా పడి దాడులు చేస్తున్న అమెరికా విదేశీ విధనాలని విమర్సిస్తే మీరు నన్ను వ్యక్తిగతంగా కెలుకుతారా? తిడతారా? అబద్ధాలు నాకు అంటగడతారా? ఏం నీతి ఇది? పైగా కెలుకుడు అందుకోసమె అని సమర్ధనలు!

  విధానాలని విమర్శించడం నా విధానం అయితే, అలా విమర్శిస్తున్న వ్యక్తులపైన ద్వేషం వెళ్లగక్కడం, వ్యక్తిగత వ్యతిరేక ప్రచారం చేయడం కెలుకుడు బ్యాచ్ ‘కెలుకుడు’ విధానం.

  —- — —-

  నేను ఇంతకు ముందే చెప్పినట్టు అక్కడిదంతా reaction మాత్రమే. proactiveగా వాళ్ళు రాసిన ఒక్క పోస్ట్ చూపించండి.
  ——————————————————————————

  ఇదో గొప్ప హిపోక్రసీ. వ్యక్తిగత విద్వేషానికి గొప్ప సమర్ధన. ఈ దెబ్బతో బూతులు కాని ద్వేష పూరిత ప్రచారానికంతటికీ ఆమొద ముద్ర పడిపోయింది. అక్కడికి బూతులు ఒక్కటే కూడనిది. మిగిలిన ఛండాలం అంతా సమర్ధించదగినది. కదా పద్మ గారు?
  నేను వ్యక్తిగతంగా ఏమీ రాయకపోయినా, మూకుమ్మడిగా నా పైన వ్యక్తిగత విద్వేషం వెళ్ళగక్కడం ప్రోయాక్టివ్ గా రాయడం కాదా?

  వ్యక్తిగత దాడులు ప్రారంభించేది మీ కెలుకుడు గ్యాంగ్ అందుకే మీరు ప్రోయాక్టివ్. రియాక్షన్ కాదు.

  మీ లక్ష్యం ఒక భావాజాలానికి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడం. అందుకు మీరెంచుకున్న పద్ధతి కెలుకుడు. భావాజాలాన్ని చర్చిస్తే అర్ధం ఉండేది. ఆ చర్చ ఇప్పటికీ అనేక అంశాలపై నా బ్లాగ్ లో నడుస్తోంది. అది కాదు మీరు చేసేది చేస్తున్నది. మీరు చేస్తున్నది వ్యక్తిగత కెలుకుడు. ఒక భావాజాలం వ్యక్తం చేస్తున్నందుకు, ఆ భావజాలం మీకు ఇష్టం లెనందుకు, మీ ఇష్టం లేని భావజాలం వ్యక్తం చేస్తున్న వారిపైన వ్యక్తిగతంగా చేస్తున్న కెలుకుడు.

  ‘ఒక్క బూతు చూపించండి’ అని సవాలు విసిరే మర్యాదస్తులకు ఈ విద్వేష పూరిత కెలుకుడు ‘ఆమోదమే’. అదొక గొప్ప కార్యక్రమం వీళ్ళకి.

  ఏళ్ళ తరబది సాగిన ఈ విద్వేష పూరిత ప్రచారానికి ప్రవీణ్ తన పద్ధతిలో స్పందిస్తున్నాడు. ఆ పద్ధతికి నా మద్దతు లేదు. కాని అతను అనుభవించిన మానసిక వేదన, నిస్పృహ, మూకుమ్మడి వ్యక్తిగత దాడుల నుండి పెల్లుబుకిన అసహాయత… వీటన్నింటికీ నా సానుభూతి కొనసాగుతుంది. ప్రవీణ్ బూతుల్ని ప్రశ్నిస్తున్నవారు ప్రవీణ్ అనుభవించిన మానసిక టార్చర్ ని కూడా చూడాలని కోరతాను. ఆ టార్చర్ గాళ్ళని, ఆ కెలుకుడు గాళ్లని వ్యతిరేకించకుండా ప్రవీణ్ బూతుల్ని వ్యతిరేకించడం సాధ్యంగాదని మాట సాయం చేస్తున్నా.
  ————————————-

  Padma gaaruu, I think you’ve more to come out. Show me evidence as I requested above.

 215. టపాకి సంబంధం లేని వ్యాఖ్యలు రాస్తున్నట్టు ఆధారాలు లేవా? సరే ప్రవీణ్ ఇది చెప్పు ఎంత మంది బ్లాగర్ల బ్లాగులలో నువ్వు అసభ్యమైన బూతులు కామెంట్లుగా పెట్టలేదు? అవన్నీ టపాకి సంబంధం ఉన్నవే అంటావా? సరే చెరసాల శర్మ అన్న పేరుతో నువ్వు http://blogavadgeetha.blogspot.com/2010/06/blog-post_12.html లో పెట్టిన కామెంట్ చూడు. విశేఖర్ గారూ ఒక సారి మీరూ ఆ పోస్ట్, అందులో ఉన్న కామెంట్ చూసి ఇద్దరూ కలిసి మీకున్న పరస్పర అవగాహన (ఈ మాట మీరే అన్నారు విశేఖర్ గారూ)తో చర్చించి అటువంటి కామెంట్ బుర్రలో మెదడు అనబడే పదార్ధం ఉన్నవాడు ఎవడైనా పెడతాడా అనేది నిర్ధారించి చెప్పండి. మరి దాన్ని తీసేయకుండా ఎందుకు ఉంచారు అని మీరు అడగచ్చు. బ్లాగుల్లో ఇలా తలా తోకాలేకుండా కామెంట్లు పెట్టే అర మెదడు కుంకలు ఉంటారు అని మా స్నేహితులకి చూపించి నవ్వుకోడానికి దాన్ని ఇంకా ఉంచడం జరిగింది.విశేఖర్ గారూ మీరూ రెండు రోజుల నుంచీ పాపం ప్రవీణ్ ని సమర్ధించుకు రాలేక అలసి పోతున్నట్టు ఉన్నారు . కాసేపు తన కామెంట్లు చూసి నవ్వుకోండి.

 216. శంకర్ గారూ, ప్రవీణ్ కామెడీ, అతని కామెంట్లు అవన్నీ వదిలెయ్యండి. మీరు నేను రాసిన అంశాలపైన చర్చిస్తే మీతో చర్చిస్తాను. ఇవన్నీ ఇప్పటికే ఎక్కువైనాయి కదా.
  ప్రవీణ్ గారికి నేను చెప్పాల్సింది చెప్పాను. అతనితో వ్యక్తిగతమైన అనుభవం ఏమన్నా ఉంటే అతనిపైన నెగిటివ్ కామెంట్స్ చెయ్యగల అనుభవం నాకు ఉంటుంది. అవేవీ లేకుండా ప్రవీణ్ పైన గానీ మరొకరి పైన గానీ నెగిటివ్ వ్యాఖ్యలు నేను చెయ్యలేను.

 217. (నా కుటుంబ సభ్యులను లాగడం వల్లనే నేను ప్రతి దాడికి దిగుతున్నా. అది కూడా మూడేళ్ళూ ఓపిక పట్టాక, సహనం నశించాక.)

  ఏకలింగం అనే వ్యక్తి మొదట్లో పది మందిని కాదు, వంద మందిని వెనుక పోగేసుకున్నాడు. (ఐనా నేను పట్టించుకోలేదు.) కానీ వీవెన్ ఏకలింగం బ్లాగ్‌ని కూడలి నుంచి కొన్ని రోజుల పాటు పీకేశారు. దానిక్కారణం నేను ఏకలింగం బ్లాగ్ పీకెయ్యమని వీవెన్‌కి మెయిల్ పంపానని ఆరోపించారు. కాని అది నిజం కాదు.

  ఏకలింగం, భరద్వాజ్ ఒకరు కాదని తరువాత తెలిసింది. ఏకలింగం సొంతూరు … అయితే, భరద్వాజ సొంతూరు …. తాడేపల్లి గారిని విమర్శిస్తూ ఏకలంగం బ్లాగ్‌లో వ్రాసినవి చదివిన తరువాత ఇద్దరూ వేర్వేరు వ్యక్తులని అర్థమైంది.

  మూడేళ్ళ క్రితం ఏకలింగం నన్ను తిడుతూ పది నిముషాలకొక టపా వ్రాసేవాడు, నిజమే. కానీ అతను నా కుటుంబాన్ని లాగలేదు కాబట్టి నేను పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులని లాగితే మూడేళ్ళ వరకు ఊరుకున్నది నేనేనని గమనించాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s